* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

29, మే 2012, మంగళవారం

బిజెపికి హ్యాండ్: పరకాలలో తెరాసకే జెఎసి మద్దతు

హైదరాబాద్: వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో మద్దతుకు సంబంధించి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) స్టీరింగ్ కమిటీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పరకాలలో బిజెపికి కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ సమావేశానంతరం వెల్లడించారు.దాదాపు రెండున్నర గంటల పాటు స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ప్రజాభిప్రాయం మేరకు తెరాసకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి సమావేశం వచ్చింది. సీమాంధ్రులు, సమైక్యవాదుల కుట్రలను దెబ్బ తీయడానికి తెరాసకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కోదండరామ్ చెప్పారు.తాము నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాన్ని ఆధారం చేసుకుని తెరాసకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరకాల ఉప ఎన్నికలో సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొత్త వ్యూహంతో సమైక్యవాదులు ఆధిపత్యం కోసం ముందుకు వస్తున్నారని, వారి ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ప్రజాభిప్రాయ సేకరణ హేతుబద్దంగా జరిగిందని, తెలంగాణవాదానికి మద్దతు ఇస్తున్న బిజెపి, తెరాసల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని తాము ప్రజలను అడిగామని, ప్రజలు ఎక్కువ శాతం తెరాస వైపు మొగ్గు చూపారని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఇటువంటి పరిస్థితే ఎదురైనప్పుడు తాము తటస్థంగా ఉన్నామని, ఇప్పుడు తటస్థంగా ఉంటే నష్టం జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చామని, అందు కోసం ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని ఆయన చెప్పారు.పరకాలలో బిజెపి, తెరాసల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై జెఎసి 20, 25 రోజులుగా తర్జనభర్జనలు పడుతూ వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణకు విశ్వవిద్యాలయాలకు చెందిన 9 మందితో జెఎసి ఓ కమిటీ వేసింది. ఈ సర్వే ఫలితం ఆధారంగానే తెరాస అభ్యర్థి బిక్షపతికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జెఎసి నిర్ణయం తీసుకుంది.కాగా, జెఎసి నిర్ణయం పట్ల బిజెపి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్వేలు కొలమానం కాదని, మహబూబ్‌నగర్ విషయంలో సర్వే ఫలితం తప్పని తేలిందని బిజెపి నాయకులు అంటున్నారు. ఏ పార్టీతో తెలంగాణ వస్తుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బిజెపి నాయకులు అంటూ వస్తున్నారు.జెఎసి నిర్ణయం పట్ల తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి హర్షం వ్యక్తం చేశారు. పరకాలలో బిజెపి గెలిచే అవకాశాలు లేవని, పాలమూరు పరిస్థితి పరకాలలో లేదని ఆమె అన్నారు. బిజెపి సమైక్యవాదానికి ఉపయోగపడుతుందని ఆమె విమర్సించారు.పరకాలలో బిజెపికి బలం లేదని, రెండు తెలంగాణవాద పార్టీలు పోటీ చేయడం వల్ల సమైక్యవాదులు బలపడే అవకాశం ఉందని విజయశాంతి అన్నారు. ఇప్పటికైనా పోటీ నుంచి విరమించుకోవాలని ఆమె బిజెపిని కోరారు. పోటీ నుంచి విరమించుకోకపోతే సమైక్యవాదలకు బిజెపి ఉపయోగపడినట్లు అవుతుందని ఆమె అన్నారు. పరకాలలో తెరాస విజయం సాధించి తీరుతుందని ఆమె అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి