* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

31, మే 2012, గురువారం

ఆళ్లగడ్డ: శోభా నాగిరెడ్డికి చిరంజీవి సెగ తప్పదా?

కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డిని నిలువరించేందుకు కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మొదటి నుంచీ అండగా నిలుస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డిని ఓడిస్తే నైతికంగా దెబ్బ తీసినట్లు అవుతుందని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెసు నాయకులు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తమకచ్చితంగా గెలిచే స్థానాల్లో ఆళ్లగడ్డ మొదటి స్థానంలో ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. వైయస్ జగన్ మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డితో భూమా కుటుంబం వియ్యమందడం, కడప జిల్లాకు ఆనుకునే ఆళ్లగడ్డ ఉండడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆ స్థానం ప్రతిష్టాత్మకంగా మారింది. వైయస్ జగన్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఓ సారి పర్యటించారు.ఆళ్లగడ్డలో ప్రచారానికి కాంగ్రెసు రాష్ట్ర నాయకులు జూన్ మొదటివారంలో రానున్నారు. జూన్ 1న కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు ఆమె ఎమ్మిగనూరులో కూడా పర్యటించే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. జూన్ 2వ తేదీన పార్లమెంటు సభ్యుడు చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆళ్లగడ్డలో రోడ్ షో నిర్వహిస్తారు. 5న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రచారం చేస్తారు. ఇప్పటికే కేంద్ర మంత్రి వాయలార్ రవితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆళ్లగడ్డ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల కోసం కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2009 ఎన్నికలలో చేపట్టినట్టు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతు పలికిన వారంతా అప్పట్లో శోభానాగిరెడ్డి విజయానికి కీలకంగా మారారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తరువాత నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులతో ఆ సామాజిక వర్గంలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.నియోజకవర్గంలో 30 వేలకు పైగా ఉన్న చిరంజీవి సామాజిక ఓటర్లు అభ్యర్థుల విజయాలను శాసిస్తున్నట్టు విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఆ వర్గం ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు చిరంజీవి, బొత్స సత్యనారాయణ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కాంగ్రెసు అభ్యర్థి గంగుల ప్రతాప రెడ్డి మొదటి నుంచీ భూమా వర్గానికి నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి