* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

4, జనవరి 2011, మంగళవారం

వెయిదీపాల వెలుగులో కనక మహలక్ష్మి

* ఆదాయం రూ.1.45 కోట్లు
విశాఖపట్నం(విశాల విశాఖ): కనకమహలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. డిసెంబరు 6 నుంచి ఉత్సవాలు ప్రారంభమైన ఉత్సవాలు మార్గశిర బహుళ అమావాస్యతో ముగిశాయి. మంగళవారం అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. ఆలయ అనివేటి మండపంలో వెయ్యి దీపాలను వెలిగించారు. ఓంకార రూపం చుట్టూ మూడు వరుసల్లోప్రమిదలను వెలిగించారు. దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ ఆధ్వర్యంలో ఈ సేవ జరిగింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దీపాలను వెలిగించారు. ట్రస్టీలు కన్నబాబు, రాంగోపాల్‌, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పలువురు భక్తులు వచ్చి దీపాలను వెలిగించారు. మంగళవారం భక్తుల హాజరు పల్చగా కనిపించింది. అమ్మవారు కనకమహలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఇంతవరకు ఈ ఏడాది రూ.1.45 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉందని, ఈ ఆదాయం కలిపితే మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. గత ఏడాది నెలరోజులకు రూ.1.25 కోట్లు ఆదాయం వస్తే ఈసారి బాగా పెరిగిందన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి