15, జనవరి 2011, శనివారం
భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వేండ్రపంపుల చెరువు వద్ద అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. పాలకోడేరు మండలం వేండ్ర నుంచి భీమవరం వెళ్తుండగా కారు కాల్వలోకి దూసు కెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఎం.ఆంజనేయశ్వరెడ్డి, దాట్ల సరస్వతి, సాయి అభినవశర్మ, భీమవరానికి చెందిన శ్రీనివాసరాజు, రాధలు ఉన్నారు. ప్రమాదంలో శ్రీనివాసరాజు భార్య పద్మ గల్లంతయ్యింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి