లాన్ ఏంజెలిన్ : భారత సంగీతకారుడు ఏఆర్‌ఇ రెహమాన్ 127 అవర్స్ సినిమాకోసం చేసిన సంగీతానికి ప్రతిష్ఠాత్మక వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డు గెలుచుకున్నారు. పబ్లిక్ ఛాయిస్ విభాగంలో ఆయనకి అవార్డు దక్కింది. గతంలో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి రెండు ఆస్కార్‌లు, రెండు గ్రామీలు అందుకున్నారు. ఇప్పుడు 127 అవర్స్ సినిమాకు తాజా అవార్డు గెలుచుకున్నారు. పబ్లిక్ చాయిస్ అవార్డు ఇచ్చినందుకు వరల్డ్ సౌండ్ ట్రాక్ అకాడమీకి నా అభిమానులకు రెహమాన్ కృతజ్ఞతలు తెలిపారు.
24, అక్టోబర్ 2011, సోమవారం
ఏఆర్ రెహమాన్‌కి వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డు
తెలంగాణ ఉద్యోగుల సమ్మె విరమణ
హైదరాబాద్ : సకల జనుల సమ్మెను తెలంగాణ ఉద్యోగులు విరమించారు. రేపటి నుంచి తెలంగాణ ఉద్యోగులు సమ్మె విరమించి విధులకు హాజరుకానున్నారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీఆజాద్ హామీ ఇచ్చారని మంత్రి దానం నాగేందర్ అన్నారు. సమ్మె విరమించమని ఢిల్లీ నుంచి ఆజాద్ కోరినట్లు చెప్పారు. ఉద్యోగుల తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. సమ్మె విరమణ పత్రంపై టి. ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు.
20, అక్టోబర్ 2011, గురువారం
ఏడువేల అంత్యోదయ కార్డుల పంపిణీకి నిర్ణయం
పాడేరు(విశాల విశాఖ): ప్రతిష్టమైన చర్యల ద్వారా విశాఖ ఏజెన్సీలో ప్రజా పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ తహసీల్దార్లకు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిజన శంకర్ ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పంపిణీ,6వ విడత భూ పంపిణీకి అవసరమయ్యే భూ సేకరణపై ఏజెన్సీలోని తహసీల్దార్‌లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.జిల్లాలో అతి పేదలైన వారికి పంపిణీకి ఏడువేల అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు అందించేందుకు నిర్ణయించామన్నారు. అందులో 5వేల 500 ఎ.ఎ.వై. కార్డులు ఏజన్సీకి ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ కార్డులపై 35 కేజీలు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ప్రాధాన్యతను బట్టి ఆదిమ జాతుల తెల్లరేషన్ కార్డులను ఎ.ఎ.వై. కార్డులుగా మార్చి డిశంబర్ నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. 6వేల టన్నుల సామర్ధ్యం గల పాడేరు జి.సి.సి. గోడౌన్‌లో పూర్తి స్థాయి నిల్వలు ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.బియ్యం, గోదుమ, కిరోసిన్ పంపిణీలో తూనికలు సరిగా ఉండేటట్లు చూడాలన్నారు. రాబోయే కాలంలో నియోజక వర్గ మండలాల్లో 5వేల దీపం కనెక్షన్లకు నమోదులు స్వీకరించాలన్నారు. 6వ విడత అటవీ భూముల పంపిణీకి అన్ని మండలాల్లో సర్వేలు పూర్తి చేయాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ భూ సేకరణ యొక్క రికార్డుల పని సంపూర్ణంగా ఉండాలన్నారు. భూ సేకరణ మెదర్‌మెట్స్, మెన్యూవల్స్ తయారీలను ముందు చేయాలన్నారు. తరువాత సిఎడి, సిఎఎం.పద్ధతిలో కంప్యూటర్‌లో పొందు పర్చాలన్నారు. ఏజెన్సీలోని అన్ని తాలుక కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందన్నారు. మండలాల వారిగా సమీక్ష చేస్తూ సిబ్బంది కొరత ఉన్న, మావోయిస్టుల సమస్య ఉన్న అంకితభావంతో విధి నిర్వహణ చేస్తున్నామన్నారు. అడంగల్, బేెసిక్ ప్రాతిపధికన భూ సేకరణకు వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆరువేల రేషన్ కార్డులు ఉన్న చోట ఒక డిఆర్‌డిపో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సర్వే సహాయ సంచాలకులు, 11 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
18, అక్టోబర్ 2011, మంగళవారం
ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడం అసందర్భం: పరకాల ప్రభాకర్
రాష్ట్రాన్ని విభజించి తెలంగాణా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం అసందర్భం, అసంమజసమని ప్రముఖ పాత్రికేయడు పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈనెల 22, 23 తేదీల్లో విశాలాంధ్ర మహాసభను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ వర్క్‌షాపులో అన్ని విషయాలను చర్చిస్తామని ఆయన తెలిపారు.దీనిపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విశాలాంధ్రపై ఈనెల 22, 23 తేదీల్లో నగరంలోని జూబ్లీహాల్‌లో వర్కషాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే, ప్రత్యేక తెలంగాణపై పరకాల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై తెలంగాణ వాదులు దాడి చేసేందుకు యత్నించగా, పోలీసుల జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఈటెల రాజేందర్‌కు బెయిల్ నిరాకరించిన రైల్వే కోర్టు!
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌కు సికింద్రాబాద్ రైల్వే కోర్టు మంగళవారం కూడా బెయిల్ నిరాకరించింది. దీంతో గత మూడు రోజులుగా జైల్లోనే ఉంటున్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శనివారం రోజు ఈటెల రాజేందర్ హైదరాబాద్‌లో రైలు రోకోలో పాల్గొన్న విషయం తెల్సిందే.రైల్వే ఆస్తుల పరిరక్షణ చట్టం కింద ఈటెలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. శనివారం నుంచి బెయిల్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నా రైల్వే కోర్టు మాత్రం ఆయనకు బెయిల్ నిరాకరించింది.ఈటెలతో పాటు.. మరికొంతమంది తెరాస నేతలకు శని, ఆదివారాల్లో బెయిల్ లక్ష్యమైంది. మెదక్ ఎంపీ విజయశాంతికి ఆదివారం బెయిలు రాగా, కాంగ్రెస్ నేతలు పొన్నం, జీవన్ రెడ్డిలకు సోమవారం బెయిలు లభించింది. కానీ, ఈటెలకు మాత్రం మంగళవారం కూడా రైల్వే కోర్టు బెయిల్ నిరాకరించింది
14, అక్టోబర్ 2011, శుక్రవారం
సహ చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది
ప్రధాని మన్మోహన్‌సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం వల్ల వస్తున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని దానిని సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్ర సమాచార సంఘం (సీఐసీ) శుక్రవారం నిర్వహించిన రెండు రోజుల వార్షిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పనితీరు కుంటుపడేలా ఉండకూడదని తెలిపారు. పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ చట్టం... తమ అధికారాల్లోకి చొరబడుతోందని కొందరు అధికారులు భావిస్తున్నారని, దీనిపై సమన్వయాన్ని సాధించాల్సి ఉందని గుర్తు చేశారు. సహచట్టం వల్ల నిజాయితీగల అధికారులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. కార్యనిర్వాహక వ్యవస్థను జవాబుదారీగా ఉంచేందుకు సహచట్టానికి మరింత పదును తెస్తామని అన్నారు. అవినీతి గుట్టును రట్టు చేసే వారికి రక్షణ కల్పించే చట్టాన్ని మరో అయిదు నెలల్లో తెస్తామన్నారు.

తెరాస శాసనసభ్యుడు కేటీఆర్ అరెస్టు, విడుదల
హైదరాబాద్: తెరాస శాసనసభ్యుడు కె. తారకరామారావును పోలీసులు అరెస్టు చేశారు. సీతాఫలమండిలో ఓ ఇంట్లో ఉన్న కేసీఆర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరెస్టు అక్రమమంటూ తెలంగాణ వాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అరెస్టును అడ్డుకున్నారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటికి పోలీసులు కేటీఆర్‌ను మరల అక్కడే విడిచిపెట్టారు.
12, అక్టోబర్ 2011, బుధవారం
అన్నా హజారేకి న్యాయ శాస్త్ర విద్యార్థి లీగల్ నోటీసు
న్యూఢిల్లీ: ఇరవై రెండేళ్ల న్యాయశాఖ విద్యార్థి ఒకరు అన్నా హజారేకి 'దేశప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని' లీగల్ నోటీసు ఇచ్చాడు. అన్నా బృందం అవినీతి మీద పోరాటాన్ని ఒక్క పార్టీకి వ్యతిరేకంగా మళ్లించి భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని విభోర్ ఆనంద్ అనే యువకుడు ఆ నోటీసులో పేర్కొన్నాడు. అన్నా బృందంలోని సభ్యులందరికీ కూడా ఈ నోటీసులను ఇచ్చారు. పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అన్నా ఉద్యమించినందుకు దేశంలో లక్షలాది ప్రజలు స్ఫూర్తి పొందారని, అలాంటిది ఇప్పుడు అన్నా బృందం తమ పంథా మార్చుకుని ఒక్క కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకుందని ఈ నోటీసులో పేర్కొన్నారు. లోక్‌పాల్ బిల్లు కోసం శీతాకాల సమావేశాలవరకూ కూడా ఆగకుండా అన్నాబృందం ప్రతినిధులు వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రచారం గురించి కూడా ప్రకటనలు చేశారని, హిసార్ ఉప ఎన్నికకీ అదే ధోరణిలో ప్రచారం ప్రారంభించారని నోటీసులో పేర్కొన్నారు. ఈ చర్యలు అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నీరుకారుస్తున్నాయని అందులో పేర్కొన్నారు.
ప్రశాంత్‌భూషణ్‌పై దాడి
న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, అన్నా బృందంలో కీలక సభ్యుడు, లోక్‌పాల్ ముసాయిదా కమిటీ సభ్యుడైన ప్రశాంత్‌భూషణ్‌పై ముగ్గురు యువకులు దాడి చేశారు. సుప్రీంకోర్టులో ఆయన తన ఛాంబర్‌లో ఉండగా వీరు దూసుకువచ్చి విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం వీరు పారిపోతుండగా జూనియర్ న్యాయవాదులు ఒకరిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వారు ఆ యువకుడిని అరెస్టు చేశారు. పారిపోయిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాశ్మీర్‌లో రెఫరెండం చేయాలన్న ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. శివసేనకు చెందిన కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ భూషణ్‌పై దాడిని కిరణ్‌బేడీ ఖండించారు.
ప్రశాంత్‌భూషణ్‌కు చికిత్స
భగత్‌సింగ్ క్రాంతి సేన కార్యకర్తల దాడిలో గాయపడిన సామాజికవేత్త అన్నా హజారే బృందం సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ను రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. భూషణ్‌పై దాడిని అన్నా టీం ఖండించింది.
దాడిని ఖండించిన హోం మంత్రి
అన్నా టీం మెంబర్ ప్రశాంత్‌భూషణ్‌పై జరిగిన దాడిని కేంద్రహోం మంత్రి చిదంబరం, అన్నా బృందం మెంబర్ కిరణ్‌బేడీ, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణలు ఖండించారు.
దాడి చేసింది...
ప్రశాంత్‌భూషణ్‌పై దాడి చేసింది భగత్‌సింగ్ క్రాంతి సేన కార్యకర్తలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆవరణలో కరపత్రాలు లభించాయి.

3, అక్టోబర్ 2011, సోమవారం
దుర్గామాతను దర్శించుకున్న సినీహీరో అల్లు అర్జున్
విజయవాడ: తెలుగు సినీహీరో అల్లు అర్జున్ ఈరోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు మూలా నక్షత్రం కావటంతో ఆలయంలో భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ఈఓ, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌లు అల్లు అర్జున్‌ను ఆయన వెంట వచ్చినవారిని కిందనుంచి స్వయంగా తీసుకుని వచ్చారు. ఈఓ వాహనంలో వారిని పైకి తీసుకుని వచ్చారు. అంతరాలయ దర్శనం చేయించి పండితులతో అమ్మవారి శేషవస్త్రం కప్పి ప్రసాదం అందజేయించారు.
రాష్ట్రంలో అప్రకటిత రాష్ట్రపతి పాలన: కొణతాల
హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో అప్రకటిత రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొణతాల రామకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతమంతా పోలీసు రాజ్యంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలు గాడాంధకారంలో మునిగిపోయారని ఆయనఅన్నారు.
1, అక్టోబర్ 2011, శనివారం
కర్నాటక మంత్రిని చెప్పుతో కొట్టిన నేత
బెంగుళూరు : కర్నాటక విధానసౌధలో ఓ మంత్రికి ఘోర పరాభవం ఎదురైంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమన్నను మాజీ బీజపీ నేత ప్రసాద్ చెప్పుతో కొట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారంటూ మంత్రిపై దాడికి దిగారు. వెంటనే రగంలోకి దిగిన విధానసౌధ పోలీసులు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు
తెలంగాణపై... అన్నీ రాజకీయపక్షాలు అభిప్రాయాలు ప్రకటించాలి
పురందేశ్వరి
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్నీ రాజకీయపక్షాలు తెలంగాణపై తమ వైఖరిని ప్రకటించిన అనంతరమే దీనిపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. సమస్య పరిష్కారానికి కేంద్రం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. రెండు ప్రాంతాల కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ నివేదిక రూపంలో సోనియాకు ఇచ్చినందున తదుపరి చర్యలు వేగవంతం చేస్తారన్నారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిసి తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించిందన్న సంగతి తనకు తెలియదన్నారు

29, సెప్టెంబర్ 2011, గురువారం
ఏసీబీకి చిక్కిన చిట్వేలు అటవీ అధికారి
కడప: రూ.20వేలు లంచం తీసుకుంటూ కడపజిల్లా చిట్వేలు అటవీ రేంజ్ అధికారి ప్రసాదరావు గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఎర్ర చందనం అక్రమంగా తరలించేందుకు ఓరైతు నుంచి రూ.20వేలు లంచం డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు
రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి పంకజ్ త్రివేది
హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా పంకజ్ త్రివేదీ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా వినయ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్.వి. ప్రసాద్‌ని నియమించారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా కె. సత్యనారాయణను నియమించారు
25, సెప్టెంబర్ 2011, ఆదివారం
విలీనంతో మరింత బలోపేతం
ఉత్తరాంధ్ర కాంగ్రెస్ గర్జన సభలో కాంగ్రెస్ నేతల స్పష్టీకరణ
విశాఖపట్నం(విశాల విశాఖ): కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ (ప్రరాపా) విలీనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మరింతగా బలపడిందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. దీనికి నిదర్శనం విశాఖలో జరిగిన బహిరంగ సభ విజయవంతం కావడమేనని పేర్కొన్నారు. రాబోయే కాలంలో గ్రామ స్థాయిలో ఇరుపార్టీ శ్రేణులు మరింతగా కలిసిమెలిసి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకొనే స్థాయికి వెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర కాంగ్రెస్ గర్జన పేరిట నగరంలోని రామకృష్ణబీచ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. విలీనానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలు, కిరణ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను వల్లెవేశారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయడం పట్ల హర్షం వెలిబుచ్చారు. పీసీసీ నేత బొత్స, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత చిరంజీవి ముగ్గురు త్రిమూర్తులు లాంటి వారని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని ముందుకు తీసుకెళ్ల గలిగే దిట్టలుగా వర్ణించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రెండు పార్టీల మేలు కలియికని అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయాలని కోరారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఐకమత్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సోనియాగాంధీ త్యాగశీలి అని, ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోందన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తో సాధ్యమని, ఈ పార్టీలో ప్రరాపాను విలీనం చేయడం హర్షణీయమన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కిరణ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున అమలు జరుతున్నాయన్నారు.రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంతో బలమైనదని, దాన్ని ఎవరూ ఎదిరించలేరన్నారు. కొన్ని పార్టీలు ఏవేవో చెబుతున్నాయని, తమకున్న పార్టీ, పత్రికలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, వారి ఆటలు సాగబోవన్నారు. పార్టీ సంస్థాగతంగా పటిష్ఠంగా ఉందని, పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. చిరంజీవితో తనకు 35 ఏళ్ల గా అనుబంధం ఉందని, ఆయన కాంగ్రెస్‌లో చేరడం వల్ల పార్టీ మరింతగా బలోపేతం అవుతుందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, చిరంజీవి కలియకలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్నాయని, రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలకు పథకాల ఫలితాలు అందుతున్నాయన్నారు. అనకాపల్లి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంతో పార్టీ మరింతగా బలపడిందన్నారు. భవిష్యత్తులో ఇదే ఊపు కొనసాగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న జగన్‌కు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వల్లే వైఎస్‌కు పదవులు వచ్చాయని, అటువంటి కాంగ్రెస్ అధినేత్రిని లక్ష్యం చేసుకొని జగన్ విమర్శలు చేయడం విచారకరమన్నారు. ఎంపీలు కిల్లి కృపారాణి, బొత్సఝాన్సీ, అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి, ప్రభుత్వ విప్ కోండ్రు మురళీ మోహన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తైనాల విజయకుమార్, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోట నగేష్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వట్టి వసంతకుమార్, పినిపే విశ్వరూప్, పార్ధసారధి, తోట నర్సింహం, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, వంగా గీత, మళ్ల విజయప్రసాద్, బోళెం ముత్యాలపాప, ప్రరాపా నాయకులు అల్లు అరవింద్, నాగబాబు, సి.రామచంద్రయ్య, డాక్టర్ ఎస్.ఎ.రెహ్మాన్, కె.వి.సిహెచ్. మోహనరావు, కోటగిరి విద్యాధరరావు, ఎమ్మెల్సీ సాగి సూర్యనారాయణరాజు, మేయరు పులుసు జనార్ధనరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బలిరెడ్డి సత్యారావు, గురుమూర్తిరెడ్డి, కె.చిట్టినాయుడు, మరియాదాస్, యల్లపు రఘురాం, సోడదాసు సుధాకర్, సతీష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం
పతనావస్థలో కాంగ్రెస్ సర్కార్
తెదేపా అధినేత వ్యాఖ్యలు
తిరుపతి(విశాల విశాఖ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పతనావస్థకు చేరుకుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడువిమర్శించారు. నెల్లూరు జిల్లా పర్యటన అనంతరం హైదరాబాదు వెళుతూ ఆయన గురువారం రాత్రి తిరుపతి పద్మావతీ అతిథిగృహం చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన శుక్రవారం హైదరాబాదు తిరుగు ప్రయాణం అవుతూ అతిథిగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభద్రతాభావంతో ఉండటం వల్ల కొత్త పథకాలంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండేలా కనిపించడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఒక్క వస్త్రాలపైనే నాలుగు నుంచి ఐదు శాతం పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. మద్యం విచ్చలవిడి అమ్మకాల ద్వారా ఖజానాకు రూ.1500 కోట్ల రెవెన్యూ చేరిందన్నారు. అవినీతిపరులు దోచుకున్న సంపదను రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకుని దాన్ని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఖనిజ సంపద, 2జీ స్పెక్ట్రం, కామన్‌వెల్త్ కుంభకోణంలో బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమార్కులు దాచిఉంచిన నల్లధనాన్ని వెలికితీసి పేదలకు పంచిపెడితే పేదలు లేని సమాజాన్ని చూడవచ్చునన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. కిలో రూపాయి బియ్యం పథకం ఒక బూటకమని కొట్టిపారేశారు. రాష్ట్రంలో ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇందుకు సర్కార్ వైఖరే కారణమన్నారు. రాజకీయ ప్రక్షాళన జరిగినప్పుడే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు.
21, సెప్టెంబర్ 2011, బుధవారం
ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
అనకాపల్లి(విశాల విశాఖ):విద్యార్థులు వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించి నడపాలని ట్రైనీ డిఎస్పీ రమాదేవి తెలిపారు. పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం హీరో కంపెనీవారు నిర్వహించిన సేఫ్ డ్రైవ్ రిహాసల్స్ సెమినార్‌లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థు లకు కాలేజీ దశ చాలా విలువైనదని జీవితానికి ఈ దశ పునాధి అని దానిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు.ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ తరువాత సాఫ్టవేర్ కంపెనీలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అలా కాకుండా గ్రూప్స్ వైపు కూడా దృష్టి సారించాలని ఆమె తెలిపారు. అలా చేయడం వలన ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ర్యాష్‌గా డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని, మీపై ఎంతో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆమె అన్నారు.అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు మీతో పాటుగా ప్రమా దానికి గురైన ఎదుటి వ్యక్తి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ పాపారావు, ఇంజనీరింగ్ కళా శాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్, ప్రిన్సిపల్ రామ్మోహన్‌రావు, హీరో ట్రైనర్ ఎం.గోపీ నాయుడు, మెకానిక్ సెక్షన్ సూపర్‌వైజర్ వినోద్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, పీఆర్పీ కార్యకర్తల సమావేశం
చోడవరం(విశాల విశాఖ): పట్టణపరిధిలో గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మండల కాంగ్రెస్ , పిఆర్‌పి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పినపోలు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కరణం ధర్మశ్రీ విచ్చేశారు. పినపోలు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఈ కార్యాలయంలో ఇరుపార్టీల కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం జరగడం శుభపరిణామమన్నారు. ఇకపై అధికారపార్టీ చెందిన కార్యకర్తలుగా కొనసాగుతామని హితవు పలికారు.ఇరు పార్టీ కార్యకర్తలకు సముచితస్థానం ల్పించి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేసి ముందుకు సాగాలన్నారు. గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ధర్మశ్రీ హయాంలో కలిసి అన్నదమ్ములుగా పనిచేస్తామన్నారు. అలాగే కార్యకర్తలను ఉద్దేశించి మూడెడ్ల శంకరరావు మాట్లాడుతూ 32 గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసిన కారణంగా ఇకనుంచి అందరి మనస్సుల్లో ఒకే స్వభావంతో పార్టీలో మెలగాలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి విజయబాటపై వెళ్లాలన్నారు. ఏడువాక సత్యారావు మాట్లాడుతూ ఒకేమాట, బాట మనస్సుల్లో ఎటువంటి ద్వేషాలు, మనస్పర్ధలు లేకుండా సంతృప్తి కరంగా ఉండాలని కోరారు. అలాగే కమిటీలు వేసి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడానికి నాయకులను కోరారు.ముఖ్యఅతిథి కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ సెప్టెంబర్ 25న విశాఖ బీచ్‌రోడ్డులో జరుగు ఉత్తరాంధ్ర మెగా సమావేశానికి కార్యకర్తలను సమాయాత్తం చేయడానికి ఈ రోజుచోడవరం నియోజకవర్గ పరిధిలో వున్న నాలుగు మండలాలు ఇరుపార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ప్రరాపా కలుపుకొని ఏకతాటిపె ైనడిచి ఒకే పార్టీ కార్యకర్తలుగా కలిసిమెలసి మెగాలన్నారు. అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో సమిష్టి కృషి చేసి కాంగ్రెస్ పార్టీ మూడు రంగులజెండాను రెపరెపలాడించాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి పార్టీని ముందుకు నడిపించడానికి మనమందరం ఐక్యంతో ముందుకు వెళ్లినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఢోకా ఉండదన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పలు పదవులను అనుభవించి పార్టీని వెన్నుపోట్లు పొడిచి కొత్త, చెత్త పార్టీలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు, ఇలాంటి పార్టీలు జాలితో మొదలై మోలీగా తయారై, గాలిలో ఎగిరిపోతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని దీని పునాదులను ఎవరూ కదల్చలేరన్నారు. చిరంజీవి, కిరణ్‌కుమార్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, ఛర్మిస్మా, నిజాయితీ, అనుభవం ఉన్న ఈ ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి ఢోకా ఉండదన్నారు.అలాగే జిల్లా స్థాయిలో గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగిపోతుందన్నారు. నియోజకవర్గ స్థాయిల్లో మంచి అనుభవం, సున్నిత మనసు గల పినపోలు వెంకటేశ్వరరావు మిగతా నాయకులు, కార్యకర్తలు తదితరులతో పార్టీ విజయపంథాలో నడిపించుటకు అందరూ కృషి చేయాలన్నారు. సెప్టెంబర్ 25న జరుగు మెగా సమావేశానికి విసృ్తత స్థాయిలో ఇరు పార్టీ కార్యకర్తలు పాల్గొని సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి 32 పంచాయతీల నుంచి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, మూడెడ్ల శంకరరావు, దన్నిన వెంకటరావు, పప్పల రమణమూర్తి, ఎ.జగన్నాధం, ఏడువాక సత్యారావు, గూనూరు పెదచ్చిబాబు, పల్లెల వరహాల బాబు, పసుమర్తి సాంభ, అల్లుతాతంనాయుడు, సాలాపు వెం టరమణ మూర్తి, దొరపిల్ల, బొడ్డు శ్రీరామ్మూర్తి, ఉప్పలబాబు, సకలా సూరిబాబు, లక్ష్మిపురం సత్యారావు తదితరులు పాల్గొన్నారు.
19, సెప్టెంబర్ 2011, సోమవారం
కర్ణాటక లోకాయుక్త శివరాజ్ పాటిల్ రాజీనామా
బెంగళూరు: పలు వైపుల నుంచి ఒత్తిడి రావడంతో కర్ణాటక లోకాయుక్త శివరాజ్ పాటిల్ సోమవారం రాజీనామా చేశారు. బెంగళూర్‌లో ఆయన కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా నివేశన స్థలాన్ని పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు వంటి ప్రముఖుల కేసులపై శివరాజ్ పాటిల్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.తనకు వ్యతిరేకంగా జరుగుతున్న విషప్రచారం తనను ఎంతో బాధించిందని, ఇటువంటి వాతావరణంలో రాజీనామా చేయడమే మంచిదని తాను అనుకున్నానని, కొంత మంది విషప్రచారానికి బాధపడే తాను రాజీనామా చేశానని ఆయన గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్‌కు రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత అన్నారు. రాజీనామా సమర్పించడానికి ముందు లోకాయుక్త శివరాజ్ పాటిల్ భరద్వాజ్‌ను కలిసి గంటకుపైగా మాట్లాడారు.
18, సెప్టెంబర్ 2011, ఆదివారం
బొత్స- చిరుకు కిరణ్ చెక్!
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డి మాదిరిగా తాను అనుకున్నదే చేస్తున్నారు. 108 సర్వీసు నిర్వహణ కోసం చిరంజీవి ఎన్ని ప్రయత్నాలు చేసినా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారా యణ వంటి నేతలు ఎన్ని సిఫారసులు చేసినా కిరణ్‌కుమార్‌రెడ్డి తాను అనుకు న్న నిర్ణయాన్నే అమలు చేశారు. 108 సర్వీసు నిర్వహణ చేపట్టేందుకు చిరం జీవి తనంతట తాను ముందుకు వచ్చినా.. కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తాను కేటాయించదలచుకున్న జీవీకే కంపెనీ వైపే మొగ్గు చూపి, చిరంజీవి బొత్సకు చెక్ పెట్టారు. చాలాకాలం పాటు సందిగ్థంలో ఉన్న 108 సర్వీసు నిర్వహణ ఎవరికి కేటాయించాలన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి వట్టి వసంతకుమార్ రంగం లోకి దిగి చిరంజీవి పక్షాన లాబీయింగ్ చేసినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. చివరకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి, కేంద్ర వైద్యశాఖమంత్రి గులాంనబీ ఆజాద్‌తో సిఫార్సు చేయించారు. ముఖ్యమంత్రి తాను అనుకున్న కంపెనీకే 108 నిర్వహణ కట్టబెట్టడం ద్వారా.. పార్టీ-ప్రభుత్వంలో త న పట్టు చాటుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి 108 నిర్వహణను తిరిగి జీవీకేకు కేటాయించడాన్ని అడ్డుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈవిషయంలో కిరణ్ దాదాపు వైఎస్ మాదిరిగానే వ్యవహరించినట్లు కనిపిస్తోంది.108 సర్వీసు నిర్వహణను జీవీకే సంస్థకు ఇచ్చేందుకు ఒప్పందం ఖరారయిన నేపథ్యంలో ప్రభుత్వంపై తనకున్న పట్టును కిరణ్ ప్రదర్శించారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇటీవలే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, అధిష్ఠానానికి దగ్గరయిన చిరంజీవి పక్షాన చివరి వరకూ పోరాడారు. ఆయనతో పాటు మరికొందరు కాపు నేతలూ చిరు పక్షాన రంగంలోకి దిగారు. అయితే, చిరంజీవికి ఈ సర్వీసు నిర్వహణ కట్టబెడితే, అది పార్టీ-ప్రభుత్వంలో చిరు హవా పెరిగిందన్న సంకేతాలు వెళతాయన్న మందుజాగ్రత్తతోనే కిరణ్ ఆయనకు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది.అదీకాకుండా.. ఇటీవలి కాలంలో బొత్సతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవికి ఈ వ్యవహారం ఓ కనువిప్పు కావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. బొత్సతో ఉంటే నష్టమే తప్ప లాభం లేదన్న భావన కలిగించడంతో పాటు, తనతో ఉంటే ఎంత లాభం ఉంటుందన్న విషయాన్ని కిరణ్ పరోక్షంగా చిరుకు చెప్పకనే చెప్పినట్టయిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
15, సెప్టెంబర్ 2011, గురువారం
28లోగా ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి
హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది. అపరాధ రుసుముతో అక్టోబర్ 14వ తేదీ వరకు ఫీజు చెల్లించే సౌకర్యాన్ని కల్పించింది. జనరల్ కోర్సు విద్యార్థులు రూ.230, వొకేషనల్ కోర్సు చదివే వారు రూ.330 (ప్రాక్టికల్స్‌తో కలిపి) చెల్లించాలి. బ్రిడ్జి కోర్సు పరీక్ష రాయబోయే బైపీసీ విద్యార్థులు రూ.60 చెల్లించాలి. మార్చిలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఇతర వివరాల కోసం కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి వాణీప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
విశ్వసుందరిగా అంగోలా అందగత్తె లైలా లోప్స్
సావోపాలో: అంగోలా అందగత్తె లైలా లోప్స్ ఈ ఏడాది విశ్వసుందరిగా ఎంపికైంది. ఉక్రెయిన్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, చైనా సుందరీమణులను వెనక్కి నెట్టి లోప్స్ విశ్వసుందరిగా అవతరించింది. రెండు, మూడు స్థానాలను ఉక్రెయిన్, బ్రెజిల్ భామలు దక్కించుకున్నారు. భారత్ నుంచి కోటి ఆశలతో వెళ్లిన వాసుకి సుంకవల్లి నిరాశపరిచారు. ఆమెకు తుది 16 మందిలోనూ చోటు దక్కకపోవడం గమనార్హం. బ్రెజిల్‌లోనిసావోపాలోలో జరిగిన 2011 విశ్వసుందరి పోటీల్లో .. సోమవారం ధగధగ మెరిసిపోతున్న గౌను ధరించిన 25 ఏళ్ల లోప్స్‌కు గతేడాది విశ్వసుందరి జిమెనా నవరెటె విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించారు. పోటీల్లో మొత్తం 98 మంది అందగత్తెలు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఒలెసియా స్టెఫాంకో, మూడో స్థానంలో బ్రెజిల్‌కు చెందిన ప్రిస్కిలా మచడోలు రెండు మూడు స్థానాల్లో నిలిచారు. సావోపాలోలోని క్రెడికార్డ్ హాలులో ఆహూతులంతా నిలబడి కరతాళధ్వనులు చేస్తుండగా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకొన్న లోప్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందభాష్పాలను అతికష్టం మీద ఆపుకొంటూ.. ''ఇప్పుడు నాకు పని దొరికింది. ఇకపై మరింత వినయంగా ఉండేందుకు ప్రయత్నిస్తా'' అని లోప్స్ విలేకర్లతో చెప్పారు. అంతకుముందు న్యాయనిర్ణేతలు ఆమెను మీకు అవకాశం వస్తే శరీరాకృతిని మార్చుకుంటారా అని అడగ్గా.. ''ఏమీ మార్చుకోను. దేవుడు ఇచ్చినదానితో సంతృప్తిగా ఉన్నా'' అని బదులిచ్చారు.
12, సెప్టెంబర్ 2011, సోమవారం
జేఎన్‌టీయూ-హెచ్ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: జేఎన్‌టీయూ-హెచ్ అనుబంధ కళేశాలల్లో బీటెక్ (సీసీసీ) 1, 2, 3, 4 సంవత్సరాల (ఎన్‌ఆర్ అండ్ ఓఆర్), ఫార్మా డీ మూడో సంవత్సర పరీక్షలను (ఈనెల 13, 14 తేదీల్లో జరగాల్సిన వాటిని) అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్ బి.వి.శంకర్‌రామ్ తెలిపారు. వీటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. జేఎన్‌టీయూహెచ్ అనుబంధ కళాశాలల్లో జరుగుతున్న మిడ్ ఎగ్జామ్స్ మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. తెలంగాణలో తలపెట్టిన సకల జనులసమ్మె కారణంగానే పరీక్షలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
11, సెప్టెంబర్ 2011, ఆదివారం
ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం : కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే
విశాఖపట్నం(విశాల విశాఖ) ;12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి దేశంలో 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ 500 మెగా వాట్ల పూర్తిస్థాయి వాణిజ్య ప్రక్రియను మంత్రి షిండే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను విద్యుత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికి 1,22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దాన్ని 1,80,000 మెగావాట్లకు పెంచగలిగామని తెలిపారు. 10వ ప్రణాళిక వరకు విద్యుత్ కొరత తీవ్రంగానే ఉందని, 11వ ప్రణాళికలో దీన్ని తగ్గించగలిగామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ కొరత 12వ పంచవర్ష ప్రణాళికాంతం వరకూ ఉండదని, 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి ఈ సమస్య మొదలవుతుందని మంత్రి షిండే తెలిపారు. ఇండొనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయని విలేఖరులు ప్రశ్నించగా, అక్కడ చవకగా బొగ్గు లభిస్తుంది. అయితే ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కష్టతరంగా ఉందని అన్నారు. శ్రీలంకలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయు చేసుకోవలసి ఉందని, దీనిపై ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పవర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన ఉందని చెప్పారు. ఎన్‌టిపిసి సిం హాద్రి ద్వారా విద్యుత్‌లో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్‌కు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు విద్యుత్ కొరత అనేక రాష్ట్రాల్లో ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించామని షిండే తెలిపారు.
10, సెప్టెంబర్ 2011, శనివారం
కులాంతరం చేసుకున్నందుకు కూతురి హత్య
నిజామాబాద్: కులాంతర వివాహం చేసుకుని పరువు తీసిందంటూ సొంత తండ్రే కూతురిని హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని బిక్కనూరులో జరిగింది. బిక్కనూరు మండలంలోని రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన అమృతారెడ్డి అనే అతను గత కొంతకాలంగా దుబాయ్‌లో నివసించి అనంతరం రామేశ్వరంపల్లివచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతని కుమార్తె మౌనిక ఇంటర్ చదువుతోంది. ఆమె ఎస్‌సీ కులానికి చెందిన ప్రదీప్ అనే అతన్ని ప్రేమించింది. అతని తండ్రికూడా దుబాయ్‌లో ఉండి ఇటీవలే స్వగ్రామం బిక్కనూరు వచ్చాడు. ప్రదీప్ 8వ తరగతి చదివి మానేసి పనులు చేసుకుంటున్నాడు. వీరిద్దరికీ అయిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ ఆరునెలలక్రితం ఇంట్లోనుంచి వెళ్లిపోయారు. అప్పుడే అమ్మాయి తల్లిదండ్రులు మైనర్‌ను కిడ్నాప్ చేశాడంటూ ప్రదీప్‌పై పోలీసు కేసు పెట్టారు. ఈ విషయం తెలిసి వారు 6 నెలలవరకు స్వగ్రామం రాలేదు. ఇటీవలే అమ్మాయి మేజర్ కావటంతో పెళ్లి కూడా చేసుకున్నారు. అనంతరం బిక్కనూరు రాగా పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఆ తరువాత వారంలోపలే అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పోస్టుమార్టం చేయించగా హత్యగా అనుమానించారు. అమ్మాయి తల్లిదండ్రులు తప్ప ఎవరూ ఇంట్లో లేనందున అనుమానంపై తండ్రిని ప్రశ్నించగా కులాంతరం చేసుకుని తమ పరువు తీసిందని, సాటివారిలో తలెత్తుకోలేకుండా ఉన్నామని పోలీసులకు తెలిపాడు. కూతురు భర్త దగ్గరికే వెళతాననటంతో కోపం వచ్చి నైలాన్‌తాడు మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో అతన్ని వారు అరెస్టు చేశారు.
భార్యను గొంతుకోసి చంపిన భర్త
నెల్లూరు: పెళ్లి సమయంలో ఇస్తానని ఒప్పుకున్న కట్నం సొమ్ము పూర్తిగా ఇవ్వనందుకుగాను భార్యను ఓ భర్త హత్య చేసిన ఉదంతం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నాయుడుపేట మండలం జిగురుపాడు అగ్రహారంలో స్వాతి అనే యువతి హత్యకు గురైంది. పెళ్లి సమయంలో ఇస్తానని చెప్పిన కట్నం విషయంలో ఇద్దరిమధ్య ఈరోజు గొడవ జరిగింది. మాటామాటా పెరిగి భర్త వెంకట్రమణ తీవ్ర ఆగ్రహంతో భార్యను కత్తితో గొంతుకోసి చంపాడు. ఆ వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదుచేసి అతని తల్లి వెంకటమ్మను అదుపులోకి తీసుకున్నారు.
19 నుంచి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె
హైదరాబాద్: సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పూర్తిస్థాయిలో పాల్గొంటారని తెలంగాణ ఆర్టీసీ ఐకాస స్పష్టం చేసింది. 19 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకుండా చూస్తామని ఐకాస అధ్యక్షుడు దొంత ఆనందం, కన్వీనర్ కె.రాజిరెడ్డి చెప్పారు. సీమాంధ్ర నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 16న హైదరాబాద్‌లో సీమాంధ్రుల ప్రైవేట్ బస్సులను అడ్డగిస్తామన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత విఠల్ తదితరులు మాట్లాడారు
4, సెప్టెంబర్ 2011, ఆదివారం
నేడు స్థాయీ సంఘ సమావేశం
విశాఖపట్నం (విశాల విశాఖ): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘసమావేశాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. మేయర్ పి.జనార్దనరావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశం కోసం 11అంశాలతో అజెండా రూపొందించారు. ముఖ్యంగా కొత్త కౌన్సిల్ హాలు విద్యుదీకరణ, శీతల సదుపాయం వంటి పనులు సభ్యుల ముందు ఉంచనున్నారు. పరిపాలన పరంగా మరో ఎనిమిది అంశాలను అజెండాలో చేర్చారు.
1, సెప్టెంబర్ 2011, గురువారం
గాజువాకలో మహగణపతి
గాజువాక, : రాష్ట్రంలో అతిపెద్ద గణనాథుని విగ్రహాన్ని గాజువాకలో ఏర్పాటు చేయడం ద్వారా పట్టణ ఖ్యాతి మరింత ఇనుమడించిందని గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. బుధవారం గాజువాక లంకావారి మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ గణనాథుడిని అనేక వ్యవప్రయాసలకోర్చి నిర్మించిన స్థానిక సంపత్‌వినాయక అసోసియేషన్ సభ్యులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.117అడుగుల ఎత్తు, 55అడుగుల వెడల్పు కలిగిన భారీ గణనాథుని విగ్రహాన్ని మేయర్ గురువారం ఉదయం 11.26నిమషాలకు లంకావారి మైదానంలో ప్రతిష్టించనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు భారీ వినాయకుని విగ్రహం దోహదపడుందన్నారు. అనంతరం కర్నంరెడ్డి నర్సింగరావు మాట్లాడుతూ 90రోజులుపాటు 200మంది కార్మికులు అహర్నిశలు శ్రమించి 117అడుగుల విగ్రహాన్ని నిర్మించారన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఇల్లపు రాము, కర్నం కనకారావు, సంపత్ వినాయకా అసోసియేషన్ సభ్యులు శివ, ముఖేష్, కనకారావు తదితరులు పాల్గొన్నారు
ఎంపీవీలో వినాయకునికి నైవేథ్యంగా 6,399 కేజీల లడ్డూ
ఎం.వి.పి కాలనీ, (విశాల విశాఖ): ఎంవీపీ కాలనీలోని సంపత్ వినాయక యూత్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఎఎస్ రాజా కళాశాల గ్రౌండ్స్‌లో 112 అడుగుల భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన సుమారు 50 మంది కార్మికులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇంత భారీ విగ్రహానికి భారీ లడ్డూ నైవేథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో 6,399 కేజీల లడ్డూను తయారు చేయించారు. సువర్ణభూమి రియల్ ఎస్టేట్ సంస్థ ఇందుకుగానూ రూ.10.50 లక్షలు ఖర్చు చేసింది. ఈ లడ్డూను తాపేశ్వరంలోని భక్తాంజనేయ సీట్స్ సంస్థ తయారు చేసింది. 15 మంది గణేష్ మాలలు ధరించి, లడ్డూను ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు.ఈ లడ్డూ తయారీకి 2000కేజీల శనగపండి, చక్కెర 2,100 కేజీలు, నెయ్యి 900 కేజీలు, డ్రైపూట్స్ 600 కేజీలు , పటికబెల్లం 450 కేజీలు ఉపయోగించినట్టు తయారీ దారు సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) తెలిపారు. తయారీకి 24 గంటల సమయం పట్టిందని, 21 రోజులపాటు పాడవకుండా ఉంటుందని తెలిపారు. ఇంత పెద్ద పరిమాణంలో లడ్డూను ఇంతకముందు ఎవరూ తయారు చేయలేదని, ఆ ఘనత తమ సంస్థకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీ సంపత్ వినాయక విశాఖ యూత్ అసోసియేషన్ ఛైర్మన్ తుమ్ములూరి జగదీశ్వరరెడ్డి, సువర్ణ భూమి సంస్థ జీఎం మేఘం సతీష్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
నేడు ‘చిరు’తిరుపతి రాక
తిరుపతి సిటి, (విశాల విశాఖ):రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి శాసనసభ్యులు డాక్టర్ చిరంజీవి శుక్రవారం తిరుపతికి రానున్నారు. పర్యటనలో భాగంగా వివిధ అధికారిక, అనధికారిక, పార్టీ నాయకులతో కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ నాయకులు సైకం జయచంద్రారెడ్డి, వూకా విజయ్‌కుమార్‌లు వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి రెండు రోజుల పర్యటన వివరాలను వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో కిరణ్‌రాయల్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి...
* శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 4.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు.
* 5 నుంచి 7 గంటల వరకు పిఆర్‌పి జిల్లా నాయకులతో స్థానిక పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమావేశం.
* 7.15 గంటలకు తిరుమలకు బయల్దేరి టిటిడి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్న కనుమూరి బాపిరాజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవుతారు.
శనివారం పర్యటన వివరాలు
* ఉదయం 9 గంటలకు స్థానిక కాంగ్రెస్‌పార్టీ నాయకులతో పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమావేశం.
* 9.50 గంటలకు హైకోర్టు బెంచి విషయంపై స్థానిక అడ్వకేట్లతో సమావేశం.
* 10.30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం.
* 11.30 నుంచి 12 గంటల వరకు స్థానిక పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమస్యలపై అర్జీల స్వీకరణ.
* 12 నుంచి 1 గంట వరకు డ్వాక్రా మహిళలతో సమావేశం.
* 1 నుంచి 2 గంటల వరకు వివిధ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం.
* 1.30 గంటలకు అండర్ డ్రైనేజి పనుల పరిశీలన.
* 3 గంటలకు గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

వాడలవాడలా బొజ్జగణపయ్య ఉత్సవాలు
పరవాడ,(విశాల విశాఖ) సెప్టెంబర్ 1: భక్తిశ్రద్ధలతో గణనాథుని ఉత్సవాలు మండలంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒక వైపు ఎడ తెరిపి లేని వర్షం మరో వైపు వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠంచారు. బుధవారం అర్ధరాత్రి నుండి వరుణుడు తన ప్రతాపం చూపడంతో వినాయకుని ఉత్సవాలు ఏర్పాట్లుకు నిర్వహకులు అనేక ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం 10గంటల వరకు వర్షం కురుస్తునే ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం కాస్త తగ్గడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. పరవాడ పారిశ్రామిక ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వినాయకుని ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. బొజ్జగణపయ్య ఉత్సవాలను నిర్వహించుకునేందుకు గ్రామాల్లో యువకులు పోటీ పడుతున్నారు. విద్యార్థులు సైతం బొజ్జగణపయ్యకు పూజలు చేసేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమాలలో రాజకీయ వేత్తలు, అధికారులు పాల్గొన్నారు. వినాయకుని చవితి కారణంగా మండలంలో గల పలు గణేష్ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. మండల కేంద్రమైన పరవాడ బొంకులదిబ్బ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయకుని ఉత్సవాలను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పయిల శ్రీనివాసరావు ప్రారంభించారు. నేతలు పయిల అప్పారావు, పయిల రమణబాబు, పయిల పోతునాయుడు, పయిల గోపాలకృష్ణ, పయిల వెంకటరావు, పయిల పైడంనాయుడు, బండారు చిన్నంనాయుడు, చీపురుపల్లి శ్రీనివాసరావు, పయిల హరీష్, పయిల చిన అక్కునాయుడు, శివ, ముఖేష్, నరేష్, శంకర్, మహేష్, వెంకటరావు, రామునాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలావుండగా జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల వసుధ ఫార్మా కంపెనీలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని విగ్రహాన్ని సంస్ధ ప్రతినిధి ప్రసాద్‌రాజు ప్రతిష్ఠించి తొలి పూజ చేశారు. లారస్‌లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని సంస్థ ప్రతినిధి నర్సింహారావు చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. తానాం షిరిడిసాయి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలను మాజీ మండలాధ్యక్షుడు పయిల జగన్నాథరావుప్రారంభించారు. తానాం అంబేద్కర్ యూత్ అసోసియేషన్, పండు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పైడిమాంబయూత్ ఆధ్వర్యంలో భారీ వినాయకుని సినిమాహాలు కూడలి ఏర్పాటు చేసి పూజలు చేపట్టారు. రామాలయం వీధిలో కాణిపాకం వినాయకుని రూపంలో గల విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. భరిణికం, వాడచీపురుపల్లి, నాయుడుపాలెం, లంకెలపాలెం, పి.బోనంగి, కలపాక, వెనె్నలపాలెం, గొర్లెనాయుడు, జూజులవానిపాలెం, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో వినాయకుని ఉత్సవాలు ప్రారంభించారు. వినాయకుని చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పందిళ్లు వద్ద రంగు రంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన బొజ్జగణపయ్య విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పరవాడ , తానాం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు విగ్రహాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. షిరిడిసాయి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచముఖ వినాయకుని విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది. తానాం ఎస్సీ కాలనీ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహంతో పాటు రొంగలివారి వీధిలో ఏర్పాటు చేసిన శివపార్వతుల మధ్య వినాయకుని విగ్రహం, పులినోట్ల వినాయకుని విగ్రహంతో పాటు కాణిపాకం వినాయకుని రంగంలో ఉన్న విగ్రహం ప్రత్యేకంగా నిలుస్తుంది.
రాజీనామాలపై పునరాలోచించే పరిస్థితి వస్తుంది: చిరంజీవి
హైదరాబాద్: రాజీనామాలు చేసిన 26 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాల విషయంలో పునరాలోచనలో పడే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ నేత చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. వినాయకచవితి సందర్భంగా బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చిరంజీవి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్న సుభిక్షంగా ఉంటేనే దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయన్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు రావడంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని, తాను ఏ స్థాయిలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారనీ ఆయన అన్నారు. వచ్చే పుట్టినరోజునాటికి తన 150 వ చిత్రం వస్తుందని ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు.
మీడియాలో 'అతి' నియంత్రణకు కమిటీ!
న్యూఢిల్లీ: మీడియా గోరంతలు కొండంతలు చేసి చెప్పడాన్ని నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఓ కమిటీని వేయాలని యోచిస్తోంది. మీడియా కారణంగానే అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం బలోపేతం అయిందని కొన్ని వర్గాలు చేస్తున్న వాదన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా... మీడియా అతిగా స్పందిస్తున్న తీరును కట్టడి చేయాలనుకుంటోంది. మీడియాలో వచ్చే అలాంటి అంశాలను పరిశీలించేందుకు, ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు కమిటీని నియమించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం జరిగిన కేంద్రకేబినెట్ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. వార్తల్లో 'అతి'ని నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ కేబినెట్ సమావేశంలో అభిప్రాయపడినట్టు కూడా ఆ వర్గాలు తెలిపాయి.
కాలినడకన కొండ ఎక్కుతున్న కనుమూరి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త అధ్యక్షునిగా నియమితులైన కనుమూరి బాపిరాజు కాలినడకన తిరుమలకొండ ఎక్కుతున్నారు. ఈరోజు ఉదయం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలకు హాజరైన బాపిరాజు సాయంత్రం తిరుమల కొండకు బయల్దేరారు.
29, ఆగస్టు 2011, సోమవారం
జి.సి.సి. ఉత్పత్తులు అన్ని సంక్షేమ వసతి గృహాలకు పంపిణీకై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
విశాఖపట్నం, ఆగస్టు 29 ; జి.సి.సి. ఉత్పత్తులను అన్ని సంక్షేమ వసతి గృహాలకు పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. తదననుగుణంగా నాణ్యమైన వస్తువులను అన్ని వసతి గృహాలకు పంపిణీ చేసేందుకు జి.సి.సి. అధికారులు సన్నదం కావాలని మంత్రి ఆదేశించారు. పంపిణీలో ఎటు వంటి అంతరాయం లేకుండా ప్రణాళికా బద్దంగా సరుకులను ముందుగానే నిల్వ ఉంచుకోవాలన్నారు. సోమవారం జి.సి.సి.కార్యాలయ సమావేశ మందిరంలో జి.సి.సి. మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జి.సి.సి. అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జి.సి.సి. ఉత్పత్తులను ఇప్పటి వరకూ గిరిజన సంక్షేమ వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు, కళాశాలలకు మాత్రమే పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. జి.సి.సి. ఉత్పత్తులకు మంచి ఆధరణ కల్పించాలనే లక్ష్యంతో అన్ని ఎస్.సి., బి.సి., మైనారిటీ, వికలాంగ సంక్షేమ వసతి గృహాలకు కూడా జి.సి.సి. ఉత్పత్తునే పంపిణీ చేయాలని నిర్థేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో ముదావహం అన్నారు. ఈ అవకాశాన్ని జి.సి.సి. అధికారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. వసతి గృహాలకు నాణ్యమైన ఉత్తత్తులను పంపిణీ చేయడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. గిరిజన ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు అవసరమైన యూనిట్లను పలు ముఖ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మేనేజింగ్ డైరెక్టర్ బి.త్రినాథరావును మంత్రి ఆదేశించారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 20 కోట్ల అంచనా వ్యయంతో పలుచోట్ల నూతనంగా డి.ఆర్.డిపోలు, గోడాములు నిర్మించేందుకు, ప్రస్తుతం ఉన్న వాటికి మరామత్తులు చేసేందుకు పలు పనులు చేపట్టబడినవని, వాటన్నింటినీ రానున్న ఆరు మాసాల్లో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్ణీత సమయంతో పూర్తిచేయాలని, లేకుంటే ఆయా నిర్మాణ పనులను ఇతర శాఖ ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగిస్తామన్నారు. ప్రతిపాదించి ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తే, అన్ని డి.ఆర్.డిపోలకు సొంత భవనాలు ఏర్పాటు చేయగలవారమవుతామన్నారు. డి.ఆర్. డిపోల ద్వారా గిరిజనులకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని క్రమబద్దీకరించాలని, అందరికీ సకాలంలో సిలిండర్లు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖలో నిర్మాణంలోనున్న కోల్డు స్టోరేజీ పనులను వేగవంతం చేసి మూడు, నాలుగు మాసాల్లో పనులు పూర్తి చేయాలన్నారు. వర్తకులకు ఎటు వంటి మినహాయింపులు ఇవ్వాల్సిన పని లేదని, వారు కొనుగోలు చేసుకున్న ఉత్పత్తులను నెలల తరబడి గోడాములలో ఉంచవద్దని, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత ఏడాది కాలంలో జి.సి.సి. సాదించిన లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ బి.త్రినాధరావు మంత్రికి వివరించారు. జనరల్ మేనేజర్లు అప్పారావు, మనోహర్, చంద్రశేఖర్, విశాఖపట్నం, వరంగల్, ఆదిలాబాద్ సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, అన్ని డివిజన్లకు చెందిని డివిజనల్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విశాఖలో సీపీఐ ధర్నా
విశాఖపట్నం: రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు, ఫించన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా చేపట్టింది. ఎన్నికలకు ముందు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను పూర్తిగా విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జె.వి.ఎస్.మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హుల పేరుతో జిల్లాలో అనేకమంది రేషన్‌కార్డులు, వితంతు, వృద్ధాప్య, వికలాంగ ఫించన్లు రద్దు చేయడంపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, ఫించన్లు పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
27, ఆగస్టు 2011, శనివారం
శ్రీవారికి రూ.కోటి విరాళం
తిరుమల: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ మొత్తంలో విరాళం అందచేశారు. ఢిల్లీకి చెందిన శివ నాడార్ అనే భక్తుడు శ్రీవారి ఆలయంలో తితిదే జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజును కలిసి రూ.కోటి విరాళం డిమాండ్ డ్రాప్టులను అందచేశారు. ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టు కింద జమ చేయాలని జేఈవోకు సూచించారు. శ్రీవారికి విరాళం చేసిన భక్తుడిని జేఈవో అభినందించారు. తీర్థ ప్రసాదాలు అందచేసి ఘనంగా సత్కరించారు
ప్రయోగ ప్రాతిపదికన రూ.10 ప్లాస్టిక్ నోట్లు
న్యూఢిల్లీ: ప్రయోగ ప్రాతిపదికన రూ.10 విలువ కలిగిన వంద కోట్ల పాలీమర్ బ్యాంక్ నోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలోని ఐదు చోట్ల వీటిని విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమోనారాయణ మీనా శుక్రవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితాల ఆధారంగా వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.వంద కోట్ల ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టడానికి భారతీయ రిజర్వు బ్యాంకు 2009లో గ్లోబల్ టెండర్లు పిలిచింది. దొంగనోట్లను అరికట్టడానికి ఈ తరహా పాలీమర్ నోట్లను తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది. ఆ తరువాత న్యూజీలాండ్, పపువా న్యూ గినియా, రొమేనియా, బెర్ముడా, బ్రునై, వియత్నాం వీటిని ప్రవేశపెట్టాయి.మరోప్రశ్నకు సమాధానమిస్తూ.. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కి చెందిన కొందరు అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడానికి కేంద్ర విజిలెన్స్ కమిషన్ సూచన మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు నమోనారాయణ మీనా చెప్పారు. వీరిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిందని తెలిపారు
26, ఆగస్టు 2011, శుక్రవారం
విశాఖలో 18న బహిరంగ సభ
హైదరాబాద్(విశాల విశాఖ) : విశాఖపట్నంలో వచ్చే నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్ నిర్ణయించింది. . కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం నాయకులే ఈ బాధ్యతను తీసుకున్నారు. ప్రరాపా శ్రేణులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌లో విలీనమయ్యేలా చూసేందుకు దీనిని తలపెట్టారు. విశాఖపట్నం సమీప నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సభకు చిరంజీవితోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు హాజరవుతారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరిజిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని చెబుతున్నారు. ఆ తర్వాత రెండు వారాలకు గుంటూరులో అదే స్థాయిలో మరో సభ నిర్వహించాలని భావిస్తున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోసం దీనిని ఉద్దేశిస్తున్నారు. ఆపై రాయలసీమ జిల్లాల కోసం అనంతపురం లేదా కర్నూలుల్లో మరో సభ జరుపుతారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స నివాసంలో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కోటగిరి విద్యాధరరావు, వేదవ్యాస్, సుబ్బరాయుడు, కామినేని శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో నియమించాల్సిన నాయకులు, సీనియర్ కార్యకర్తల జాబితాను ఇవ్వాలని బొత్స వీరిని కోరారు. వారంరోజుల్లో పీసీసీ, డీసీసీల పునర్‌వ్యవస్థీకరణ చేపడుతున్నానని వాటిలో ప్రరాపాలో పనిచేసిన వారిని వారి స్థాయినిబట్టి సర్దుబాటు చేస్తానని బొత్స వారికి వివరించారు. నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన వారి జాబితాను ముఖ్యమంత్రికి అందించాలని నిర్ణయించారు.
24, ఆగస్టు 2011, బుధవారం
సత్యంకూడలిలో 50 అడుగుల వినాయక ప్రతిమ
విశాఖపట్నం: వినాయక మహోత్సవాలు సమీపిస్తున్నాయి. నగరంలో ఈ దఫా భారీ గణనాథులే కొలువుదీరబోతున్నారు. గణపతి లక్కీయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్యంకూడలి గాంధీనగర్‌లో 50 అడుగుల వినాయక ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. బెంగాల్ కళాకారుల నైపుణ్యంతో 70 అడుగుల ఎత్తులో భారీ పందిరి నిర్మిస్తున్నారు. 17 రోజులపాటు పూజలతో పాటు హోమాలు, అఖండ దీపారాధన, హారతి, 50 కేజీల లడ్డూ, మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకుడు కోన గోవిందరావు తెలిపారు. వినాయక ప్రతిమకు దాదాపు రూ.4లక్షల వ్యయమవుతుందన్నారు. కమిటీ సభ్యులుగా ఆనంద్, కోన శ్రీను, సందీప్, ఈశ్వరరావు, లక్ష్మణ్, సంతోష్, వినోద్ తదితరులు వ్యవహరిస్తున్నారు.
సెప్టెంబరు తెలంగాణపై తుది నిర్ణయం: మంత్రి పొన్నాల
సెప్టెంబరు నెలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. యూపీఏ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సెప్టెంబర్‌లో ఒక నిర్ణయం వస్తుందన్నారు.అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర విభజన జరపాలని కోర్‌కమిటీ చేసిన సూచనలకు సర్వత్రా ఆమోదం లభించిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతాల హక్కుల పరిరక్షణ, నదీజలాల వినియోగంపై అనుమానాలు, భయాందోళనలకు తావులేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రక్రియ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కీలకమైన హైదరాబాద్‌తో పాటు నదీజలాల వాటాలే అత్యంత కీలకంగా మారాయన్నారు. ఈ రెండు అంశాల కారణంగానే రాష్ట్ర విభజనలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
తగ్గిన బంగారం ధర
హైదరాబాద్: గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజు వ్యవధిలోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ.720కు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,870కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.25,600గా ఉంది. కిలో వెండి ధర రూ.63వేలు.
21, ఆగస్టు 2011, ఆదివారం
లోక్‌పాల్ బిల్లు కోసం పట్టు: ఆరో రోజుకు హజారే దీక్ష!
జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబట్టిన సామాజికవేత్త అన్నా హజారే చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఆదివారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సాగుతున్న ఈ దీక్షకు మద్దతుగా భారీ సంఖ్యలో జనం మైదానంకు చేరుతున్నారు. మరోవైపు హజారేతో సామాజికవేత్తల బృందం సమావేశం అయింది. ఈ సమావేశంలో కిరణ్‌బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతిభూషణ్, మనీశ్ సిసోడియా, మేధాపాట్కర్ తదితరులు ఉన్నారుఇదిలావుండగా, దేశంలో పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ర్యాలీ సంజీవయ్య పార్కుకు చేరుకుని తిరిగి పీపుల్స్ ప్లాజాకు నిర్వహించారు. ఈ ర్యాలీలో చిన్నారులు, యవతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్నాకు మద్దతుగా, అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంటులో జనలోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
అలాగే, అన్నా హజారేకు మద్దతుగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం కేబీఆర్ పార్కు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేస్తున్న దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిరహిత భారత్ ఏర్పడినపుడే భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.

నెల్లురులో నలుగురు కూలీల మృతి
నెల్లూరు: పట్టణంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న ఓ భవన మట్టి పెళ్లలు విరిగిపడి నలుగురు కూలీలు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్మికులు భవనం కింద పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
పదిహేను రోజుల్లో కొమరం భీమ్ విగ్రహం ప్రతిష్టిస్తాం
గిరిజన ఐక్యవేదిక
హైదరాబాద్ (విశాల విశాఖ ప్రతినిది): కొమరంభీమ్ విగ్రహం సిద్ధంగా ఉన్నా ప్రతిష్టించడంలో ప్రభుత్వం తాత్సారం చూపుతోందని గిరిజన ఐక్యవేదిక ఆరోపించింది. ఈ అంశంపై సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.చెల్లప్పను కలిస్తే విగ్రహ ప్రతిష్టకు మరో ఆరునెలలు పడుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపినట్లు చెప్పారని వేదిక కన్వీనర్ వివేక్ వినాయక్ అన్నారు. ఈ సమాధానం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. మరో పదిహేను రోజుల్లో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకపోతే.. విగ్రహాన్ని తామే ప్రతిష్టించుకొంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన ఆదివాసీ మేధావులు, ప్రజాప్రతినిధుల సదస్సులో వివేక్ వినాయక్ మాట్లాడారు. గిరిజన ప్రాంతాలలో వందలాది మంది విషజ్వరాలు, ఇతర రోగాలతో మరణిస్తున్నారని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ముఖ్యంగా పంచాయితీరాజ్ ఎన్నికల్లో తమ ప్రాంతంలో కూడా గిరిజనేతరులకు అవకాశాన్ని కల్పించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమానికి వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే రాజారాంలక్య, చందా లింగయ్య దొర, సీడం అర్జులతో పాటు ఆదివాసీ సంఘం నేతలు, రాజకీయ నాయకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిని తీర్మానం రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని వివేక్ వినాయక్ తెలిపారు.

సానుభూతి కోసమే టక్కు, టమార విద్యలు: బొత్స
హైదరాబాద్ (విశాల విశాఖ): కడప ఎంపీ జగన్ సానుభూతి కోసం టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు అవలంభిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ద్వారా పెద్దవాడై ఇప్పుడు పార్టీనే విమర్శిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వానికి ఓ చట్టం ఉంటుందని దాన్ని ఉల్లఘించి అడ్డగోలుగా దోచుకున్నవారు ఇప్పుడు అనుభవిస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు. గాంధీభవన్ ప్రకాశం హాల్‌లో జరిగిన కృష్ణాజిల్లా కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
16, జూన్ 2011, గురువారం
జీవీఎంసీ ఆస్తిపన్ను కుంభకోణంలో నలుగురు అరెస్టు
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను కుంభకోణంలో మరో నలుగుర్ని అరెస్టు చేసినట్లు డీసీపీ బాలకృష్ణ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.7లక్షల నగదు, రూ.3.5లక్షల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్త్టెన వారిలో జీవీఎంసీ ఉద్యోగులు వై. తిరుపతిరావు, ఎస్.శ్రీనివాసరావు, ఎం. సన్యాసిరావు, ఎండీ ఇస్మాయిల్ ఉన్నారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి ఆరుగుర్ని అరెస్టు చేశారు.
3, జూన్ 2011, శుక్రవారం
ఆర్టీసీ బస్సులో ప్రసవం
హుకుంపేట: ఒక్క ఫోను కలిసి ఉంటే ఆ కన్నతల్లికి కడుపుకోత తప్పేది. రవాణా సదుపాయాలు లేక, వైద్యం అందక పోవడంతో ఓ పసికందు కళ్లు తెరవకుండానే వూపిరి వదిలాడు. ఈ సంఘటన శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని హుకుంపేట మండలంలో చోటు చేసుకుంది. మెరకచింత గ్రామానికి చెందిన పసుపులేటి సత్యవతికి గురువారం రాత్రి నుంచి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె తమ్ముడు, భర్త బాకురు వెళ్లి 108 వాహనానికి ఫోను చేసినా లైన్ దొరకలేదు. శుక్రవారం పాడేరు-బాకురు ఆర్టీసీ బస్సులో అసుపత్రికి బయలుదేరారు. ఘాట్‌రోడ్డులో బస్సు కుదుపులకు నొప్పులు ఎక్కువై ఆమె కూర్చోలేక నిలబడిపోయింది. దీంతో బిరిసింగి గ్రామసమీపాన బస్సులోనే ప్రసవమై పసికందు కింద పడిపోయింది. హుకుంపేట అసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. 108వాహనం ఉంటే తమ బిడ్డ బతికేదని తండ్రి అప్పారావు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం
హైదరాబాద్: చంద్రబాబు అధ్యక్షతన ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. నేడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు జరగనున్న ఎన్నికలు, అవిశ్వాస తీర్మానం తదితర అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నట్లు సమచారం. ఈ సమావేశానికి తెదేపా బహిష్కృత నేత నాగం జనార్దన్ వెంట నడుస్తున్న జోగురామన్న, హరీశ్వర్‌రెడ్డి హాజరుకాలేదు.
తిరుపతిలోని అతిథిగృహంలో భక్తుడు మృతి
తిరుపతి: తిరుపతిలోని శ్రీనివాసం అతిథిగృహంలో చెన్నైకి చెందిన భక్తుడు మృతి చెందాడు. రాత్రి శోచశాలలో మృతిచెంది పడి ఉన్న భక్తుడి మృతదేహాన్ని భద్రతాసిబ్బంది గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదవశాత్తూ మరణించాడా అనే విషయం తెలియడం లేదు. మృతుని వద్ద చెన్నై టి.నగర్ ఆంధ్రాబ్యాంకుకు చెందిన పాస్‌బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
15, మే 2011, ఆదివారం
కాంగ్రెసు పార్టీని ఆంధ్రలో మొయిలీయే భ్రష్టు పట్టించాడు: పాల్వాయి
హైదరాబాద్ (విశాల విశాఖ): వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల వైఫల్యానికి ఉన్నత స్థానంలో ఉన్నవారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఇటీవలి వరకు రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్‌గా పని చేసిన వీరప్ప మొయిలీ ఓటమికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. మొయిలీ వల్ల రాష్ట్రంలో కాంగ్రెసు పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. జగన్ గెలుపు వల్ల కాంగ్రెసుకు ఎలాంటి నష్టం లేదన్నారు.మంత్రివర్గంలో పలువురిని తొలగించాలని సూచించారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెసులో ఉంటూ కాంగ్రెసును నష్ట పరిచే చర్యలు చేపడుతున్నారన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెప్పారు. ఈ వైఫల్యం కాంగ్రెసు నేతలు పోస్టుమార్టం నిర్వహించాల్సిన ఆవశ్యకతను చూపించిందన్నారు.
ఆ పదవి వద్దు బాబోయ్
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తదనంతరం ముఖ్యమంత్రి పీఠం కూర్చున్న కొణిజేటి రోశయ్య మరోసారి ఆ పదవి వస్తే వద్దంటున్నారు. రోశయ్య కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మరోసారి ముఖ్యమంత్రి పదవి వస్తే తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన ససేమీరా అని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సర కాలంలో అనేక ప్రకృతి వైపరీత్యాలను, ఉద్యమాలను ఎదుర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు సమస్యలపై బాగానే వర్క్ చేశారనే పేరు మాత్రం తెచ్చుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సమస్య ఆయనకు కంటి మీద నిద్ర లేకుండా చేశాయి. ఆయనకు వయసు కూడా సహకరించక లేదు. అలాంటి పదవిపై మరోసారి కూర్చోవాలని లేదని మాత్రం చెబుతున్నారు.కాగా కడప ఉప ఎన్నికలలో ఓటమిపై కాంగ్రెసు పార్టీ లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జగన్, విజయమ్మ భారీ ఆధిక్యంతో గెలవడంపై ఓసారి కాంగ్రెసు విశ్లేషించుకోవాలన్నారు. ఈ ఓటమికి ఎవరో కొంతమంది బాధ్యులని చేయడం భావ్యం కాదని, అందరూ సమిష్టిగా ఓటమిపై సునిశిత పరిశీలన జరపాలని అభిప్రాయపడ్డారు. టిడిపి పరిస్థితి కూడా కాంగ్రెసుకు భిన్నంగా ఏమీ లేదన్నారు. కడప ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే కాంగ్రెసు జాతీయ స్థాయిలో పటిష్టంగా ఉందని చెప్పారు.

12, మే 2011, గురువారం
కేరళలో సత్యసాయి ఆలయ నిర్మాణం!
తిరువనంతపురం: కేరళలో త్వరలో సత్యసాయిబాబా ఆలయాన్ని నిర్మించనున్నారు. థొనక్కల్‌లోని సాయి గ్రామంలో ఏర్పాటయ్యే ఆలయంలో సత్యసాయి వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ట్రావెంకోర్ రాజకుటుంబం ఈ వెండి విగ్రహాన్ని బహూకరించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడి శ్రీ సత్యసాయి శరణాలయ ట్రస్ట్ ప్రతినిథి ఆనందకుమార్ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. భగవాన్ సాయిబాబా జన్మదినమైన నవంబరు 23వ తేదీన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు.
సెప్టెంబర్ 18న సీడీఎస్ పరీక్ష
న్యూఢిల్లీ: రక్షణ దళాల్లో ప్రవేశాల కోసం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష-2ను సెప్టెంబర్ 18న నిర్వహించనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది. భారత మిలటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 2012 జులైలో ప్రారంభమయ్యే కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2012 అక్టోబర్‌లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మొదలయ్యే కోర్సు (మహిళలు, పురుషులు) కోసం కూడా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించింది. అర్హత, సిలబస్, పరీక్ష విధానం, దరఖాస్తు విధానం వంటి వివరాల కోసం మే 7 2011 నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/ రోజ్‌గార్ సమాచార్ చూడాలని కోరింది. పూర్తివివరాలు www.upsc.gov.in వెబ్‌సైట్‌లో కూడా లభ్యమవుతాయని తెలిపింది.
6, మే 2011, శుక్రవారం
కనిమొళి బెయిల్ అభ్యర్థనపై న్యాయస్థానం విచారణ
న్యూఢిల్లీ: 2జి స్కామ్ కేసుకు సంబంధించి డీఎంకే ఎంపీ కనిమొళి ముందస్తు బెయిల్ కోరడంతో దానిమీద ఈరోజు విచారణ జరుగుతోంది. న్యాయస్థానానికి వచ్చిన కనిమొళి ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ 'కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం...' అన్నారు.
మూడో రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె
వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల సమ్మె మూడో రోజుకు చేరింది. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
1, మే 2011, ఆదివారం
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఆరుగురి మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా అచ్యుతాపురం వద్ద చెట్టును జీపు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. సంఘటన స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తుండగా జీపు టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.

కడప ఎన్నికల ప్రచారంలో చిరంజీవి
కడప : ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అలాంఖాన్‌పల్లె, చెన్నూరు. ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు. బద్వేలు, పోరుమామిళ్ల... తదితరప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో నాయకులను ఎన్నుకోవాల్సింది ప్రజలేనని ఆయన అన్నారు.
తెలుగుదేశంలో చేరనున్న రాజశేఖర్ దంపతులు
హైదరాబాద్ : సినీనటుడు రాజశేఖర్ దంపతులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. రాజశేఖర్, ఆయన సతీమణి జీవితలు ఈ అంశమై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సోమవారం రాజశేఖర్ దంపతులు తెలుగుదేశంలో చేరనున్నారు.
1, ఏప్రిల్ 2011, శుక్రవారం
ఊబకాయంతో ఆరోగ్యానికి సమస్యలెన్నో...!!
ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని పీడిస్తున్న సమస్య ఊబకాయం. ఇది కొందరిలో వారసత్వం కారణంగా కూడా వస్తుందని పరిశోధకులు తేల్చారు. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హృద్రోగం, టైప్-2, మధుమేహం, కీళ్ళనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. కేలరీలు అధికమోతాదులో ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరకశ్రమ చేయక పోవడంతో బరువు పెరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాలైన మందుల వాడకం వల్ల హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.
ఊబకాయ వల్లే వచ్చే దుష్పలితాలు:
ఊబకాయంతో బాధపడే వ్యక్తి జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అంటే చిన్న వయస్సులోనే దీని బారిన పడితే తక్కువకాలం జీవిస్తారని వైద్యులు చెపుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారిలో సాధారణ పౌరుల ఆరోగ్యం కంటే ఆరింతలు అధికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా, హృద్రోగం, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, మధుమేహం, నడుంనొప్పి, కీళ్ళలో రక్తప్రసరణ సరిగా లేకపోవడం, రక్తం గడ్డకట్టడం, నిద్రలేమి లేదా అధికనిద్ర, పిత్తాశయ వ్యాధులు సోకుతాయి.
ఎలా తగ్గించుకోవచ్చు?
ఈ ఊబకాయాన్ని వ్యాయామాలు ద్వారా, ఆహారంలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా కొంతమేరకు తగ్గించుకోవచ్చు. తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు, చక్కెర, ఉప్పు, కూల్‌డ్రింక్స్, జంక్‌ఫుడ్స్, తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు, ఎత్తుకు తగిన బరువు ఉండేలా క్రమం తప్పకుండా చూసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు.

8, మార్చి 2011, మంగళవారం
గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ సభ్యుల నిరసన
హైదరాబాద్: అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు.
రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిల్యాండ్
శ్రీలంక: వన్డే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచుల్లో భాగంగా గ్రూప్ 'ఎ' లోని పాకిస్థాన్, న్యూజిల్యాండ్ జట్లు ఇక్కడి పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ బ్యాటింగ్ చేస్తోంది. 16 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 69 పరుగులతో ఆడుతోంది.
స్కోరు:
గుప్తిల్: 45 (బ్యాటింగ్)
బ్రెండన్ మెక్లమ్: 6 (బౌల్డ్ అక్తర్)
హౌ: 4 (ఎల్బీ వుమర్ గుల్)
టేలర్ 9 (బ్యాటింగ్)
స్కోరు:
గుప్తిల్: 45 (బ్యాటింగ్)
బ్రెండన్ మెక్లమ్: 6 (బౌల్డ్ అక్తర్)
హౌ: 4 (ఎల్బీ వుమర్ గుల్)
టేలర్ 9 (బ్యాటింగ్)
మహిళాబిల్లుకు ఆమోదం లభించకపోవడం శోచనీయం: శోభానాగిరెడ్డి
హైదరాబాద్: మహిళాబిల్లుకు ఆమోదం లభించకపోవడం శోచనీయమని, చట్టసభల్లో మహిళల శాతం పెంచుకోవాల్సిన అవసరం ఉందని శోభానాగిరెడ్డి అన్నారు. మహిళా సమస్యలపై శాసనసభలో ప్రస్తావిస్తూ ఆమె, హోంమంత్రి సబితాఇంద్రారెడ్డికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని సూచించారు.
శాంతియుతంగా మిలియన్ మార్చ్: కోదండరాం
హైదరాబాద్: శాంతియుతంగా మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నందున ఎలాంటి అనుమతులు అవసరం లేదని ఐకాస కన్వీనర్ కోదండరాం అన్నారు. శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రభుత్వం అనవసరమైన అవాంతరాలు సృష్టించవద్దని, మిలియన్ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు బెదిరింపులకు దిగవద్దని ఆయన అన్నారు. మార్చి 10న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. సంఘటితంగా తెలంగాణ సాధించుకుంటామని ప్రతిజ్ఞచేయాలని ఆయన కోరారు. 10న విద్యార్థులంతా పరీక్షలకు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆయన కోరారు.
అగ్నిప్రమాదంలో పత్తి విత్తనాలు దగ్ధం: రు. 10 కోట్లు నష్టం
ప్రకాశం: ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలోని బ్రహ్మసాగో ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు గోదాముల్లో నిలవున్న పత్తివిత్తనాలు దగ్ధమైనాయి. రు. 10 కోట్ల నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం తెలిపింది. ప్రమాదానికి కారణం తెలియలేదు.
14, ఫిబ్రవరి 2011, సోమవారం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
ఆదిలాబాద్(విశాల విశాఖ): ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తాండూరు మండలం బోయపల్లి వద్ద రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.అదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్థు చేస్తున్నారు.
అనంతపురం: జిల్లాలోని గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు మిర్చియార్డులో నిలిచిన కొనుగోళ్లు
గుంటూరు(విశాల విశాఖ): గుమస్తాల ఆందోళనతో గుంటూరు మిర్చియార్డులో కొనుగోళ్లు నిలిచిపోయాయి. మిర్చియార్డులో కమిషన్ వర్తక గుమస్తాలు ఈ ఉదయం ఆందోళన చేపట్టారు. నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేట రహదారిపై గుమస్తాలు బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుమస్తాల ఆందోళన కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి.
విశాఖలో పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ
ఐదుగురి పరిస్థితి విషమం
విశాఖ : ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీని ఢీకొని గ్యాస్ సిలిండర్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఘటన అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న పోలీసులపైకి వేగంగా వస్తున్న మరో లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏఎస్సై డి.సూర్యనారాయణ, కానిస్టేబుల్ బోడయ్య, హోంగార్డులు ప్రసాద్, అప్పారావు, రామారావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అవిశ్వాసం ఎదుర్కొనేందుకు సిద్ధం
పీసీసీ అధ్యక్షుడు డీఎస్
హైదరాబాద్-న్యూస్‌టు: అవిశ్వాస తీర్మానాన్ని ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. ''ఆ తీర్మానం అనుమతి పొందుతుందా? నిబంధనల ప్రకారం కనీసం 30 మంది సభ్యులు ఉండాలి. తెరాసకు 11 మందే ఉన్నారు. ఒకవేళ భాజపాను కలుపుకొన్నా మొత్తమ్మీద 13 మందే అవుతారు. కేసీఆర్ తీర్మానం పెట్టమనండి మేమైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తెదేపాతో తాముకుమ్మక్యయ్యామనడాన్ని సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఖండించారు. సహాయ నిరాకరణపై ఆయన స్పందిస్తూ.. ప్రజలకు మేలు జరక్కపోయినా.. వారికి ఇబ్బంది మాత్రం కలుగకూడదన్నారు. సహాయ నిరాకరణ వల్ల.. రోజుకూలీతో బతుకుతున్న కూలీల పరిస్థితేంటన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున ఈ కార్యక్రమంపై పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నచ్చజెబుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి కొండా సురేఖపై అధిష్ఠానం సమీక్షిస్తోందని సరైన సందర్భంలో నిర్ణయం తీసుకుంటారని డీఎస్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో 21మంది మృతి
రాజస్థాన్: రాజస్థాన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 21మంది మృతి చెందారు. నాగౌర్ వద్ద లారీ-వ్యాను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 19మంది మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి కలెక్టరేట్‌ముందు విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్(విశాల విశాఖ): బోధనాఫీజులను వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రంగారెడ్డి కలెక్టరేట్‌ముందు ధర్నా చేశారు. లోపలికి వెళ్లేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
మార్చిలో మాపార్టీ వస్తుంది: జగన్
హైదరాబాద్: వైఎస్సార్ ఆశయాలను, పథకాలనురాష్ట్రప్రభుత్వం ఒక్కటొక్కటిగా భ్రష్టు పట్టిస్తోందని అందుకే ఆయన ఆశయాలను సాధించేందుకు గాను కొత్త పార్టీ పెడుతున్నామని వై.ఎస్.జగన్ అన్నారు. బద్వేల్‌లో ఆయన ఈ విషయం తెలిపారు. మార్చిలో ఇడుపులపాయలో ఉన్న వై.ఎస్.ఆర్ స్మృతిచిహ్నం వద్ద తమ పార్టీని ప్రకటిస్తామన్నారు.
5, ఫిబ్రవరి 2011, శనివారం
జనగణనను విజయవంతం చేయాలి
కలెక్టర్ శ్యామలరావు
విశాఖపట్నం(విశాల విశాఖ): జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, కలెక్టర్ జె.శ్యామలరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 28వ తేదీ వరకు ఇది జరుగుతుందని, మార్చి 1 నుంచి 5వరకు పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చేపడుతున్న గణన 15వదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 7వదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6వ గణనన్నారు. మొదటి విడతగా గత ఏడాది ఏప్రిల్ 26 నుంచి జూన్ 10 వరకు ఇళ్ల గణనను విజయవంతంగా పూర్తిచేశామని, ఇదే స్ఫూర్తితో ఈనెల 9న ప్రారంభం కానున్న జనగణనను విజయవంతం చేయాలన్నారు. మొత్తం 29 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారని, గణన సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. సేకరించిన వ్యక్తిగత జనాభా గణన వివరాలు ఎవరికీ తెలియచేయరాదని, కుటుంబ యజమాని కూడా తమ వివరాలను ఎన్యూమరేటర్‌కు వాస్తవమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించాలన్నారు. జనాభా గణన రెండో దశకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

శంషాబాద్‌లో చిరుత కలకలం
హైదరాబాద్: శంషాబాద్ మండలం కవ్వగూడలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాత్రి దూడపై చిరుత దాడి చేసింది. ఓ యువకుడిని వెంబడించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
విలీనం పై చిరంజీవిక పవన్ కళ్యాణ్ మంతనాలు
ఢిల్లీ బయలుదేరే ముందు అన్నయ్య చిరంజీవితో తమ్ముడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన తర్వాత చిరంజీవి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఏం జాగ్రత్తలు చెప్పారనేది ఆసక్తిగా మారింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కాబోతోందని, వివరాలు అన్నయ్యనే వెల్లడిస్తారని పవన్ కళ్యాణ్ చిరంజీవితో భేటీకి ముందు చెప్పారు. దీన్ని బట్టి కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావడమనేది లాంఛనమేనని తెలుస్తోంది.కాంగ్రెసు నాయకత్వంతో, సోనియాతో వ్యవహరించాల్సిన తీరుపై పవన్ చిరంజీవితో మాట్లాడినట్లు తెలుస్తోంది. సమైక్యావదంపై, తెలంగాణ అంశంపై పవన్ అన్నయ్యతో మాట్లాడినట్లు చెబుతున్నారు. చిరంజీవిని ముఖ్యమంత్రి పీఠం మీద చూడాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. కాంగ్రెసుతో దోస్తీ అందుకు అనుగుణంగానే ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెసు కూడా చిరంజీవితో దోస్తీపై పవన్ కళ్యాణ్, ఇతర సినీ స్టార్ల మద్దతును కూడా దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.
సాయుధ బలగాల్లో 53 వేల ఖాళీల భర్తీ
హైదరాబాద్: దేశంలో మొదటిసారిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోని ప్రత్యేక దళాలతోపాటు సాయుధ బలగాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సమాయత్తం అవుతోంది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన సూచనలను అనుసరించి ఎస్‌ఎస్‌సీ దేశవ్యాప్తంగా సాయుధబలగాల్లో 53వేల ఖాళీలను భర్తీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ కార్యాలయాల్లోని గ్రూప్ బి స్థాయి ఖాళీలను భర్తీ చేసే ఎస్‌ఎస్‌సీ తాజాగా సాయుధ బలగాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తుండటం ఇదే ప్రథమం. దీనికోసం కమిషన్ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ బలగాలతోపాటు ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్‌లో భర్తీచేసే కొత్త ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు శారీరక దృఢత్వంకలిగినవారు అర్హులని, సాయుధబలగాల్లోని ఖాళీలను ఆరునెలల్లో భర్తీ చేస్తామని ఎస్‌ఎస్‌సీ ఛైర్మన్ రఘుపతి తెలిపారు.
ఆటోను ఢీకొన్న ఎమ్మెల్యే వాహనం: ఇద్దరు మృతి
మెదక్: పుల్కల్ మండలం చౌటాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వాహనం ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
2, ఫిబ్రవరి 2011, బుధవారం
దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయమనండి: వెంకటస్వామి
హైదరాబాద్: సోనియాపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామిస్పష్టం చేశారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని అధిష్టానాన్నిసవాలుచేశారు. కొత్త పార్టీ తప్పక వస్తుందని సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తానని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆయనన్నారు.
వెంకటస్వామి వ్యాఖ్యలపై డీఎస్ నివేదిక
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి చేసిన తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. మీడియాలో తీవ్ర చర్చ జరగటంతో ఈ విషయంపై అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీఎస్‌ను నివేదిక కోరింది. ఈ మేరకు ఆయన ఈరోజు అధిష్టానానికి నివేదిక పంపారు. మీడియాలో ఆయన మాట్లాడిన మాటల పూర్తి వివరాలు, క్లిప్పింగులను జతచేసి పంపారు. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు.
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం
లారీ డ్రైవర్ మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. లారీ-బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈప ప్రమాదంలో లారీ డ్రైవర్ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన 24 మందిని విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు.

1, ఫిబ్రవరి 2011, మంగళవారం
అంబటి క్షమాపణ చెప్పాలి: మంత్రి బాలరాజు
చోడవరం(విశాల విశాఖ): కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీని విమర్శించే స్థాయి జగన్‌వర్గం నాయకుడు అంబటి రాంబాబుకు లేదని మంత్రి బాలరాజు అన్నారు. విజయరామరాజుపేటలోఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాపై అంబటి చేసిన వాఖ్యల పట్ల మండిపడ్డారు. ఆమెపై చేసిన వాఖ్యల్ని ఉపసంహరించుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం కోసం పదవుల్ని సైతం త్యజించిన సోనియాపై విమర్శలు చెయ్యడం అంబటి లాంటి వ్యక్తులకు తగదని పేర్కొన్నారు. తన స్థాయిని పెంచుకోవడానికి, ప్రచారం కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ నాయకులు కలిస్తే మంచి పరిణామమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరువు తీశారు : వీహెచ్
హైదరాబాద్ : దేశ రక్షణ మంత్రి ఏకే ఆంటోనిని చిరంజీవి ఇంటికి రాయబారానికి పంపి 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని, హైకమాండ్ తీరుపై తనకు ఎంతో బాధ కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. అంత తొందరేమొచ్చిందని చిరంజీవితో పొత్తుకు వెంపర్లాడుతున్నారని కాకా ప్రశ్నించారు. ఆంటోని సోనియా దూతంగా కేవలం చిరంజీవని కలవడానికే రావడం తనకు అవమానంగా ఉందని, చిరంజీవిని ఢిల్లీకి పిలిపిస్తే వెళ్లకపోదునా? అని ఆయన అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని విమర్శించిన చిరంజీవితో పొత్తును భరించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి రావడాన్ని ఇవాళ ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నారు. వారు తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారని కాకా అన్నారు.
పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చచిపోయారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మోటార్‌సైకిల్‌ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు చనిపోయారు.
తల్లిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు
చిత్తూరు : తల్లి తిండి పెట్టడం లేదని గొడవచేసినందుకు దారుణంగా ఆమెను చంపిన కొడుకుకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వుంగనూరు మండలం భగత్‌సింగ్ కాలనీకి చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి తనకు తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడని అతని తల్లి తరచూ ఘర్షణ పడేది. దీంతో ఓరోజు రెడ్డప్ప తల్లి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమె తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ సంఘటన 3-5-2010న జరిగింది. ఆ కేసులో రెడ్డప్ప 14 రోజులు రిమాండ్‌లో ఉండి, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. మదనపల్లి రెండవ అదనపు కోర్టులో ఈ కేసు తదుపరి విచారణ ఈరోజు జరిగింది. రెడ్డప్పకు జడ్జి సుమలత జీవిత ఖైదు, 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
చిరంజీవి నివాసంలో ప్రరాపా ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్: ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవితో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం భేటీ అయ్యారు. ప్రరాపాను విలీనం చేయాలి లేదా మంత్రివర్గంలో చేరాలంటూ కాంగ్రెస్ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి తొమ్మిది మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాసేపు పాల్గొన్న చిరంజీవి అనంతరం తిరుపతి పర్యటనకు బయల్దేరి వెళ్లారు. చిరంజీవి నివాసంలో ఇంకా ఈ సమావేశం కొనసాగుతోంది
31, జనవరి 2011, సోమవారం
విశాఖలో అర్థరాత్రి రింగ రింగా హీరోయిన్ విమల హైడ్రామా
విశాఖపట్నం: రింగ రింగా సినిమా హీరోయిన్ విమల సోమవారం అర్థరాత్రి విశాఖపట్నంలో హైడ్రామా సృష్టించారు. ప్రశాంత్ అనే యువకుడు తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి ప్రశాంత్ అనే యువకుడు ఓ దర్శకుడి పేరు చెప్పి తనను లాడ్జీకి ఆహ్వానించాడని, తాను లాడ్జికి వెళ్లానని, దాంతో అతను తనపై దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ తన వెంట పడుతున్నాడని కూడా ఆమె ఆరోపించారు. తనకు మత్తు మందు ఇచ్చాడని, తన జుట్టు కత్తిరించాడని, ఆ తర్వాత దాడి చేశాడని ఆమె పోలీసులకు చెప్పారు.పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో విమల మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంపై చిన్ని చిన్న గాట్లు ఉన్నాయని వారు చెప్పారు. ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, విమల ఫిర్యాదులోని నిజానిజాలను తెలుసుకోవడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. విమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రచారం కోసమే విమల నాటకమాడుతోందా అనే కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు విమల ఇంతకు ముందు రెండు తమిళ సినిమాల్ోల నటించారు. ప్రస్తుతం రింగ రింగా సినిమాలో నటిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)