1.తగ్గిన 9 శాతం ప్రజాభిమానం
2.ప్రధాన మంత్రి స్థానానికి రాహుల్'కే ప్రధమ స్థానం
3.ఉత్తమ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ
4.నితీష్ కుమార్'కు రెండవ స్థానం
5.షీలా దీక్షిత్'కు మూడవ స్థానం
న్యూఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆమె కుమారుడు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి దేశంలో ప్రజాదరణ తగ్గుతోంది. ఇండియాటుడే ఎసి నిల్సన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వీరే ఆరు నెలల క్రితం నిర్వహించిన సర్వేకంటే ఇప్పుడు జరిపిన సర్వేలో జనాభిమానం తగ్గినట్లు స్పష్టగా తెలుస్తోంది. అయితే ప్రధాన మంత్రి స్థానానికి రాహుల్'కే ప్రధమ స్థానం దక్కింది. అయితే గతంలో కంటే 9 శాతం ప్రజాభిమానం తగ్గింది. ఆరు నెలల క్రితం జరిపిన సర్వేలో 29 శాతం మంది రాహుల్ ప్రధాని కావాలని కోరుకోగా, ఇప్పుడు 20 శాతంమందే కోరుకుంటున్నారు.సోనియా గాంధీ ప్రధాన మంత్రి కావాలని గత ఏడాది 13 శాతం మంది కోరుకోగా, అది ఇప్పుడు 8 శాతానికి పడిపోయింది. సోనియా కంటే బిజెపి నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ఎక్కవ శాతం మంది కోరుకోవడం విశేషం. 2014లో మన్మోహన్ సింగ్ ప్రధాని కావాలని మాత్రం ఎవరూ కోరుకోలేదు. ఈ సర్వే ఫలితాలు కాంగ్రెస్ పెద్దలకు మింగుడుపడటంలేదు.గత సర్వేలోనూ, ఈ సర్వేలోనూ 7 శాతం మందే బిజేపి నేత అద్వానీ ప్రధాని కావాలని కోరుకోరుకున్నారు. ఈ పార్టీకి చెందిన అద్వానీ కంటే నరేంద్ర మోడీయే ప్రధాని కావాలని కోరుకున్నవారు ఎక్కువ మంది ఉండటం విశేషం.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యుపిఏ 42 ఎంపి స్థానాలను కోల్పోతుందని సర్వేలో వెల్లడైంది. స్కామ్'లతో యుపిఏ ప్రభుత్వం సతమతమవుతుండటంతో ఇటువంటి ఫలితాలు వచ్చినట్లు భావిస్తున్నారు.ఇదే సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నిలిచారు. నితీష్ కుమార్'కు రెండవ స్థానం లభించింది. షీలా దీక్షిత్'కు మూడవ స్థానం దక్కింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి