* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

5, జనవరి 2011, బుధవారం

ప్రేమే జీవితాన్నిస్తుంది



ప్రేమ అనేది ఓ తియ్యటి అనుభూతి. అది మన హృదయాంతరాలలో సన్నటి ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదో మధురానుభూతి. దీంతో మనకు జీవించాలనే కోరిక పెరుగుతుంది. మనలో కొత్త శక్తిని నింపుతుంది. దీంతో ప్రేమ సాగరంలోని అలలలో తేలియాడుతుంటాము. అలా...అలా అలుపు..సొలుపు లేకుండా మున్ముందుకు సాగిపోతుంటాము. ప్రేమకు అంత బలం ఉంది మరి.ప్రేమ అనేది టీవీలు, సినిమాలలో చూపించే విధంగా ఉండదు. ప్రేమ అనేది మనసు పొరలలో నుంచి ఉద్భవించేది. ఆ మనసులో ఉద్భవించిన ప్రేమతో ప్రపంచమంతాకూడా ప్రేమమయంగా కనపడుతుంటుంది. ఈ లోకంలో చాలామంది ప్రేమిస్తుంటారు. తాము నిజమైన ప్రేమికులమని ఇతరులకు ఉదాహరణలుగా చూపిస్తుంటారు. కాని కొన్ని సంవత్సరాలైన తర్వాత వారి ప్రేమ బంధంపై వారికే అనుమానాలు తలెత్తుతాయి. చివరికి వారు అమితంగా ప్రేమించిన వ్యక్తిని సైతం వదులుకోవడానికి వెనుకాడరు.మరి ఇదేనా ప్రేమంటే...దానికి ముందు ఎన్నో ఊసులు, ఎన్నో బాసలు చేసుకుని ఎన్నటికీ వీడకూడదని ప్రమాణాలు చేసుకుంటుంటారు. అప్పుడు రాని అనుమానాలు ఇప్పుడు ఎలా వచ్చాయనేది అతి పెద్ద అనుమానం. అందుకే అన్నారు పెద్దలు..అనుమానం పెను భూతం అని.
మీ ప్రేమలో నిజమైన ప్రేమే ఉంటే అనుమానమనేది రాదు, సరికదా దానికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి మీరు వెనుకాడరు. మీ ప్రియురాలు/ప్రియుడికి నమ్మకం కలగడానికి ఎల్లప్పుడు ప్రయత్నిస్తుండాలి. ఎట్టి పరిస్థితులలోనూ ప్రేమలో అనుమానాలు, అపనమ్మకాలుండకూడదు.ప్రేమ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలంటే కొన్ని సిద్ధాంతాలను మీరు తప్పనిసరిగా పాటించాలి. దీంతో మీ ప్రియమైనవారితో జీవితాంతం కలిసి జీవించే నమ్మకం కలుగుతుంది.
విశ్వాసాన్ని స్థిరంగా ఉంచండి :
చాలామంది మీ ప్రేమను చూసి అసూయ చెందుతుంటారు. మీరంటే గిట్టని వారు ఏదో ఒకటి మీకు నూరిపోస్తుంటారు. లేదా మీ ప్రియులగురించి లేనిపోనివి కల్పించి మరీ మీకు చాడీలు చెబుతుంటారు. వాటిని మీరు నమ్మి మీ ప్రేమను దూరం చేసుకోకండి. ముఖ్యంగా మీ ప్రేమపై మీకు ఎట్టి పరిస్థితులలోనూ అపనమ్మకం కలగకూడదు. మీ ప్రేమపై చివరి వరకు నమ్మకం ఉండేలా చూడండి. ఎవరు ఎన్ని చెప్పినాకూడా చివరకు మీ ప్రేమదే విజయం. దానిని మాత్రం అపహాస్యం చేయకండి.
అయినదేదో అయినది :
గతంలో గడిచిన విషయాలను తవ్వి, వాటిని పెద్దవిగా చేసుకుంటూపోతే చివరకు మీ ప్రియమైనవారికి ఎలాంటి ఆనందం ఇవ్వలేరు. ప్రతి వ్యక్తి తప్పులు చేస్తుంటారు. కాని ఆ తప్పును తెలుసుకున్న తర్వాత తమ వారిని క్షమించమని అడుగుతారు. మీరు క్షమించిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మీరు అవకాశం ఇచ్చినట్టే. నిజంగానే మీ ప్రేమలో మంచి బలం, పట్టు ఉంటే గడిచిన విషయాలను మరచిపోయి మళ్ళీ నూతనోత్సాహంతో ముందుకు సాగడానికి మీ ప్రేమ దోహద పడుతుంది.
మీ ప్రేమకు సర్ప్రైజ్ ఇవ్వండి :
సర్ప్రైజ్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం. మనకు ఇష్టమైన వస్తువు మనకు తెలియకుండానే మన ప్రియులు దానిని అందిస్తే చాలా సర్ప్రైజ్ అవుతాం. ఇలాంటివి ప్రేమ బంధాలను బలపరచడానికి దోహదపడతాయి. మీలోని భావాలు తమ ప్రియులకు తెలపడానికి గిఫ్ట్‌లకు మించి మరేవి లేవు.
మీ ప్రియమైన వారి భావాలను అర్థం చేసుకోండి :
మీ గర్ల్ ఫ్రెండ్ వద్ద ఎప్పుడూ కూడా మీరో ప్రొఫెషనల్‌లా ఉండకూడదు. మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రియులను మీరు అర్థం చేసుకునే శక్తి మీలో ఉంటే మీ మధ్య మనస్పర్థలనేవి తలెత్తవు.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే మీరుకూడా ప్రేమపూరితమైన బంధాన్ని ప్రేమతోనే అలంకరించండి. మీ వ్యవహారంలో పాజిటివ్ థింకింగ్‌ను పెంపొందించుకొని మీ ప్రియతముల మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి