13, జనవరి 2011, గురువారం
అంబరాన్నింటిన బోగి సంబరాలు
విశాఖపట్నం: సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడాలేకుండా వీదులన్నీ రంగుల రంగుల ముగ్గులతో ముస్తాబయ్యాయి. వేకువజామున బోగి మంటలు ఉవ్వెత్తున ఎగిసాయి. చలికాలంలో వెచ్చని మంటతో ప్రజలు బోగిమంట కాచుకున్నారు. కొత్తబట్టలు ధరించి పిండివంటల రుచులు ఆరగించారు. పల్లెల్లో హరి దాసుల కీర్తనలు మునపటి కంటే తక్కువగా కనిపించాయి.గంగిరెద్దులు ఎక్కడో తప్ప కానరాలేదు. మరో వైపు జిల్లాలోని ప్రదాన పట్టణాలు, మండల కేంద్రాలు నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోళ్ళతో కిక్కిరిసిపోయాయి. సామాన్యుడికి భారంగా కూరగాయలు, పండ్లు ధరలు చుక్కలనంటాయి. బట్టల దుకాణాలు జాతరను తలపించాయి. పల్లెలంతా పిల్లల ఆట పాటలతో సందడి సందడిగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కొనుగోలు దారులను ఆకట్టుకునేందుకు పట్టణంలోని వస్త్ర దుకాణాలన్నీ ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి