* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

17, నవంబర్ 2010, బుధవారం

కోస్తాపై రాడార్‌ డేగకన్ను

బెంగుళూరు(పిటిఐ): భారత్‌ సుదీర్ఘ సముద్ర కోస్తా తీరంలో అత్యంతాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలో 20 కిమీ దూరంలో ఏ పడవ కదలికలైనా ఢిల్లీలో కూర్చుని పర్యవేక్షించవచ్చని కోస్తాలో ఎక్కడ ఏది ఉందో కనిపెట్టవచ్చని ఇక్కడ అధికారులు చెప్పారు. ఈ వ్యవస్థలో ఒక రాడార్‌, ఎలక్ట్రో ఆప్టిక్‌ సెన్సర్‌, కమాండ్‌ కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌ ఉంటాయన్నారు. దేశం మొత్తం కోస్తా తీరంలో ప్రతి చదరపుటంగుళం మేర నిఘా పెట్టవచ్చన్నారు. కంటితో చూడవచ్చని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ బెంగుళూరు,డైరెక్టర్‌ ఐ.వి.శర్మ చెప్పారు. రక్షణరంగానికి చెందిన ఈ కంపెనీ తీరరక్షకదళం కోసం ఈ వ్యవస్థను రూపొందించిందన్నారు. 46 సున్నితమైన ప్రాంతాలలో మూడు చోట్ల ఈ నిఘా కేంద్రాలను ఏర్పాటు చేస్తారని వచ్చే ఏడాదికి ఇది పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యంగా పశ్చిమకోస్తాపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.

రిలయన్స్ లైఫ్‌కు 10 లక్షలు జరిమానా

న్యూఢిల్లీ, నవంబర్ 16 : నిబంధనలు ఉల్లంఘించినందుకు అడాగ్ అనుబంధ సంస్థ రిలయన్స్ లైఫ్‌కు బీమా నియంత్రణ-అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డిఏ) 10 లక్షల రూపాయలు జరిమానా విధించింది. భవిష్యత్తులో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా మార్గదర్శకాలన్నింటినీ తుచ తప్పకుండా పాటించాలని ఆదేశించింది.

ఐఆర్‌డిఏ చైర్మన్ జంధ్యాల హరినారాయణ ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులను సంస్థ వెబ్‌సైట్‌లో ఉంచారు. గ్రూప్ ఉత్పత్తుల విషయంలో ఐఆర్‌డిఏ మార్గదర్శకాలు అమలుపరచకుండా ఉల్లంఘనకు పాల్పడినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్టు ఆగస్టులో ఆయన జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.

పుట్టపర్తికి ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే

సికింద్రాబాద్‌: ఈనెల 22, 23వ తేదీల్లో కాచిగూడ నుంచి పుట్టపర్తికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పుట్టపర్తి సాయిబాబా జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.

రూ.1475 కోట్లతో విశాఖకు మౌలికవసతులు: సీఎం

విశాఖపట్నం: విశాఖలో రూ.1475 కోట్లతో మౌలికవసతులు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద ఈ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం స్వర్ణభారతి ప్రాంగణంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. స్వయంసహాయక బృందాల మహిళలకు 20 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అనంతరం శ్రీకృష్ణాపురంలో నిర్మించతలపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ కళాశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో నాబార్డు సాయంతో 33 విద్యార్థి వసతిగృహాలను 330 కోట్ల రూపాయలతో నిర్మించనున్నట్లు ప్రకటించారు. గృహ నిర్మాణ పథకంకోసం 416 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మైక్రోఫైనాన్స్‌ బాధితులకు సాయంగా ఉంటామని వారికోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేశామని తెలిపారు.

 

విశాఖలో సీపీఎం ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

విశాఖ: విశాఖలో ఈరోజు జరగనున్న కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి దృష్టికి ఆస్తిపన్ను పెంపు అంశాన్ని తీసుకువెళ్లే ఉద్దేశంతో ఆందోళనకు దిగిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తిపన్ను తగ్గించాలంటూ జగదాంబ సెంటర్‌ నుంచి స్వర్ణభారతి ఆడిటోరియం వరకు ప్రదర్శనగా వెళ్లాలని భావించిన పలువరు కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

డీఎస్‌ ఇంటిముందు విద్యార్థుల నిరసన

హైదరాబాద్‌: ఫ్రీజోన్‌ అంశం, ఎస్‌ఐ నియామక పరీక్షలపై పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ తన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఓయు జేఏసీ విద్యార్థులు ఆయన ఇంటిముందు నిరసన చేపట్టారు. అన్ని రాజకీయపార్టీలు ఈ వివాదంపై మాట్లాడుతుంటే డీఎస్‌ ఎందుకు స్పందించటంలేదని వారు ప్రశ్నించారు. దీనిపై ఆయన తన వైఖరి స్పష్టం చేయకపోతే ఆయన ఇంటిని దిగ్భందం చేస్తామని హెచ్చరించారు. ఆ సమయంలో డీఎస్‌ ఇంట్లో లేకపోవటంతో విద్యార్థులు కొంతసేపు బైఠాయించి వెళ్లిపోయారు.

మారుతున్న సమీకరణలు

                               

కదలి వచ్చిన కొణతాల రామకృష్ణ వర్గం
విశాఖపట్నం, నవంబర్ 16: జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పులు రానున్నాయా? సమీకరణలు మారనున్నాయా? జగన్‌కు జై కొట్టిన వారంతా.. ఇప్పుడు రోశయ్య పంచన చేరుతున్నారా? అవును నిజమే. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన వెంటనే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక తాటిమీదకు చేర్చి, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్‌తో కొణతాల గళం విప్పారు. జిల్లా నేతలంతా ఆయనకు మద్దతు పలికారు.జగన్ ముఖ్యమంత్రి కావడం సాధ్యం కాదని తేలిపోవడంతో కొణతాల, అతని అత్యంత సన్నిహితుడు గండి బాబ్జి మినహా మిగిలిన వారంతా మంత్రి బాలరాజు గూటిలోకి వచ్చేశారు. కొణతాల వెంట తిరిగిన వారిలో ఒక్కొక్కరుగా బయటకు వచ్చేయడంతో ఆయన ఏకాకైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొణతాల గైర్హాజరయ్యారు. పార్టీ కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. రాష్ట్ర రాజకీయాలు ఏవిధంగా మారుతాయో తెలియని పరిస్థితి ఉన్నందున కొణతాల వర్గం కాస్త పట్టు సడలించుకున్నట్టు తెలుస్తోంది.మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి సమక్షంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మంగళవారం సమావేశమై నగరంలో రోశయ్య జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే, అధిష్టానం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయన్న భావనతో ఈ వర్గం కేవలం ఈ ఒక్క కార్యక్రమానికి మాత్రమే రోశయ్యతో కలిసి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు చెపుతున్నారు.అందులోనూ పిసిసి అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో విభేదాలను పక్కన పెట్టి, అంతా ఒక్కటిగా ఉన్నామన్న భావన పిసిసి చీఫ్‌కు కల్పించేందుకైనా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వెళ్లి తీరాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు, కొణతాల వర్గం ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలికింది.