రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనుంది
హైదరాబాద్: యువనేత వైఎస్ జగన్ ఢిల్లీలో చేపట్టనున్న ఒకరోజు దీక్షకు తరలివచ్చే ప్రజా ప్రతినిధులు, రైతులతో ప్రత్యేక రైలు ఈ నెల 9న సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని అంబటి రాంబాబు తెలిపారు. ప్రత్యేక రైలులో ఢిల్లీకి వచ్చే వారి పేర్లతో జాబితాలను తయారు చేసి జిల్లాల వారీగా పంపించామని శనివారమిక్కడ తెలిపారు. లిస్టులో పేర్లు లేనివారెవరూ రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రైలులో ఎక్కువ మందిని తీసుకె ళ్లే వీలు లేనందున పరిమిత సంఖ్యలోనే ప్రజా ప్రతినిధులను తీసుకెళుతున్నామని, అర్థం చేసుకోవాలన్నారు. జాబితాలో పేర్లు ఉన్నవారందరూ గంట ముందుగా రావాలని కోరారు. ప్రత్యేక రైలు రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనుంది. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ ఈనెల 11న ఢిల్లీలో రైతులు, ప్రజా ప్రజానిధులతో కలిసి జగన్ ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి