* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

5, జనవరి 2011, బుధవారం

చెరకుపై ఎన్నో పరిశోధనలు

ఏడీఆర్ డాక్టర్ ఎన్.వి.నాయుడు
అనకాపల్లి (విశాల విశాఖ): కేవలం తొమ్మిదేళ్లలోనే తొమ్మిది కొత్త వంగడాలను కనుగొన్నట్టు ఆర్‌ఏఆర్‌ఎస్‌లో 17 ఏళ్లపాటు పనిచేసి చెరకు అభివృద్ధికి ఎంతో కృషిచేసినట్టు ఇటీవల బదిలీ అయిన ఏడీఆర్ డాక్టర్ ఎన్.వి.నాయుడు తెలిపారు. . స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌కి 1994లో బ్రీడర్‌గా వచ్చానన్నారు. అప్పటి నుంచి చెరకుపై ఎన్నో పరిశోధనలు చేశామన్నారు. నాణ్యతతో కూడిన విత్తనాల అభివృద్ధికి విశేష కృషి చేసినట్టు వివరించారు. ప్రధానంగా వ్యాపార సరళిలో రైతులకు ఉపయోగపడే 2000 వీ 59 రకాన్ని కొనుగొన్నామన్నారు.అలాగే 2002లో మధు, విశ్వామిత్ర, కనకదుర్గ, కృష్ణ, వసుధ అనే రకాలను, 2006లో శారదా అనే మరో రకాన్ని కొనుగొన్నామన్నారు. 2009లో కనుగొన్న 97 ఏ 85 రకాన్ని ఈస్ట్‌కోస్ట్ మండలం(ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్)లో సాగుకి జాతీయ స్థాయిలో అధికారికంగా ఎంపిక చేశామన్నారు. 2010లో విశాఖ 97ఏ85రకం, 2003వీ46రకం భరణి పేరుతో, 2000వీ59 రకం స్వాతి పేరుతో రాష్టస్థ్రాయిలో రైతులకు పరిచయం చేశామన్నారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద కోటి రూపాయలతో నాణ్యత గల విత్తనోత్పత్తికి నిధులు సమకూర్చామన్నారు.చెరకుపై రైతులకు, ఫ్యాక్టరీ యాజమాన్యాలకు, శాస్తవ్రేత్తలకు ఉపయోగపడేవిధంగా చెరకు సమాచారం పేరుతో 2003 నుంచి త్రైమాసిక పత్రికలను విడుదల చేసినట్టు వెల్లడించారు. తాను చదివిన తిరుపతి వ్యవసాయ కళాశాలకే హెడ్‌గా వెళ్లడం ఆనందంగా ఉందని ఎన్.వి.నాయుడు తెలిపారు. కార్యక్రమంలో సాయిల్ సైంటిస్టు డాక్టర్ కె.వీరభద్రరావు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి