విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అసంఘటిత కార్మికుల సమస్యలపై దేశంలోని అన్ని యూనియన్లతో కలిసి ఫిబ్రవరి 23న పార్లమెంట్ ముట్టడి చేపట్టనున్నట్లు ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 లక్షల మంది కార్మికులు పాల్గొంటారని చెప్పారు. ఆదివారం హోటల్ టైకూన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే ఉద్యోగ సమస్యలపై పోరాడేందుకు ఈనెల 8, 9 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన సంఘం వర్కింగ్ కమిటీ సమావేశంలో కార్యాచరణ రూపొందించుకున్నామని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ ఐఎన్‌టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని, యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల మైనింగ్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందని పేర్కొన్నారు. ప్లాంట్‌లో పొరుగుసేవల విధానం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగ నియామకాలు రద్దుచేసి ప్రస్తుతం పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గడసాల అప్పారావు, కేవీఎన్‌రాజు, ఈశ్వరరావు, మస్తానప్ప, పి.రవి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి