మీరు గంటల కొద్దీ కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారా.? రోజుకు నాలుగు గంటలకు మించి కంప్యూటర్లు, బుల్లితెరను గుడ్లప్పగించి చూస్తున్నారా.? అయితే, మీకు గుండెపోటు రావొచ్చు...!! ఈ విషయం యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఎక్కువ సమయం టీవీలు చూసే వారికి, కంప్యూటర్లు వినియోగించే వారికి గుండెపోటు రావొచ్చని ఈ సర్వే తేల్చింది.రెండు గంటల కంటే తక్కువగా కంప్యూటర్లు ఉపయోగించే వారితో పోలిస్తే వీరిలో రోజంతా టీవీలకు అతుక్కుని పోయే బుల్లితెర ప్రేక్షకులకు గంటలకొద్ది కంప్యూటర్ వినియోగించే నెటిజన్లకు గుండెపోటు వచ్చే అవకాశాలు 125 శాతం అధికంగా ఉన్నట్టు సర్వే నివేదికను ఉటంకిస్తూ డైలీ ఎక్స్‌ప్రెస్ పత్రిక వెల్లడించింది.కంప్యూటర్ లేదా బుల్లితెరను తీక్షణంగా చూసే వారిలో వివిధ కారణాల చేత సంభవించే మరణాలు కూడా 48 శాతం ఎక్కువగా ఉన్నట్టు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. నిరంతరం కంప్యూటర్లకు అతుక్కుపోయే వారు వ్యాయామాలు చేసినా శరీరానికి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోతుందని అందువల్ల వ్యాయామాల కారణంగా పెద్ద ఫలితం ఉండక పోవచ్చని పేర్కొంది.ప్రధానంగా కంప్యూటర్ల ఎదుట సుదీర్ఘంగా కూర్చోవడం వల్ల గుండె జబ్బులను నిరోధించే లిపోప్రొటీన్ లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి 90 శాతం తగ్గుతుందన్నారు. అయితే, ప్రతి 20 నిమిషాలకు ఓసారి స్వల్ప విరామం తీసుకోవడంతో పాటు కుర్చీలోంచి లేచి నడవడం ద్వారా ఈ ముప్పును కొంతమేరకు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి