12, జనవరి 2011, బుధవారం
ప్రమాదంలో ఎమ్మెల్యే జోగి రమేష్ కు స్వల్ప గాయాలు
విజయవాడ: కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ్యుడు జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారు బుధవాం ప్రమాదానికి గురయింది. అయితే ఆయన ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎమ్మెల్యే జోగి రమేష్ తన కారులో వెళుతుండగా ఓ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా గతంలో కూడా జోగి రమేష్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఆయన స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి