న్యూఢిల్లీ: మద్దెల చెరువు సూరి మరణవార్తను విని తాను షాక్ గురయ్యానని సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్‌లో తెలిపారు. రక్త చరిత్ర సినిమా తీయడానికి సూరియే స్పూర్తి అని ఆయన తెలిపారు. రక్త చరిత్ర సినిమా నిర్మిణానికి చేసిన పరిశోధన కోసం సూరితో గత కొద్దికాలంగా తాను టచ్‌లో వున్నానని ఆయన అన్నారు. అటువంటి మనిషి చనిపోయాడన్న వార్త తనను ఎంతో కలిచివేసిందని ఆయన ట్విట్టర్ తెలిపారు. పరిటాల రవి, మద్దెల చెరువు సూరిల మధ్య వున్న ఫ్యాక్షన్ చరిత్రను తె రకెక్కించడానికి 2009 సంవత్సరంలో అనంతపురం జైలుని వర్మ సందర్శించారు. ఆ సమయంలోనే సూరితో వర్మ సమావేశమైనారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి