* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

15, డిసెంబర్ 2010, బుధవారం

విశాఖలో కూలిన అపార్టుమెంట్‌ రిటైనింగ్‌ వాల్‌

విశాఖ(విశాల విశాఖ) : నగరంలోని మర్రిపాలేం వుడా లేఔట్‌లో అపార్ట్‌మెంట్‌కు రక్షణగా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ ఈ ఉదయం కుప్పకూలింది. దీంతో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న దాదాపు 26 కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. అధికారులు అప్రమత్తమై వారిని ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. మహా విశాఖ నగరపాలక అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

తాజ్‌ హమల్ దర్శనం.. ఇక ప్రియం

ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన ప్రేమ సౌధం "తాజ్ మహల్" మెడలో ఇక నుంచి ధనికులకు మాత్రమే అనే హెచ్చరిక బోర్డు దర్శనమివ్వబోతుందా..? ఇకపై సామాన్యుడు తాజ్‌ను కిలోమీటరు దూరం నుంచి చూడాల్సిందేనా..? అవుననే చెబుతున్నాయి తాజా నివేదికలు. ప్రాచీన సంపదను భావితరాలకు కూడా తెలియాలంటే ఈ చర్యలు తీసుకోకతప్పవని ఆ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.ఈ జాబితాలో కేవలం తాజ్ మహల్ మాత్రమే కాదండోయ్.. ఈజిప్టు పిరమిడ్స్, వెనిస్ నగరం లాంటి చారిత్రాత్మక కట్టడాలు కూడా ఉన్నాయి. మరో 20 ఏళ్లలో ప్రాచీన సంపదగా చెప్పుకునే ఈ ప్రపంచ సంపద కనుమరుగయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కట్టడాలను దర్శించడానికి పర్యాటకుల తాకిడి నానాటికి పెరిగిపోతుండటంతో ఇవి అరిగిపోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.ఫ్యూచర్ లేబోరేటరీ నిపుణుల ప్రకారం.. సంపన్నులకు సందర్శన వేళలను కుదించడం, సామాన్యులకు పరిసర ప్రాంతాల నుంచి చూసే వీలు కల్పించడం వంటివి చేయడం ద్వారా జాతీయ సంపదను కాపాడుకున్న వాళ్లమవుతామని వారు చెబుతున్నారు. బ్రిటన్‌లో జాతీయ సంపదను సందర్శించాలనుకునే పర్యాటకులు వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ద్వారా వచ్చినట్లు రుజువు చూపితేనే ప్రవేశం ఉంటుందని లేకపోతే ఉండదని డైలీ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.దీనిపై ఫ్యూచరాలజిస్ట్ ఇయాన్ పియర్సన్ స్పందిస్తూ.. "ఇలాంటి ప్రాచీన ప్రపంచ సంపదను ఇప్పుడే తిలకించడం మంచిది. భవిష్యత్తులో మనం వెళ్లాలనుకున్నా కష్టమ"ని అన్నారు. "ధనికులు మాత్రమే పెద్దమొత్తంలో ధనం వెచ్చించి టికెట్ కొనుక్కోగలరు. సాధారణ వ్యక్తులు మాత్రం తాజ్ మహల్ లాంటి ప్రదేశాలను సందర్శించాలంటే.. ఏ లాటరీయో గెలిస్తే కానీ టికెట్ కొనలేని పరిస్థిత"ని ఆయన చెప్పారు.

సంతానంకోసం

తెలుగును ముద్దుముద్దుగా మాట్లాడే రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం రంభ గర్భవతి. అందుకని గత కొంతకాలంగా చెన్నైలో తల్లితోపాటు ఉంటోంది.అయితే లండన్‌లో ప్రసవిస్తే పుట్టిన అమ్మాయో.. అబ్బాయికి అక్కడ సిటిజన్‌‌షిప్‌ వస్తుందని భావించి అక్కడికివెళ్ళాలని నిర్ణయించుకున్నదట.తొమ్మిదో నెల వచ్చాక ఫ్లైట్‌ ఎక్కడానికి అనుమతించరు కాబట్టి ఇటీవలే అక్కడికి వెళ్ళిపోయింది. తల్లయిన తర్వాత మళ్ళీ సినిమారంగంలోకి రావాలని కలలుకంటోంది. భర్త ప్రోత్సాహంతో నిర్మాణసంస్థను స్థాపించాలని కూడా ప్లాన్‌ చేస్తోందని తెలిసింది.

ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల మృతి

విజయవాడ (విశాల విశాఖ): ఆటోనగర్‌ గేటు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై ఇద్దరు విద్యార్థులు బెంజిసర్కిల్‌ వైపు వస్తున్నారు. ఆటోనగర్‌ గేటు సమీపంలోని బస్టాప్‌ వద్ద లారీని ఓవర్‌టేక్‌ చేసి ముందుకు వెళ్లారు. ఇంతలో ఓ మహిళ డివైడర్‌ దాటుకుంటూ వస్తుండడంతో విద్యార్థులు తమ బండి వేగం తగ్గించగా.. ఇంతలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. బైక్‌ లారీ ముందు చక్రాల కింద ఇరుక్కుపోవడంతో కొంతదూరం ఈడ్చుకు వెళ్లింది. లారీ వారిద్దరి తలలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విద్యార్థులు జేబులు పరిశీలించగా కళాశాల ఐడీ కార్డు లభించింది. దాని ద్వారా ధనేకుల ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీలో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. వీరిలో ఒకరిని బీటెక్‌ మెకానికల్‌ చదువుతున్న ఇ.సతీష్‌ (20)గా గుర్తించారు. మరో విద్యార్థి దుర్గాప్రసాద్‌. వీరు పెనమలూరులో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐడీ కార్డు మీద ఉన్న ఫోన్‌ నెంబర్లకు, కళాశాల యాజమాన్యానికి ఫోన్‌చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి తరలించారు.ఇంజనీరింగ్‌ విద్యార్థులు చనిపోయారని తెలియగానే వివిధ కళాశాలల విద్యార్థులు అక్కడకి చేరుకున్నారు. తమ కళాశాల విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు తమ కళాశాల విద్యార్థి అని తెలియగానే వారి హృదయాలు బరువెక్కాయి. చుట్టుపక్కల ప్రజలు కూడా రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.దీంతో బందరు రోడ్డులో దాదాపు గంట సేపు ట్రాఫిక్‌ స్తంభించింది.

శబరిమల భక్తులకు ప్రత్యేక రైలు

విశాఖపట్నం: శబరిమల వెళ్ళే భక్తుల కోసం తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. ఈ నెల 19 నుంచి జనవరి 23 వరకు ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. విశాఖపట్నంలో బయలుదేరే ఈ రైలు కేరళలోని కొళ్లాం(కొట్టాయం తరువాతి హాల్టు) వరకు వెళుతుంది. ప్రతి ఆదివారం విశాఖపట్నంలో ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు కొళ్లాం చేరుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 11.45కు కొళ్లాంలో బయలుదేరి మంగళవారం రాత్రి 7.15కు విశాఖ చేరుతుంది.మార్గమధ్యంలో ఈ రైలు విజయవాడ, రేణిగుంట, జోలార్‌పేట్‌, పాల్ఘాట్‌, త్రిచూర్‌, కొట్టాయం వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.

విశాఖలో వాతావరణ అవగాహన ర్యాలీ

విశాఖపట్నం(విశాల విశాఖ): సుందర నగరంగా పేరు గాంచిన విశాఖలో వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండవలి అవగాహన ర్యాలీ నిర్వహించింది. నగరంలో రోజూ రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టి ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఏవీఎన్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టరేట్‌ మీదుగా జగదాంబ జంక్షన్‌ నుంచి పలు ప్రధాన రహదారుల్లో పర్యటించి ప్రజలకు అవాగహన కల్పించింది.

తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైన వైఎస్.జగన్ టూర్

 తూర్పుగోదావరి జిల్లాలో మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటన బుధవారం ప్రారంభంమైంది. ఈ యాత్ర కోసం మంగళవారం రాత్రి ఆయన సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి రైలులో బయలుదేరారు. రాజమండ్రి స్టేషన్‌లో స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటించి, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తారు.
రాజమండ్రి చేరుకోనున్న వైఎస్ జగన్, రోడ్ షో పూర్తిచేసుకుని కాకినాడ చేరుకుంటారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంట జరిగే వివాహ కార్యక్రమంలో జగన్‌‍తో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఇదిలావుండగా, బుధవారం ఉదయం స్థానికంగా ఉన్న సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు.