ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా డి. శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో పార్టీని పటిష్టపరచగల నాయకుడు ఒక్క డీఎస్ మాత్రమేనని అధిష్టానం బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తిరిగి మూడోసారి డీఎస్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.పార్టీపరంగానే కాకుండా ప్రస్తుతం రగులుతున్న తెలంగాణా ప్రాంతంలో తలెగరేస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ముకుతాడు వేయాలంటే అది డీఎస్ వల్లనే సాధ్యమవుతుందని పలువురు సీనియర్ నాయకులు చెప్పడంతో పీసీసీ చీఫ్ పదవి డీఎస్‌కు మరోసారి దక్కిందని తెలుస్తోంది.ఇవన్నీ ఇలావుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం కొత్త నిర్ణయాలు తీసుకుని కొత్త చిక్కుల్లో పడేందుకు సిద్ధంగా లేదని ఓ సీనియర్ నాయకుడు చెప్పుకొచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి