4, జనవరి 2011, మంగళవారం
ఘనంగా వెంకన్నకు వెండి పూలాభిషేకం
విశాఖపట్నం(విశాల విశాఖ) : ఎంవీపీ కాలనీ టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వర స్వామికి మంగళవారం వెండి పువ్వులతో ప్రత్యేక అభిషేకం చేశారు. తిరుమల తిరుపతిలో ప్రతి మంగళవారం నిర్వహించే మాదిరిగానే ఇక్కడ 1008 వెండి పువ్వులతో అభిషేకం చేశారు. ఫణిహారం నృసింహాచార్యులు భక్తులకు ప్రత్యేక అభిషేకాలు చేసి, వారికి వెండి పువ్వులను, శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.ఉదయం 5 గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, పూలంగి సేవ నిర్వహించారు. భక్తులకు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంతో పాటు తీర్థం కూడా అందజేశారు. సాయంత్రం నిర్వహించిన సహస్ర దీపాలంకరణలో భక్తులు విరివిగా పాల్గొని శ్రీవారి ఎదుట దీపాలను వెలిగించారు. ఈ నెల 14 వరకు ధనుర్మాసోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహించనున్నారు. గురువారం వేంకటేశ్వర స్వామి నాలుగు అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మేనేజర్ రమేష్, జిల్లా ధార్మిక సలహా మండలి గౌరవ కోశాధికారి హిమాంశు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి