* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

12, జనవరి 2011, బుధవారం

కౌలురైతుకు పంటరుణం మంజూరుచేయాలి

కౌలు రైతుకు పంట రుణం మంజూరు చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌చేశారు. స్థానిక ఉప్పల చంద్రశేఖర్‌ కల్యాణ మండపంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీపై అవగాహనా సదస్సు జరిగింది. దీనిలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్‌.రాజు మాట్లాడుతూ భూ యజమానినుంచి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుకు పంట రుణం, భూ యజమానికి అత్యవసర పరిస్థితుల్లో ప్రాపర్టీ రుణం మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వరికి ఒక ఏడాది, చెరకుకు రెండు సంవత్సరాలు, సరుగుడుకు ఐదు సంవత్సరాలు కౌలు రైతులకు అగ్రిమెంట్‌ ఇచ్చేలా అధికారులు కృషి చేయాలని కోరారు. డిఆర్‌ఓ వెంకటరెడ్డి మాట్లాడుతూ గుర్తింపు పొందిన వ్యవసాయదారుడు 2011 చట్టాన్ని రూపొందించామని, ఇకనుంచి కౌలు రైతులకు ఎటువంటి ఇబ్బందీ కలగదని అన్నారు. ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 13,788 మంది మాత్రమే కౌలు రైతులున్నారని అధికారులు చెప్పడం కాదని అన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో ఆరుగురు మాత్రమే కౌలు రైతులున్నారని, మరో పది మంది మండలాల్లో కౌలు రైతులే లేరని ప్రభుత్వాధికారులు నివేదిక తయారు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. సోమనాథన్‌ కమిషన్‌, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు నేటికీ అమలు కాలేదని అన్నారు. కౌలు రైతులకు బతికి ఉండగానే నష్టపరిహారం అందజేసి వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎపి రైతు సంఘర జిల్లా ఉపాధ్యక్షుడు పెంటకోట జగన్నాథం మాట్లాడుతూ పంటనష్టపోయి ధీన పరిస్థితుల్లో ఉన్న రైతుల నుంచి నష్టపరిహార చెక్కుల పంపిణీలో డబ్బులు వసూలు చేయడం అన్యాయమన్నారు. వ్యవసాయం చేయనివారికి కూడా నష్టపరిహార చెక్కులు అందజేసిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం అందని పరిస్థితి కూడా కూడా ఉందని అన్నారు. తెలుగు రైతు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బుద్ద మాణిక్యాలరావు, గౌరీ పిఎసిఎస్‌ అధ్యక్షుడు విల్లూరి రాము మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకుంటామని చెబుతున్న అధికారుల మాటలకు, చేతలకు వ్యత్సాసం ఉందని అన్నారు. పిఎసిఎస్‌లో సభ్య రైతులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలని చట్టంలో పేర్కొ నడమే ఇందుకు ఉదాహరణనని పేర్కొన్నారు. అలాంటప్పుడు కౌలు రైతులకు రుణాలు ఏ మేరకు అందించి వారికి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కౌలు రైతులకు నిజంగా సహాయం చేసే దృష్టి ప్రభుత్వానికి ఉంటే ప్రత్యేక కార్పొరేషన్‌ బ్యాంకు ఏర్పాటు చేసి ఆదుకోవాలని వారు సూచించారు. ఎంపిపి మంత్రి సన్యాసిరావు మాట్లాడుతూ, ప్రతి రైతుకూ పంటల బీమా వర్తింపజేయాలని కోరారు. ఖరీఫ్‌ సీజన్‌ ముందు బ్యాంకర్లతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించి కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని తెలియజేసినప్పటికీ, కౌలు రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగినా వారికి ఒక్క రూపాయి రుణం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఆర్‌డిఓ కె.ప్రభాకరరావు, స్థానిక తహసీల్దార్‌ ఎస్‌.భాస్కరరెడ్డి, మునగపాక జెడ్‌పిటిసి సభ్యుడు మళ్ల సంజీవరావు, పరవాడ, మునగపాక, కశింకోట, దేవరాపల్లి, ఆనందపురం మండలాల నుంచి తహశీల్దార్లు, ఎండిఓలు వ్యవసాయ అధికారులు, విఆర్‌ఓలు, రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి