* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

13, జనవరి 2011, గురువారం

నిజామాబాద్‌ విశాఖల మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌ మీదుగా నిజామాబాద్‌-విశాఖ, సికింద్రాబాద్‌-పోర్బందర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని ద.మ.రైల్వే అధికారులు గురువారం రాత్రి నిర్ణయించారు.
నిజామాబాద్‌ విశాఖపట్నంల మధ్య నాలుగు సర్వీసులు
నెంబరు 08569 ప్రత్యేక రైళ్లు విశాఖ నుంచి ఈ నెల 16, 23 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 8.20 గంటలకు, ఉదయం 11.50 గంటలకు నిజామాబాద్‌కు చేరుతాయి
నెంబరు 08570 ప్రత్యేక రైళ్లు ఈ నెల 17, 24 తేదీల్లో సాయంత్రం 18.10 గంటలకు నిజామాబాద్‌ నుంచి, రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లకు దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, కాజీపేట్‌, ఖమ్మం స్టేషన్లలో మాత్రమే హాల్టు సదుపాయాన్ని కల్పిస్తారు.
సికింద్రాబాద్‌-పోరుబందర్‌ల మధ్య 12 సర్వీసులు
నెంబరు 09221 ప్రత్యేక రైళ్లు ఈ నెల 17, 24, 31, ఫిబ్రవరి 7, 14, 21 తేదీల్లో (సోమవారాల్లో) రాత్రి 11 గంటలకు పోర్బందర్‌ నుంచి బయలుదేరి బుధవారాల్లో ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతాయి
నెంబరు 09222 ప్రత్యేక రైళ్లు ఈ నెల 19,. 26, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో (బుధవారాల్లో) మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 11.55 గంటలకు పోర్బందర్‌కు చేరుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లకు రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌, వల్సద్‌, వాసాయ్‌రోడ్‌, కళ్యాణ్‌, పూణే, దౌడ్‌, షోలాపూర్‌, వాడి, తాండూరు, బేగంపేట్‌ స్టేషన్లలో మాత్రమే హాల్టు సదుపాయాన్ని కల్పిస్తారు. ద ప్రత్యేక రైళ్లకు సంబంధించిన సరైన, సమగ్ర సమాచారానికై టెలిఫోన్‌ నెంబరు 139 ద్వారాగానీ, రిజర్వేషన్‌ కేంద్రాల్లోగానీ, రైల్వే వెబ్‌సైట్లలోగానీ సంప్రదించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి