విశాఖపట్నం: రింగ రింగా సినిమా హీరోయిన్ విమల సోమవారం అర్థరాత్రి విశాఖపట్నంలో హైడ్రామా సృష్టించారు. ప్రశాంత్ అనే యువకుడు తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి ప్రశాంత్ అనే యువకుడు ఓ దర్శకుడి పేరు చెప్పి తనను లాడ్జీకి ఆహ్వానించాడని, తాను లాడ్జికి వెళ్లానని, దాంతో అతను తనపై దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ తన వెంట పడుతున్నాడని కూడా ఆమె ఆరోపించారు. తనకు మత్తు మందు ఇచ్చాడని, తన జుట్టు కత్తిరించాడని, ఆ తర్వాత దాడి చేశాడని ఆమె పోలీసులకు చెప్పారు.పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో విమల మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంపై చిన్ని చిన్న గాట్లు ఉన్నాయని వారు చెప్పారు. ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, విమల ఫిర్యాదులోని నిజానిజాలను తెలుసుకోవడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. విమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రచారం కోసమే విమల నాటకమాడుతోందా అనే కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు విమల ఇంతకు ముందు రెండు తమిళ సినిమాల్ోల నటించారు. ప్రస్తుతం రింగ రింగా సినిమాలో నటిస్తున్నారు.
31, జనవరి 2011, సోమవారం
విశాఖలో అర్థరాత్రి రింగ రింగా హీరోయిన్ విమల హైడ్రామా
వెంకటేష్ కెప్టెన్‌గా, విష్ణు ఓనర్‌గా సీసీఎల్ పోటీలు
దక్షిణాది, ఉత్తరాది రంగాలకు చెందిన పలువురు తారలతో సీసీఎల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్న విషయం విదితమే. మన టాలీవుడ్‌లో క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో వెంకటేష్ ఒకరు.షూటింగ్‌లు లేనప్పుడు ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగితే అక్కడికి వెళ్లిపోతుంటారు వెంకటేష్. సీసీఎల్‌లో మన టాలీవుడ్ టీమ్‌కు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. ఇక క్రికెట్ అంటే ఇష్టపడే మరో హీరో మంచు విష్ణు. ఆయన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరపున ఈ టాలీవుడ్ టీమ్‌కు ఓనర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.ఈ మ్యాచ్‌లో పాల్గొనడానికి సీనియర్ హీరోలు, యువ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫిబ్రవరి 14లోపు ఈ జట్టులో ఎవరెవరు ఆడతారో నిర్ణయించి, ఆ టీమ్ ఆవిష్కరణ కార్యక్రమం జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగు టీమ్ యజమాని విష్ణు విలేకరులకు తెలిపారు.ఈ టీమ్‌కు ప్రచారకర్తలుగా అందాల తారలు తాప్సీ, సమంత వ్యవహరించనున్నారని ఆయన తెలిపారు. ఇదిలావుండగా తమిళ టీమ్‌కు సూర్య కెప్టెన్‌గా, అక్కడి నడిగర్ సంఘం(ఆర్టిస్ట్ అసోసియేషన్) ఓనర్‌గా వ్యవహరించడానికి తీర్మానం అయ్యాయి. ఇంకా కన్నడ టీమ్‌కు పునీత్ రాజ్‌కుమార్, హిందీకి కెప్టెన్‌గా మరియు ఓనర్‌గా సల్మాన్‌ఖాన్ వ్యవహరించబోతున్నారు.
'అయ్యారే' సినిమాకు సర్టిఫికెట్లు ఇవ్వొద్దు
తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా 'అయ్యారే' చిత్రానికి ఎలాంటి సర్టిఫికెట్‌ను జారీ చేయరాదని సెన్సార్ బోర్డును ఆదేశిస్తూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మీడియాలో వచ్చిన అసత్య కథనాల ద్వారా 'అయ్యారే' పేరుతో సినిమాను తీసి తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని, ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ స్వామి నిత్యానంద తరఫున కె.పి.శైలేందర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
చిరంజీవితో రక్షణ మంత్రి ఏకే ఆంటోని చర్చలు
హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీక్షల పేరుతో హల్‌చల్ చేస్తున్న జగన్‌కు చెక్కుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రక్షణమంత్రి ఏకే ఆంటోని గప్‌చుప్‌గా హైదరాబాద్ వచ్చారు. పీసీసీ చీఫ్ డీఎస్‌తో కలిసి పీఆర్‌పీ అధినేత చిరంజీవి నివాసానికి ఆంటోని వెళ్లారు. చిరును కేబినెట్‌లో చేర్చుకునే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పీఆర్‌పీ పార్టీలో విలీనమా?, ప్రభుత్వంలో చేరడమా అనే విషయంపై మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది.
బీఎస్‌ఎన్‌ఎల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
విశాఖపట్నం: ప్రతీ అయిదేళ్లకోసారి జరిగే బీఎస్‌ఎన్‌ఎల్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరగనున్నాయి. ఎన్నికల సంఘం, కార్మిక శాఖల ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ దీనిని సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి పోలింగు మొదలవుతుంది. సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక బ్యాలెట్ పెట్టెల్ని స్ట్రాంగ్‌రూంకు తరలిస్తారు. 3వ తేదీన వెలంపేటలోని బీఎస్‌ఎన్‌ఎల్ భవనంలో ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాన్ని ప్రకటిస్తారు. జిల్లా మొత్తం మీద క్లాస్-3, 4 సిబ్బంది 1450 మంది ఉండగా వారంతా ఓటు హక్కు కలిగి ఉంటారు. దేశం మొత్తం మీద ఏ కార్మిక సంఘానికి ఎక్కువ ఓట్లు లభిస్తే ఆ సంఘానికే రాష్ట్ర, జిల్లా స్థాయిలోనూ గుర్తింపు లభిస్తుంది. ఈసారి బరిలో ఉన్నవాటిలో ప్రధాన పోటీ బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, టెలికాం ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్.ఎఫ్.టి.ఇ.)ల మధ్యే కనిపిస్తోంది. మొత్తం ప్రక్రియ సాధారణ ఎన్నికల మాదిరిగానే ఉంటుంది. ఓటర్ల జాబితా ప్రకటన, ఆ తర్వాత బదిలీలపై నిషేధం, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పెట్టెల సమీకరణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి... ఇదంతా పక్కాగా నిబంధనల ప్రకారం జరగాల్సిందే. ఎన్నికల పరిశీలకులూ దీని కోసం వస్తున్నారు. దాదాపు సిబ్బంది అంతా 15 రోజులుగా ఈ కోలాహలంలోనే నిమగ్నమై ఉన్నారు.కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలపై రెండు కార్మిక సంఘాలు వాగ్దానాలను చేశాయి. విస్తృతంగా ప్రచారం కూడా చేపట్టాయి. బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఇంకు సరఫరాసహా మొత్తం సామగ్రి అంతటినీ పోలింగ్ కేంద్రాలకు చేర్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సిబ్బంది ఎన్నికల సంబంధిత విధుల్లో ఎక్కడ ఉంటే అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అనకాపల్లి, అరకు, బాలచెరువు, భీమిలి, సి.ఆర్.ఆర్. సముదాయం, చోడవరం, డాబాగార్డెన్స్, గోపాలపట్నం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, మల్కాపురం, ఎం.వి.పి.కాలనీ, మింది, నర్సీపట్నం, పాడేరు, వెలంపేట, యలమంచిలి, మధురవాడల్లో పోలింగ్ నిర్వహిస్తారు. 3వ తేదీ మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఫిబ్రవరి 5న ప్రధాని హైదరాబాద్ రాక
హైదరాబాద్ : ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 5న హైదరాబాద్ రానున్నారు. 6న నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి అదే రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్ళనున్నట్లు సమాచారం.
బాలు అన్ని అవార్డులకు అర్హులే
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి సోమవారం రాత్రి చెన్నైలో అభినందనసభ జరిగింది. ఆయన పద్మభూషణ్ అవార్డుకు ఎంపికవడాన్ని పురస్కరించుకుని స్థానిక కామరాజ్ ఆడిటోరియంలో శ్రీరామ్స్ ఎంటర్‌టైనర్స్ నిర్వహించిన అభినందనసభలో ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్, సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్, శ్యామ్‌జోసెఫ్, గణేష్, నేపథ్య గాయకులు టీఎం సౌందర్రాజన్, పీబీ శ్రీనివాస్, గాయని సుశీల, తమిళ నటులు వివేక్, పార్తిబన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాలసుబ్రమణ్యం అన్ని అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. గాయకుడిగానే కాక నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వివిధ రంగాల్లో ఆయనకు ప్రావీణ్యం ఉందన్నారు. ఎస్పీబీతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తాను ఎన్ని అవార్డులు అందుకున్నా అందుకు పాతతరం గాయనీగాయకుల స్ఫూర్తే కారణమన్నారు. ఎంఎస్‌విశ్వనాథన్ లేకుంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం లేడని వ్యాఖ్యానించారు. ఈసందర్త్భంగాజరిగిన సంగీత విభావరిలో పి.సుశీల, మనో, చిత్ర, మాలతి, ఎస్పీబీ చరణ్, మల్లిఖార్జున, హరిణి, సంజన, గోపికాపూర్ణిమ తదితరులు తమిళ, తెలుగుభాషల్లో ఎస్పీబీ పాడిన పాటలను ఆలపించి సభికులను అలరించారు. శివమణి తన డ్రమ్స్ విన్యాసాల ద్వారా ఆహూతులను ఆకట్టుకున్నారు. శ్రీరామ్స్ ఎంటర్‌టైనర్స్ నిర్వాహకుడు శ్రీరాములు, గాయకుడు మనో, డ్రమ్మర్ శివమణిలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
కర్నూలు: హంద్రీనీవా ప్రాజెక్టు జాప్యం, రైతు సమస్యలపై నేడు కర్నూలు జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లు చేరుకొనే చంద్రబాబు కసాపురం మీదుగా కర్నూలు జిల్లాలోని మద్దికెరకు చేరుకొంటారు. అక్కడి నుంచి తుగ్గలి, పెరవలి, రాతన గ్రామాల్లో రోడ్డుషో నిర్వహిస్తారు. పత్తికొండలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం హంద్రీనీవా ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న పందికోన జలాశయాన్ని పరిశీలిస్తారు. అడ్వాన్సులు ఇచ్చినా నిర్మాణాలు సాగని హంద్రీనీవా కాలువలను దేవనకొండ, కరివేముల ప్రాంతాల్లో పరిశీలిస్తారు. అనంతరం కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రాత్రికి కర్నూలు చేరుకొంటారు.
విధులను బహిష్కరించిన గనులశాఖ ఉద్యోగులు
హైదరాబాద్: కన్నెధార లీజుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న గనులు, భూగర్భశాఖ అసిస్టెంట్ డైరక్టర్ కోటేశ్వరరాజుపై జరిగిన దాడిని గనుల శాఖ ఉద్యోగసంఘాలు తీవ్రంగా ఖండించాయి. హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉన్న సంస్థ ప్రధానకార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. తమ ఉద్యోగికి న్యాయం జరిగేవరకు మాస్‌లీవు ప్రకటించి విధుల్లో పాల్గొనబోమని చెప్పారు.
నిరుపేదలకోసం రచ్చబండ కార్యక్రమం
మంత్రి గీతారెడ్డి
హైదరాబాద్: నిరుపేదలకోసమే ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి గీతారెడ్డి అన్నారు. తార్నాక డివిజన్‌లోని శాంతినగర్‌లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కొందరికి వృద్ధాప్య పింఛన్లు, మహిళాసంఘాలకు బ్యాంకు రుణాలు అందజేశారు. రేషన్‌కార్డులకోసం దరఖాస్తులు స్వీకరించారు. ఎంపీ అంజన్‌కుమార్, ఎమ్మెల్యే జయసుధ, మేయర్ కార్తీకరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: నిరుపేదలకోసమే ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి గీతారెడ్డి అన్నారు. తార్నాక డివిజన్‌లోని శాంతినగర్‌లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కొందరికి వృద్ధాప్య పింఛన్లు, మహిళాసంఘాలకు బ్యాంకు రుణాలు అందజేశారు. రేషన్‌కార్డులకోసం దరఖాస్తులు స్వీకరించారు. ఎంపీ అంజన్‌కుమార్, ఎమ్మెల్యే జయసుధ, మేయర్ కార్తీకరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబు హయాంలోనే ఎన్నో కుంభకోణాలు: దానం
హైదరాబాద్: కాంగ్రెస్ కంటే చంద్రబాబు హయాంలోనే ఎన్నో అవినీతి కుంభకోణాలు వెలుగుచూశాయని కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. బాక్సైట్, మైనింగ్, ఓబుళాపురం, రహేజా, గోల్ఫ్‌కోర్సు, ఎమ్మార్ వంటి సంస్థలకు అక్రమంగా అనుమతి ఇచ్చిన ఘనత బాబుదేనని అన్నారు. అవినీతి భరతం పడదామని ఆయనే అనటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
30, జనవరి 2011, ఆదివారం
రేపు ఢిల్లీలో ముఖ్యమంత్రుల సదస్సు
న్యూఢిల్లీ: మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మంగళవారం రాజధానిలో జరగనుంది. దీనిని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మావోల హింస, అతివాదుల తీవ్రవాద కార్యకలాపాలు, పోలీసు బలగాల ఆధునికీకరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు, నిఘావిభాగాన్ని బలోపేతం చేయడం, పరస్పర సమాచార మార్పిడి వ్యవస్థ, తీరప్రాంత భద్రత అంశాలు కూడా భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీలకు తీవ్రవాద కార్యకలాపాలను అంటగట్టడంపై గుజరాత్ సీఎం నరేంద్రమోడీ, మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్‌చౌహాన్‌ల నుంచి ఈ సమావేశంలో గట్టి వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో నేడు నేపాల్ అధ్యక్షుడి పర్యటన
హైదరాబాద్: నేపాల్ అధ్యక్షుడు రాంభరణ్ యాదవ్ నేడు హైదరాబాద్‌లో పర్యటించున్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాంభరణ్ ఈ ఉదయం 10 గంటలకు సాలార్‌జంగ్ మ్యూజియంను సందర్శించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా హోటల్ తాజ్‌కృష్ణ నుంచి సాలార్‌జంగ్ మ్యూజియం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటల నుంచి 10.15 గంటల వరకు హోటల్ తాజ్‌కృష్ణ నుంచి సాలార్‌జంగ్ మ్యూజియం వరకు... 10.45 నుంచి 11.30 వరకు సాలార్‌జంగ్ మ్యూజియం నుంచి తాజ్‌కృష్ణ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 వరకు తాజ్‌కృష్ణ నుంచి బేగంపేట విమానాశ్రయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆదర్శ్ నిందితుల ఇళ్లపై సీబీఐ దాడులు
ముంబయి: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నలుగురు ప్రధాన నిందితుల ఇళ్లపై సీబీఐ ఆదివారం దాడులు నిర్వహించింది. సొసైటీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ ఠాకూర్, మాజీ బ్రిగేడియర్ ఎంఎం వాన్‌ఖూ, కాంగ్రెస్ నాయకుడు కెఎల్ గిద్వానీ, పట్టణాభివృద్ధిశాఖ మాజీ ముఖ్యకార్యదర్శి రామానంద్ తివారీలకు చెందిన గృహాలు, ఇతర ప్రాంతాల్లో సీబీఐ ఈ దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, బీహార్‌ల్లో ఇవి ఏకకాలంలో సాగాయి. ఆదర్శ్ వ్యవహారంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సహా 13 మందిపై సీబీఐ శనివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
జగన్‌పై అసత్య ఆరోపణలు: అంబటి
హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రామోజీలు దుష్ట చతుష్టయమని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, టీడీపీలపై అంబటి నిప్పులు చెరిగారు. జగన్‌పై వస్తున్న ఆరోపణల విషయంలో సీబీఐ చేపట్టే రీఎంక్వైయిరీకి తాము సిద్ధమేనని ఆయన అన్నారు.
వైఎస్ అవినీతి పరుడనే వారు దివంగత ముఖ్యమంత్రి హాయంలో పనిచేసిన మంత్రుల్ని, వీరప్పమొయిలీ, సోనియాలను కూడా అవినీతికి పాల్పడ్డారని అంటారా అని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలతో జగన్‌ను అణుగదొక్కాలని టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు జగన్ ఫోబియా పట్టుకుందని ఆయన తెలిపారు.జనహితులెవరో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాతే పార్టీ పేరును ప్రకటిస్తామని మీడియాకు వెల్లడించారు. జగన్‌పై అసత్య ఆరోపణలు చేసిన సీఎం కిరణ్తో రాజీనామా చేయించి, ఆయన్నిముద్దాయిగా చేస్తూ రీ ఎంక్వైరీని చేపట్టాలన్నారు.అవినీతిపై చంద్రబాబు ఉద్యమం చేయటమేమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు క్రిమినల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో వంగవీటి రంగా హత్యను చేయించింది చంద్రబాబేనని అందరూ అనుకున్నారని పదవి కోసం సొంతమామనే మానసికంగా వేధించి చంపిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు.
వైఎస్ అవినీతి పరుడనే వారు దివంగత ముఖ్యమంత్రి హాయంలో పనిచేసిన మంత్రుల్ని, వీరప్పమొయిలీ, సోనియాలను కూడా అవినీతికి పాల్పడ్డారని అంటారా అని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలతో జగన్‌ను అణుగదొక్కాలని టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు జగన్ ఫోబియా పట్టుకుందని ఆయన తెలిపారు.జనహితులెవరో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాతే పార్టీ పేరును ప్రకటిస్తామని మీడియాకు వెల్లడించారు. జగన్‌పై అసత్య ఆరోపణలు చేసిన సీఎం కిరణ్తో రాజీనామా చేయించి, ఆయన్నిముద్దాయిగా చేస్తూ రీ ఎంక్వైరీని చేపట్టాలన్నారు.అవినీతిపై చంద్రబాబు ఉద్యమం చేయటమేమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు క్రిమినల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో వంగవీటి రంగా హత్యను చేయించింది చంద్రబాబేనని అందరూ అనుకున్నారని పదవి కోసం సొంతమామనే మానసికంగా వేధించి చంపిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు.
విద్యార్థినిపై కిరోసిన్‌పోసి నిప్పంటించిన ఉన్మాది
రాజమండ్రి: ప్రేమించలేదని ఓ ఉన్మాది విద్యార్థినిపై కిరోసిన్‌పోసి నిప్పంటించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో జరిగింది. వేట్లపాలెం గ్రామంలో ఎనిమిదోతరగతి చదువుతున్న విద్యార్థినిని అదేగ్రామానికి చెందిన వ్యక్తి గత కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. విద్యార్థిని పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన అతడు ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉండగా విద్యార్థినిపై కిరోసిన్‌పోసి నిప్పంటించి పరారయ్యాడు. తీవ్రంగాగాయపడిన బాలికను అమాలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
శ్రీకాళహస్తిలో పురాతన నాణేలు లభ్యం
తిరుపతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయం సమీపంలోని స్వర్ణముఖి నదిలో మూడున్నర కిలోల పురాతన నాణేలు లభ్యమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు నదిలో చేపలు పడుతుండగా ఓ సంచిలో ఈ పురాతన నాణాలు లభించాయి. వాటిని శ్రీకాళహస్తిలోని ఓ నగల దుకాణంలో అమ్మేందుకు వారు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన దుకాణ యజమాని రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రెవెన్యూ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఆనాణేలపై విక్టోరియా మహారాణి చిహ్నం ముద్రించి ఉండటంతో, 1891 కాలం నాటివిగా గుర్తించారు.
రిజర్వేషన్ వల్లే కేంద్రమంత్రినయ్యా: పనబాక
హైదరాబాద్: భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్లే తాను కేంద్ర మంత్రినయ్యానని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలో ఆంద్రాబ్యాంక్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా జనరల్ బాడీ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రాబ్యాంకు ఉద్యోగుల్లా ఎస్సీ, ఎస్టీ ఎంపీలంతా తమ సమస్యల సాధనకోసం ఓ ఫోరం ఏర్పాటు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు.
కళాశాలలు మూసివేస్తాం
ప్రభుత్వానికి యాజమాన్యాల హెచ్చరిక
హైదరాబాద్: ఫిబ్రవరి 15లోపు ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో కళాశాలలు మూసివేస్తామని ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కళాశాలల యాజామాన్యాలు హెచ్చరించాయి. విద్యార్థుల ఫీజులు అడిగితే ప్రభుత్వం గ్రేడులు, ర్యాంకింగ్‌ల పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించాయి.
హైదరాబాద్: ఫిబ్రవరి 15లోపు ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో కళాశాలలు మూసివేస్తామని ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కళాశాలల యాజామాన్యాలు హెచ్చరించాయి. విద్యార్థుల ఫీజులు అడిగితే ప్రభుత్వం గ్రేడులు, ర్యాంకింగ్‌ల పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించాయి.
విమర్శిస్తే బెదిరింపులా? వీహెచ్
హైదరాబాద్ : కొందరిపై విమర్శిస్తే బెదిరింపులు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్‌నేత వి.హనుమంతరావు అన్నారు. తనతో పాటు శంకర్‌రావు, డీఎల్ రవీంద్రారెడ్డి... తదితరులనుటార్గెట్ చేస్తూ కొందరు బెదిరింపు ఫోన్‌కాల్స్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులకు కూడా రక్షణలేకపోవడంపై ఆయన ప్రశ్నించారు. దీనిపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంగలి కృష్ణ వ్యవహారంలో సీబీఐ పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆయన కోరారు. తనపై వస్తున్న ఆరోపణలనుంచి ప్రజలను మళ్లించేందుకు జగన్ పోలవరం యాత్ర చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.
చేనేత రుణాలు మాపీచేస్తాం: సీఎం
అనంతపురం: అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు రుణాలు మాఫీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. త్వరలోనే హంద్రీనీవా ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేసి ఖరీఫ్ నాటికి నీరందిస్తామని సీఎం చెప్పారు.
29, జనవరి 2011, శనివారం
కామాక్షి ఆలయంలో విజయ్‌కాంత్
కాంచీపురం: డీఎండీకే వ్యవస్థాపకుడు, నటుడు విజయ్‌కాంత్ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు విజయ్‌కాంత్‌ను, ఆయన సతీమణి ప్రేమలత, కుమారులను ఆలయంలోనికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అర్చకులు ఆయనకు ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన విజయ్‌కాంత్‌ను విలేకర్లు చుట్టుముట్టి డీఎండీకే కూటమి గురించి ప్రశ్నించగా 'నో కామెంట్స్' అని చెప్పి వెళ్లిపోయారు.
28, జనవరి 2011, శుక్రవారం
50 % లేదంటే అగ్నిగుండం
హైదరాబాద్: వాటాలు... కోటాలు కాదు... ఢిల్లీ కోటలో బీసీలు పాగావేయాలి...అనిరాష్ర్టం నలు మూలల నుంచి వచ్చిన బీసీలు గళం విప్పారు. అరకొర రిజర్వేషన్లతో తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే సహించేది లేదని వారు గర్జించారు. యాభైశాతం రిజర్వేషన్లకు మాత్రమే తాము సమ్మతమని అందులో ఏ కొంచెం తగ్గినా ఊరుకోమని, పర్యవసానాలు తీవ్రంగా ఉంటూయని వారు బీసీ కమిషన్ ఎదుట బహిరంగ విచారణలో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను జాప్యం చేయకుండా కార్యరూపం దాల్చేందుకు చర్యలు చేపట్టాలని బీసీ నేతలు పట్టు బడ్డారు. 50 శాతం బీసీ రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ రంగాలలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. 50శాతం రిజర్వేషన్ల అమలులో తాత్సారం చేసేందుకు వంకలుచెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు. అగ్రవర్ణాలకు కొమ్ముకాసే ప్రయత్నం చేస్తూ 50 శాతానికి ఏ ఒక్క పర్సెంటేజీ తగ్గించినా రాష్ర్టం అగ్నిగుండం అవుతుందని హెచ్చరిం చారు.తర్వాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బహిరంగ ప్రకటన చేశారు. ఉద్యమరూపం కూడా ఆషామాషీగా ఉండదనీ, కొత్తపోక డలతో వినూత్న చర్యలు చేపడతామన్నారు. టునీషియా, ఈజిప్టు తరహాలో ఉద్యమిస్తామని నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో వెల్లువెత్తే రాష్ర్టవ్యాప్త ఉద్యమాలు అగ్నిశిఖలతో లావాలా ఉవ్వెత్తున ఎగుస్తాయనీ హెచ్చరించారు. 50 శాతం బీసీ రిజర్వే షన్లను అడ్డుకునేవారు ఆ లావాలో మాడి మసైపోవాల్సి వస్తుంది కనుక అటువంటి చర్యలు చేపట్టవద్దని ముందుగా హితవుపలికారు. ఉద్యమాన్ని కాలరాచే ప్రయత్నం చేస్తే బీసీలు ఏకమై ఉక్కుపాదంతో అణిచి వేస్తాం అని చెప్పారు. శుక్రవారం ఉదయం జగ్జీవన్‌రామ్ భవన్‌లో బీసీ రిజర్వేషన్ల ప్రస్తుత శాతాన్ని పెంచడానికి చేపట్టిన ప్రక్రి యలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బిసి కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభించింది. బీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ దాల్వా సుబ్రహ్మణ్యంతోపాటు మిషన్ సభ్యులు చల్లకోన రఘురాం ప్రసాద్, సిహెచ్ పాండురంగ పాల్గొన్నారు. బహిరంగ విచారణను ప్రారంభిస్తూ జస్టిస్ సుబ్రహ్మణ్యం మాట్లాడారు.గతంలో జరిగిన మల్టీసర్పస్ హౌస్‌హోల్డ్ సర్వే ప్రకారం బీసీ జనాభాను తీసుకున్నామనీ, అయితే విద్యా, ఉద్యోగరంగాలలో బీసీలు ఎందరున్నారో పరిశీలించాల్సి ఉందన్నారు. ఆ సర్వే పూర్తిచేసి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తామని చెప్పారు. బహిరంగ విచారణకు రాష్ర్టం నలుమూల నుంచి బీసీ నేతలు తరలివచ్చారు. విద్యా, ఉద్యోగ రంగాలలోని బీసీ గణన నిమిత్తం సర్వేకు బీసీ కమిషన్ ప్రభుత్వాన్ని 50కోట్ల రూపాయలు కావాలని నివేదిక పంపితే బట్టదాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నివేదికను చెత్తబుట్టలోవేసి ఈ ప్రక్రియకు గండికొట్టిన ప్రభుత్వం సంగతి తేల్చాలని నినదించారు. వచ్చే నెల 12వ తేదీ వరకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో ఇదే అంశంపై రచ్చ రచ్చ చేయాలని పిలుపునిచ్చారు. కాపులను బీసీ రిజర్వేషన్ల జాబితాలో చేర్చడానికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని దినపత్రికలలో వస్తున్న వార్తలు తమని కలచి వేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ జాబితాలో కాపులను చేర్చితే సహించేది లేదని హెచ్చరించారు.అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన వారిని ఏ విధంగా వెనుకబడిన తరగతుల్లో చేరుస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో ఇతర కులాలను ఏ విధంగా చేరుస్తారని నిలాదీశారు. ఇది పెంపు ప్రక్రియ తప్ప, కొత్త కులాలను చేర్చే ప్రక్రియ కాదన్నారు. గతంలో కాపులను బీసీల్లో చేర్చితే ఎపీపీఎస్సీలో 95శాతం ఉద్యోగాలు కాపులే ఎగరేసుకుపోయారని గుర్తు చేశారు. మండల్ మిషన్ సందర్భంగా రాష్ర్టంలో జరిగిన ఘటనలను బీసీ నాయకులు గుర్తు చేశారు. బీసీలలో చైతన్యంలేని ఆరోజుల్లోనే ఉస్మానియా, ఆంధ్ర విశ్వ విద్యాలయాల నుండి అగ్రకులాలు పారిపోయి రెడ్డి, కమ్మ హాస్టళ్లలో దాక్కున్నా రనీ, 50 శాతం రిజర్వేషన్లను అడ్డుకుని అటువంటి పరిస్థితిని ఇప్పుడు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ నిర్భయంగా బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని కోరారు. బీసీ కమిషన్ చర్యలను వ్యతిరేకిస్తే రాష్ట్రాన్ని స్తంభింపచేస్తామని నిప్పులు చెరిగారు.ఇదే స్పూర్తితో బీసీ బిల్లుపై కూడా బీసీలు ఉద్యమించాలన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పెద్ద సంఖ్యలో కులాలను చేర్చడం వలన బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ర్ట బీసీ కమిషన్‌కు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని కోరారు. ఉత్తర ప్రదేశ్‌తో సహా మరికొన్ని రాష్ట్రాలలోని బీసీ కమిషన్‌కు ఉన్న అధికారాలను మన బీసీ కమిషన్‌కు కల్పించాలని కోరారు. బోగస్ బీసీల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అటువంటి బోగస్ బీసీలను ఏరివేసి నిజమైన బీసీలకు న్యాయం చేయాలని కోరారు. బహిరంగ విచారణలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరు రామకృష్ణయ్య, బీసీ మహాజన్ సమితి చైర్మన్ ఉ.సా (ఉ.సాంబశివరావు), జాతీయ వెనుకబడిన తరగతుల సంఘం అధ్యక్షుడు కె. జయప్రసాద్, బీసీ నేత వై.కోటేశ్వరరావు, కొండలరావులతో పాటు పలువురు మాట్లాడారు.
శీవారి ప్రసాదాల ధరల పెంపు
తిరుపతి: తిరుమల శ్రీవారికి నైవేద్యంగా ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సమర్పించే ప్రత్యేక ప్రసాదాల (లడ్డూ తప్ప) ధరలు పెరిగాయి. ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి వీటిని ఉచితంగానే ఇస్తారు. అవి కాకుండా అదనంగా ప్రముఖులు, ఇతరులకు విక్రయించే ప్రసాదాలకు మాత్రమే ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వల్ల శ్రీవారి ప్రత్యేక ప్రసాదాల ధరలు పెంచుతూ ఇటీవల టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయించింది. పెరిగిన ధరలను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చినట్టు టీటీడీ జేఈవో కె.భాస్కర్ మీడియాకు వెల్లడించారు. సాధారణ భక్తుల ప్రాసాదాల ధరల్లో ఎటువంటి మార్పులేదు.
నాగోల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి
హైదరాబాద్ : నాగోల్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.మృతి చెందిన వారు ఎక్కువగా కూలీలుగా గుర్తించారు. 20 మందికి గాయాలయ్యాయి. మరో 10 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక లారీ అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పి లారీ 1 ఆటోను, 8 బైక్‌లను ఢీకొంది. ఆటో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ పాదాచరులను కూడా ఢీకొట్టింది. వారిని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించారు. వాహనాలకు ఢీకొన్న లారీ నెంబరు ఏపి 22 డబ్ల్యూ 0441, లారీ ఓనర్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సి.తిరపతయ్య. ఆటో నెంబరు ఏపీ 11 ఎస్ 4504. పల్సర్ నెంబరు ఏపీ 29 హెచ్ 3651.
గుడిసెకు నిప్పంటుకొని ఇద్దరు చిన్నారుల మృతి
కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ గుడిసెకు నిప్పంటుకొని ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. జిల్లాలోని కొయ్యలగూడెం మండలం సీతంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హద్దులులేని అభిమానం
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఓ అరుదైన గౌరవం దక్కింది. భారత లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ గ్వాలియర్‌లో సాధించిన అజేయ డబుల్ సెంచరీని మధ్యప్రదేశ్ మరిచిపోకుండా, వన్డే క్రికెట్‌లో సచిన్ సాధించిన ఈ అరుదైన ఘనతకు గుర్తుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గ్వాలియర్‌లోని ఓ రోడ్డుకు సచిన్ పేరు పెట్టింది.గతేడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో గ్వాలియర్ వేదికగా జరిగిన వేన్డేలో సచిన్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్వాలియర్ హైకోర్టు నుంచి హురాల్వి గ్రామం వరకు రూ. 2.89 కోట్లతో నిర్మించిన 3.55 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల రోడ్డుకు సచిన్ పేరు పెట్టారు.
వక్షోజ ఆకృతులను పెంచుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు
వక్షోజ సౌందర్యంపై చాలామంది యువతులు మథనపడుతుంటారు. ముఖం, పెదవులు, మెరిసిపోయే మేనిఛాయ అన్నీ అమరినా తగిన వక్షోజ సంపద లేకపోవడంపై బాధపడుతుంటారు. ఎద సంపదను పెంచుకునేందుకు రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు.కొంతమంది ఏవేవో క్రీములు రాస్తూ ఉన్న సౌందర్యాన్ని పాడుచేసుకుంటారు. మరికొందరైతే సిలికాన్ ఇంప్లాంట్స్ అంటూ కృత్రిమ అందాలను అరువు తెచ్చుకునేందుకు సిద్ధమైపోతారు. కానీ సహజసిద్ధంగానే ఎద ఆకృతులను పెంచుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం...
వ్యాయామం: వ్యాయామం ద్వారా వక్షోజాల ఆకృతులు పెరగవు. కానీ పాలిండ్ల లోపల ఉన్న టిష్యూలను బలపరిచి స్టిఫ్‌గా ఉండేందుకు వ్యాయామం ఎంతో సహకరిస్తుంది. దీనివల్ల ఉన్న వక్షోజ సంపద కాస్తంత బిగుతుగా కనిపించడమే కాక ఆకృతిలోనూ తేడా కనబడుతుంది. పుషప్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఈ మార్పును తీసుకురావచ్చు. కాకపోతే దీనికోసం రెండు మూడు నెలలు బాగా శ్రమించాల్సి ఉంటుంది.హెర్బల్ ప్రొడక్ట్స్: ఇవి కూడా వక్షోజ సంపదను వృద్ధి చేసేందుకు ఎంతగానో దోహదపడతాయి. ఇవి సహజసిద్ధమైనవే కాక సురక్షితమైనవి కూడా. ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయవు. వక్షోజ ఆకృతులను పెంచుకునేందుకు రకరకాల మాత్రలు, క్రీములు వాడేకంటే ఈ హెర్బల్ ఉత్పత్తులను వాడటం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇటువంటి ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి. కాకపోతే వీటిని వైద్యుల సిఫార్సు మేరకు మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి వృద్ధి చెంది పాలిండ్ల ఆకృతులను పెంచేందుకు సహాయపడతాయి.ఆహారం: వక్షోజ సంపదను పెంచగల ఆహార పదార్థాలేమిటో తెలుసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది. కెఫైన్ సంబంధిత పదార్థాలను తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. ముఖ్యంగా ఎద సౌందర్యాన్ని పెంచుకునేందుకు హెర్బల్ ఉత్పత్తులు ఉపయోగించేవారిలో ఇది వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రోడ్ల స్థానే ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటే వక్షోజ సంపద ద్విగుణీకృతమవుతుంది..
వ్యాయామం: వ్యాయామం ద్వారా వక్షోజాల ఆకృతులు పెరగవు. కానీ పాలిండ్ల లోపల ఉన్న టిష్యూలను బలపరిచి స్టిఫ్‌గా ఉండేందుకు వ్యాయామం ఎంతో సహకరిస్తుంది. దీనివల్ల ఉన్న వక్షోజ సంపద కాస్తంత బిగుతుగా కనిపించడమే కాక ఆకృతిలోనూ తేడా కనబడుతుంది. పుషప్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా ఈ మార్పును తీసుకురావచ్చు. కాకపోతే దీనికోసం రెండు మూడు నెలలు బాగా శ్రమించాల్సి ఉంటుంది.హెర్బల్ ప్రొడక్ట్స్: ఇవి కూడా వక్షోజ సంపదను వృద్ధి చేసేందుకు ఎంతగానో దోహదపడతాయి. ఇవి సహజసిద్ధమైనవే కాక సురక్షితమైనవి కూడా. ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయవు. వక్షోజ ఆకృతులను పెంచుకునేందుకు రకరకాల మాత్రలు, క్రీములు వాడేకంటే ఈ హెర్బల్ ఉత్పత్తులను వాడటం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇటువంటి ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి. కాకపోతే వీటిని వైద్యుల సిఫార్సు మేరకు మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి వృద్ధి చెంది పాలిండ్ల ఆకృతులను పెంచేందుకు సహాయపడతాయి.ఆహారం: వక్షోజ సంపదను పెంచగల ఆహార పదార్థాలేమిటో తెలుసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది. కెఫైన్ సంబంధిత పదార్థాలను తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. ముఖ్యంగా ఎద సౌందర్యాన్ని పెంచుకునేందుకు హెర్బల్ ఉత్పత్తులు ఉపయోగించేవారిలో ఇది వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రోడ్ల స్థానే ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటే వక్షోజ సంపద ద్విగుణీకృతమవుతుంది..
'ఐరన్ లెగ్' రోజా నన్ను విమర్శించడమా?: శంకర్రావు ధ్వజం
రాష్ట్ర రాజకీయ రంగంలో ఐరన్ లెగ్ అనే పేరున్న నటి రోజా తనను విమర్శిస్తున్నారని చేనేత మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శంకర్రావు ఎద్దేవా చేశారు. తనపై విమర్శలు చేసిన వైయస్ జగన్ వర్గానికి చెందిన సినీనటి, రాజకీయ నాయకురాలు రోజాపై మంత్రి విరుచుకుపడ్డారు.వై.ఎస్. జగన్ ఆస్తులపై రోజా చేసిన వ్యాఖ్యలు కోర్టును ధిక్కరించినట్లవుతుందని శంకర్రావు అన్నారు. శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసిన అనంతరం శంకర్రావు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. తెలంగాణకు 15 నెలల పాటు రాజ్యాంగ రక్షణలు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తుందని, ఆ తర్వాత తెలంగాణ కేంద్రం ప్రకటిస్తుందని శంకర్రావు సంచలన ప్రకటన చేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమన్నారు. కాగా.. వై.ఎస్. జగన్మోహన రెడ్డి అక్రమ ఆస్తులపై కేసులు ఉపసంహరించుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నాయని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని శంకర్రావు స్పష్టం చేశారు
వైఎస్ లాంటి అక్రమార్కుడిని చూడలేదు : కాకా
తిరుమల : తన 53 ఏళ్ల రాజకీయ చరిత్రలో వైఎస్‌ఆర్ లాంటి అక్రమార్కుడిని ఇంతవరకు చూడలేదని కాంగ్రెస్ సీనియన్ నేత జి.వెంకటస్వామి(కాకా) అన్నారు. వైఎస్ కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. జగన్ వైపు వెళ్లే ఎమ్మెల్యే సంఖ్య క్రమంగా తగ్గుతోందని, నిజం తెలుసుకుని నిన్నటివరకు ఉన్న అభిప్రాయాన్ని కొంత మంది మార్చుకున్నారని కాకా అన్నారు.
మధ్యంతర ఎన్నికలు రాకుండా మద్దతిస్తాం: చిరంజీవి
అనంతపురం : పీఆర్పీ అధినేత చిరంజీవి మధ్యంతర ఎన్నికలు రాకుండా ప్రభుత్వానికి మద్దతిస్తామని అన్నారు. ప్రజలపై భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిరంజీవి తెలిపారు. నన్ను రాజకీయాలనుంచి దూరం చేసేందుకు మీడియాలో కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్పీలో నేతలకు, కార్యకర్తలకు మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని చిరంజీవి అన్నారు.
సీఎం రచ్చబండపై రాళ్లదాడి, ఉద్రిక్తత
కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకున్న తెలంగాణవాదుల్ని పోలీసులు ఆపడంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. సభ వెలుపల నుంచి తెలంగాణవాదులు రాళ్లతో దాడి చేశారు. ఈదాడిలో దేవరకొండ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జీతోపాటు, భాష్పవాయువును ప్రయోగించారు. కొండమల్లేపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా వున్నట్టు తెలుస్తోంది.
27, జనవరి 2011, గురువారం
దొంగ చేతికే తాళం
దోపిడీదార్లను ప్రభుత్వమే తలుపులు తెరిచి సాగనంపితే .ఇక ప్రజాధనాన్ని కాపాడేదెవరు? రూ.వేల కోట్ల ఖనిజ సంపదను .పర్యవేక్షించే పకడ్బందీ వ్యవస్థకు సర్కారే తూట్లు పొడిస్తే ఇక వనరులకు రక్షణ ఎవరు?
అనంతపురంలో చిరంజీవి ర్యాలీ
అనంతపురం: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ పీఆర్పీ అధినేత చిరంజీవి అనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రి బస్టాండ్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లారు. అక్కడ ధర్నాలో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు జనం దారిపొడవునా ఎగబడ్డారు.
రేపు ఆధార్ కార్డుల పంపిణీ ప్రారంభం : శ్రీధర్‌బాబు
హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో ఆధార్‌కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సీఎం చేతుల మీదుగా కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని, రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి చెప్పారు. స్మార్ట్‌కార్ట్ వల్ల నిజమైన లబ్దిదారులకు లాభం చేకూరుతుందని శ్రీధర్‌బాబు అన్నారు.
ఆర్‌టీసీ బస్సు బోల్తా : 5గురు మృతి
చిత్తూరు : శ్రీనివాసమంగాపురంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 5 గురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు అద్దాలను పగులగొట్టి క్షతగాత్రులను బయటికు తీసి ఆసుపత్రికి తరలించారు. బస్సు మదనపల్లి నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది
రూ.5 కోట్లకు టోపీ పెట్టిన స్టీల్ కంపెనీ
హైదరాబాద్: నగర శివారులోని ఎల్‌బీ నగర్ సాగర్ కూడలిలో ।స్టీల్ ల్యాండ్* షాలిని స్టీల్స్ అనే సంస్థ వినియోగదారుల నెత్తిన టోపి పెట్టింది. ఇనుము, సిమెంట్ సర ఫరా చేస్తామని నమ్మబలిన షాలిని స్టీల్స్ యజమాని బిచాణా ఎత్తేశాడు. వినియోగదారుల నుంచి సేకరించిన రూ.5 కోట్లతో ఉడాయించాడు.
బస్సు బోల్తా; ఐదుగురు మృతి
చిత్తూరు: శ్రీమంగాపురం సమీపంలోని రైల్వే గేటు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. బస్సు మదనపల్లి నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో చిక్కుకున్న వారిని స్థానికులు రక్షించారు. గాయపడిని వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
26, జనవరి 2011, బుధవారం
నేడు అనంతలో చిరు ధర్నా
హైదరాబాద్: ధరల పెరుగుదలకు నిరసనగా గురువారం అనంతపురంలో ప్రరాపా నిర్వహించనున్న ధర్నాలో ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పాల్గొననున్నారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ, తూర్పు కాపు, మున్నూరు కాపు, గాజుల బలిజ తదితర కులాల వారికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చూడాలని చిరంజీవికి రాష్ట్ర కాపునాడు నాయకులు బుధవారం ఒక వినతి పత్రం అందించారు.
ప్రగతి పథంలో జీవీఎంసీ
విశాఖపట్నం(విశాల విశాఖ):మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని కమిషనర్ వి.ఎన్.విష్ణు పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి కమిషనర్ విష్ణు, మేయర్ పులుసు జనార్దనరావు, ఉపమేయర్ దొరబాబు పూలమాల నివాళులు అర్పించారు. జాతీయపతకాన్ని ఆవిష్కరించి పావురాలను ఎగురవేశారు. జీవీఎంసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ విష్ణు మాట్లాడుతూ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద రూ.1886 కోట్లతో 20 ప్రాజెక్టుల పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషన్ కృష్ణమూర్తి, ప్రధాన ఇంజినీరు జయరామిరెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరిలో సింహాద్రి మూడో యూనిట్
గణతంత్ర వేడుకల్లో ఇన్‌ఛార్జి జీఎం డి.కె.సూద్
పరవాడ(విశాల విశాఖ): సింహాద్రి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీపీసీ) స్టేజ్ 2 మూడో యూనిట్‌ను ఫిబ్రవరి నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని సంస్థ ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ డి.కె.సూద్ అన్నారు. బుధవారం ఎన్టీపీసీ దీపాంజలినగర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1975లో స్థాపించిన ఎన్టీపీసీ సంస్థ ప్రస్తుతం మహారత్న కంపెనీగా ఎదిగి 33,194 మెగావాట్ల విద్యుదుత్పత్తిని తయారుచేస్తుందన్నారు. 2017 సంవత్సరానికి 75వేల మెగావాట్ల ఉత్పత్తిని సాధించే దిశగా పయనిస్తుందన్నారు. దేశంలో ఉన్న ఎన్టీపీసీ విద్యుత్ సంస్థలన్నింటిలోను ఉత్పతిలో గతయేడాది డిసెంబర్ నాటికి సింహాద్రి ఎన్టీపీసీ ప్రథమస్థానంలో ఉందన్నారు. ఎన్టీపీసీ రెండోదశ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మూడో యూనిట్‌ను ఫిబ్రవరి నెలాఖరుకల్లా ప్రారంభిస్తామన్నారు. అనంతరం గత ఏడాది ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
పరవాడ(విశాల విశాఖ): సింహాద్రి సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీపీసీ) స్టేజ్ 2 మూడో యూనిట్‌ను ఫిబ్రవరి నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని సంస్థ ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ డి.కె.సూద్ అన్నారు. బుధవారం ఎన్టీపీసీ దీపాంజలినగర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1975లో స్థాపించిన ఎన్టీపీసీ సంస్థ ప్రస్తుతం మహారత్న కంపెనీగా ఎదిగి 33,194 మెగావాట్ల విద్యుదుత్పత్తిని తయారుచేస్తుందన్నారు. 2017 సంవత్సరానికి 75వేల మెగావాట్ల ఉత్పత్తిని సాధించే దిశగా పయనిస్తుందన్నారు. దేశంలో ఉన్న ఎన్టీపీసీ విద్యుత్ సంస్థలన్నింటిలోను ఉత్పతిలో గతయేడాది డిసెంబర్ నాటికి సింహాద్రి ఎన్టీపీసీ ప్రథమస్థానంలో ఉందన్నారు. ఎన్టీపీసీ రెండోదశ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మూడో యూనిట్‌ను ఫిబ్రవరి నెలాఖరుకల్లా ప్రారంభిస్తామన్నారు. అనంతరం గత ఏడాది ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
సబ్బంపై జగన్ సీరియస్
కాంగ్రెస్ జగన్ మధ్య సయోధ్య ప్రయత్నాలు జరుగు తుంటే ఆ విషయం తెలిసిన మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సయోధ్య వాతావరణాన్ని చెడగొడుతున్నారని జగన్ వర్గీ యుడిగా ముద్ర పడిన అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలపై జగన్ వర్గం మండిపడుతోంది. సబ్బం హరి తన అపరిపక్వత రాజకీయ చర్యతో చివరకు జగన్ పరువు తీశారంటున్నారు. స్వయంగా జగన్ కూడా సబ్బం చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను మంటకలిపేలా ఉన్నాయని తన సహచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్‌ను భ్రష్ఠు పట్టించాలన్న కసితో సొంత పార్టీ పెట్టేందుకు పరుగులు పెడుతున్న జగన్‌ను నైతికంగా దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరిపై జగన్ వర్గీయులు విరుచుకుపడుతున్నారు. మాట మార్చడం, మడమ తిప్పడం తన తండ్రి తనకు నేర్పలేదని ఒకవైపు జగన్ ఖండితంగా చెబుతున్నారు. ఆయన అను చరుడిగా ముద్రపడిన సబ్బం మాత్రం కాంగ్రెస్ - జగన్ మధ్య సయోధ్య ప్రయత్నాలు ప్రారంభమవుతే, సీఎం కిరణ్ దానిని చెడగొడుతున్నారంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు జగన్ పరువును మంటగలిపేలా ఉన్నాయని జగన్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సబ్బంవ్యాఖ్యల వల్ల.. జగన్ పైకి కాంగ్రెస్‌తో పోరాడుతూనే, దొడ్డిదారిలో తిరిగి అదే పార్టీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారన్న భావన కల్పించారని జగన్ వ ర్గీయులు మండిపడుతున్నారు. దీనివల్ల ఇప్పటివరకూ ప్రజల్లో జగన్‌పై ఉన్న హీరోవర్షిప్ పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఒకరకమైన వ్యతిరేకభావన కల్పించారంటున్నారు. మడమ తిప్పని వీరుడిగా, సోనియాగాంధీనే ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన ధీరుడిగా సంపాదించుకున్న ఇమేజ్ అంతా సబ్బం హరి వ్యాఖ్యలతో కొట్టుకుపోయి, చివరకు జగన్ కూడా పదవులు-ఉనికి చాటుకునేందుకేందుకు ప్రయత్నించే ఒక సాధారణ రాజకీయ నాయకుడి మాదిరిగానే ముద్రపడటాన్ని ఆయన అనుచరులు సహించలేకపోతున్నారు. అసలు జగన్-కాంగ్రెస్ మధ్య సయోధ్య జరుగుతోందని సబ్బం హరికి ఎవరు చెప్పారని జగన్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.చివరకు.. జగన్ కూడా సబ్బం చేసిన వ్యాఖ్యలపై తన అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌ను అంతం చేసేందుకు తాను అన్నింటికీ తెగించి పార్టీ స్థాపించే యత్నాల్లో ఉంటే, తన మద్దతుదారుడయిన సబ్బం హరి మాత్రం అందుకు విరుద్ధంగా తనకు కాంగ్రెస్‌కు మధ్య సయోధ్య ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం వల్ల తన ఇమేజ్ దెబ్బతిందని జగన్ కూడా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. హరి వ్యవహారశైలి ఇప్పటివరకూ తాను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్ఠను మంటగలిపాయని మండిపడినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్‌కు భయపడుతున్నందువల్లే తాను ఆ పార్టీ నాయకత్వంతో సయోధ్య కుదుర్చునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, భావన క్షేత్రస్థాయిలో విస్తృతమవుతే ఇక తాను పార్టీ పెట్టినా ఫలితం ఉండదని జగన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనివల్ల ప్రజలు తనను వీరుడిగా కాకుండా పిరికివాడుగా భావించే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఆయనలో లేకపోలేదు. ఈ కారణాల వల్లే సబ్బం తీరుపై జగన్ కలత చెందుతున్నారు.జగన్ అనుచ రులయితే సబ్బం తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రణబ్-ఆంటోనీ వంటి సీనియర్లతో చర్చలు జరిపేంత స్థాయి సబ్బం హరికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మీడియాను ఆకర్షించి, కాంగ్రెస్‌లో తన ప్రాధాన్యం పెంచుకునే ఎత్తుగడ తప్ప సబ్బం హరికి ఢిల్లీలో అంత సీన్ లేదంటున్నారు. అసలు సబ్బం.. జగన్ పెట్టే పార్టీలో చేరతారా లేదా అన్నది కూడా సందేహమేనంటున్నారు. జగన్ విశాఖ ఓదార్పు యాత్రకు ముందు జగన్ పార్టీ పెట్టిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు జగన్ పార్టీ పెట్టిన తర్వాత, ఆ విధానాలు తనకు నచ్చితేనే పార్టీలో చేరతానని మాట మార్చడాన్ని జగన్ వర్గీయులు గుర్తు చేస్తున్నారు.చివరకు అసలు సబ్బం హరి జగన్ పార్టీలో చేరకుండా కాంగ్రెస్‌లోనే ఉండిపోయినా ఆశ్చర్యపడవలసిన పనిలేదని విశాఖ జిల్లా నేతలు జోస్యం చెబుతున్నారు. కాగా, జగన్‌కాంగ్రెస్ మధ్య సయోధ్య యత్నాలపై వ్యాఖ్యానించిన సబ్బం హరిపై మంత్రి బాలరాజు విశాఖ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, తైనాల విజయకుమార్, విజయప్రసాద్ విరుచుకుపడ్డారు. సబ్బం హరి స్థాయి ఏమిటని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే స్థాయి హరికి లేదన్నారు. వారి వద్దకు వెళ్లడానికి ఈయన స్థాయేమిటి? జాతీయ స్థాయి నేతగా ఊహించుకుని, ప్రచారం చేసుకుంటున్నాడు.ఒక వేళ వెళ్లినా వారి గుమ్మం కూడా ఎక్కే పరిస్థితి కూడా ఉండదు. నీతి నియమాలు వదిలి అవకాశ రాజకీయాలు చేస్తున్నాడు. రాజీనామా చేసి ఏ ఇతర పార్టీ నుంచయినా పోటీ చేసి గెలవాల’ని సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ సోనియా, కిరణ్, కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే విజయకుమార్ మరో అడుగు ముందుకేసి ‘సబ్బం హరి కాంగ్రెస్‌లో కాకుండా మరే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ గుర్తు లేకుండా పోటీ చేసి గెలిస్తే గుండు చేసుకుని ఏడాదిపాటు తిరుగుతానని సవాల్ చేశారు.
బీహెచ్‌పీవీ ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
అక్కిరెడ్డిపాలెం(విశాల విశాఖ): బీహెచ్‌పీవీ కూడలిలోని ప్రసన్నగిరిపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో వెండి మకరతోరణం, కిరీటంతో పాటు స్వామివారి ఉత్సవ విగ్రహం అపహరణకు గురయినట్లు ఆలయ సిబ్బంది గాజువాక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదుచేశారు. ఆలయ ఇ.ఒ భానురాజ తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం రాత్రి పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం అర్చకులు గర్భగుడికి, ఆలయంకు తాళం వేసుకొని వెళ్లిపోయారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల్లో ఒకరు వెంకన్న ఆలయం వద్ద, మరొకరు కొండ దిగువనుంచి పైవరకు తిరుగుతూ ఉంటారు. బుధవారం తెల్లవారుజాము నాలుగు గంటల సమయాన అటుగా వెళ్తున్న గార్డులు ఆలయ తాళాలు పగిలి ఉండడం చూసి గుమస్తా సూర్యనారాయణకు సమాచారం అందించారు. చోరీ జరిగిన విషయం నిర్థారించి ఆయన వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఒక కిలో వెండితో చేసిన మకర తోరణం, ఏడు కిలోల ఇత్తడితో చేసిన కిరీటం, ఉత్సవ విగ్రహం పోయినట్లు ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉండొచ్చు. విషయం తెల్సుకున్న సి.ఐ.దేవప్రసాద్, ఎస్.ఐ బి.ఎం.డి.ప్రసాద్‌తో పాటు క్లూస్‌టీం సి.ఐ.రామచంద్రరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. గతంలో రెండుసార్లు కొండపై వివిధ ఆలయాల్లో చోరీలు జరగడంతో ముందుజాగ్రత్తలు తీసుకున్నామని, దీంతో భారీ నష్టం తప్పిందని ఇ.ఒ. భానురాజ చెప్పుకొచ్చారు. గిరి చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో తరుచూ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు.
అంగన్‌వాడీలో గుడ్లు బంద్
హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగటంతో సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా విలవిల్లాడుతోంది. దారిద్య్రరేఖ దిగువనున్న నిరుపేద చిన్నారులను పౌష్టికాహార లోపం నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు కొద్దిరోజులుగా గడ్లు సరఫరాను నిలిపివేశారు. గుడ్ల ధర పెరగడమే అందుకు కారణమని తెలిసింది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని గర్భిణీలకు, 18ఏళ్ల వయస్సులోపు ఎదుగుదల లేని స్ర్తీలకుపౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ్రపభుత్వం ఏటా వందల కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 229 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 91,307 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గతంలో పౌష్టికాహారంగా కిచిడీతోపాటు స్వీటును సరఫరా చేసేవారు.అయితే గుడ్డులో అధికంగా పోషక విలువలు ఉన్నాయని, పౌష్టికాహారంతో పాటు వారానికి రెండు సార్లు గుడ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలకు గుడ్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నది. ప్రాజెక్టు వారీగా గుడ్లు సరఫరా చేసేందుకు కొంతమందికి బాధ్యతలు అప్పగించింది. ఐదేళ్ల లోపు చిన్నారులతో పాటు గర్భిణీలకు వారానికి రెండు సార్లు ‘ఉడకబెట్టిన’ గుడ్డును సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ప్రారంభించి రెండు నెలలు గడవకముందే గుడ్ల ధర ఆకాశానికి చేరడంతో వాటి సరఫరాను నిలిపివేశారు. ఈ విషయం తెలియని నిరుపేదలు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి గుడ్డు ఇవ్వాలని వర్కర్లతో నిత్యం కొట్లాటకు దిగుతున్నారు.
సింగపూర్‌లో గాజువాక యువకుడి అనుమానాస్పద మృతి
గాజువాక (విశాల విశాఖ): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు మంగళవారం అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ విషయం ఇక్కడున్న కుటుంబ సభ్యులకు బుధవారం తెలిసింది. 59వ వార్డు రెడ్డి తుంగ్లాం గ్రామానికి చెందిన కొత్తారి వీర్రాజు (31) టెన్త్ వరకూ చదువుకున్నాడు. పైచదువులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానికంగా వెల్దింగ్‌లో శిక్షణ తీసుకొని. ఉపాధి కోసం 2001లో సింగపూర్ వెళ్లాడు.2006లో స్వగ్రామానికి తిరిగి వచ్చిన అతడికి ఇక్కడ ఉపాధి లభించకపోవడంతో మూడు నెలల తరువాత తిరిగి సింగపూర్‌కు వెళ్లిపోయాడు. వచ్చే నెలలో సమీప బంధువుల ఇంట్లో జరగనున్న వివాహానికి రావాల్సి ఉంది. మృతుడి సోదరుడు వికలాంగుడు కావడంతో కుటుంబమంతా వీర్రాజుపైనే ఆధారపడి ఉంది. కొడుకు చనిపోయాడన్న వార్త తెలియడంతో తమకు దిక్కెవరంటూ అతడి తల్లి, సోదరి రోదిస్తున్నారు. వీర్రాజు ఆత్మహత్య చేసుకున్నాడని అక్కడ్నుంచి సమాచారం అందింది. వీర్రాజు ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రాజమండ్రిలో నలుగురి దొంగల అరెస్ట్
రాజమండ్రి : రాజమండ్రిలో నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు.
25, జనవరి 2011, మంగళవారం
పోలీస్ సిబ్బంది ఎంపిక రివార్డులకు 73 మంది
విశాఖపట్నం: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 73 మంది పోలీస్ సిబ్బందికి గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ శ్యామలరావు రివార్డులందజేయనున్నట్టు కమిషనరేట్ వర్గాలు మంగళవారం తెలిపాయి. నగర ట్రాఫిక్ ఏసీపీ సురేష్‌బాబు, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలు, ఒక ఆర్‌ఎస్‌ఐ, ముగ్గురు హోంగార్డులు, మరికొంతమంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, అడ్మినిస్ట్రేటివ్ విభాగం సిబ్బందితో పాటు జిల్లాకు చెందిన 30 మంది సిబ్బంది కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రాలు అందుకుంటారని అధికారులు తెలిపారు. గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పోలీస్ బ్యారెక్స్ అందంగా ముస్తాబయింది. బుధవారం ఉదయం 9గంటలకు కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావుల ఆధ్వర్యంలో పతాకావిష్కరణ, అనంతరం ప్రసంగం ఉంటుందని సిబ్బంది తెలిపారు. ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బంది పరేడ్ నిర్వహిస్తారు. జవాన్ల క వాతు సమర్థంగా నిర్వహించేందుకు మంగళవారం రిహార్సల్స్ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఏఆర్ సిబ్బంది తెలిపారు.
305మంది జీవితఖైదీలకు స్వేచ్ఛావాయువులు
హైదరాబాద్: ఏళ్ల తరబడి జైళ్లో మగ్గుతున్న జీవితఖైదీలు స్వేచ్ఛా జీవులు కానున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 305 మంది అర్హులైన జీవితఖైదీలు బుధ, గురువారాల్లో విడుదల కానునానరు. సత్ప్రవర్తన కలిగిన 305 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్రప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల అవుతున్నవారిలో 11 మంది మహిళాఖైదీలు ఉన్నారు.
గాంధీభవన్‌లో జెండా ఎగురవేసిన డీఎస్
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ బుధవారం గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, మత సామరస్యాన్ని కాంగ్రెస్ పాడుతుందన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని డీఎస్ జోస్యం చెప్పారు. సోనియా ఉన్నంతకాలం కాంగ్రెస్‌కు ఢోకా లేదన్నారు.
24, జనవరి 2011, సోమవారం
పోలియో చుక్కల వల్లే బాలుడి మృతి
తమిళనాడులో పోలియో చుక్కల వల్లే రెండేళ్ల బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఆరోగ్య సంస్థ సలహాదారు,
ఆరు జిల్లాల ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రసాద్ సోమవారం స్పష్టం చేశారు.
ఆరు జిల్లాల ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రసాద్ సోమవారం స్పష్టం చేశారు.
ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోండి
హైదరాబాద్: యువతను ఎన్నికలవైపు ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 66.795 పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం జరగనుంది. ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే వారికి గుర్తింపు కార్డుతో పాటు ప్రత్యేకంగా నల్లబ్యాడ్జీలు అందజేయనుంది. ఈ బ్యాడ్జీలపై 'ఓటరుగా గర్విస్తున్నా... ఓటు హక్కు వినియోగానికి సిద్ధంగా ఉన్నా' అనే నినాదం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పాత ఓటర్ల గుర్తింపు కార్డుల్లో ఏమైనా సవరణలు ఉంటే సరిచేయడానికి దరఖాస్తులు తీసుకుంటారు.
6న పీఆర్పీ జిల్లా మహాజన సభ
చోడవరం: ప్రజారాజ్యం పార్టీ గ్రామీణ జిల్లా సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 6వతేదీన చోడవరంలో జరుగుతుందని పీఆర్పీ పొలిట్ బ్యూరో సభ్యుడు గంటా శ్రీనివాసరావు చెప్పారు. చోడవరం పీఆర్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తుఫాను పంట నష్టం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఏడుగురు రైతులను పరామర్శించేందుకు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఫిబ్రవరి 5,6 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారన్నారు.రైతుల ఓదార్పు అనంతరం గ్రామీణ జిల్లా కార్యకర్తల సర్వసభ్య సమావేశం చోడవరంలో జరుగుతుందన్నారు. సమావేశం అనంతరం అదేరోజు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమీక్ష నిర్వస్తారన్నారు. వైఎస్సార్ ఆశయాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. ఆయన హయాంలో ఉన్న పథకాలు సైతం పూర్తిగా అమలు చేయడంలేదని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో అర్హులకు ప్రభుత్వం పథకాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.మన రాష్ర్టం నుంచి అత్యధికంగా ఎంపీలను పంపినప్పటికీ కేంద్రం మంత్రివర్గంలో సముచిత స్థానం ఇవ్వలేదని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి పరిమితికి మించి కూడా మంత్రివర్గంలో స్ధానం కల్పించారన్నారు. రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్, వై.ఎస్.జగన్ ఆధిపత్య పోరాటంలో ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని గంటా ఆరోపించారు. రానున్న బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు జరగడానికి పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ సమష్టిగా పార్లమెంటులో పోరాడాలని ఆయన కోరారు.
ఉపాధి కూలీలకు ఇక రోజుకు రూ.121
హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే కూలీలకు వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నైపుణ్యం లేని కూలీకి రోజుకు వంద రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడా కూలీని రూ. 121కి పెంచుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఈనెల 14న ఉపాధి హామీ కూలీలకు ఆయా రాష్ట్రాల కూలీవేతనాల ఆధారంగా మన రాష్ట్రంలో రూ. 121లుగా నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జనవరి ఒకటో తేదీ నుంచి అమలుల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీల రేటు మనకంటే అధికంగా ఉండడం గమనార్హం.
అనకాపల్లిలో జిల్లా స్థాయి కళాప్రదర్శన
అనకాపల్లి : నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న అనకాపల్లిలో జిల్లా స్థాయి కళాప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా యువ సమన్వయ అధికారి బి.అప్పారావు తెలిపారు. సోమవారం ఆయన దేవరాపల్లిలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా స్థాయి క్రీడాపోటీలు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో చోడవరంలో నిర్వహిస్తామన్నారు. వీటిలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. జిల్లాలో తమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించడానికి ఇటీవల కాశ్మీరు, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందాలు వచ్చాయన్నారు. జిల్లాలోని దిబ్బిడికి చెందిన కోలాటాల బృందాన్ని ఒరిస్సా రాష్ట్రానికి పంపించామన్నారు. జిల్లాలో 2,900 యువజన సంఘాలున్నాయన్నారు. వీటిలో 700 సంఘాల పనితీరు బాగుందన్నారు. ముఖ్యంగా దేవరాపల్లి, కె.కోటపాడు, పాయకరావుపేట మండలాల్లో యువజన సంఘాల పనితీరు నిరాశాజనకంగా ఉందన్నారు. ఈ మండలాల్లో వీటిని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో యువజన సంఘాల పనితీరుని మెరుగు పర్చడానికి ప్రతీ ఏటా రూ. 7 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 128 సంఘాలకు క్రీడా పరికరాలు పంపిణీ చేశామన్నారు. మరికొన్ని సంఘాలకు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. 8 యువజన సంఘాలకు సామాజిక భవనాల నిర్మాణానికి రూ. లక్షా 60 వేలు మంజూరు చేశామన్నారు. 34 మండలాల్లో హెచ్‌ఐవి, ఎయిడ్స్ పై అవగాహనా తరగతులు నిర్వహించామని వివరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామగ్రామాన అవగాహనా శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 40 మండల సమన్వయ కర్తలు పనిచేస్తున్నారన్నారు. 1836, 2001 రాష్ట్రప్రభుత్వ చట్టప్రకారం నెహ్రూ యువ కేంద్రంలో పేరు నమోదు చేయించుకున్న సంఘాలకు మాత్రమే తమ సేవలు అందిస్తామన్నారు. ఈయన వెంట మండల సమన్వయ కర్త కడియాల శ్రీను తదితరులున్నారు.
రచ్చబండపై రచ్చ చేయడం తగదు: చిరంజీవి
తిరుపతి: రచ్చబండ మంచి కార్యక్రమమని... అనవసరంగా రచ్చ చేయడం తగదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన యాన రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మంచి చేస్తే ప్రోత్సహిస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ప్రస్తుతానికి ప్రభుత్వంలో చేరే ఆలోచన లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
లంకెలపాలెం: పరవాడ మండలంలో తూర్పుకావు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని 56వ వార్డు పరిధి లంకెలపాలెంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మడక రమేశ్, ఉపాధ్యక్షుడిగా మేడశెట్టి జానకీరామ్, కార్యదర్శిగా సంపంగి సూరిబాబు ఎన్నికయ్యారు. కోశాధికారిగా కోరుకొండ అప్పారావు, కార్యవర్గసభ్యులుగా మడక సత్యనారాయణ, బలిరెడ్డి శ్రీనివాసరావు, మడక బాబ్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలంలో తూర్పు కావుల సంక్షేమం కోసం కృషి చేస్తామని అధ్యక్షుడు రమేశ్ తెలిపారు.
జమ్ము విమానాశ్రయంలో భాజపా నేతల నిలిపివేత
జమ్ము: జమ్ము విమానాశ్రయంలో ఈరోజు మధ్యాహ్నంనుంచి హైడ్రామా నడిచింది. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో రిపబ్లిక్ డేరోజు త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేందుకు భాజపా నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ, అనంతకుమార్‌లు జమ్ము వచ్చారు. వారు విమానాశ్రయంలో దిగగానే పోలీసులు బైటకు వెళ్లే దారిని మూసివేసి వారిని అడ్డుకున్నారు. విమానాశ్రయం బయట పెద్దసంఖ్యలో భాజపా కార్యకర్తలు ఉన్నందున శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అందుకే సెక్షన్ 144 ప్రకారం వారిని అనుమతి నిరాకరించారని అధికారులు తెలిపారు. వారిని వెనుకకు ఢిల్లీ వెళ్లాల్సిందిగా కోరారు. అందుకు వారు నిరాకరించి లోపలే ధర్నాకు దిగారు. రెండుగంటలపాటు లోపల వారి ధర్నా, బయట కార్యకర్తల నినాదాలతో హోరెత్తిపోయింది. చివరకు అధికారులు భాజపా నేతలను బయటకు వెళ్లేందుకు అనుమతించారు.
అల్లు అరవింద్ కి చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్....
ఇన్నాళ్లు తను చెప్పినట్టుగా ఆడడంతో చిరంజీవి పేరు చెప్పుకుని ఎన్నో సినిమాలు తీసి కోట్లు గడించిన అల్లు అరవింద్ కి ఇక మెగా హీరోలని కూడా తాడుకి కట్టి ఆడించడం కుదరదని తేలిపోయింది. ఇకపై గీతా ఆర్ట్స్ కి మెగా హీరోల డేట్లు దొరకడం కూడా కష్టమైన పనే అని అర్థమవుతోంది. రామ్ చరణ్ తన తల్లి పేరు మీద సొంత బ్యానర్ మొదలు పెట్టిన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ కూడా సొంత కుంపటి పెట్టేసుకున్నాడు.అమాయకుడైన నాగబాబుకి తన సొంత అన్నదమ్ముల డేట్లే దొరక్కుండా అడ్డుపడిన అల్లు అరవింద్ కి ఒకేసారి చరణ్ పవన్ చెక్ పెట్టారు. అల్లు అరవింద్ కి ఉన్న సత్సంబందాల వల్ల ఇతర హీరోలు అతని బ్యానర్ లో నటించడం దాదాపు అసాధ్యమే అనుకోవచ్చు. ఇక అల్లు అరవింద్ తన కొడుకు బన్నీతో చేసుకుంటూ, ఎప్పుడైనా కనికరిస్తే చరణ్, పవన్ లతో సినిమాలు చేసుకోవాల్సిందేనేమో..
ఆయనకేం.. లక్షల్లో జీతం పుచ్చుకుంటారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (టిఐకాస) ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) ఎదురుదాడికి దిగారు. ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న కోదండరామ్ నెలతిరగక ముందే లక్షల్లో జీతభత్యాలు పుచ్చుకుంటారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు, బాధలు, కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు.ఇటీవల తన ఇంటిని ముట్టడించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ దాడిలో స్వయంగా జగ్గారెడ్డి (జయప్రకాష్ రెడ్డి) పాల్గొని తెరాస కార్యకర్తలను తరిమితరిమి కొట్టారు. దీన్ని ఖండిస్తూ.. తెరాస సోమవారం సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, బంద్‌ను విరమించుకున్నప్పటికీ తెరాస అధినేత కేసీఆర్ సదాశివపేటలో పర్యటించనున్నట్టు ప్రకటించారు.ఈ ప్రాంత పర్యటనకు సోమవారం కేసీఆర్ బయలుదేరారు. ఈయన రాకను నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే వర్గీయులు సోమవారం ఉదయం సంగారెడ్డిలో ఆందోళనకు దిగారు. కంది చౌరస్తాలో రెండు టాటా సుమో వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలిపి నిప్పుపెట్టారు. దీంతో హైదరాబాద్- ముంబై జాతీయ రహదారిపై 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అలాగే కవనంపేట వద్ద ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టే యత్నం చేశారు. కేసీఆర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రాంతంలోని కేసీఆర్, తెరాస ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.దీనిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కోదండరామ్‌లు కుమ్మక్కై ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రకటనలు, పిలుపులు ఇవ్వడం కాదన్నారు. దమ్ముంటే తన నియోజకవర్గంలోని గ్రామాల్లో తనతో పాటు పర్యటించాలని కోదండరామ్‌కు ఆయన సవాల్ విసిరారు. గ్రామ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆయనకేం తెలుసన్నారు.ఆయన పాఠాలు చెప్పినా చెప్పక పోయినా నెలకు లక్షల్లో జీతాలు వస్తాయన్నారు. గ్రామ ప్రజలకు అలా కాదన్నారు. వారికి రెక్కాడితేగానీ డొక్క నిండదన్నారు. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని నడుచుకోవాలని హితవు పలికారు. తెలంగాణ అంశంలో తమ అజెండానే అమలు చేస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
సచ్చిదానంద మూర్తి కన్నుమూత
గుంటూరు : ప్రముఖ తత్వవేత్త, దార్శనికుడు, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కొత్త సచ్చిదానంద మూర్తి సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సెయింట్ జోసఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా సచ్చిదానందమూర్తి పనిచేశారు.
శ్రీకాకుళం జిల్లాకు సీఎం వరాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆ జిల్లాకు వరాలు కురిపించారు. పలు హామీలు ఇచ్చారు.
* రాజాంలో రూ.39 కోట్లతో రక్షిత మంచినీటి పథకం మంజూరు.
* రాజాంలో 60 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్పు.
* శ్రీకాకుళంలో రూ.35 కోట్లతొ కొత్త కలక్టరేట్ నిర్మాణం.
* శ్రీకాకుళం జిల్లాలో రూ.10 కోట్లతో రహదారుల నిర్మాణం. వంటి హామీలను ఇచ్చారు.
* రాజాంలో రూ.39 కోట్లతో రక్షిత మంచినీటి పథకం మంజూరు.
* రాజాంలో 60 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్పు.
* శ్రీకాకుళంలో రూ.35 కోట్లతొ కొత్త కలక్టరేట్ నిర్మాణం.
* శ్రీకాకుళం జిల్లాలో రూ.10 కోట్లతో రహదారుల నిర్మాణం. వంటి హామీలను ఇచ్చారు.
23, జనవరి 2011, ఆదివారం
విశాఖ బయలుదేరిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉదయం విశాఖ బయలుదేరారు. ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. రచ్చబండ కోసం ప్రభుత్వం రూ.2,500 కోట్లు వెచ్చించనుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ పరిధి డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఉదయం 11 గంటలకు రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తదుపరి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు. బహిరంగసభలోనూ ప్రసంగిస్తారు. అనంతరం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గుషిణి గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు.
అనకాపల్లి యువతికి టెంపుల్‌వర్సిటీ అవార్డు
అనకాపల్లి: అనకాపల్లికి చెందిన జలగడుగుల గౌతమి సత్యశ్రీ అమెరికాలోని టెంపుల్ వర్సిటీ నుంచి అవార్డు పొందారు. ఈ యూనివర్సిటీలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్న సత్యశ్రీ వంశపారంపర్యంగా సంక్రమించే ఇన్‌హెరిటెడ్ థ్రాంబో సైటోపినియా ( రక్తం గట్టకట్టడానికి సహాయపడే వ్యవస్థ) లోపంపై జరిపిన పరిశోధనలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.అలాగే అసోసియేషన్ ఆఫ్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ అమెరికా(ఏఎస్‌ఐఓఏ) కూడా ఈమె ప్రతిభను గుర్తించి యంగ్ సైంటిస్ట్2010 అవార్డుని ప్రకటించింది. గౌతమి సత్యశ్రీ తండ్రి రిటైర్డ్ తహశీల్దార్ జలగడుగుల చినగురువులు, తల్లి పార్వతీకుమారి. ఏఎంఏఎల్ కళాశాలలో బీఎస్సీ చదివిన ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ,ఎంఫిల్ కోర్సులను పూర్తి చేశారు. సత్యశ్రీకి అవార్డు పట్ల స్థానికులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమె భర్త డాక్టర్ మహదేవ్ కళ్యాణకర్ కూడా శాస్తవ్రేత్తగా పనిచేస్తున్నారు.
మధ్యంతరం వస్తే ప్రజారాజ్యందే హవా: గంటా
ఎలమంచిలి(విశాల విశాఖ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే ప్రజారాజ్యం పార్టీకి గతంలో కంటే అధిక స్థానాలు లభిస్తాయని ప్రరాపా శాసనసభ ఉపనేత గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆదివారం ఎలమంచిలిలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్రంలో బలం పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోదని స్పష్టం చేశారు. ఒక వేళ అదే పరిస్థితి వస్తే పార్టీ అధినేత చిరంజీవి నిర్ణయం ప్రకారం ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఖర్చు ప్రజలపై పడే అవకాశం ఉన్నందున కాంగ్రెస్‌పార్టీకి మద్దతు ఇస్తుందన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఒక్క ప్రజారాజ్య ంపార్టీకి ఉందన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రరాపా ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దుబాసి నాగేంద్రకుమార్, కస్పా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం: మంత్రి వట్టి
అనకాపల్లి: అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వట్టివసంత్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ వైద్యాలయంలో జీవదార సంజీవని పశురక్ష విభాగాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యులకు తక్కువ ధరలో మందులు అందించడానికి సంజీవని పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. అలాగే పశువుల మందులు తక్కువ ధరలో అందించడానికి పశురక్ష పథకాన్ని ప్రారంభించామన్నారు.ఈ కేంద్రం ద్వారా ప్రముఖ కంపెనీలకు చెందిన పశువుల మందులు 19 నుంచి 57 శాతం తక్కువ ధరలకు అందిస్తామన్నారు. దీంతో పాటుగా సంజీవని పథకం ద్వారా ఇక్కడ 30శాతం తక్కువకు మందులు అందిస్తామన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో రచ్చబండలను నిర్వహించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేలా సి.ఎం. కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో తిరిగి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందదాయకమన్నారు. అనంతరం కలక్టర్ శ్యామలరావు మాట్లాడుతూ సంజీవని పథకం ద్వారా జిల్లాలో అయిదు కేంద్రాల్లో రూ. 80లక్షల మందుల అమ్మకాలు చేపట్టామన్నారు. బయట మార్కెట్లో దీని విలువరూ. 3కోట్లకు పైగా ఉంటుందన్నారు. ప్రైవేటు వైద్యులు సంజీవని దుకాణాల్లో మందులు కొనుగోలు చేయించేలా సహకారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీకాంత్ ప్రభాకర్, పశు సంరక్షకశాఖ జేడీ సింహాచలం, ఏడీ రామూర్తినాయుడు, డ్రగ్‌ఇన్పెక్టర్ రజిత, జిల్లా వైద్యవిధాన పరిషత్తు సమన్వయకర్త నాయక్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి, కలక్టర్‌లను అనకాపల్లి మెడికల్ అసోసియేషన్ సభ్యులు వంకాయల ఈశ్వరరావు, కోడూరు త్రినాధ్ తదితరులు సత్కరించారు.
ఘనంగా మోదకొండమ్మ తీర్థం
పాడేరు: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీమోదకొండమ్మ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం పాడేరులో ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. మన్యంలోని మండలాల నుంచే కాకుండా మైదాన ప్రాంతం నుంచి కూడా అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం జరిగిన ఉత్సవ విగ్రహం ఊరేగింపులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ ధింసా, గుమ్మాలాట, పలు సాంస్కృతిక నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్చారు. ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.చిట్టినాయుడు, కార్యదర్శి పీవీజీ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
22, జనవరి 2011, శనివారం
ఇద్దరు యువతుల దారుణ హత్య
గుంటూరు: జిల్లాలోని మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాలో ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురైయ్యారు. కంది చేను కాపలాకు వెళ్లిన వీరిద్దరిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఒక యువతి పీక కోసి హత్య చేశారు. మరో యువతిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.
కనుల పండువగా వేల్పుల వీధి గౌరమ్మ మహోత్సవం
అనకాపల్లి,(విశాల విశాఖ):ఉత్తరాంధ్రాలోనే ప్రఖ్యాతిగాంచిన పట్టణంలోని వేల్పులవీధి శ్రీగౌరీపరమేశ్వరుల మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ మహోత్సవాన్ని జరుపుకున్నారు. ఉత్సవం సందర్భంగా గౌరీ పరమేశ్వరుల ఆలయాన్ని విద్యుద్దీప కాంతులతో సర్వా ంగ సుందరంగా అలంకరించారు. ప్రాతఃకాలం నుంచి ఆలయంలో గౌరీప రమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గౌరీపరమేశ్వరులను దర్శిం చుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజన సందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ మహోత్సవానికి 156 సంవత్సరాల చరిత్ర ఉంది. వేల్పులవీధిలో వేల్పులరామారావుకు చెందిన స్ధలంలో ఒక రాయికి గౌరీపర మేశ్వరి అని పేరుపెట్టి వేల్పులవారి ఇంట పుట్టిన వేల్పుల గౌరమ్మ అనే బాలిక ఆడుకుంటూఉండేదని పెద్దలు చెబుతుంటారు. ఆమె యుక్త వయసుకు వచ్చి వివాహ మైన తరువాత అత్తవారి ఇంట్లోనూ ఆ ప్రతిమతో గౌర మ్మను ఆరాదించే ది. ఇరుగుపొరుగు వారిని కూడా గౌరమ్మను ఆరాధించాలని కోరేది. కాగా 1935 నుంచి గౌరమ్మను ఆరాధించే భక్తుల సంఖ్య పెరిగింది. ఆనాటి కాలంలో పెద్దలు వాకాడ దాలె ప్ప తదితరులు గౌరీ పరమేశ్వరుల ఉత్స వాన్ని ఘనంగా నిర్వహించేవారు.వేల్పుల గౌరమ్మ మరణానంతరం వేల్పుల కుటుంబీకులు గౌరమ్మ పీఠాన్ని ప్రతిష్టించారు. ఉత్సవం రోజున ఈ పీఠాన్ని వేల్పుల రామారావు కుమా రుడు వేల్పుల గణేష్ తలపై ఉంచి ఉరేగింపుగా పొలా ల్లోకి వెళ్లి దానిని వరిదు బ్బుపై ఉంచి మూడు సార్లు ప్రదక్షిన చేసిన తర్వాత దానిని గుడి దగ్గర ఉన్న పీఠంపై ప్రతిష్టించి ఉత్సవాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అంత టి ప్రాధాన్యత కలిగిన ఈ ఉత్స వాన్ని తిలకించేందుకు జిల్లా నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గౌరమ్మను దర్శి ంచు కుంటూ ఉంటారు. జాతరను పురస్కరించుకుని అనకా పల్లి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు, శాసన మండలి ప్రతిపక్షనేత దాడి వీరభ ద్రరావు తదితర ప్రముఖులు శనివా రం ఉదయం ఆలయంలో గౌరమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
5 నుంచి చిరంజీవి జిల్లా పర్యటన
శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు
అనకాపల్లి (విశాల విశాఖ): వచ్చే నెల అయిదు, ఆరు తేదీల్లో చిరంజీవి జిల్లా పర్యటన ఉంటుందని శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తెలిపారు. పంట నష్టాలకు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను చిరంజీవి పరామర్శిస్తారని చెప్పారు. స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడరారు. కశింకోట, ఎలమంచిలి, నక్కపల్లి, ఎస్.రాయవరం గ్రామాల్లో మృతి చెందిన రైతుల కుటుంబ సభ్యులను కలుసుకుంటారన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ప్రరాపా ఎమ్మెల్యేలంతా పాల్గొంటారన్నారు. అయితే ఇందులో వ్యవసాయానికి సంబంధించిన అంశం లేకపోవడం అన్యాయమన్నారు. పంటల నష్టపరిహారం పంపిణీ పూర్తిచేయాలని కోరారు
25న జాతీయ ఓటర్ల దినోత్సవం
విశాఖపట్నం:భారత ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశామని డీసీఆర్ సన్యాసినాయుడు పేర్కొన్నారు. దీనిపై శనివారం జీవీఎంసీ సమావేశమందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా జీవీఎంసీ పరిధిలో 234 డిజిగ్నేటెడ్ కేంద్రాల్లో మొదటిసారిగా ఓటరు నమోదు చేయించుకున్న 18 నుంచి 20 ఏళ్ల వారిలో ఒక్కో కేంద్రం నుంచి కొంతమందిని గుర్తించి అభినందిస్తామన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పాఠశాలలు, కళాశాలల స్థాయిలో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం పోటీలను నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు, బిల్లు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
దక్షిణాఫ్రికాతో చివరి వన్డే నేడే
సెంచూరియన్: మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సిరీస్ నిర్ణయాత్మక సమరం ఆదివారమే. సెంచూరియన్‌లో జరిగే ఈ మెగా పోరాటంలో.. బ్యాటింగ్ వైఫల్యాలను అధిగమించాలని భారత్ పట్టుదలగా ఉండగా, మరో విజయంతో సిరీస్ ముగించాలని దక్షిణాఫ్రికా కోరుకుంటోంది. మిగతా మ్యాచ్‌ల్లాగే ఐదో వన్డే కూడా రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. సెంచూరియన్‌లోనే జరిగిన తొలి టెస్టులో ఓటమితో సఫారీ సవాల్‌ను ఆరంభించిన ధోనీసేన.. అక్కడే విజయంతో మురిపిస్తుందేమో చూద్దాం.
మిడిల్ నిలబడేనా: తిరుగులేదనుకున్న బ్యాటింగే భారత్‌కిప్పుడు ప్రధాన సమస్య. కోహ్లి తప్పితే జట్టులో నిలకడగా ఆడే బ్యాట్స్‌మనే కనిపించడం లేదు. సచిన్, వీరూ, గంభీర్ లేకపోవడంతో మిడిలార్డర్‌పై భారం పెరిగింది. కానీ.. బాధ్యతలు తీసుకునే ఆటగాడే కరవయ్యాడు. యువీ, రైనా తమదైన శైలిలో ఆడడమే మరిచారు. ధోనీ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి చాలాకాలమైంది. ఒక మ్యాచ్‌లో మెరిసిన యూసుఫ్ మరో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఓపెనర్లు శుభారంభం అందిస్తే మిడిల్‌పై భారం తగ్గుతుంది. కానీ రోహిత్, మురళీ విజయ్‌లు అవకాశాలను వృథా చేసుకుంటున్నారు. మరోసారి పార్థివ్ ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది. ప్రపంచకప్ ముందు భారత్‌కిదే చివరి మ్యాచ్. బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి రావడం ఎంతో అవసరం.
మిడిల్ నిలబడేనా: తిరుగులేదనుకున్న బ్యాటింగే భారత్‌కిప్పుడు ప్రధాన సమస్య. కోహ్లి తప్పితే జట్టులో నిలకడగా ఆడే బ్యాట్స్‌మనే కనిపించడం లేదు. సచిన్, వీరూ, గంభీర్ లేకపోవడంతో మిడిలార్డర్‌పై భారం పెరిగింది. కానీ.. బాధ్యతలు తీసుకునే ఆటగాడే కరవయ్యాడు. యువీ, రైనా తమదైన శైలిలో ఆడడమే మరిచారు. ధోనీ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి చాలాకాలమైంది. ఒక మ్యాచ్‌లో మెరిసిన యూసుఫ్ మరో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఓపెనర్లు శుభారంభం అందిస్తే మిడిల్‌పై భారం తగ్గుతుంది. కానీ రోహిత్, మురళీ విజయ్‌లు అవకాశాలను వృథా చేసుకుంటున్నారు. మరోసారి పార్థివ్ ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది. ప్రపంచకప్ ముందు భారత్‌కిదే చివరి మ్యాచ్. బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి రావడం ఎంతో అవసరం.
రాష్ట్రవ్యాప్తంగా నేడు తొలివిడత పల్స్‌పోలియో
హైదరాబాద్: నేడు రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పల్స్‌పోలియో కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో చుక్కల మందును అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి విడత పోలియోకు హైదరాబాద్ జిల్లాలో 3200 కేంద్రాలు ఏర్పాటుచేశారు. 12వేలమంది వైద్య సిబ్బందిని వినియోగించనున్నారు. నిర్మాణాలు, వ్యాపారాలు తదితర పనుల్లో నిమగ్నమైనవారి పిల్లల సౌకర్యార్థం 60 మొబైల్ పోలియో బృందాలను ఏర్పాటుచేశారు. రైల్వే, బస్టాండు వంటి ప్రయాణ సముదాయాల్లో అర్థరాత్రి నుంచే పోలియో కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 6,60,102 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైదరాబాద్ డీఎమ్‌హచ్‌ఓ వీనా కుమారి తెలిపారు. రెండో విడత పోలియో ఫిబ్రవరి 27న నిర్వహిస్తారు.
పాదయాత్రకు విలువ ఇవ్వని సోనియా: కొణతాల
విశాఖపట్నం: ఆనాడు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విలువ ఇవ్వలేదన్న విషయాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఈ రోజు ఇక్కడ బయటపెట్టారు. రామకృష్ణా బీచ్'లో యువనేత జగన్మోహన రెడ్డి ప్రారంభించిన జనదీక్ష శిబిరం వద్ద ఆయన ప్రసంగించారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యం క్షీణించిందని తాను సోనియా గాంధీకి చెప్పినా ఆమె కనీస పలకరించేందుకు కూడా ఇష్టపడలేదన్నారు. పాదయాత్ర చేయమని తాను ఆదేశించలేదని, దానిపై తనకు సదభిప్రాయంలేదని ఆమె చెప్పినట్లు తెలిపారు. దాని పర్యవసానం ఏదైనా వైఎస్ఆరే అనుభవించాలని కూడా సోనియా స్పష్టంగా చెప్పారన్నారు. ఇది జరిగింది విశాఖపట్నం విమానాశ్రయంలోనేనని ఆయన తెలిపారు. ఆ సంఘటకు ప్రత్యక్ష సాక్షి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అని కూడా కొణతాల తెలిపారు. ఇటువంటి నాయకులకా మనం మద్దతు పలికేది అని ఆనాడు తనకు అనిపించిందన్నారు. ఆరోజు నుంచి తాను సోనియా గాంధీని కలవలేదని ఆయన చెప్పారు.
గబ్బర్‌సింగ్'గా పవన్‌కల్యాణ్
హైదరాబాద్: గబ్బర్‌సింగ్ ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా షోలే. అయితే 'గబ్బర్‌సింగ్'గా పవన్ కల్యాణ్ ఏంటి అనుకుంటున్నారా..? పవన్ నటించబోయే నూతన చిత్రం పేరే 'గబ్బర్‌సింగ్'. మిరపకాయ్ సినిమా ద్వారా సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు హరీష్‌శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్‌పై పవన్‌కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇంతకీ ఈ సినిమా ఏ కథ ఆధారంగా తీస్తున్నారో తెలుసా? బాలీవుడ్‌లో సంచలన విజయం నమోదు చేసిన దబాంగ్‌ను రిమేక్ చేస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
21, జనవరి 2011, శుక్రవారం
బ్లాక్‌మెయిల్ చేసేందుకే ఓదార్పు
మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి
విశాఖపట్నం(విశాల విశాఖ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసేందుకే మాజీ ఎంపీ జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నగర తెదేపా అధ్యక్షుడు పీలా శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లెక్కలేనని కుంభకోణాలు జరిగాయన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయ్యిందని పేర్కొన్నారు. జగన్ ఎంపీగా ఉన్నపుడు అయిదుసార్లు పెట్రోలు ధరలు పెరిగాయని అప్పుడు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇప్పుడు ధరలు పెరగగానే జనదీక్ష అంటూ నిరసన చేయడం ఏంటని ప్రశ్నించారు. అవగాహన లేకుండా ఆయన ఏవేవో మాట్లాడుతున్నారని, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో రూ.2 బియ్యం పథకాన్ని వై.ఎస్.దిగా చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. తెదేపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సంపాదించిన అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే దీక్షలంటూ జగన్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో 12 సార్లు పెట్రోల్ ధరలు పెరిగినా ఈయనకు ఏమీ కనిపించలేదని ఎద్దేవా చేశారు. తీరంలో జగన్ దీక్ష చేస్తే సముద్రం మొత్తం అవినీతితో కలుషిత మైపోతుందన్నారు.
విశాఖపట్నం(విశాల విశాఖ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసేందుకే మాజీ ఎంపీ జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నగర తెదేపా అధ్యక్షుడు పీలా శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లెక్కలేనని కుంభకోణాలు జరిగాయన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయ్యిందని పేర్కొన్నారు. జగన్ ఎంపీగా ఉన్నపుడు అయిదుసార్లు పెట్రోలు ధరలు పెరిగాయని అప్పుడు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇప్పుడు ధరలు పెరగగానే జనదీక్ష అంటూ నిరసన చేయడం ఏంటని ప్రశ్నించారు. అవగాహన లేకుండా ఆయన ఏవేవో మాట్లాడుతున్నారని, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో రూ.2 బియ్యం పథకాన్ని వై.ఎస్.దిగా చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. తెదేపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సంపాదించిన అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే దీక్షలంటూ జగన్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో 12 సార్లు పెట్రోల్ ధరలు పెరిగినా ఈయనకు ఏమీ కనిపించలేదని ఎద్దేవా చేశారు. తీరంలో జగన్ దీక్ష చేస్తే సముద్రం మొత్తం అవినీతితో కలుషిత మైపోతుందన్నారు.
దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ హఠాన్మరణం
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఈ.వి.వి.సత్యనారాయణ శుక్రవారం అర్ధరాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఈవీవీని ఈ నెల 19న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈవీవీ వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఆర్యన్ రాజేశ్, 'అల్లరి' నరేశ్‌ఉన్నారు. ఈవీవీ 51సినిమాలకు దర్శకత్వం వహించారు.ఈవీవీగా సినీరంగాన పేరు తెచ్చుకున్న ఈదర వీర వెంకట సత్యనారాయణ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కోరుమామిడి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఆయన జన్మించారు. నిడదవోలులో విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పటి నుంచీ సినిమాలపై ఆసక్తి ఉండటంతో మద్రాస్‌కు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. నవత కృష్ణంరాజు సలహా మేరకు దర్శకత్వ శాఖలో చేరి ప్రముఖ దర్శకుడు జంధ్యాల దగ్గర అసిస్టెంట్‌గా పలు చిత్రాల్లో పని చేశారు. సినిమాల్లో వినోదాన్ని పండించటం ఆయన దగ్గరే నేర్చుకున్నారు. దర్శకునిగా ఈవీవీ 'చెవిలో పువ్వు' చిత్రంతో పరిచయమయ్యారు. ప్రేమఖైదీ సినిమాతో ఆయనకు తొలిహిట్ లభించింది. ఒక దశలో ఆయన దర్శకత్వంలో వరుసగా దాదాపు 10 హిట్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర అగ్ర హీరోలతో కూడా విజయవంతమైన సినిమాలు తీశారు. ముఖ్యంగా కామెడీహీరో రాజేంద్రప్రసాద్‌తో ఈవీవీ తీసిన పలు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. సీనియర్ నటుడు శోభన్‌బాబుతో ఏవండీ ఆవిడొచ్చింది, హిందీలో అమితాబ్‌బచ్చన్ హీరోగా సూర్యవంశ్ తీశారు. కుమారులిద్డరితోనూ బెండు అప్పారావు, ఎవడి గోల వాడిది, అత్తిలి సత్తిబాబు, కితకితలు తదితర సినిమాలు రూపొందించారు. వినోదంతోపాటు సెంటిమెంటు, సీరియస్ సినిమాల్లో కూడా ఈవీవీ పలు ప్రయోగాలు చేసి విజయం సాధించారు. ఆమె, తాళి, అమ్మో ఒకటో తారీఖు తదితర సినిమాలు ఈ కోవకే చెందుతాయి. దర్శకునిగా ఆయన చివరి సినిమా కత్తి కాంతారావు. కుమారుడు నరేశ్ హీరోగా తీసిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.
పెదగంట్యాడలో వైఎస్ విగ్రహావిష్కరణ
విశాఖ : ఓదార్పు యాత్రలో భాగంగా యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెదగంట్యాడలోమహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మలివిడత ఓదార్పు యాత్ర నేటితో నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన తన తండ్రి ప్రజలందరి గుండెల్లో ఉన్నారని అన్నారు. తనపై అభిమానులు కురిపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఎన్ని జన్మెలెత్తినా రుణం తీర్చుకోలేనని అన్నారు.
వ్యభిచారం కేసులో నటి యమున అరెస్ట్
బెంగళూరు: సినీ నటి యమునని వ్యభిచారం నేరకింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటిసి గార్డెన్ హొటల్లో గురువారం రాత్రి వ్యభిచారం నిర్వహిస్తుండగా సినీనటి యమునతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఒక సాఫ్టువేర్ కంపెనీ యజమాని కూడా ఉన్నారు. సినీనటి యమున తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటిస్తారు. మౌనపోరాటం చిత్రంతో ఆమె తెలుగు సినీరంగంలోకి ప్రవేశించారు. యమున అరెస్ట్ అయిన విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ కూడా ధృవీకరించారు. ఐటిసి గార్డెన్ హొటల్లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో రచ్చబండలో పాల్గొననున్న సీఎం
హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చెబుతున్న రచ్చబండ కార్యక్రమాన్ని శ్రీకాకుళంనుంచి సీఎం ప్రారంభించనున్నారు. ఈనెల 24న శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేరోజుమ విజయనగరం జిల్లాలో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు.
మహేష్‌బాబుతో పూరి కొత్త చిత్రం
హైదరాబాద్: మహేష్‌బాబుకు పోకిరి వంటి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు పూరిజగన్నాథ్ ప్రిన్స్‌తో మరో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాకు ది బిజినెస్‌మేన్ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ వేసవిలో మొదలు కానుందని సినిమావర్గాలు తెలిపాయి. కధానాయిక, ఇతర ముఖ్య పాత్రలను త్వరలోనే ఎంపిక చేయనున్నారు.
20, జనవరి 2011, గురువారం
25న సీఎం రచ్చబండ కార్యక్రమం
పాడేరు(విశాల విశాఖ) : ఈనెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పాడేరు మండలంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు అధికారుల్ని ఆదేశించారు. గురువారం సాయంత్రం పాడేరు మండలంలో గుత్తులపుట్టు, కిండంగి గ్రామాల్లో పర్యటించిన మంత్రి రచ్చబండ కార్యక్రమం కోసం స్థల పరిశీలన చేశారు. భారీ బహిరంగ సభ కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్థలాన్ని పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ జె.శ్యామలరావుకు సూచించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ వినీత్ బ్రిజ్‌లాల్‌తో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ సత్యనారాయణ, ఆర్డీఓ కేఆర్డీ ప్రసాదరావు, జడ్పీటీసీ సభ్యులు ఉషారాణి, సర్పంచి నారాయణ, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ కాంతమ్మ, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
నక్కపల్లిలో మరో భారీ పరిశ్రమ
ముందుకొచ్చిన అమెరికా బ్రైటన్ సంస్థ
నక్కపల్లి(విశాల విశాఖ): పెట్రో కెమికల్ పెట్రోలియం ఇన్వెస్టిమెంట్ రీజియన్‌లో (పీసీపీఐఆర్) భాగంగా మండలంలో ప్రత్యేక పరిశ్రమల పార్కు ఏర్పాటు చేస్తున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలు ఇందులో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మండలంలో పలువురు విదేశీ ప్రతినిధులు ఇక్కడి భూములను పరిశీలించి వెళ్లారు. తాజాగా ఓ విదేశీసంస్థకు సంబంధించి నక్కపల్లి మండలంలో 800 ఎకరాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని మంత్రి గీతారెడ్డి ముఖ్యమంత్రితో కలిసి ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపై మరలగా, అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది.మండలంలో ఇప్పటికే దాదాపు 2500 ఎకరాల జిరాయితీ భూమికి సంబంధించి రైతులకు నోటీసులు జారీచేసి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సదస్సులు ఏర్పాటు చేశారు. దీనిపై అన్నదాతల నుంచి వ్యతిరేక వచ్చినా సేకరణ ప్రక్రియ ఏమాత్రం ఆగలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి మొత్తం సుమారుగా 4500 ఎకరాలు గుర్తించారు. ఇప్పటికే రాజయ్యపేట వద్ద ఆన్‌రాక్ సంస్థకు చిన్న తరహా ఒడరేవు నిర్మించుకోడానికి అనుమతిచ్చారు. తాజాగా అమెరికాకు చెందిన బ్రైటన్ సంస్థ రాష్ట్రంలో అణువిద్యుత్తు యంత్ర పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చింది. అధికారకంగా ప్రభుత్వం ఈ సంస్థకు మాత్రమే అనుమతిని ఇచ్చింది. దీంతో పీపీపీఐఆర్‌లో తొలి పరిశ్రమ ఇదే కానుంది. రూ. 2880 కోట్లు పెట్టుబడి పెట్టడంతో పాటు రెండేళ్ల కాలంలో నిర్మాణాన్ని పూర్తిచేసి లక్ష మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఈ సంస్థ ప్రభుత్వానికి వివరించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
అనుకూల పరిస్థితులు ఇవీప్రధానంగా మండలం తీరాన్ని ఆనుకుని ఉండటంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అధికంగా ఉన్నాయి. దీంతో రసాయన పరిశ్రమలు ఏర్పాటుచేస్తే తప్పనిసరిగా తీరం అవసరం. మండలంలో తీరానికి జాతీయ రహదారి 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దగ్గర్లో తుని, నర్సీపట్నం రోడ్డు వంటి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా ఇక్కడకు ప్రత్యేక రైలు మార్గాలు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. మండలంలోని తీరప్రాంత గ్రామాలకు రోడ్డు మార్గాలు ఉండటం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
నక్కపల్లి(విశాల విశాఖ): పెట్రో కెమికల్ పెట్రోలియం ఇన్వెస్టిమెంట్ రీజియన్‌లో (పీసీపీఐఆర్) భాగంగా మండలంలో ప్రత్యేక పరిశ్రమల పార్కు ఏర్పాటు చేస్తున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలు ఇందులో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మండలంలో పలువురు విదేశీ ప్రతినిధులు ఇక్కడి భూములను పరిశీలించి వెళ్లారు. తాజాగా ఓ విదేశీసంస్థకు సంబంధించి నక్కపల్లి మండలంలో 800 ఎకరాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని మంత్రి గీతారెడ్డి ముఖ్యమంత్రితో కలిసి ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపై మరలగా, అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది.మండలంలో ఇప్పటికే దాదాపు 2500 ఎకరాల జిరాయితీ భూమికి సంబంధించి రైతులకు నోటీసులు జారీచేసి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సదస్సులు ఏర్పాటు చేశారు. దీనిపై అన్నదాతల నుంచి వ్యతిరేక వచ్చినా సేకరణ ప్రక్రియ ఏమాత్రం ఆగలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి మొత్తం సుమారుగా 4500 ఎకరాలు గుర్తించారు. ఇప్పటికే రాజయ్యపేట వద్ద ఆన్‌రాక్ సంస్థకు చిన్న తరహా ఒడరేవు నిర్మించుకోడానికి అనుమతిచ్చారు. తాజాగా అమెరికాకు చెందిన బ్రైటన్ సంస్థ రాష్ట్రంలో అణువిద్యుత్తు యంత్ర పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చింది. అధికారకంగా ప్రభుత్వం ఈ సంస్థకు మాత్రమే అనుమతిని ఇచ్చింది. దీంతో పీపీపీఐఆర్‌లో తొలి పరిశ్రమ ఇదే కానుంది. రూ. 2880 కోట్లు పెట్టుబడి పెట్టడంతో పాటు రెండేళ్ల కాలంలో నిర్మాణాన్ని పూర్తిచేసి లక్ష మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఈ సంస్థ ప్రభుత్వానికి వివరించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
అనుకూల పరిస్థితులు ఇవీప్రధానంగా మండలం తీరాన్ని ఆనుకుని ఉండటంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అధికంగా ఉన్నాయి. దీంతో రసాయన పరిశ్రమలు ఏర్పాటుచేస్తే తప్పనిసరిగా తీరం అవసరం. మండలంలో తీరానికి జాతీయ రహదారి 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దగ్గర్లో తుని, నర్సీపట్నం రోడ్డు వంటి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా ఇక్కడకు ప్రత్యేక రైలు మార్గాలు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. మండలంలోని తీరప్రాంత గ్రామాలకు రోడ్డు మార్గాలు ఉండటం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
25న పాడేరులో రచ్చబండ
విశాఖ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి ఈనెల 24న విశాఖ వస్తున్నారు. ఆ రోజు ఉదయం విమానంలో హైదరాబాద్ నుంచి నగరం చేరుకునే ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా రాజాం వెళతారు. అక్కడ రచ్చబండ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. అదే రోజు రాత్రికి విశాఖ చేరుకొని ప్రభుత్వ అతిథి గృహంలో బసచేస్తారు. 25న పాడేరులో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. కొమ్మాదిలో ఏర్పాటు చేయనున్న మరో కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర మాజీ మంత్రి సత్యనారాయణరావు మృతి
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి ఎస్.పి.బి.కె. సత్యనారాయణరావు ఈ ఉదయం మృతి చెందారు. కొద్ది రోజులుగా అస్వస్థతో ఉన్న ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు.
నేటి నుంచి మొబైల్ నెంబర్ ఫోర్టబులిటీ సేవలు
న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మొబైల్ నెంబర్ ఫోర్టబులిటీ సర్వీసు అందుబాటులోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లు దీన్ని నేటి నుంచి అమలుల్లోకి తేనున్నాయి. ఈ సదుపాయం ద్వారా సెల్ నెంబర్ మారకుండానే ఆపరేటర్‌ను మార్చుకునే అవకాశంతోపాటు, సీడీఎంఏ నెట్‌వర్క్ నుంచి జీఎస్‌ఎంలోకి, జీఎస్‌ఎం నుంచి సీడీఎంఏలోకి మారవచ్చు. ఈ సర్వీసులను పొందాలనుకున్నవారు port space మొబైల్ నెంబర్‌ను 1900 కిఎస్‌ఎంఎస్ చేయాలి. కొద్ది సెకన్లలో 8 అంకెల యునిక్ పోర్టింగ్ కోడ్‌తో రిప్త్లె మెసేజ్ వస్తుంది. ఈ కోడ్‌తో మారాలనుకున్న ఆపరేటర్ కార్యాలయంలో ఫొటో, చిరునామా, వక్తిగత గుర్తింపు కార్డును సమర్పించి రూ. 19 చెల్లిస్తే కొత్త సిమ్‌కార్డును ఇస్తారు. పోస్ట్‌పేయిడ్ కనెక్షన్‌లయితే రూ. 500య వరకూ అడ్జెస్టబుల్ డిపాజిట్ వసూలు చేస్తారు. కొత్త ఆపరేటర్‌కు మారాక కనీసం 90 రోజులు ఆ నెట్‌వర్క్‌లో కొనసాగాలి.
.
.
మసాజ్... భలే సమ్మగా ఉంది
కొన్నిసార్లు హఠాత్తుగా మెడ పట్టేసినట్లవుతుంది. బరువుగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు బాగా కష్టపడి పనిచేస్తున్నట్లు, ఎక్కువ బరువు బాధ్యతలు భుజాలపై వేసుకున్నట్లే లెక్క. అంతేకాదు అవసరమైన స్థాయిలో మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం లేదని తెలుస్తుంది.ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు మీరు ముందుగా కాస్త రిలాక్స్ అవ్వాలి. ఒత్తిడి చెందకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పిమ్మట శరీరాన్ని మసాజ్ చేయించుకోవాలి. నైపుణ్యంతో శరీరంపై కదలాడే వేళ్లు ఉత్తమ చికిత్సల్ని తప్పక అందిస్తాయి. అనేకానేక ప్రత్యామ్నాయాలు, కొన్ని ప్రత్యేక స్పా ఎంపికల వల్ల ఒత్తిడి కేంద్రాలకు సరైన చికిత్స లభించి, విశ్రాంతి, ఉపశమనం, ప్రశాంతత దొరుకుతాయి.కణతలు, కనుబొమలు, మెడ, భుజాలు, వెన్ను, మోకాళ్లలో నిల్వ చేసుకున్న టెన్షన్ అంతా మాయమై సంతృప్తిని, పునఃశక్తిని అందుకుంటారు. కనుక ఎన్ని పనులున్నా వాటి నడుమ ఎంతో కొంత సమయాన్ని చిక్కించుకుని స్పాలకో, బ్యూటీ పార్లర్లకో వెళ్లి మసాజ్ చేయించుకోవడం ద్వారా ప్రశాంతతను, రిలాక్సేషన్‌ను పొందవచ్చు.
రోడ్డు ప్రమాదంలో గంటా బంధువులకు గాయాలు
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరానికి సమీపంలోని చినవుటుపల్లి వద్ద చెన్నై కోల్‌కత్తా జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం... విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం విజయవాడ నుండి కారులో వైజాగ్ వెళుతుండగా చిన్నఅవుటుపల్లి సమీపంలో టిప్పర్ ఢీకొంది. లారీ డ్రైవర్ డివైడర్ వద్ద రోడ్‌క్రాస్ చేయబోగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న గంటా శారద (45), పోతినేని కల్పన (35) గాయపడ్డారు. స్థానికులు అప్రమత్తమై వారిని సమీపంలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారుముందు భాగం బాగా దెబ్బతింది. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ తూర్పునకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పిన్నమనేని ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించారు
నిరభ్యంతరంగా సస్పెండ్ చేసుకోవచ్చు : సబ్బం హరి
న్యూఢిల్లీ : తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు అధిష్టానం భావిస్తే నిరభ్యంతరంగా సస్పెండ్ చేసుకోవచ్చని ఎంపీ సబ్బం హరి అన్నారు. కావాలనుకుంటే పార్టీనుంచి పూర్తిగా బహిష్కరించవచ్చని సవాల్ చేశారు. ప్రజా సమస్యలపై జరిగే ఏ పోరాటంలోనైనా పాల్గొంటానని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు గౌరవం ఇచ్చి పోలవరానికి జాతీయహోదా ఇస్తే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని సబ్బం హరి అన్నారు.పీఆర్‌పీని మంత్రివర్గంలో చేర్చుకుంటే ఒప్పుకోమని, పదవులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారికే ఇవ్వాలని సబ్బం హరి డిమాండ్ చేశారు.
డీజిల్ ధరలు పెంచం: జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ: డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదనేదీ లేదని పెట్రోలియం శాఖ జైపాల్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్‌కు ఏడు రూపాయలు నష్టపోతున్నాయని ఆయన చెప్పారు. అయిన ప్పటికీ ప్రస్తుతం ధరలు పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
హోంగార్డుల జీతం రూ.4 వేలనుంచి 6 వేలకు పెంపు
హైదరాబాద్ : హోంగార్డుల జీతం రోజుకు 130 రూపాయలనుంచి 200 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనివల్ల సర్కారు ఖజానాకు 68 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ మునిగిపోయిన పడవ: అంబటి
హైదరాబాద్: రాష్ట్రంలో 2014 నాటికి కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం లేదని అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగే పడవని కేంద్ర మంత్రి పదవులు రాని ఆ పార్టీకి చెందిన ఎంపీలే అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయిన పడవని అంబటి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో రాష్ర్టంలో సాధించిపెట్టిన అధికారం ఉండడం వల్లె ఆ పార్టీ ఇంకా ఉన్నట్టు కన్పిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంత బలహీన నాయకత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అంబటి అన్నారు. సొంత పార్టీకి చెందిన ఎంపీలే మునిగిపోయే పడవని’ వ్యాఖ్యలు చేసిన చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని ఎద్దేవా చేశారు.తెలుగు ఎంపీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి దెబ్బతీసిందన్నారు. 2014 నాటికి జగన్ తిరిగి కాంగ్రెస్‌లో కలుస్తారని వస్తున్న ఊహాగానాలను అంబటి కొట్టిపారేశారు. కాంగ్రెస్ నాయకులే జగన్ పార్టీలోకి వస్తారని అన్నారు. చంద్రబాబుకు పోటీగానే జగన్ జనదీక్ష తలపెట్టారన్న వార్తలను ఆయన ఖండించారు. ఎవరితో పోటీపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో నిరంతరం పోరాటం చేయాలన్న తాపత్రయంతో జగన్ ముందుకు కదులుతున్నారని అంబటి వివరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)