హైదరాబాద్: మంత్రి పదవులు అందరికీ ఇవ్వలేనని అందుకే రానివారు నిరాశపడవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లేక్‌వ్యూ అతిధిగృహంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పదవులు రానంతమాత్రాన అసమర్థులు కాదని వారు అవకాశం రానివారు మాత్రమేనని అన్నారు. తాను మంత్రి కాకుండానే సీఎం అయ్యానని అందరికీ ఇలానే గుర్తింపు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమని అన్నారు
29, నవంబర్ 2010, సోమవారం
మంత్రి పదవులు అందరికీ ఇవ్వలేను: సీఎం
సుప్రీంకోర్టులో రతన్‌టాటా పిటీషన్ దాఖలు
న్యూఢిల్లీ: నీరా రాడియా టేపులు బహిర్గతమైన నేపధ్యంలో దీనిపై రతన్‌టాటా సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆమెతో తాను మాట్లాడిన టేపులను ట్రాప్ చేయటం వాటిని బయటకు విడుదల చేయటం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని, ఇది రాజ్యాంగహక్కులను ఉల్లంఘించటమేనని ఆయన అందులో ఆరోపించారు, కేంద్రం ఈ విషయంలో వెంటనే దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని ఆయన కోర్టును తన పిటీషన్‌లో కోరారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు మంత్రి వీరప్పమొయిలీ, ప్రణబ్‌ముఖర్జీలు నిరాకరించారు.
27, నవంబర్ 2010, శనివారం
బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న
విశాఖపట్నం(విశాల విశాఖ): తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డ గౌతు లచ్చన్న బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కేంద్ర మంత్రి డి.పురందేశ్వరి పేర్కొన్నారు. శనివారం జీవీఎంసీ ఆధ్వర్యంలో జిల్లా జడ్జికోర్టు జంక్షన్‌లో దివంగత డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని మంత్రి డి.పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌతు లచ్చన్న తెలుగుజాతికి గర్వకారణమన్నారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు, మేయర్ పి.జనార్దనరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మచిలీపట్నం ఎంపీ కె.నారాయణ, మాజీ మంత్రి శ్యామ్‌సుందర్ శివాజీ, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, ద్రోణంరాజు శ్రీనివాసు, పంచకర్ల రమేశ్‌బాబు, కమిషనర్ విష్ణు, పోలీసు కమిషనర్ పూర్ణచంద్రరావు, జీవీఎంసీ ఉపమేయర్ దొరబాబు, కార్పొరేటర్ బి.అనురాధ, భాజపా సీనియర్ నేత కె.హరిబాబు, తమిళనాడు యువజన కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జి.శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
2016 నాటికి రూ.3వేల కోట్ల టర్నోవర్
వన్‌టౌన్(visala visakha) విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు వ్యాపార టర్నోవరు 2016 నాటికి రూ.3వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆ బ్యాంకు ఛైర్మన్ మానం ఆంజనేయులు వెల్లడించారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం 18 శాఖలతో పనిచేస్తున్న తమ బ్యాంకు నిర్దేశిత లక్ష్య సాధనకు వీలుగా బ్యాంకు శాఖల సంఖ్యను 30కి పెంచుతామన్నారు. గత ఏడాది డిసెంబరు నాటికి రూ.వెయ్యి కోట్లు టర్నోవరు సాధిస్తే ఈ ఏడాది ఇప్పటికే రూ.1500 కోట్ల టర్నోవర్‌కు చేరామన్నారు. జిల్లాలో తమ బ్యాంకు విస్తరించి ఉందని, వచ్చే ఏడాది మార్చిలోగా మరో శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ఏడు జిల్లాలకు సేవలు అందుతాయన్నారు. ఐక్యరాజ్య సమితి 2012ను సహకార సంవత్సరంగా ప్రకటించిందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు సహకార రంగమే ప్రత్యామ్నాయంగా గుర్తించారన్నారు. 250 నగరాల్లో విస్తరించిన సహకార అర్బన్ బ్యాంకుల ద్వారా సూక్ష్మరుణాల సేవలను ప్రత్యేకంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాబార్డ్, ఆర్.బి.ఐ, ప్రభుత్వం సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వైపు పౌరులు వెళ్లకుండా ప్రత్యామ్నాయాలను ఆలోచన చేయాలన్నారు. గత 14 నెలల వ్యవధిలో రూ.3కోట్ల మేర రుణాలను నెల్లూరు, విశాఖ ప్రాంతాల్లో అందించడం ద్వారా ప్రజలకు మేలు చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1674 బ్యాంకుల్లో 40 ఉత్తమమైనవిగా గుర్తింపు పొందాయని, వాటిలో విశాఖ అర్బన్ బ్యాంకు కూడా ఒకటన్నారు. షెడ్యూలు బ్యాంకుగా గుర్తింపు పొందేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకుల విలీనం కంటే కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఒంగోలు, తిరుపతిల్లో ఉన్న బ్యాంకులను విలీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 108 సహకార బ్యాంకుల ద్వారా రూ.4,200 కోట్ల డిపాజిట్లు, రూ.3,200 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య బ్యాంకుల కన్నా డిపాజిట్‌దారులకు ఎక్కువ వడ్డీ ఇస్తూ, రుణం పొందేవారికి తక్కువ వడ్డీ వసూలు చేసేందుకు తమ బ్యాంకు కృషి చేస్తోందన్నారు. విలేకర్ల సమావేశంలో బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు, సి.ఇ.ఒ. జి.వి.నర్సింహమూర్తి, వైస్‌ఛైర్మన్ భాస్కర్రావులు పాల్గొన్నారు.
నగరంలో 10కె రన్
ఉదయం 5 నుంచి 12 గంటల వరకు అమలు
హైదరాబాద్: ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 10కె రన్ నిర్వహించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 10కె రన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పరుగులో పెద్దఎత్తున పాల్గొనేవారికి అసౌకర్యం కల్గకుండా నగర పోలీస్ కమిషనర్ ఎ.కె.ఖాన్ ట్రాఫిక్ మళ్లింపు ఆదేశాలు జారీ చేశారు.రాజ్‌భవన్, పంజాగుట్ట, ఆనంద్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ ఫ్త్లెఓవర్‌పైకి అనుమతించరు.ఐమాక్స్ థియేటర్ నుంచి వచ్చే వాహనాలు ఇందిరాగాంధి విగ్రహం జంక్షన్ పక్క నుంచి ఖైరతాబాద్ ఫ్త్లెఓవర్ మీదుగా వెళ్లొచ్చు.తెలుగుతల్లి విగ్రహం నుంచి వచ్చేవారు సచివాలయం హెలీప్యాడ్ పక్క నుంచి ఐమ్యాక్స్ థియేటర్.. ఖైరతాబాద్ ఫ్త్లెఓవర్ మీదుగా వెళ్లిపోవచ్చు.బైబిల్ హౌస్, ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించరు. కవాడిగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.హిల్‌పోర్ట్ నుంచి తెలుగుతల్లి ఫ్త్లెఓవర్ కిందుగా కుడివైపు అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. వీరు ఎడమవైపుగా ఇక్బార్‌మినార్ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.బషీర్‌బాగ్ నుంచి వాహనాలు అంబేద్కర్ విగ్రహం పక్క నుంచి ట్యాంక్‌బండ్ వెళ్లేందుకు అనుమతించరు. ఈ వాహనాలు జీహెచ్‌ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లొచ్చు. లేదంటే లిబర్టీ చౌరస్తా నుంచే హిమాయత్‌నగర్ మీదుగా ప్రయాణించవచ్చు.రసూల్‌పుర నుంచే రాణిగంజ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కిమ్స్ మీదుగా ప్యారడైజ్‌వైపు మళ్లిస్తారు.ఎం.జి.రోడ్డు మీదుగా కర్బాల మైదాన్ వైపు వచ్చే వాహనాలను రోచా బజార్ టీ జంక్షన్ మీదుగా బాటా చౌరస్తా వైపు మళ్లిస్తారుబాటా చౌరస్తా నుంచి కర్బాలా మైదాన్ వైపు వచ్చే వాహనాలు బైబీల్ హౌస్ మీదుగా కవాడీగూడ చౌరస్తా మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.కవాడిగూడ నుంచే వాహనాలు చిల్డ్రన్స్ పార్క్ మీదుగా ట్యాంక్‌బండ్ మీదకి అనుమతించరు. డీబీఆర్ మిల్స్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్ చేరుకోవచ్చు.వీఐపీలకు మాత్రమే: పరుగులో పాల్గొనేవారు పై మార్గాలను మార్గాలను అనుసరించి పార్కింగ్ స్థలం వద్దకు చేరుకోవచ్చు.వీఐపీ పాసులున్న వాహనదారులను ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తా మీదుగా పీపుల్స్ ప్లాజాకు చేరుకునేందుకు అనుమతిస్తారు. వీరు అక్కడ పార్క్ చేసుకోవచ్చు.సాధారణ పాసులున్న వాహనదారులను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పార్కింగ్, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్, లుంబినీ పార్క్ పార్కింగ్ వరకు అనుమతిస్తారు.

ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు...నలుగురి దుర్మరణం
ఉప్పల్: ఉప్పల్‌లో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోగా... ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కర్మన్‌ఘాట్‌లోని ఆదర్శ్‌నగర్ కాలనీకి చెందిన మూడావత్‌శివ(33) టాటా ప్యాసింజర్ ఆటో యజమాని. నాచారం నుంచి సూర్యాపేటకు రోజూ ఓ దినపత్రిక ప్రతులను వాహనంలో తీసుకెళ్తుంటాడు. శనివారం రాత్రి తన సోదరుడి కుమారుడు వీపీ సింగ్(11)ను తీసుకుని ఆటోలో ఆదర్శనగర్‌నుంచి నాచారం వైపు వస్తున్నాడు. మార్గమధ్యలో కొందరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. నాగోలు వంతెన దాటాడు. ఇంతలో ఓ ద్విచక్రవాహనదారుడు ఆటోకు ఎదురుగా రాంగ్‌రూట్‌లో రోడ్డు దాటుతున్నాడు. అతణ్ని తప్పించబోయాడు. దీంతో ఆటో అదుపుతప్పింది. పక్కనే ఉన్న డివైడర్ పైనుంచి పక్క మార్గంలోకి వచ్చింది. అదే సమయంలో ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్న ప్రయివేటు బస్సు ఆటోను వేగంగా ఢీకొంది. దీంతో ఆటోడ్రైవర్ శివ, అతడి సోదరుడి కుమారుడు వీపీసింగ్, డీఎంఆర్‌పీ టెక్నికల్‌ఆఫీసర్ సుక్కల శ్రీనివాసరావు(40) అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఉప్పల్ పోలీసులు మృతదేహాలను, క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సైనిక్‌పురికి చెందిన పోతన శాస్త్రీ (53) మృతిచెందాడు. మూడావత్ శివ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అదేవదారుకుంట తండా. జీవనోపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. భార్యా పిల్లలు, బంధుమిత్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

ధారూర్ ఠాణాలో లాకప్ డెత్!
వికారాబాద్: హత్య కేసులో నాలుగు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న వ్యక్తి స్టేషన్‌లోనే విగతజీవుడయ్యాడు. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా పేర్కొంటున్నా.. పరిస్థితులు మాత్రం లాకప్‌డెత్ జరిగిందన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ఈ నెల 22న ధారూర్ మండల కేంద్రంలో పోగుల అనంతయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు 23న పత్తి కిష్టయ్య(45)ను అదుపులోకి తీసుకొన్నారు. నాలుగు రోజుల పాటు స్టేషన్‌లోనే ఉంచి విచారణ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి కిష్టయ్యను హఠాత్తుగా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించగా కాపాడి ఆసుపత్రికి తీసుకొచ్చామని పోలీసులు చెప్పారు. కిష్టయ్యను పరీక్షించిన వైద్యులు ఎప్పుడో చనిపోయాడని తేల్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. కిష్టయ్య ఒంటిపై దెబ్బలు కనిపిస్తుండటం, ఉరేసుకున్నాడన్న కథనం వినిపిస్తూనే కుటుంబీకులతో మాత్రం గుండెపోటుతో చనిపోయాడని చెప్పించేందుకు పోలీసులు ప్రయత్నించడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
మంత్రివర్గంలో ప్రరాపా చేరుతుందా?
హైదరాబాద్ : తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటి స్థితే కొనసాగుతుందా? రెండు పార్టీలూ మరింత సన్నిహితమవుతాయా? మంత్రివర్గంలో ప్రరాపా చేరుతుందా? ఇప్పుడు కాకుంటే విస్తరణ సమయంలో చేరే అవకాశముందా? అన్న వాటిపై చర్చలు కేంద్రీకృతమయ్యాయి.కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే... కడప ఎంపీ జగన్ వర్గం వ్యవహారశైలి ఎలా ఉండబోతోందన్న అంశం ఆధారంగానే ప్రరాపాని మంత్రివర్గంలోకి ఆహ్వానించటమా లేదా అనేది ఆధారపడి ఉంటుందని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా రెండు పార్టీల మధ్య నెలకొన్న మద్దతు రాజకీయం ఆ తరువాత కొంతవరకు ముందుకు సాగింది. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నప్పుడు తొలుత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అవగాహనతో పోటీ చేసేందుకు రెండుపార్టీల నుంచీ గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఒక దశలో పొత్తు కుదిరినట్లేనని భావించినా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో అది ఆచరణలోకి రాలేదు. తరువాత ప్రరాపా ప్రభుత్వంలో చేరుతుందనే ప్రచారం బలంగా వినిపించింది. తనవర్గం ఎమ్మెల్యేలతో జగన్ పార్టీని వీడినా, సహాయ నిరాకరణ చేసినా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రరాపా ఎమ్మెల్యేల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటుందని భావించారు. ఈ పరిణామం చోటుచేసుకోకపోయినా... రోశయ్య హయాంలో పార్టీకి సముచిత ప్రాధాన్యమే లభించింది. ప్రరాపా విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకునే వారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సమానంగా వీరి నియోజకవర్గాల పనులు చూడమనే సందేశం కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వచ్చిందని సమాచారం. పాలనపై ప్రరాపా నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించినా... అవి పార్టీల మధ్య సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇంతలో ఊహించని రీతిలో రోశయ్య రాజీనామా చేయటం, కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ స్థానంలోకి వచ్చారు. దీంతో రెండు పార్టీల సంబంధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇప్పుడూ జగన్ అంశమే రెండు పార్టీల మధ్య సంబంధాలకు కీలకమైంది.మంత్రివర్గంలో చేరితే పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేసుకోవచ్చనే భావన కొంతమంది ప్రరాపా నాయకులు, ఎమ్మెల్యేల్లో ఉంది. తాజాగా మంత్రివర్గం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రభుత్వంలో చేరాలని ఆహ్వానం అందితే అప్పుడు ఆలోచిస్తామని అధికారికంగా ప్రరాపా స్పందించింది. ప్రభుత్వంలో చేరమని ఆహ్వానం అందినా... చేరటానికి ఇది సరైన సమయం కాదేమోనన్న సందేహం అంతర్గతంగా కొంతమంది సీనియర్ నేతల్లో ఉంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం జనవరి, ఫిబ్రవరిల్లో తిరిగి ఆందోళనలు చోటుచేసుకునే అవకాశముంది. ఇప్పుడు ప్రభుత్వంలో చేరితే ఉద్యమాల ప్రభావం తమపైనా పడుతుందని భావిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక పర్యవసానాలన్నీ జరిగేంత వరకు వేచి చూడాలని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అప్పటివరకు అవసరమైన సమయాల్లో సహకారం ఇవ్వటానికే పరిమితం అయితే మేలన్నది వీరి వాదనగా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కోరితే మంత్రివర్గంలో చేరటమే మేలనే భావనా కొందరిలో ఉంది. మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి శనివారం ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య ఎలాంటి సంబంధాలుండాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం కొన్ని సూచనలు చేసే అవకాశముందని భావిస్తున్నారు. ప్రరాపాని మంత్రివర్గంలో చేరమని ఆహ్వానించేలా ఉంటాయా, లేదా అన్నది ఆదివారంనాటికి స్పష్టత వచ్చే వీలుంది.

ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తే: సీఎం
ఢిల్లీ: ఉప ముఖ్యమంత్రి పదవి నూటికి నూరు పాళ్లు తెలంగాణకు చెందిన వ్యక్తేకే దక్కుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో అధిష్ఠానంతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి వర్గం కూర్పు రేపు పూర్తవుతుందని, అయిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అధినాయకత్వం సూచనమేరకు మంత్రి వర్గంలో అన్ని వర్గాలు, ప్రాంతాలకు చెందిన వారికి సమ ప్రాధాన్యం ఇచ్చామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జగన్ విషయమై మాట్లాడుతూ.. జగన్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడని, అందరు సభ్యులను చూసినట్లే ఆయన్ని చూస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది తాను కాదని, ఆ విషయంలో పూర్తి అధికారం అధిష్ఠానందేనని స్పష్టం చేశారు.
వివేకా: పావుగా మారకండి.. అంబటి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధినేత్రి సోనియా గాంధీల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చటానికి తను శాయశక్తులా కృషి చేస్తానని వైఎస్సార్ సోదరుడు వివేకానంద రెడ్డి ప్రకటించారు. అంతేకాదు సాక్షి ఛానల్‌లో సోనియాకు వ్యతిరేకంగా కథనాలు రావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆ కథనాలు పార్టీ కార్యకర్తలకు బాధ కలిగించాయని చెప్పారు.భవిష్యత్తులో అటువంటి కథనాలను ప్రసారం చేయవద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. సోమవారం తనతోపాటు వైఎస్ జగన్ ఇద్దరం కలిసి జరిగిన రాద్ధాంతంపై వివరణ ఇస్తామని తెలిపారు.అయితే జగన్ వర్గంలో కీలక నేతగా ఉన్న అంబటి రాంబాబు వైఎస్ వివేకానంద వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్‌ను అభాసుపాలు చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగా వైఎస్ వివేకానంద రెడ్డిని ఓ కీలుబొమ్మగా, పావుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పూర్తిగా బలహీనపరచడానికి కొన్ని శక్తులు వేస్తున్న ఎత్తుల్లో వివేకానంద రెడ్డి పాలుపంచుకోవద్దని ఆయన హితవు పలికారు. జగన్ తప్పు చేయలేదనీ, తప్పు చేసింది అధిష్టానమేననీ, ఆయన ఓదార్పు యాత్రలో మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుని పెద్ద తప్పు చేసిందని మండిపడ్డారు.మరోవైపు అధిష్టానం మాత్రం వివేకానంద రెడ్డిపైనా కాస్త సంశయంగానే ఉన్నట్లు సమాచారం. విధేయతగా ఉంటామని చెపుతున్నప్పటికీ ఒకవేళ ఆయనను జగన్ వర్గం పావుగా వాడుకుంటున్నారేమోనన్న అనుమానంలో ఉంది. ఏదేమైనా సోమవారంనాడు అసలు సంగతి ఏమిటన్నది తేలిపోతుంది.
మంత్రి పదవి నాకివ్వరు.. ఇచ్చినా నేను తీసుకోను: పిల్లి
కొత్త మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించరని, ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినా తాను స్వీకరించబోనని రాష్ట్ర తాజా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఆయన శనివారం యానాంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో తనకు స్థానం దక్కుతుందనే ఆశలు లేవన్నారు. ఒకవేళ మంత్రిపదవి ఇచ్చినా తాను తీసుకోబోనన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ శక్తిమేరకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీలో తిష్టవేసి ఎంపీలతో లాబీయింగ్ చేయిస్తున్నారు.అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం తద్విరుద్ధంగా యానాంలో పర్యటిస్తూ కాలం వేళ్లదీస్తున్నారు. తనకు మంత్రిపదవి దక్కినా దక్కక పోయినా ఒక్కటేనని ప్రకటించారు. పదవి ఇచ్చినా ఇవ్వక పోయినా కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
25, నవంబర్ 2010, గురువారం
2011లో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సెలవులివే
.హైదరాబాద్: వచ్చే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అధికారికంగా వర్తించే సెలవుల వివరాలను తాజాగా ప్రకటించారు. అవి.. మకర సంక్రాంతిజనవరి 14 (శుక్రవారం), రిపబ్లిక్ డేజనవరి 26 (బుధవారం), మిలాద్ఉన్నబిఫిబ్రవరి 16 (బుధవారం), ఉగాదిఏప్రిల్ 04 (సోమవారం), మహావీర్ జయంతిఏప్రిల్ 16 (శనివారం), గుడ్‌ఫ్రైడేఏప్రిల్ 22 (శుక్రవారం), బుద్దపూర్ణిమమే 17 (మంగళవారం), స్వాతంత్ర దినోత్సవంఆగస్టు 15 (సోమవారం), ఈద్ ఉల్ ఫితర్ఆగస్టు 31(బుధవారం), వినాయక చవితిసెప్టెంబర్ 01(గురువారం), గాంధీ జయంతిఅక్టోబర్ 02(ఆదివారం), దసరాఅక్టోబర్ 06 (గురువారం), దీపావళిఅక్టోబర్ 26 (బుధవారం), బక్రీద్నవంబర్ 07 (సోమవారం), గురునానక్ జయంతి నవంబర్ 10 (గురువారం), మొహర్రండిసెంబర్ 06 (మంగళవారం), క్రిస్మస్ డిసెంబర్ 25(ఆదివారం).
రోశయ్యను కలవనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను కలవనున్నారు. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని కేవలం మర్యాదపూర్వకంగానే ఆయన్ని కలిసినట్లు సీఎం కార్యాలయ వర్గం తెలిపింది. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ర్ట గవర్నర్ నరసింహన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవనున్నారు.
ఆలయ ప్రాంగణంలో మహిళపై అత్యాచారం
అనంతపురం: కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో మహిళపై ఆలయ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరిని భక్తులు పట్టుకొని చితకబాదారు. ఆలయ ఈవో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మావోడే సీఎం : మీసాలు మెలేస్తున్న సీమ సింహాలు
కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కడంపై ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీమలో ఆయనపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రాన్ని సవ్యదిశలో నడిపించగల సత్తా కిరణ్ కుమార్ రెడ్డికి ఉందని గంటకొట్టి చెపుతున్నాయి.ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే చూశారుగా.... మావోడే సీఎం... పరిస్థితిని చక్కదిద్దాలంటే సీమ సింహాలకే చెల్లుతుందంటూ మీసాలు మెలేస్తున్నారు. ఇలా ఎవరెన్ని చెప్పుకుంటున్నా కొత్త ముఖ్యమంత్రి మాత్రం తనదైన శైలిలో సమాధానాలు చెప్పేస్తున్నారు.తన తల్లిదండ్రులది రాయలసీమ ప్రాంతమైనా తను పుట్టి పెరిగింది హైదరాబాదులోనేననీ, తనకు కోస్తాంధ్రలో ఎంతోమంది స్నేహితులున్నారని అంటున్నారు. మొత్తంగా అందరూ తనవాళ్లే అని చెపుతున్నారు కేకేఆర్
మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ప్రారంభం
న్యూఢిల్లీ : సెల్ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మొబైల్ నెంబర్ పోర్టబిలిటీని కేంద్ర టెలికాం మంత్రి కపిల్‌సిబాల్ ప్రారంభించారు. మొదట హర్యానాలో ఈ సర్వీసును ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ పథకంలో సెల్ వినియోగదారుడు అదే నెంబరుతో వేరే సర్వీసుకు మారే సౌలభ్యముంటుంది. వచ్చే సంవత్సరం జనవరి 20 నుంచి ఈ పథకం దేశమంతా అమల్లోకి వస్తుందని టెలికాం వర్గాలు ప్రకటించాయి.
ఇక బ్యాంకుల ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ
హైదరాబాద్: విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో ఎస్‌బీహెచ్‌తో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ఎస్‌బీహెచ్ ఎండీ రేణుచల్లూ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారసంస్థ డిప్యుటీ డైరక్టర్ జనరల్ భాస్కర్‌లు సంతకాలు చేశారు. అనంతరం నమోదు ప్రక్రియపై యూఐడీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బ్యాంకు అధికారులకు వివరించారు.
లారెన్స్ అభ్యర్థనను తిరస్కరించిన అనుష్క
కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ చేసుకున్న అభ్యర్థనను సెక్సీతార అనుష్క తిరస్కరించిందట. ఇంతకీ ఆ అభ్యర్థను ఏంటని అనుకుంటున్నారా...? మరేం లేదండీ... అనుష్కకు తెలుగు, తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ రెండు భాషల్లోనూ కాంచన అనే సినిమా తీయాలని లారెన్స్ ప్లాన్ చేశాడు.రెండు భాషా చిత్రాల్లోనూ హీరోయిన్‌గా అనుష్కను నటింపజేసేందుకు ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నాడట. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ తమిళ వెర్షన్‌లో నటించనని అనుష్క తెగేసి చెప్పిందట.దీంతో ప్రస్తుతం తమిళ భాషలో మరో హీరోయిన్‌ను నటింపజేసేందుకు వెతికే పనిలో ఉన్నాడట.
శుక్రవారం స్నేహారెడ్డి - అల్లు అర్జున్‌ల నిశ్చితార్థంv
టాలీవుడ్ కండలవీరుడు వరుడు అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల నిశ్చితార్థం జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలను మాత్రమే ఆహ్వానిస్తున్నారు.అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిన దరిమిలా పెద్దలు పెళ్లి కార్డుతో శుభం పలుకనున్నారు. వలచిన అమ్మాయే శ్రీమతి అవుతున్నందుకు అల్లు అర్జున్ ఆనందానికి అవధుల్లేకుండా ఉందిమొత్తానికి వీరిద్దరి ప్రేమ కథ సుఖాంతమయ్యేందుకు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కీలక పాత్ర పోషించినట్లు
24, నవంబర్ 2010, బుధవారం
శిరస్త్రాణం ధరించకుంటే కేసులు పెట్టండి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
వన్‌టౌన్(విశాల విశాఖ): శిరస్త్రాణం ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ అధికారులను కలెక్టర్ జె.శ్యామలరావు ఆదేశించారు. శిరస్త్రాణం (హెల్మెట్ల) వినియోగం తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. విశాఖ జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా కమిటీ ఛైర్మన్ హోదాలో కలెక్టర్ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదాల నివారణపై తీసుకుంటున్న చర్యలు, నగరంలోని వాహనాల పార్కింగ్ ఇత్యాది అంశాలపై సమీక్షించారు.సెల్‌ఫోను వాడుతూ వాహనాలు నడిపే వారిపైనా కేసులు నమోదు చేయాలన్నారు. రోజువారీ తనిఖీలతో పాటు శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడిపేవారు, సెల్‌ఫోను వాడుతూ వాహనాలు నడిపేవారిపై రోజుకు కనీసం 30 మందిపై కేసులు నమోదు చేయాలన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా డాబాలు ఉన్నచోట్ల లారీలను పార్కింగ్ చేస్తున్నారని, ఇటువంటి వారికి నోటీసులు జారీచేసి, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించాలని జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ జయశ్రీని ఆదేశించారు. ఫుట్‌బోర్డులపై ఆర్టీసీ ప్రయాణం నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్థేశించిన ప్రదేశాల్లోనే ఆర్టీసీ బస్సులను నిలుపు చేయాలని కలెక్టర్ సూచించారు. డాబాగార్డెన్స్, ద్వారకానగర్ ప్రాంతాల్లో రోడ్లమీదనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, ఈ సమస్యను నివారించాలంటే దుకాణ యజమానులు సెల్లార్లలో వాహనాల పార్కింగ్‌కు చోటు కల్పించాలన్నారు. సెల్లార్లలో షాపింగ్ కాంప్లెక్సులు నిర్వహిస్తున్న వారిపై చర్యలను తీసుకోవాలని జీవీఏంసీ అదనపు కమిషనర్ కృష్ణమూర్తిని కలెక్టర్ ఆదేశించారు. రవాణాశాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హెల్మెట్లు, సీట్ బెల్టుల వాడకం వల్ల కలిగే లాభనష్టాలపై వివరణ ఇచ్చారు. సమావేశంలో సహాయ కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంరాజు, ర.భ పర్యవేక్షక ఇంజినీర్ కె.శాంతామణి, ట్రాఫిక్ ఎ.సి.పి సురేష్‌బాబు, అదనపు ఎస్.పి బి.సుదర్శనరావులు పాల్గొన్నారు.
తెదేపా నేత దారుణ హత్య
మాడుగుల(విశాల విశాఖ): రావికమతం మండలం మేడివాడ మేజరు పంచాయతీ మాజీ సర్పంచి, తెదేపా సీనియర్ నాయకుడు గొర్లె గణేష్ రామకృష్ణ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందాడు. ప్రత్యర్థులు ఇతన్ని హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తుండగా పోలీసులు కకూడా ఈ దశగానే దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం వద్ద పరిస్థితులు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. గణేష్ రామకృష్ణ ఆదివారం ఉదయం ఇంటి నుంచి పనిమీద బమటకు వచ్చారు. రెండు రోజులైనా అతను తిరిగి ఇంటికి చేరకపోవడంతో బంధువులు రావికమతం పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడం, వారు ఆదృశ్యం అయినట్లుగా కేసు నమోదు చేయడం పాఠకులకు తెలిసిందే. ఈ లోగా మంగళవారం సాయంత్రం పిట్టగెడ్డ వీధిలో చందనాల కొండ తుప్పల్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించి గ్రామస్థులు చెప్పడంతో వీఆర్వో ఎర్రయ్య మాడుగుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూసింది.
భూ తగాదాలే కారణమా..?
గణేష్‌ను కుట్రతో, పథకం ప్రకారమే ప్రత్యర్థులు హత్య చేసినట్లుగా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో గొల్లవిల్లి సోమునాయుడు (తాతబాబు) కుటుంబంతో గణేష్‌కు భూవివాదం తలెత్తింది. కేసు కోర్టులో నడుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఉదయం గణేష్ వద్దకు వచ్చి భూ సమస్య పరిష్కారానికని చెప్పి మాడుగుల వైపు తీసుకెళ్లాడని హతుడు సోదరుడు గొర్లె సత్యనారాయణ (బాబులు) తెలిపారు. అప్పటి నుంచి తిరిగి రాలేదన్నారు. ప్రత్యర్థులే హత్య చేయించి అక్కడ పడేసి ఉంటారని, గొల్లవిల్లి తాతబాబు తదితర ముగ్గురు వ్యక్తులపై సంఘటనాస్థలి వద్దే లిఖితపూర్వక ఫిర్యాదుచేశాడని మాడుగుల ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. కాగా గాజువాకకు చెందిన కిషోర్ అనే యువకుడు ఓ భూ వివాదం తరచూ ఇతని వద్దకు వచ్చేవాడని, ఆదివారం కూడా ఇతడు వచ్చాడని కుటుంబీకులు చెబుతున్నారు.

నేడు ఢిల్లీ వెళ్లనున్న కిరణ్‌కుమార్‌రెడ్డి?
హైదరాబాద్ : రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఈ మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇవాళ కిరణ్‌కుమార్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనుండడంతో మంత్రివర్గ ఏర్పాటుపై అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకు ఆయన ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం
బీహార్‌లో రేపు కొలువుదీరనున్న నితీశ్ ప్రభుత్వం
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీశ్‌కుమారు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం శుక్రవారం ప్రమాణస్వీకారం చేస్తుందని ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఎన్డీయే శాసనసభా పక్షం గురువారం భేటీయై సభా నాయకుణ్ని ఎన్నుకుంటుంది. అంతకుముందే జనతాదళ్(యు), భాజపా శాసనసభ సభ్యులు విడివిడిగా భేటీయై తమ తమ పక్షాల నాయకులను ఎన్నుకుంటారు. ఈ భేటీలకు భాజపా తరఫున కేంద్ర పరిశీలకులుగా అరుణ్‌జైట్లీ, అనంతకుమార్, ధర్మేంద్ర ప్రధాన్‌లు హాజరవుతారు. భాజపా నేత సుశీల్ కుమార్ మోడీనే మళ్లీ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జేడీయూ-భాజపా కూటమి 206 చోట్ల విజయం సాధించగా, ఆర్జేడీ-ఎల్జేపీ కూటమి 25, కాంగ్రెస్ 4, ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.
పోలీసుస్టేషన్‌లో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ
ఆదిలాబాద్ : కాశీపేట మండలం దేవాఊర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ సుధాకర్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
ఖమ్మం : అశ్వారావుపేట వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న క్వాలీస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో వాహనంలోని దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందినవారిగా గుర్తించారు. వీరు అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పావులు కదుపుతున్న చిరంజీవి, ముఖ్యులతో సమావేశం
హైదరాబాద్: కాంగ్రెసులోని ప్రస్తుత పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే కాంగ్రెసుకు మద్దతిస్తామని చిరంజీవి ఢిల్లీలో చెప్పారు. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తే కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు జరిగిపోయాయని అంటున్నారు. మెజారిటీ శాసనసభ్యుల మద్దతు వైయస్ జగన్ కే ఉందని, వైయస్ జగన్ పేరును సిఎల్సీ సమావేశంలో ప్రతిపాదిస్తామని శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి చెప్పారు. దీన్ని బట్టి పకడ్బందీ వ్యూహంతో సిఎల్పీ సమావేశానికి హాజరవుతన్నట్లు తెలుస్తోంది.వైయస్ జగన్ వర్గం కాంగ్రెసు శాసనసభ్యులను చీలిస్తే చిరంజీవి వెంటనే తన మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. అందుకు ప్రతిగా తాను డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవిని, మరో ఇద్దరు శాసనసభ్యులకు మంత్రి పదవులు తీసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానంతో డీల్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రజారాజ్యం పార్టీ ముఖ్యులు సమావేశమవుతున్నారు. ఢిల్లీ నుంచి చిరంజీవి కూడా హైదరాబాదుకు బయలుదేరినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు కోరితే తాను మద్దతిస్తానని ఆయన స్పష్టంగా చెప్పారు.
సీఎల్పీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్ : రోశయ్య వారసుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమైంది. ఏఐసీసీ ప్రతినిధులు ప్రణబ్‌ముఖర్జీ ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, అహ్మద్‌పటేల్, మొయిలీ ...తదితరులు హాజరయ్యారు. ఆపధర్మ ముఖ్యమంత్రి రోశయ్యతో పాటుఆయన మంత్రివర్గసభ్యులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన రోశయ్యకు ధన్యావాదాలు తెలుపుతూ ఒక తీర్మానం ముఖ్యమంత్రి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అప్పగిస్తూ మరో తీర్మానం చేసే అవకాశముంది.
గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన రోశయ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. ఈరోజు ఉదయంనుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి.ఢిల్లీనుంచి ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్‌పటేల్‌లు హైదరాబాద్‌కు వస్తున్నారనగానే సీఎంను మారుస్తున్నారనే వూహాగానాలు తీవ్రంగా వచ్చాయి. ఈలోగా మధ్యాహ్నం 1.30కు రోశయ్య స్వయంగా రాజీనామా విషయం ప్రకటించి రాజ్‌భవన్‌కు బయలుదేరివెళ్లారు. అనంతరం గవర్నర్ నరసింహన్‌కు విషయం వివరించి రాజీనామా లేఖ సమర్పించారు.
23, నవంబర్ 2010, మంగళవారం
పిల్లి - బాలినేని - కోమటిరెడ్డి "ఔట్": చిరు వర్గం "ఇన్"
ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ సుడిగాలి పర్యటనలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధిష్టానానికి పంటికింద రాయిలా మారిన వైఎస్ జగన్ వర్గానికి వీరవిధేయులుగా ఉన్న ముగ్గురు మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. జగన్ ఓదార్పులో పాల్గొనవద్దని ఎంత చెప్పినప్పటికీ వినని ఈ మొండి మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని రోశయ్య అడిగినట్లు సమాచారం.సీఎం రోశయ్య అడిగినదానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్ వీరివిధేయులుగా ముద్రపడిన మంత్రుకు ఉద్వాసన పలికి వారి స్థానంలో జానారెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డిలతోపాటు ప్రజారాజ్యం పార్టీని కూడా మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే చిరంజీవి ఢిల్లీకి పయనమై వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ చేపడితే ప్రస్తుతం ఉన్న మంత్రుల సంఖ్య 33 నుంచి 45కి పెరిగే అవకాశం ఉంది. మొత్తమ్మీద సీఎం రోశయ్య ఢిల్లీ పర్యటన రకరకాల అనుమానాలకు తావిచ్చింది. అసలు సంగతి ఏమిటన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
రాజుగారి అక్రమాలు మాటేంటి
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలచేత... ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు నిత్యం నిధులను వెనకేసుకోవడంలోనే బిజీ అయిపోతున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం మన దేశంలోని నాయకుల చరిత్రను తవ్వి చూస్తే బయల్పడుతున్న విషయాలు ఇవే."ఏ నాయకుడిని చూసినా ఏమున్నది... అవినీతి అక్రమాల చుట్టూ వారి రాజకీయ జీవితం" అన్నట్లుగా ఉంది నేటి రాజకీయ నాయకుల పరిస్థితి. అమాత్య కిరీటం అక్రమార్జనకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. దీపావళి సంబరాల్లో భారత్‌లో అడుగుపెట్టిన బరాక్ ఒబామా భారత్ అభివృద్ధిని చూసి ఓహో.. ఆహా అంటూ పొగిడి వెళ్లారు.ఆయన పొగడ్త వెనుక ఉన్న అసలు రహస్యం సంగతి అలా ఉంచితే... మన దేశంలో నాయకులు, నాయకుల అండతో దేశాన్ని దోచుకు తింటున్న లక్షల కోట్ల ధనం... నిజంగా ప్రజలకోసం వినియోగమైతే భారతదేశం సూపర్ సోనిక్ కంట్రీగా ఇప్పటికే అవతరించి ఉండేది. అయితే ఇంతమంది పందికొక్కులు ఎడాపెడా డబ్బును తినేస్తున్నప్పటికీ వాటన్నిటినీ తట్టుకుని భారతదేశం ఆమాత్రమైనా ముందుకు వెళుతున్నదంటే సగటు భారతీయుల్లో కాస్తో కూస్తో నీతి, నిజాయితి ఇంకా బతికే ఉందని అనుకోవచ్చు.
అవినీతి, అక్రమాల ఊబిలో ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న భారత్ పగ్గాలలో ఒక్కో పగ్గా( శాఖ)న్ని ఒక్కో మంత్రి తన చేతిలోకి తీసుకుని సమర్థవంతంగా నడపాలి. కానీ ఏం జరుగుతోంది. చేతిలోకి పదవి వచ్చీరాగానే నిధుల వేటలో మునిగిపోతున్నారు మంత్రులు, నాయకులు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి అల్లుడు, టెలికం మాజీమంత్రి రాజా నిర్వాకం దీన్నే ఎత్తి చూపిస్తోంది.కమ్యూనికేషన్ల శాఖను నిర్వహించిన రాజా, దర్జాగా.. అడ్డగోలుగా కేటాయింపులు చేసి ప్రభుత్వానికి దక్కవలసిన రూ.1.76 లక్షల కోట్ల రూపాయలకు గండికొట్టారు. ఆ నిధులు దారులు వెతుక్కుంటూ పక్కదారులకు వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.అడ్డగోలుగా కేటాయింపులు చేస్తూ టెలికం మంత్రి ఎ.రాజా అక్రమాలకు ద్వారాలు తెరిచారు. ఫలితంగానే ప్రభుత్వానికి ఇంతటి భారీ నష్టం.టెలికమ్యూనికేషన్ల పనితీరుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఎదుట ఉన్నది. కాగ్ సమర్పించిన నివేదికను మంగళవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో అగ్రశ్రేణి కార్పొరేట్ కంపెనీలు వాటాలను ఎలా కొల్లగొట్టిందీ, 2జి స్పెక్ట్రమ్ లైసెన్సులను దక్కించుకునేందుకు అవలంభించిన అక్రమ మార్గాలన్నిటినీ కాగ్ తన నివేదికలో ఏకరవు పెట్టింది.కేటాయింపులకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలను రాజా తుంగలో తొక్కినట్లు స్పష్టంగా కనబడుతోంది. నిబంధనలను అతిక్రమిస్తూ కేటాయింపులు దక్కించుకున్న కంపెనీల్లో స్వాన్, యూనిటెక్, లూప్, డేటాకమ్ ఎలియాంజ్ ఇన్‌ఫ్రా వంటివి ఉన్నట్లు కాగ్ ఎత్తి చూపింది. మొత్తం 120 కంపెనీల్లో సుమారు 85 కంపెనీలకు సంబంధించిన లైసెన్సులన్నీ సక్రమమైనవి కావని కాగ్ తెలిపింది.ఇటువంటి కంపెనీలకు కేటాయింపులను చేస్తూ అప్పటి టెలికం మంత్రి రాజా, జనవరి 10, 2008లో పత్రికా ప్రకటన జారీ చేశారని పేర్కొంది. చిత్రంగా ప్రకటన వెలువడ్డ 45 నిమిషాల్లోపే వ్యవహారం అంతా చకచకా జరిగిపోయిందని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే మంత్రి తీసుకోబోయే నిర్ణయాలు, కేటాయింపుల గురించిన సమాచారం ముందుగానే ఆయా కంపెనీలకు చేరిపోయిందని తెలుస్తోంది.పైగా పత్రికా ప్రకటన వెలువడక ముందే కొన్ని కంపెనీలు డీడీలు తీసుకుని సిద్ధంగా ఉంచుకోవడాన్ని చూస్తే పరిస్థితి తేటతెల్లమవుతుంది. ఇలా అడగుడుగునా రాజా అక్రమాలకు తలుపులు బార్లా తెరిచారని కాగ్ నివేదిక ఎండగట్టింది. ఇదీ టెలికం మాజీమంత్రి వ్యవహారం.ఇక కామన్వెల్త్ క్రీడలకుగాను నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్‌లో అక్రమాల వ్యవహారంలో కల్మాడీ, కార్గిల్ అమరవీరులకోసం నిర్మించిన ఆదర్స్ భవనం ప్లాట్ల కేటాయింపుల్లో "మహా" మాజీముఖ్యమంత్రి అశోక్ చవాన్ పాత్ర.... ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం ప్రపంచపుటవినీతి జాబితాలో అత్యంత వేగంగా అగ్రస్థానాన్ని ఆక్రమించేటట్లు కనబడుతోంది. ఈ జాఢ్యాన్ని కూకటి వేళ్లతో పెకళించగల నిస్వార్థ నేతలు భవిష్య భారతంలో చూడగలమా..? ఏమో..?

అమెరికా పౌరసత్వ లాటరీలో కోటిన్నర విదేశీయులు
అమెరికా గ్రీన్-కార్డ్ (శాశ్వత పౌరసత్వం) లాటరీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో అభ్యర్థులు ప్రవేశించారు. ఈ సంవత్సరం కోటిన్నర మంది విదేశీయులు అమెరికాలో శాశ్వత పౌరసత్వం కోసం బారులు తీరారు. అమెరికాలో వార్షికంగా 50,000 మంది విదేశీయులకు త్వరితగతిన న్యాయపరమైన, శాశ్వత పౌరసత్వం లభించే విధంగా గ్రీన్-కార్డ్ లాటరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.కాగా.. ఈ కార్యక్రమానికి ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చి చేరాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ లాటరీ కార్యక్రమాన్ని "వైవిధ్య వీసా కార్యక్రమం" అనే పేరుతో వ్యవహరిస్తారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 25 శాతం మంది ఈ లాటరీ కోసం దరఖాస్తులు చేసుకున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.ఈ లాటరీలో పాల్గొన్న వారి నుంచి కేవలం 50,000 మందిని మాత్రమే ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. అమెరికా శాశ్వత పౌరసత్వం అభ్యర్ధుల అదష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియను కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రారంభించింది. అయితే ఇప్పుడు కొందరు లామేకర్లు మాత్రం ఈ ప్రక్రియకు ఫుల్‌స్టాప్ పెట్టాలని పిలుపునిస్తున్నారు.కెన్యా నుంచి కజకిస్థాన్ వరకూ అభ్యర్ధులు ఇంటర్నెట్ ద్వారా ధరఖాస్తులను పూర్తి చేశారు. ఈ ప్రక్రియ గడువు తేదికి కొన్ని గంటల సమయానికి ముందు, ఒక నెలపాటు ధరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యతో సమానంగా ధరఖాస్తులు అందాయి. గడువుకు చివరి ఘడియల్లో గంటకు 62,000 అప్లికేషన్ల చొప్పున చేరాయి. ఈ ప్రక్రియ ఈ సంవత్సరం నవంబర్ 3న ముగిసింద"ని ఆ పత్రిక వెల్లడించింది.
ప్రభుదేవ కేసు విచారణ జనవరి 1కి వాయిదా
ప్రభుదేవపై భార్య రమలత్ వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు జనవరి 1కి వాయిదా వే సింది. తదుపరి విచారణకు ప్రభుదేవ, నయనతార నేరుగా కోర్టుకు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా వెంకీ "నాగవల్లి" విడుదల
విక్టరీ వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సమర్పణలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ప్రిస్టీజియస్ మూవీ నాగవల్లి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరు 16న విడుదలకు సిద్ధమైంది.ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... ఇటీవల విడుదలైన ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. ఈ వారంలోనే థియేటర్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఆడియో హిట్ కావడంతో సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారఅంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా వెంకటేష్ పెర్‌ఫార్మెన్స్ ఉంటుంది. పి.వాసుగారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.చంద్రముఖి కంటే నాగవల్లి పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి వెంకటేష్, 60మంది డాన్సర్లపై రాజు సుందరం నృత్య దర్శకత్వంలో అభిమానులు లేనిదే హీరోలు లేరురా.. అనుచరులు లేనిదే లీడరు లేరురా అనే పాటను బాదామిలో చిత్రీకరిస్తున్నాం. దీంతో చిత్రం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. నాగవల్లి మా బ్యానర్లో ఓ మెమరబుల్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అన్నారు.
నేడో రేపో గ్రూపు-1 ప్రిలిమ్స్ ఫలితాలు
హైదరాబాద్: గ్రూపు-1 ప్రిలిమ్స్ సమాధానపత్రాల మూల్యాంకనం పూర్తయిందని, మంగళ లేదా బుధవారాల్లో ఫలితాలు వెలువడొచ్చని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
ఉభయ సభలు బుధవారం నాటికి వాయిదా
2జీ స్పెక్టృం కుంభకోణంపై పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో బుధవారం నాటికి వాయిదా పడ్డాయి. మంగళవారం పార్లమెంట్ సభ ప్రారంభమైయిన వెంటనే 2జీ స్పెక్టృంపై జేపీసీ విచారణకు విపక్షాలు పట్టుబట్టాయి. సభను సజావుగా నడవడానికి సహకరించాలని స్పీకర్ ఎంత సర్దిచెప్పిన విపక్ష సభ్యులు వినకపోవడంతో సభా కార్యక్రమాలకు ఆటకం ఏర్పడటంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి.తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. జేపీసీకి పట్టుపడుతూ సభ్యులు పొడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోయేసరికి సభను బుధవారం నాటికివాయిదా వేశారు. రాజ్యసభలోకూడా ఇదే పరిస్థితి నెలకొనగా సభను రేపటికి వాయిదా వేశారు.
కాంబోడియాలో పెను విషాదంనామ్‌ఫెన్:
కాంబోడియాలోని నామ్‌ఫెన్‌లో జరుగుతున్న జలోత్సవంలో సోమవారం రాత్రి తొక్కిసలాట జరిగి 345మందికి పైగా మృతిచెందారు. మృతుల్లో 240మంది మహిళలు ఉన్నారు. 329మందికి తీవ్రగాయాలయ్యాయి. బ్రిడ్జిపై నుంచి ఒక్కసారిగా దూసుకెళ్లేందుకు లక్షల మంది ప్రజలు ప్రయత్నించడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జనం కాళ్ల కింద నలిగి, నీళ్లల్లో పడిపోయి అనేక మంది మృతిచెందారు. మృతులసంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
సీఎంగా రోశయ్య పూర్తికాలం కొనసాగుతారు: చిరు జోస్యం!!
ముఖ్యమంత్రి పదవిలో రోశయ్య పూర్తికాలం కొనసాగుతారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జోస్యం చెప్పారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. హస్తినకు చేరుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజారాజ్యం పార్టీ చేరుతుందని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇవి కేవలం మీడియా ఊహాజనిత కథనాలేనన్నారు.ఇకపోతే.. ముఖ్యమంత్రి రోశయ్య తన పదవిలో ఐదేళ్ళపాటు కొనసాగుతుందన్నారు. ఆయనకు ఉన్న అపార అనుభవంతో మిగిలిన కాలాన్ని నెట్టుకొస్తారన్నారు. పోలవరంతో పాటు.. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇదే అంశంపైనే ప్రధాని మన్మోహన్‌తో సమావేశం కానున్నట్టు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో సమావేశమయ్యే అవకాశాలు లేవన్నారు.
22, నవంబర్ 2010, సోమవారం
27న సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రంలో సృజనాత్మక కళలనుప్రోత్సహించి సంస్కృతి, సంప్రదాయాలను పునరుజ్జీవింపజేయాలనే సంకల్పంతో టి. సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్‌ను ప్రారంభించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ పరిషత్ ఛైర్మన్‌గా డి.రామానాయుడు, సలహాదారులుగా అక్కినేని నాగేశ్వరరావు, డాక్టర్ సి.నారాయణరెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. ఈనెల 27న శిల్పకళావేదికపై ముఖ్యమంత్రి రోశయ్య దీన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
మీ శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయి?
శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనడాన్ని బట్టి ఫలితాలను చెప్పేయవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగను, ఆకుపచ్చగను, తేనెరంగును, పసుపుపచ్చగను, గంధపురంగుగా ఉంటాయి.ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి. అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచకములని పండితములు అంటున్నారు. అయితే లేత నలుపు, ఆకుపచ్చరంగు, గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి.అలాగే పుట్టుమచ్చల మీట వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అని కొంచెము పొడవు కలిగివున్నచో ఆ వ్యక్తి ధనవంతుడు, కీర్తివంతుడవుతాడని పురోహితులు చెబుతున్నారు. అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెము పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయి.ఇకపోతే.. పురుషులకు రెండు కనుబొమల మధ్య యున్నచో ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. బంధుప్రియుడవుతాడు. భోగములందు ఆసక్తి కలిగివుంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమకలిగి వుంటాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
కార్తీక సోమవారాల్లో నదీస్నానం, దీపారాధన చేస్తే..!
సాధారణంగా ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే మాసానికి వస్తుంది. అలా కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి 'కార్తీకమాసమ'ని పేరు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉందిఅలాగే కార్తీక మాసాల్లో వచ్చే సోమవారాల్లో మాత్రమే గాకుండా, మంగళవారాల్లో పెళ్లికాని అమ్మాయిలు, వివాహితులైన మహిళలు గౌరీదేవిని నిష్టతో పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులుఅంటున్నారు. కార్తీకమాసంలోవచ్చేసోమవారం శివునికెంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించేవారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతీరోజూ ఆదిదంపతులను ప్రార్థించేవారికి ఈతిబాధలు తొలగిపోతాయి. అందుచేత కార్తీక సోమ, మంగళవారాల్లో వివాహిత, అవివాహితులు శివాలయాలకు చేరుకుని, నేతితో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇలాచేస్తే.. వివాహం, సుఖసంతోషాలు, సకలసంపదలు, వాహనయోగం వంటివి చేకూరుతాయికార్తీక సోమవారాల్లో నదీ స్నానాలు చేస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటే.. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్చీకమాసంలో వేకువ వేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీస్నానం చేయడం చాలా మంచిది. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైన ఉంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడై శివుడిని ధ్యానించాలి. అలాగే ఈ నెలరోజుల పాటు భక్తులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేస్తే మహత్తరశక్తి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.
భక్తవత్సలం "టు" మోహన్‌బాబు
భక్తవత్సలం నుంచి తన గురువు దాసరి ద్వారా పేరు మార్చుకున్న ఎవర్‌గ్రీన్ నటుడు మోహన్‌బాబు సినిమా రంగానికి వచ్చి 35 ఏళ్లు గడిచింది. గురువు దాసరి పెట్టిన భిక్ష "స్వర్గం - నరకం". అందులో మోహన్ బాబు జీవించాడు. ఎవడురా... ఇంతటి విలనిజాన్ని పండించినవాడని ఇండస్ట్రీ యావత్తూ ఆయనపై దృష్టి పెట్టింది. గాత్రంతోపాటు శారీరక ఆకర్షణ విలనిజానికి ప్రత్యేకతను చూపించాడు.ఢీ అంటే ఢీ అన్నట్లు ఎన్టీఆర్‌తో ధీటుగా నటించి మెప్పించిన నటుడు ఆయనే. చిరంజీవితోకూడా కలిసి నటించినా మోహన్‌బాబు ధాటికి చిరంజీవి కూడా తట్టుకోలేకపోయాడు. తెల్లదొర పాత్రలోనూ ఒదిగిపోయాడు. ప్రస్తుతం తన కుటుంబాన్ని ఈ పరిశ్రమకే అంకితం చేశాడు. అడపాదడపా తనూ నటిస్తూ తనలోని నటుడిని బయటపెడుతున్నాడు.విష్ణు, మనోజ్‌లు కథానాయకులుగా నటిస్తుండగా కుమార్తె లక్ష్మీప్రసన్న నిర్మాతగా సాగుతోంది. మోహన్‌బాబు మార్చి 19, 1952లో జన్మించారు. చెన్నైలో పి.డి కోర్సు చదివారు. ఆ తర్వాత డ్రిల్ మాస్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి... ఆ తర్వాత సినీరంగంలో ప్రవేశించారు. డైరెక్టర్ డిపార్ట్‌మెంట్‌లో 1970లో ప్రవేశించారు. 1975 నవంబరు 22న ఆయన నటించిన తొలిచిత్రం స్వర్గం - నరకం చిత్రం విడుదలైంది.35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మజిలీలు. విలన్‌గా, కథానాయకునిగా, నిర్మాతగారాజకీయవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన ఆయన కెరీర్‌లో పద్శశ్రీ అవార్డును కూడా పొందారు. భరతముని, వంశీబర్కిలీ వంటి పలు కల్చరల్ అవార్డులను పొందారు. "మా" అధ్యక్షునిగా కూడా పనిచేశారు.ప్రతిజ్ఞ, అల్లుడుగారు, రౌడీపెళ్లాం, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, రాయలసీమ రామన్న చౌదరి, యమదొంగ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన కెరీర్లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలే ఘనవిజయాలు సాధించిపెట్టాయి.ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కల ఆయన తన తోటి నటీనటులతోనూ అదేవిధంగా ప్రవర్తిస్తాడు. సెట్ లో ఉండాలంటే నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది. నేడు దర్శకులు చాలామంది నేర్చుకోవలసిన అంశమిది. యమదొంగలో ఆయన డెడికేషన్ చూసి రాజమౌళి దంపతులే ఆశ్చర్యపోయారు. ఆ మధ్య ఓ సందర్భంలో ఆయనను ఇంటర్య్వూ చేయడం జరిగింది.
మిమ్మల్ని చూసి అందరూ భయపడుతుంటారట.. కారణం...?
ఇది ఇండస్ట్రీలో నెలకొన్న ధోరణి. ఎక్కడ సిన్సియారిటీ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. అది ఒక్కోసారి మైనస్‌గాను ఉంటుంది. అంటూ... ప్రక్కనే ఉన్న బ్రహ్మానందాన్ని పిలిచి, ఇదిగో... బ్రహ్మీ.. నేనంటే నీకు భయమా..? అని అడిగారు. వెంటనే బ్రహ్మానందం.. మీరంటే ఎవరికి భయమెవరకి ఉండదండీ... అందుకే అందరూ సైలెన్స్‌గా ఉంది.మీతో నటించడం టెన్షన్‌గా కూడా ఉంటుంది. పేమెంట్ ఇస్తారో లేదోనని.. అంటూ అధినేత షూటింగ్‌లో బ్రహ్మానందం చెప్పాడు. దానికి మోహన్‌బాబు స్పందిస్తూ... కొన్ని సీక్రెట్లు బయటకు చెప్పకూడదయ్యా. అయితే నీకు పేమెంట్‌లో కొంత కట్ అంటూ.. ఏదో నవ్వులాటకు అన్నాను అంటూ స్పందించారు మోహన్ బాబు.చాలా సరదాగా సెట్లో జోకులతో ఉండే మోహన్ బాబు తేడా వస్తే తన కన్నకొడుకుల్నైనా వదలడు. ఝుమ్మంది నాదం షూటింగ్‌కు మనోజ్ కాస్త లేట్‌గా వస్తే.. చడామడా తిట్టేసి.. రాత్రంతా తిరగడం, తాగడం.. డిసిప్లిన్ తప్పాడంటూ.. అందరి ముందే వేలెత్తి చూపాడు. ఇలా చెపితే.. ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. కానీ, తన నటగురువు ఎన్టీఆర్ గురించి మాత్రం గొప్పగా చెపుతారు. నడకలో, నడతలోనూ, ఆంగికాభినయాల్లో అన్న ఎన్టీఆరే తనకు ఆదర్శం అని చెపుతారు మోహన్‌బాబు

21, నవంబర్ 2010, ఆదివారం
శ్రీలంకలో పెరిగిపోతున్న అత్యాచారం కేసులు
శ్రీలంకలో అత్యాచారం కేసులు పెరిగిపోతున్నాయి. గత పదేళ్లలో నేరాలు తగ్గినా, అత్యాచారం కేసులు మాత్రం పెరిగిపోతున్నాయని ఓ సర్వేలో తేలింది. 2009వ సంవత్సరం శ్రీలంకలో 57,340 నేరాలపై కేసులు నమోదయ్యాయి.అంతకుముందు సంవత్సరం (2008)లో 3530 మాత్రమే కేసులు నమోదయ్యాయి. అయితే 2009లో అత్యాచారం కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. గత ఏడాది శ్రీలంకలోని రత్నపురంలో 107 అత్యాచారం కేసులు, అనురాధపురంలో 98, కోకాలైలో 82, మాత్తరైలో 65 అత్యాచార కేసులు నమోదైనట్లు సర్వే తెలిపింది.శ్రీలంకలో నేరాలు-ఘోరాలు సంఖ్య రోజు రోజుకు తగ్గినప్పటికీ అత్యాచారం కేసులు మాత్రం పెరిగిపోతోందని పోలీసు యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది
ఫైనల్‌లోకి ప్రవేశించిన సోమ్‌దేవ్
గాంగ్‌జౌ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుడు సోమ్‌దేవ్ వర్మన్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్‌లో జపాన్ క్రీడాకారుడు తత్సుమా ఇటోపై 6-2, 0-6, 6-3తో సోమ్‌దేవ్ విజయం సాధించాడు. ఫైనల్‌లో ఉజ్బెకిస్థాన్ ఆటగాడు ఇస్టోమిన్‌తో సోమ్‌దేవ్ తలపడనున్నాడు.
జనన సంఖ్యను పెంచుకోవడానికి బాల్యవివాహాలు: ఇరాన్
ఇరాన్ దేశంలో కుటుంబ నియంత్రణ వల్ల జనభా సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో అక్కడ బాల్యవివాహాలను ఆ దేశాధ్యక్షుడే ప్రోత్సహిస్తున్నారు. 16 ఏళ్లు నిండిన బాలికలు పెళ్లి చేసుకోవచ్చని ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మది నెజాది సూచించారు.గడచిన 1979లో ఇస్లామిక్ విప్లవం వెలుగుచూసిన నేపథ్యంలో 1990లో జననాల సంఖ్యను తగ్గించేందుకు అప్పటి ఇరాన్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణను అమలు చేసింది. కానీ.. అక్కడ నాటకీయ పరిణామాలతో జనన సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.ఆ సమయంలో దీనిని వ్యతిరేకించిన వారే ఎక్కువగా ఉన్నారు. కుటుంబ నియంత్రణ ప్రక్రియ దైవ వ్యతిరేకమని, పాశ్చాత్య సంస్కృతి నుంచి దిగుమతయిందని అధ్యక్షుడు విమర్శలు చేశారు. కాబట్టి బాలురకు 20ఏళ్లు, బాలికలకు 16ఏళ్లు రాగానే వివాహాం చేసుకోవాలని కోరుతున్నట్లు నెజాది చెప్పారు.కాగా.. ప్రస్తుతం ఇరాన్‌లో బాలురకు 26, బాలికలకు 24 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలనే నిబంధన ఉంది. గత 2005లో నెజాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ జనాభా పెరగాలని కోరుతున్నారు. అయితే.. ఇప్పటికే దేశంలో ఓ వైపు నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా ఉండటంతో ఈ తాజా పరిణామాల వల్ల జనాభా మరింత పెరిగితే.. నిరుద్యోగుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశముందని విమర్శకుల వాదన.
పుట్టపర్తి బయలుదేరిన ముఖ్యమంత్రి
విజయవాడ : సత్యసాయిబాబా జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రోశయ్య బెజవాడ నుంచి పుట్టపర్తి బయలుదేరారు. అంతకు ముందు ఆయన విజయవాడ నగర పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కాగా ఎస్‌ఐ పరీక్షలను వాయిదా వేయవద్దంటూ విద్యార్థి సంఘాల నేతలు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
విజయవాడ నగర పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం
విజయవాడ: విజయవాడ నగర పోలీస్ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి రోశయ్య ఈ ఉదయం ప్రారంభించారు. vijayawadapolice.org పేరిట ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. కమిషనరేట్‌కు చెందిన 15 విభాగాలతో అన్ని వివరాలను ఈ సైట్‌లో పొందుపరిచారు. ఈ కార్యక్రమం అనంతరం ఎస్సై పరీక్ష నిర్వహించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఏఐవైఎఫ్ నాయకులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి పుట్టపర్తికి వెళ్లేందుకు బయల్దేరారు.
ఆసుపత్రిలో చేరిన హృతిక్
ముంబయి: బాలీవుడ్ కథానాయకుడు హృతిక్‌రోషన్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. హృతిక్ తీసుకున్న రోగ నిరోధక (యాంటిబయాటిక్) మందులు వికటించి ఎలర్జీకి గురవడంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇక్కడి కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు. ''హృతిక్ నటించిన 'గుజారిష్' చిత్రం శుక్రవారం విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఆయన తీరికలేకుండా ఉన్నారు. ఆదివారం ప్రచార కార్యక్రమానికి వెళ్లే ముందు ఆయన వేసుకొన్న మందులు వికటించాయి'' అని హృతిక్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ''యాంటిబయాటిక్ వల్ల నేను ఎలర్జీకి గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. గొంతు మూసుకుపోయి ఊపిరి తీసుకోలేకపోయాను'' అని హృతిక్ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ''ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. రాత్రికి ఇంటికి వెళ్లిపోవచ్చు'' అని చెప్పారు.
గంభీర్ అర్థ సెంచరీ; భారత్ 220/2
నాగపూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రెండో రోజు టీ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు సెహ్వాగ్(74), గంభీర్(78) అర్థ సెంచరీలతో జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరినీ కివీస్ బౌలర్లు వెటోరి, సౌతీ అవుట్ చేశారు. టీ విరామ సమయం తర్వాత ఆట ప్రారంభించిన టీమిండియా 220/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. దావిడ్ 43, సచిన్ 13 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌లో 193 పరుగులకు ఆలౌట్ అయింది.
సోనియాపై సాక్షి కథనం: జగన్‌కు షోకాజ్ నోటీసులు!?
చెప్పిన మాట వినడని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప ఎంపీ వై.ఎస్. జగన్‌పై హైకమాండ్ సీరియస్ అయ్యింది. సాక్షి టీవీ ఛానెల్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన కథనాలపై కాంగ్రెస్ అధిష్టానం తగిన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో జగన్ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న హైకమాండ్, ఆ కథనం పార్టీ పరువుకు భంగం కలిగించేవిగా ఉంటే ఏమి చర్య తీసుకోవాలని యోచిస్తోంది.కానీ జగన్‌పై కాంగ్రెస్ అధిష్టానం తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. పనిలో పనిగా సాక్షి కథనంపై నివేదిక పంపాల్సిందిగా పీసీసీకి హైకమాండ్ ఆదేశించింది. అధిష్టానం ఆదేశంతో పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇప్పటికే నివేదిక పంపారు. కాగా.. హైకమాండ్ నివేదికను పరిశీలించి.. జగన్‌కు షోకాజ్ నోటీసు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రాంతీయ పార్టీకి ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు.. సోనియాపై తప్పుడు ప్రచారం చేసిన సాక్షి కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ బాబు ఆందోళనకు దిగారు. అయితే ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు సురేష్ బాబు అరెస్టు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సాక్షి పత్రికలను తగులబెడుతూ.. సాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేపడుతున్నారు.
ఆసియాడ్‌లో భారత్‌కు కాంస్యం
గాంగ్‌జౌ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ మరో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రెజ్లింగ్ 60 కిలోల విభాగంలో భారత రెజ్లర్ రవీందర్‌సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు.
20, నవంబర్ 2010, శనివారం
ఎవరెస్ట్ శిఖరం వద్ద చిక్కుకున్న 1500 మంది సురక్షితం
వాతావరణం అనుకూలించక ఎవరెస్ట్ శిఖరం వద్ద చిక్కుకున్న 1500 మంది పర్యాటకులను నేపాల్ అధికారులు సురక్షితంగా రక్షించారు. ఆర్మీ హెలికాఫ్టర్లు, ఏయిర్‌ప్లేన్ల సాయంతో వీరిని రక్షించినట్టు నేపాల్ టూరిజం బోర్డుకు చెందిన మీడియా కోఆర్డినేటర్ శరద్ ప్రధాన్ వెల్లడించారు.దీనిపై ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా ఎవరెస్ట్ శిఖరం ప్రధాన ద్వారంగా భావించే లుక్లా వద్ద వాతావరణం అనుకూలించగా చిక్కుకుని పోయారు. వీరిని రక్షించేందుకు ఎన్నో రకాల చర్యలు చేపట్టారు. ఆ చర్యలేవీ ఫలించలేదు. దీంతో నేపాల్ ఆర్మీని రంగంలోకి దింపి, వారి సహకారంతో చర్యలు చేపట్టింది.మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ సివిల్ ఏవియేషన్, నేపాల్ టూరిజం బోర్డు విజ్ఞప్తి మేరకు రంగంలోకి ఆర్మీ హెలికాఫ్టర్లు మౌంట్ ఎవరెస్ట్ వద్ద చిక్కుకున్న పర్యాటకులను క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు శరద్ ప్రధాన్ వెల్లడించారు.
ఆర్థిక పరిస్థితులపై పెరిగిన భారతీయుల అంచనాలు
దాదాపు గత రెండేళ్లుగా దేశాన్ని పీడించిన ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కున్న అనంతరం భారత్ అతి వేగంగా కోలుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత్ అగ్ర దేశాల కన్న వేగంగా రెండెకల వృద్ధి వైపు శరవేగంగా పయనిస్తోంది.ఈ నేపథ్యంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ అబివృద్ధిలో భారతీయలు అభిప్రాయాలపై నిర్వహించిన ఓ సర్వేలో 2010 సంవత్సరంలో స్థానిక ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని భావించే వారి సంఖ్య గడచిన మూడేళ్లుగా చూస్తే గణనీయంగా పెరిగింది.గత 2007, 2009 మధ్య కాలంలో స్థానిక ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయని విశ్వసించే వారి సంఖ్య 52 శాతం నుంచి 37 శాతానికి పడిపోయింది. కానీ.. 2010లో మాత్రం ఆ సంఖ్య తిరిగి వృద్ధి చెందుతూ.. 45 శాతానికి పెరిగినట్లు సర్వే నిర్వహించిన "గల్లుప్" తెలిపింది.ఇదే విధంగా భారతీయుల జీవణ ప్రణాల మీద కూడా గల్లుప్ సర్వే నిర్వహించింది. జీవణ ప్రణాలపై ఈ ఏడాది భారతీయులపై జరిపిన సర్వేలో 44 శాతం మంది ప్రజలు తమ జీవణ ప్రణాల మెరుగుపడినట్లు వెల్లడించారు. కాగా.. గతేడాది వీరి సంఖ్య 32 శాతంగా ఉంది.
రాష్ట్ర మార్కెట్లో నానో ఓపెన్ సేల్స్: 22 నుంచి ప్రారంభం
టాటా మోటార్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిన్న కారు నానో.. ఇప్పుడు రాష్ట్రీయ మార్కెట్‌లో కూడా ఓపెన్ సేల్స్‌కు వచ్చేసింది. ఈనెల 22 నుంచి నానో ఎలాంటి ముందస్తు బుకింగ్ అవసరం లేకుండా షో రూంకు వెళ్లి కొనుగోలు చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర మార్కెట్‌లో కల్పించింది.దీంతో గతేడాది నానో కార్లను బుక్ చేసుకోలేని వారు ఇప్పుడు నేరుగా షోరూమ్‌లుక వచ్చి నానో కారుని కొనుగోలు చేసుకునే అవకాశం ఏర్పడింది. షోరూంలలో టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని కూడా టాటా మోటార్స్ కల్పిస్తోంది. నానో కారు కొనుగోలుకు కావాల్సిన రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని, ఇందుకు గానూ 26 బ్యాంకులతో తమ కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకుందని టాటామోటార్స్ తెలిపింది.కాగా.. ఈ తరహా ఓపెన్ సేల్స్ ఇప్పటికే.. గుజరాత్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో టాటా మోటార్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్‌లో 50 వేల మంది స్టీల్‌వర్కర్లకు ఉపాధి గండం!!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది స్టీల్ వర్కర్లు తమ ఉపాధిని కోల్పోనున్నారు. రాష్ట్రంలో ఉన్న మధ్యతరహా స్టీల్ ప్లాంట్లలో 175 ప్లాంట్ల యజమానులు తమ ప్లాంట్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్లాంట్లలో పని చేస్తున్న 50 వేల మంది రోడ్డున పడనున్నారు. నానాటికీ పెరిగిపోతున్న స్టీల్ (ఉక్కు) ధరలతో పాటు.. ముడి ఇనుముగా స్పాంజ్ ఐరన్‌ను వినియోగిస్తున్నారు. దీంతో మధ్యతరహా ప్లాంట్‌లు మనుగడ కొనసాగించలేక పోతున్నాయి. ఫలింతా 175 స్టీల్ ప్లాంట్లను మూసివేయాలని యజమానులు నిర్ణయించారు.దీనిపై ఛత్తీస్‌గఢ్ మిలీ స్టీల్ ప్లాంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ సురానా మాట్లాడుతూ.. స్పాంజ్ ఐరన్ ధర రూ.14,000 - 15,000 నుంచి రూ.18,000 పెరిగినప్పటికీ అవసరాలకు అందడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబరు ఒకటో తేదీ నుంచి తమ ప్లాంట్లను మూసి వేయడం మినహా తమకు ప్రత్యామ్నాయం లేదని ఆయన వివరించారు. తాము తీసుకున్న 175 స్మాల్ యూనిట్లలో పని చేస్తున్న 50 వేల మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
స్థూలకాయంపై అవగాహన రన్
హైదరాబాద్ : స్థూలకాయంపై అప్రమత్తంగా ఉండాలంటూ లీడ్ మెడికల్ సెంటర్ నెక్లెస్‌రోడ్డులో రన్‌ను నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో స్థూలకాయుల సంఖ్య ఎక్కువగా ఉందని దీనిని తగ్గించడానికి అందరూ అవగాహన చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఆరోగ్యభద్రతపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని భన్వర్‌లాల్ అన్నారు.
దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి
హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాదిమంది భక్తులు నదీస్నానం చేశారు. దేశంలోని పరమేశ్వరుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం తిరువణ్నామలైలో భరణీ దీపంతో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మన రాష్ట్రంలోని శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, పంచారామాలు .... భక్తులతో కిటకిటలాడాయి.
22న ప్రధాని పుట్టపర్తి రాక
పుట్టపర్తి: ప్రధాన మంత్రి మన్మోహన సింగ్ ఈ నెల 22న అనంతపురం జిల్లా పుట్టపర్తి రానున్నారు. సత్యసాయి బాబా జన్మదిన వేడుకలలో భాగంగా జరిగే సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు.
డ్రైవింగ్ లైసెన్సులకు తత్కాల్
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు తీసుకుని తక్షణం విదేశాలకు వెళ్లాలి. ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేస్తే 2 నెలల తర్వాతడ్రైవింగ్ పరీక్షకు రమ్మన్నారు. ఇది వేల మంది ఎదుర్కొనే సమస్య. ఇకముందు దీనికి పరిష్కారం లభించబోతోంది. రైల్వే తత్కాల్ టికెట్ల తరహాలో.. అత్యవసరమైన వారికి వెంటనే డ్రైవింగ్ పరీక్ష నిర్వహించే ఏర్పాట్లను రవాణాశాఖ చేస్తోంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవడం పెద్ద తతంగం. ముందుగా లెర్నింగ్ లైసెన్సు, ఆ తర్వాత పూర్తిస్థాయి లైసెన్సు తీసుకోవాలి. ఇందుకోసం ఈసేవా కేంద్రానికి వెళ్లి పరీక్షా సమయాన్ని (స్లాట్‌ను) కుదుర్చుకోవాలి. ఏ రోజు ఖాళీ ఉందో పరిశీలించి చెబుతారు. రుసుం చెల్లిస్తే సంబంధిత దరఖాస్తుదారుడి పేరున సమయాన్ని కేటాయిస్తారు. ఈ విధంగా వేలమంది ముందుగానే సమయాన్ని కుదుర్చుకుంటున్నారు. దాదాపు రెండు నెలల నుంచి మూడు నెలల ముందే సమయాలు అయిపోతున్నాయి. నాలుగు చక్రాల వాహనాల లైసెన్సులను రోజుకు వెయ్యిమందికి మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. దీనివల్ల వేల మంది నెలల తరబడి పరీక్ష సమయం కోసం వేచి చూడాల్సి వస్తోంది. అత్యవసరంగా లైసెన్సులు తీసుకోవాలనుకునే వారిని, విదేశాల్లో ఉద్యోగ నిమిత్తం వెళ్లాల్సిన వారిని ఈ విధానం ఇబ్బందులకు గురి చేస్తోంది.ప్రస్తుతం రైల్వేలో రైలు బయలుదేరే రెండు రోజుల ముందు తత్కాల్ కింద రిజర్వేషన్ టికెట్లను తీసుకోవచ్చు. దీనికి అదనపు రుసుం రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఇదే విధంగా డ్రైవింగ్ లైసెన్సుల పరీక్ష సమయాన్ని కూడా దరఖాస్తుదారులు తమ పేరుమీద అప్పటికప్పుడు కుదుర్చుకునేట్లుగా తత్కాల్ విధానాన్ని అమలు చేయాలని రవాణా శాఖ కమిషనర్ ప్రేమచంద్రారెడ్డి యోచిస్తున్నారు. ప్రస్తుతం ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు వేర్వేరుగా లైసెన్సు పొందాలంటే రూ.465 చొప్పున వసూలు చేస్తున్నారు. రెండింటికీ కలిపి ఒకేసారి తీసుకోవాలంటే రూ.515 వసూలు చేస్తున్నారు. తత్కాల్ అమల్లోకి వస్తే ఈ రుసుంలతో పాటు అదనంగా వసూలు చేస్తారు. పరీక్ష అయిన వెంటనే లైసెన్సు కార్డు ఇంటికి చేరుతుంది. ఈ అదనపు రుసుం రూ.200, ఆ పైన ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉన్నతాధికారులతోచర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. తత్కాల్ విధానానికి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వెబ్‌సైట్‌లో జాబితా!
రైల్వే తరహాలోనే లైసెన్స్ పరీక్ష సమయం కేటాయించే విషయంలోనూ వెయిటింగ్ లిస్ట్ పద్ధతిని అమలు చేయాలన్న ఆలోచన రవాణాశాఖలో ఉంది. ఈ-సేవలో ముందుగా సమయం కుదుర్చుకున్న వారు ఆ రోజు రాకపోతే వేరే వారికి కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక నుంచీ డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యే వారి వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో ఉంచుతారు. పరీక్షకు రావడం కుదరని వారు ముందుగానే ఆర్టీవో కార్యాలయంలో తెలియజేసే ఏర్పాట్లు చేస్తారు. ఆ సమయాన్ని.. క్రమసంఖ్య ప్రకారం జాబితాలో తర్వాత ఉన్నవారికి కేటాయిస్తారు. దరఖాస్తు చేసుకున్న వారు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్ చూసుకుని ఆ ప్రకారం పరీక్షకు హాజరుకావచ్చు. ఇందులో ఆచరణాత్మకంగా ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నారు.

పెరుగులో దాగున్న అందమైన ఆరోగ్యం
ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలోనే అందమైన ఆరోగ్యం దాగుంది. ఇందులో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. పెరుగులోని గుణాలేంటో తెలుసుకుందాం...
* ప్రతి రోజు పెరుగు సేవిస్తుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
* పెరుగులో వాము కలుపుకుని సేవిస్తే మలబద్దకం తగ్గి ఉపశమనం కలుగుతుంది.
* వేసవి కాలంలో పెరుగుతో చేసిన మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని లస్సీలాగా సేవిస్తే శరీరంలో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఎండల్లో తిరిగే వారు లస్సీని సేవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్య నిపుణులు.
* పెరుగు సేవిచండం వలన జీర్ణశక్తి పెరుగుతుంది.
* పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతి రోజు పెరుగును సేవించడం వలన ఉదరసంబంధిత జబ్బులు ముటమాయమౌతాయి.
* జలుబు, శ్వాసకోస సంబంధిత జబ్బులతో బాధపడేవారికి పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
* అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
* నోట్లో పొక్కులు ఏర్పడి నోరు పుండైతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కలిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

కాంటాక్ట్ లెన్స్‌కి కళ్లను "కాటు" వేయడమూ తెలుసు
ఒక్కోసారి ఓ చిన్న అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాంటిదే ఈ సంఘటన. ప్రాజెక్టులో భాగంగా మా కంపెనీ అవుట్‌డోర్ టూర్ ప్లాన్ చేసింది. ఓ రోజు రాత్రి అందరం సరదగా ఆడుతూ పాడుతూ గడుపుతున్నాం. అక్కడ ఓ చిన్నసైజు పార్టీ వాతావరణం నెలకొంది.అక్కడి వాతావరణం బాగా చలిగా ఉండటంతో కట్టెలతో మంట వేసి దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటూ... ఆ మంటకి దగ్గరగా కూర్చొని ఉన్న మా సహోద్యోగిని కాసేపటికి లేచి బాధతో అరుస్తూ, ఏడుస్తూ బాధ తాళలేక ఇష్టం వచ్చినట్లు గెంతుతూ నానా హైరానా పడసాగింది.ఆ అమ్మాయికి ఏంజరింగిందో, ఎందుకలా ప్రవర్తిస్తుందో ఎవరికీ అంతుబట్టలేదు. ఆ తర్వాత తనని హాస్పిటల్‌లో చేర్చాం. తనని పరీక్షించిన డాక్టర్లు ఆమెకి శాశ్వతంగా చూపు పోయిందని తేల్చారు. దానికి కారణమేంటో తెల్సా..! తను వాడిన కాంటాక్ట్ లెన్స్. ఆ కాంటాక్ట్ లెన్స్ ప్లాస్టిక్‌తో చేసినవి కావడం వల్ల ఆ చలి మంట తాలూకు వేడికి ఆ లెన్స్ కరిగి తన చూపుని దెబ్బతీశాయి.ఈ సంఘటన మా అందరినీ కలచి వేసింది. ఫ్యాషన్ ప్రపంచానికి అలవాటు పడుతున్న యువత ఇలా అందానికి పోయి అనర్థాలు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి కాంటాక్ట్ లెన్స్ వాడే విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. కాంటాక్ట్ లెన్స్ వాడాలనుకునేవారు ఈ కింది విషయాలపై దృష్టి సారించాలి. వీటి వాడకంలో సమస్యలు ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.కాంటాక్ట్ లెన్స్‌ను వైద్యుల సలహా మేరకే కొనుగోలు చేయాలి. మార్కెట్‌లో ఇష్టం వచ్చిన వాటిని కొని వినియోగిస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి. అలాగే.. నాణ్యమైన వాటినే కొనుగోలు చేయాలి, నాసిరకం వాటిని కొనుగోలు చేసి ఇబ్బందులు తెచ్చుకోకండి.లెన్స్ కొనుగోలు చేసేటపుడు వాటి గడువు తేది (ఎక్స్పైరీ డేట్)ని పరీక్షించుకోవాలి. గడువు ముగిసిన వాటిని వినియోగిచడం ప్రమాదకరం.రంగు, రంగుల లెన్స్ ఎంచుకునేటప్పుడు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రంగుల వల్ల కళ్లకు హాని కలిగే ప్రమాదం ఉంది.వీటిని ధరించినపుడు కళ్లు నలపడం, ఏడవడం వంటి పనులు చేయకూడదు. ఇవి ధరించినపుడు పొగ, ధూళికి దూరంగా ఉండాలి. నిద్రించే సమయంలో లెన్స్ వాడకండి.
లెన్స్ భద్రపరిచేందుకు కూడా ఓక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుది దానిని తెలుసుని ఆ విధంగా భద్రపరిస్తే మంచిది.
చెన్నయ్ సిటీ సెంటర్‌లో మోంబాసా కార్నివాల్-10
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని షాపింగ్‌మాల్స్‌లలో చెన్నయ్ సిటీ సెంటర్ ఒకటి. ఈ షాపింగ్ మాల్ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. అటు షాపింగ్‌తో పాటు మనస్సుకు ఆహ్లాదం కలిగించే సకల సౌకర్యాలు ఈ మాల్‌లో ఉండటం ప్రత్యేకత. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే షాపింగ్‌తో పాటు.. ఐమాక్స్ సినిమా థియేటర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ప్రస్తుత పండుగ సీజన్‌లలో నగర వాసులను మరింతగా ఆకర్షించేందుకు వీలుగా మోంబాసా కార్నివాల్ -10ను నిర్వహిస్తోంది. కెన్యా దేశంలోని మోంబాసా అనే ప్రాంతానికి చెందిన నలుగురు ఆఫ్రికా ఆర్కోబాట్స్ (సాహస క్రీడాకారులు) వళ్లుగగుర్పొడిచే విధంగా సాహసకృత్యాలను చేస్తూ ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. శనివారం నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక షో (ఒక తరహా సర్కస్) వచ్చే వారం రోజుల పాటు సాగుతుంది.బాసా అనే ప్రాంతంలోని ఆటపాటలతో పాటు వారి సంస్కృతీ సంప్రదాయలను కళ్ళకు కట్టినట్టు ఇందులో చూపించనున్నారు. చెన్నయ్ నగరంలోని షాపింగ్ మాల్స్‌లలో ఈ తరహా ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో బాడీ అక్రోబాటిక్స్, లింబో, వెర్టికల్ పో వంటి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రోజుకు మూడు ఆటను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన జరిగే ప్రాంతాన్ని హ్యాడిక్రాఫ్ట్స్, థికింగ్ మ్యాన్, గెయింట్ మాస్క్‌లతో అందంగా అలంకరించారు.తేకాకుండా, చెన్నయ్ సిటీ సెంటర్‌లో ప్రతి రూ.500లకు షాపింగ్ చేసే నగర వాసులు ఒక కూపన్ అందజేస్తారు. ఈ కూపన్ లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన వారికి లక్కీ బంపర్ బహుమతిని అందజేయనున్నట్టు తెలిపారు. వీటితో పాటు.. మొదటి బహుమతిగా యమహా ఎఫ్‌జడ్, రెండో బహుమతిగా స్కూటీ పెప్, మూడో ప్రైజ్‌గా హోమ్ థియేటర్ బహుమతిని అందజేయనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.
ఏవండీ.. సినిమా చూపిస్తా... వచ్చి చూడండి: ఐష్
హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన "గుజారిష్" చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో హృతిక్‌తో శృతిమించిన శృంగార సన్నివేశాలలో ఐష్ నటించిందని గత వారం నుంచీ బాలీవుడ్ సీనీజనం ఒకటే వాయిస్తున్నాయి. దీంతో ఐశ్వర్య తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఒక దశలో దర్శకుడితో అటువంటి సన్నివేశాలేమైనా ఉంటే దయచేసి తొలగించండి అని చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా శుక్రవారం సినిమా విడుదల కావడంతో ఆ చిత్రాన్ని తనతోపాటు చూడాల్సిందిగా ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌ను కోరినట్లు సమాచారం. భార్యకోసం ఏదైనా త్యాగం చేసేందుకు సిద్ధపడతాడన్న పేరున్న అభిషేక్, ఐష్ అడిగిందే తడవుగా తన "ప్లేయర్స్" చిత్రం షూటింగ్ వాయిదా వేసుకుని గోవా నుంచి ఫ్లైట్ ఎక్కి ముంబయిలో వాలిపోయాడట. భర్తరాగానే మిగిలిన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని వెళ్లి సినిమా చూపించిందట ఐష్. అంతా చూశాక అభి స్పందిస్తూ... నిజంగా "గుజారిష్"లో నటించిన నటీనటులందరినీ ప్రత్యేకంగా అభినందించాల్సిందే. "ఏం నటనా.. ఏం మూవ్‌మెంట్స్.. ఓహ్ సూపర్బ్. ముఖ్యంగా నా భార్య, నా స్నేహితుడు హృతిక్ అయితే జీవించారనుకోండి" అంటూ పొగడ్తల వర్షం కురిపించాడట. సినిమాలో తమ నటనను భర్త అలా మెచ్చుకునేసరికి ఐష్ కళ్లవెంట ఆనంద భాష్పాలు రాలాయట. భర్త అంతగా పొగిడితే ఏ భార్య మాత్రం ఆనందించకుండా ఉండగలదు...
19, నవంబర్ 2010, శుక్రవారం
గర్భిణి మృతి, ఆస్పత్రిపై బంధువుల దాడి
కర్నూలు : కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ గర్భిణి మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విశాఖలో మూతపడిన విద్యాసంస్థలు
విశాఖపట్నం: ఎస్‌ఐ రాతపరీక్షల వాయిదాను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థులు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వటంతో విశాఖలో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. మరికొన్ని చోట్ల విద్యార్థినాయకులే వెళ్లి మూయించారు.
కుంభకోణాల "స్పెక్ట్రమ్"తో తడిసి ముద్దవుతున్న యూపీఎ
యూపీఏ సర్కారును కదిలిస్తే చాలు... కుంభకోణాలు జలజలా రాలిపోతున్నాయి. ఏదైనా మంత్రిత్వ శాఖను నిశితంగా గమనిస్తే చాలు... పుట్టలోంచి చీమల్లో అక్రమాలు బిలాబిలా పరుగెడుతున్నాయి. మొత్తంగా యూపీఎ పాలనా వర్ణపటం(స్పెక్ట్రమ్) పూర్తిగా అవినీతి మకిలితో అంటుకునిపోయి ఉంది. ఈ జిడ్డును వదిలించుకునేందుకు యూపీఎ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నానా తంటాలు పడుతున్నారు.2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి కారకులైన రాజా పార్టీ డీఎంకేకు హ్యాండ్ ఇవ్వడం ద్వారా అవినీతి మరకలను వదిలించుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవంక సుప్రీంకోర్టు మొట్టికాయలతో ప్రధాని కలత చెందారనీ, తన పదవికి రాజీనామా చేస్తున్నారన్న ఊహాగానాలు బుధవారం మధ్యాహ్నం తిరుగాడాయి. చివరకు మన్మోహన్ రాజీనామా చేయడం లేదంటూ స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయాల్సిన అగత్యం ఏర్పడింది.ఇంతకీ అసలు యూపీఏలో కుంభకోణాల లోతెంత అని చూస్తే మనకు కనబడేవి కొన్నే.... అవి...టెలికం మంత్రిత్వ శాఖకు అప్పటి మంత్రి, ప్రస్తుత మాజీమంత్రి ఏ.రాజా అడ్డగోలు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి లక్షా 70వేల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. ఇందులో రాజావారి వాటా భారీగా ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ "రాజా" కుంభకోణం ప్రస్తుతం ప్రధాని పీఠాన్నే తాకి సలసలా కాగుతోంది. పీఠం వద్ద ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. "ఏ ప్రాంతమేగినా.. ఎందు కాలిడినా..." ప్రతిపక్షాలు రాజా "వర్ణపటం" మేజిక్కు గురించే తూర్పారబడుతున్నాయి. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రంగు వెలికి తీయాలంటూ పట్టుబడుతున్నాయి. ఇరు సభలను స్తంభింపజేస్తున్నాయి. దీంతో సభ సమావేశమైన నిమిషాల్లోనే వాయిదాపడుతున్నాయి.
ఇక దీపావళి పండుగకు ఒబామా రాక మునుపు వెలుగు చూసిన 31 అంతస్తుల భవనం తాలూకు కుంభకోణం... ఆదర్శ్. ఈ భవనానికి సంబంధించిన ప్లాట్ల కేటాయింపుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన చేతివాటాన్ని ప్రదర్శించారని అక్కడి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. దీంతో ఎటూ పాలుపోని కాంగ్రెస్ హైకమాండ్ చవాన్‌ను పదవి నుంచి తొలగించి చేతులు దులుపుకుంది. చవాన్‌ను త్వరలో సీబీఐ ప్రశ్నించనుంది.
అంతకుముందు, దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న కామన్వెల్త్ క్రీడల వ్యవహారంలో సుమారు 8 వేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయనీ, అందుకు సురేష్ కల్మాడీ బాధ్యులని ఆరోపణలొచ్చాయి. దీంతో ఎటూ తేల్చుకోలేని సర్కార్ ఒబామా అటు వెళ్లగానే ఆయనను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి పదవి నుంచి తొలగించి తాత్కాలికంగా ఉపశమనం పొందింది. అయితే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆయన కొనసాగడం విచిత్రమే. అదలా వుంచితే... కల్మాడీని కూడా త్వరలో సీబీఐ ప్రశ్నించనుంది.
ఇంకా మరీ ముందుకు వెళ్లి యూపీఎ చరిత్రను తిరగేస్తే మాజీమంత్రి శశీ థరూర్, శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ వగైరాలంతా సూపర్‌సోనిక్ క్రికెట్ గేమ్ ఐపీఎల్ ద్వారా కోట్లకు కోట్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆమధ్య విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో థరూర్‌పై వేటు వేసి కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది. ఈయన వ్యవహారం ఏమైందన్న సంగతి ప్రస్తుతానికి తెలియడం లేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే... కొంతమందికే తెలిసిన సబ్‌మెరైన్ ఒప్పందాల్లో అవకతవకలు, బియ్యం ఎగుమతుల్లో ప్రైవేటు వ్యక్తుల హస్తం, అణు ఒప్పందం బిల్లు ఆమోదం సమయంలో ప్రభుత్వ విశ్వాసంకోసం "క్యాష్ ఫర్ ఓట్" ఆరోపణలు, ప్రసారభారతిలో రూ. 60 కోట్లకు పైగా ప్రభుత్వానికి లూటీ... తదితరాలన్నీ మినీ కుంభకోణాలు.
వీటన్నిటినీ మించిన భారీ కుంభకోణం ఇపుడు వెలుగుచూసిన 2జి స్పెక్ట్రమ్. ఈ స్కాంలో ఏకంగా ప్రభుత్వ ఖజానాకు దక్కాల్సిన లక్షా 70 వేల కోట్ల రూపాయలు లూటీ జరిగిపోయింది. ప్రభుత్వ రథసారథి అయిన మన్మోహన్ సింగ్‌కు తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందా...? అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ప్రధాని తక్షణమే స్పందించాలని ఎగువ, దిగువ సభలను స్తంభింపజేస్తున్నాయి విపక్షాలు.
ఏం చేయాలో పాలుపోని యూపీఎ ప్రభుత్వం ప్రస్తుతానికి దిక్కులు చూస్తోంది. కుంభకోణం మొత్తం వ్యవహారాన్ని మాజీమంత్రి రాజాపై నెట్టివేసే దారులు ఏమైనా ఉన్నాయా...? అన్న ఆలోచనలు సైతం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇన్ని కుంభకోణాల నడుమ యూపీఎ సర్కార్ ఎంతకాలం తన పాలనను నెట్టుకొస్తుందో చూడాలి.

నాకు రాజకీయ గురువు రంగా : సిఎం రోశయ్య
గుంటూరు: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోదుడు, రైతు నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు ఆచార్య ఎం జి రంగా గొప్ప నాయకుడని, తనకు రాజకీయ గురువని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రంగా కాంస్య విగ్రహాన్ని శుక్రవారం రోశయ్య ఆవిష్కరించారు. ఇప్పటికి రంగా తనకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు. రైతుల అభివృద్ధి కోసం రంగా అలుపెరగని పోరాటం చేశారని ఆయన అన్నారు. మద్రాసు రాష్ట్రంలోని రాజాజీ మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారని రోశయ్య అన్నారు. రంగాతో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా రోశయ్య గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కె. లక్ష్మీనారాయణ, పార్లమెంట్ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల డిప్లొమా పరీక్ష వాయిదా
హైదరాబాద్: పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ నెల 20న నిర్వహించతలపెట్టిన డిప్లొమా పరీక్షలు వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యా శిక్షణ మండలి తెలిపింది. మిగిలిన తేదీల్లో పరీక్షలు యథాతథంగా జరుగుతాయి.
జేఎన్‌టీయూహెచ్ బీటెక్, బీఫార్మసీ పరీక్షలు రద్దు:జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉన్న బీటెక్, బీఫార్మసీ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు 20వ తేదీ జరగాల్సిన మొదటి సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్షలను రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ తులసీరాందాస్ తెలిపారు. ఎస్సై రాత పరీక్షల విషయంలో గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో రద్దయిన ఈ పరీక్షలను ఆదివారం (21న) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.

శబ్ధాల్లోనూ వినగలగడం వరమే
ఒకవైపు జోరుగా పార్టీ జరుగుతోంది... ఎటు చూసిన జనం పెద్ద ఎత్తున మాటలు వినిపిస్తున్నాయి. అయినా సరే... మీతో మాట్లాడే వ్యక్తి మాటలు వినగలుగుతున్నారంటే చాలా అదృష్టం. అంతటి ధ్వనిలోనూ వినగలిగారంటే అది నిజంగా వరమే...ఈ విధంగా వినగలగడమనేది సామాన్యమైన పని కాదు. ఇలా వినగలగడాన్ని శాస్త్రవేత్తలు 'కాక్టైల్ పార్టీ ఫినామినా' అని అంటారు. పార్టీ జరుగుతున్న సమయంలో వివిధ రకాల శబ్దాలు వినిపిస్తుంటారు. పాటలు... సంగీతం.. ఈలలు, కేకల మధ్య ఎదుటి వారి మాటలను నినగలగడం విశేషమేనంటున్నారు.ధ్వని దిశను అనుసరించి వినిపిస్తుందనేది చాలా కాలంగా ఉంది. కాని ఇటీవల అమెరికా పరిశోధకులు దీనిపై పలువురి వినికిడి శక్తిని గమనించారు. ఇది పూర్తిగా శ్రవణంలోని నాడీ విధానంపై ఆధారపడి ఉంటుందని తేల్చేశారు. ఆ నిర్మాణం తీరు తెన్నులపై ఇది పూర్తిగా ఆధారపడి ఉంటుందని నిర్ణయించారు. వినే వ్యక్తి వీటన్నింటిని స్వీకరిస్తాడు.వీటన్నింటిలో వినగలిగే వ్యక్తి వీటిలో ఒకదానిని గుర్తుపెట్టకోగలుగుతాడు. ఒక్కొక్కరి మాటలు ఒక్కొక్క విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వారి మాటలను అనుసరించే శ్రవణ పౌనఃపుణ్యత ఉంటుంది. అందరి మాటలు ఒకే మారు వినిపిస్తుంటాయి. వీటిలో ఒకటి మాత్రమే మిగిలిన వాటిని అధిగమించి నియంత్రణా విభాగాలను చేరుతుంది.మిగిలిన వారి మాటలు చాలా దూరంగా ఉండడం వలన ఇది సాధ్యమవుతోంది. ఇది ఎలా సాధ్యమవుతుందనే అంశాలను పరిశోధకులు చాలా ధీర్ఘంగా వివరించారు. వీరి వాదనలు విన్న తరువాత అవి నిజమేననక తప్పదు
యోగా అంటే ఏమిటి..?
యోగా అన్న పదం 'యజ్' అన్న సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. యోగా అంటే కలిసి ఉండటం, చేర్చడం, జతకట్టడం మరియు మనసు స్థిరత్వాన్ని పొందేందుకు నేరుగా ఉపయోగించే సాధనం అని చెప్పవచ్చు. సమాజంలో వివిధ రకాల వ్యక్తులతో సామరస్యం కలిగి సమన్వయ, సహకారాలతో మెలగడం, స్ఫూర్తివంతమైన ఆలోచనలను కలిగి ఉండటం యోగాలోని మూలార్ధం. మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంత జీవనాన్ని పొందే మహత్తర అవకాశం ఒక్క యోగా ద్వారానే కలుగుతుంది.
ఆధ్యాత్మిక మార్గాల్లో ఒకటైన యోగా... చేరవలసిన గమ్యం వైపు సక్రమంగా అడుగులు వేసేలా తీర్చిదిద్దుతుంది. మనసుకు స్థిరత్వాన్ని కలిగించి ఖచ్చితమైన మార్గ సంకేతాలతో నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చేరుకునేలా మలుస్తుంది. ఇందుకోసం ప్రధానంగా మూడు రకాల సూచికలున్నాయి. అవి ఆరోగ్యకరమైన జీవన విధానం, నైతిక నియంత్రణ, స్వీయ నియంత్రణ.ఈ సూచికల సంయుక్త ప్రభావంతో భవిష్యత్తు ఎంతో అందంగా కనిపిస్తుంది. అంతేకాదు ఎవరైతే ఈ విధానాలు, నియంత్రణలపై శ్రద్ధ చూపుతారో వారు తప్పనిసరిగా మనసుపై ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు. దీనివల్ల వ్యక్తిలోని ఆధ్యాత్మిక శక్తి పునరుజ్జీవనం పొందుతుంది. ఒక్కసారి మెదడు సామరస్యంతో స్ఫూర్తిని కలిగి ఉంటే ఆలోచనలు కూడా హద్దుల్లోనే ఉంటాయి. కాలం గడుస్తున్న కొద్ది యోగసాధకుడు... తన మెదడు తాలూకు కార్యకలాపాల్లో చురుకైన, ఆశావహ దృక్పధమైన రూపాంతరాన్ని అనుభవిస్తాడు. ఈ మార్పు ఖచ్చితంగా జీవన విధానంపై ప్రతిబింబిస్తుంది.
యోగా పద్ధతులు
యోగాలో రెండు రకాల పద్ధతులున్నాయి. వాటిలో ఒకటి దైహికం, రెండు ఆధ్యాత్మికం. ఆసనాలు, క్రియలు, బంధం, ప్రాణాయమం మొదలైన నాలుగు రకాల ముద్రలు దైహిక పద్ధతుల్లో ముఖ్యమైనవి. సరైన శిక్షణతో నాలుగు ముద్రలు గల వ్యాయామాలను అనుసరిస్తూ.. అదేసమయంలో నిబంధనలను పాటిస్తుంటే ఆధ్యాత్మిక పురోగతిని కూడా సాధించవచ్చు. స్వీయానుభవం, మనోనియంత్రణ వంటివి ఆధ్యాత్మిక పద్ధతిలో ఉన్నాయి. ఈ ప్రత్యేకతలకు నేటి యోగా గురువులే ప్రత్యక్ష నిదర్శనాలుగా నిలుస్తారు.

పుట్టపర్తికి చేరిన రాష్ట్రపతి: మహిళా దినోత్సవంలో ప్రసంగం!
రాష్టప్రతి ప్రతిభాపాటిల్ శుక్రవారం పుట్టపర్తి చేరుకున్నారు. సత్యసాయి 85వ జన్మదిన వేడుకల్లో భాగంగా ‘మహిళ దినోత్సవ’ కార్యక్రమంలో రాష్టప్రతి ప్రసంగించనున్నారు. మూడు దశాబ్ధాలుగా ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హోదాలో మహిళ రాష్ట్రపతి హాజరుకావడం విశేషంష్ట్రపతి రాకను పురస్కరించుకుని భారీ ఎత్తున పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి ప్రశాంతి నిలయం వరకు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇక, సత్యసాయి జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం జరిగిన వేణుగోపాలస్వామి రథోత్సవంలో సాయి నామ స్మరణ చేస్తూ వేలాదిమంది పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని సత్యసాయి దగ్గరుండి ప్రారంభించడం ప్రతి ఏటా ఆనవాయితీ. అయితే, గురువారం జరిగిన రథోత్సవ కార్యక్రమానికి బాబా రాక పోవడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులు కొంత నిరాశ చెందారు.

18, నవంబర్ 2010, గురువారం
16 ప్రాజెక్టుల్లో అవకతవకలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం చేపట్టిన 16 నిర్మాణ ప్రాజెక్టుల్లో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) గుర్తించింది. ఇందులో 6 పనులను ప్రజాపనుల శాఖ(పీడబ్ల్యూడీ), మూడింటిని ఢిల్లీ పురపాలకశాఖ, మిగతా పనులను వివిధ సంస్థలు పూర్తిచేశాయి. కామన్వెల్త్ క్రీడల కోసం చేపట్టిన నిర్మాణ ప్రాజెక్టులపై సీవీసీ అంతర్గత దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. సరాయ్‌కానేఖాన్ ప్రాంతం నుంచి జవహర్‌లాల్ స్టేడియం వరకు రూ.400 కోట్లతో నిర్మించిన రహదారి పనులను అర్హత లేని కాంట్రాక్టర్‌కు కట్టబెట్టినట్లు సీవీసీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలని పీడబ్ల్యూడీని ఆదేశించింది. చాలా ప్రాజెక్టుల్లో నాణ్యతలేని నిర్మాణ సామగ్రి వాడడం, రేట్లను పెంచి చూపడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయని, వీటిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించాయని వెల్లడించింది.రైన్ టి-పాయింట్ వద్ద ఫ్త్లెఓవర్ నిర్మాణ పనులను 'నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ' చేపట్టింది. అంచనా వ్యయం రూ.65.76 కోట్లు కాగా అధికారులు ఆ సంస్థకు రూ.97.91 కోట్లకు పనులు అప్పగించారు. నిబంధనల ప్రకారం.. పనుల పర్యవేక్షణ కోసం థర్డ్‌పార్టీ సంస్థను నియమించుకొన్న తర్వాతే కార్యకలాపాలు ప్రారంభించాలి. నవయుగ కంపెనీ మాత్రం పనులు మొదలైన 7 నెలల తర్వాత థర్డ్‌పార్టీని ఏర్పాటు చేసుకుందని సీవీసీ తన నివేదికలో పేర్కొంది.
మరోసారి తార్నాక వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఎస్సై రాతపరీక్షల రద్దు కోసం మళ్లీ ఉస్మానియా విద్యార్థులు రోడ్డెక్కారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తార్నాక వైపు విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి వద్ద పోలీసులపై రాళ్లు రువ్వారు. హబ్సీగూడ వద్ద వ్యాపారసముదాయాలపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలసులు విద్యార్థులపై బాష్పవాయువును ప్రయోగించారు. తార్నాక నుంచి క్యాంపస్ వైపు వెళ్లే దారులను, అడిక్‌మెట్ ఫైఓవర్‌ను పోలీసులు మూసివేయడంతో రాంనగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ఓయూ పరిసర ప్రాంతాల్లో 8 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్‌ఫోర్స్‌తో పోలీసులు భారీగా మోహరించారు.
పోలవరంపై ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మరోసారి రణం
హైదరాబాద్: పోలవరంపై వివాదం చెలరేగుతున్న స్థితిలో ప్రజారాజ్యం అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఉద్యమం చేసేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధరరావు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. పోలవరాన్ని అడ్డుకుంటున్నది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారేనని ఆయన ఆరోపించారు. పోలవరాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.పోలవరం జాతీయ హోదాపై ప్రజారాజ్యం పార్టీ మరోసారి ఉద్యమానికి సిద్ధమయిందని కోటగిరి చెప్పారు. ఇప్పటికే ఒకసారి మా పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి లేఖ రాశారన్నారు. ఈనెల 23న చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన నేతలు మరోసారి ప్రధానమంత్రిని కలిసి పోలవరం జాతీయ హోదాకు ఒత్తిడి తీసుకు వస్తారని చెప్పారు.
.రాజధానిలో మరో డ్రగ్స్ ముఠా: పట్టుబడ్డ ఇద్దరు నైజీరియన్లు
హైదరాబాద్: హైదరాబాదులో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్సు సరఫరా ఇద్దరు నైజీరియన్లను బంజారాహిల్సు పోలీసులు అరెస్టు చేశారు. కొకైన్ కొంటున్న వారినుండి పోలీసులు మొబైల్ ఫోన్లు, పాసుపోర్టు తీసుకున్నారు. వారిని పోలీసు స్టేషన్ కి తరలించారు. 73 గ్రాముల కొకైన్ దొరికింది. డ్రగ్సు కొంటూ దొరికిన వారు ప్రముఖుల కుమారులని సమాచారం. అయితే ఇప్పుడే వారు ఎవరో చెప్పేందుకు ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు.గత కొంతకాలంగా విదేశీ డ్రగ్సు మాఫియా మనపై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. సంపన్న కుటుంబాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకొని విదేశీయులు డ్రగ్సు సరఫరా చేస్తున్నారు. గతంలో పలుమార్లు విదేశీయులు డ్రగ్సు అమ్ముతూ పట్టుబడ్డారు. ఇటీవల ప్రముఖ చిత్ర కథానాయకుడు రవితేజ సోదరులు ఉగండాకు చెందిన వ్యక్తుల దగ్గరనుండి డ్రగ్సు తీసుకుంటూ పట్టుబడ్డారు. డ్రగ్సు వ్యవహారంలో ప్రముఖుల హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాదు, బెంగుళూరులలో డ్రగ్సు మాఫియా ఉంది. ముంబయి మీదుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో హైదరాబాదు పోలీసులు ముంబయి పోలీసులను అలర్ట్ చేశారు. ఇక్కడ కూడా డ్రగ్సు సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు
కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసీ పూజ చేయండి!
కార్తీక శుద్ధ ఏకాదశికి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాభ్ది ద్వాదశి అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలురేది వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడే ప్రవేశిస్తాడు. ఈ కారణం చేతనే ఈ రోజున తులసీ కోట దగ్గర విశేష పూజలు జరపడం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు. కార్తీక శుద్ద ద్వాదశిన కడలిలో శయనించిన విష్ణువు ద్వాదశినాడు లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు. ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించి దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
వేయి ఉపయోగాలిచ్చే ఖర్జూరం పండు
సంప్రదాయఫలంగా ఖర్జూరం నీరాజనాలందుకుంటోంది. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మహమ్మద్ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, ఖోరాన్ పేర్కొంటోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబుతారు. ఇస్లామిక్ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
ఎండు ఖర్జూరాలు
ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండు ఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.
ఉపయోగాలు
ఖర్జూరం, పండుగానే కాక చెట్టుగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు.ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని పూరికప్పులుగా వాడటమూ ఎక్కువే.
తాటి ఆకుల మాదిరిగానే చాపలు, తడికెలు, బుట్టలు, విసనకర్రల్లోనూ వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది.ఎండుటాకులు చీపుళ్లుగానూ వంటచెరకుగానూ ఉపయోగపడతాయి.
ఆకుల్లోని పీచుతో తాళ్లు, టోపీలు, నేతబట్ట... లాంటివీ అల్లుతారు.
కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు.
నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల మేతకి ఎలానూ పనికివస్తాయి.సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన తైలం వాడతారు.ఆక్జాలిక్ ఆమ్లానికి ఈ విత్తులే మంచి వనరులు.కాఫీబీన్స్ మాదిరిగా వీటిని కాఫీపొడిలో కలపడమూ కద్దే.ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలూ రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతారు.పూమొగ్గల్ని సలాడ్‌లలో ఎండుచేపల కూరల్లో వాడతారు.
ఖర్జూరంతో వైద్యం
ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి.
ఎండా కాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు.మూత్రం సాఫీగా కానివారికి కర్జూరపండు పెడితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది.పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్ చక్కగా ఉపయోగపడుతుంది.గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు.డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుందిమూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలి.
మరికొన్ని విశేషాలు
గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఖర్జూరపండ్లు కనీసం నెలరోజులు నిల్వ ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పాడవకుండా ఏడాదిపాటు నిల్వ ఉండేలా కూడా చేస్తారు.ఒకవేళ మరీ ఎక్కువ ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్ ద్వారా వాటిని పంచదార, జామ్, జెల్లీ, జ్యూస్, సిరప్, వినెగర్‌గా మార్చి విక్రయిస్తున్నారు.
బలవర్థకమైన ఆహారంలో భాగంగా ఖర్జూర సిరప్‌ను తేనెలా రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటుంటారు.ఇస్లామిక్ దేశాల్లో రంజాన్ మాసంలో ఆల్కహాల్‌కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపేన్ లాంటిపానీయాన్ని తాగుతున్నారు.మొరాకోలాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాన్ని వంటల్లో విరివిగా వాడతారు.
సహారా వాసులు గుర్రాలు, ఒంటెలు, కుక్కలకు ఆహారంగా ఎండు ఖర్జూరాల్ని వాడతారు.
ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని జోడించి ఓ రకమైన బీరును తయారుచేస్తారు.

కర్పూరం... కొన్ని లాభాలు
హోమియోపతి వైద్యవిధానం ప్రకారం కర్పూరం, ఇతర పరిమళ ద్రవ్యాలు పరిసర వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. హారతిని భక్తులు కళ్లకు అద్దుకున్నప్పుడు కర్పూరం సువాసనలు పీల్చడం వల్ల అది ఔషధంగా పనిచేస్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం....స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, గుండెకు సంబంధించిన పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు.కర్పూరం సహజసిద్ధమైన ఉత్పత్తి అయినప్పటికీ అది విడుదల చేసే ఆవిర్లు విషపూరితమైనవి. మితిమీరి కర్పూరం వినియోగాన్ని అమెరికాలో నిషేధించారు. ఐతే కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తున్నారు. ఆస్త్మా, అలెర్జీలున్నవారు కర్పూరాన్ని వాడకూడదు. చిన్ని పిల్లల ముఖాలపై పొరపాటున కూడా ఉపయోగించరాదు.
'బిగ్‌బాస్' కు స్టే ఇచ్చిన హైకోర్టు
ముంబయి: కలర్స్ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ కార్యక్రమంపై సమాచార మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించి 24 గంటలు గడవకముందే ఆ కార్యక్రమ నిర్వాహకులు బొంబాయి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ షో అభ్యంతరకరంగా ఉన్నందున రాత్రి 11 గంటల తరువాత ప్రసారం చేయాలని ప్రభుత్వం ఆదేశించగా ఎప్పటిలాగే వారు రాత్రి 9 గంటల సమయంలో ప్రసారం చేసుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది.
"నాగవల్లి"కి ఇంకా 7 సీక్వెల్స్ వస్తాయి: పి.వాసు
విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నాగవల్లి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు, నాగవల్లి పాటలు సుపర్బ్‌గా వచ్చాయన్నారు. మొత్తం ఐదుగురు హీరోయిన్లున్నారనీ, వారిలో చంద్రముఖి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పారు.అనంతరం దర్శకుడు పి. వాసు మాట్లాడుతూ... ప్రేక్షకులకు కొత్తదనం కావాలి. ఈ చిత్రంలో అన్ని రసాలున్నాయి. క్యారెక్టరైజేషన్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఇంతకు ముందు చంద్రముఖిగా జ్యోతిక నటించిందనీ, ఇప్పుడు ఆ పాత్రలో మరో హీరోయిన్ కనిపించబోతుందన్నారు.వీరిలో ఎవరు బాగా నటించారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ఒక్కో హీరోయిన్‌కు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుందనీ, దాని ప్రకారమే వాళ్లను చూపించామని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ... నాగవల్లికి ఇంకా ఏడు సీక్వెల్స్ వస్తాయని చెప్పారు. నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కొత్త వెంకీని చూస్తారని చెప్పారు.ఇంకా ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు, బ్రహ్మానందం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
స్విస్ బ్యాంకు నల్లధన జాబితాలో భారతీయులే టాప్..!!
భారతదేశంలో అవినీతికి కొరతే లేదు అనడానికి ఈ తాజా సంఘటనే నిలువెత్తు నిదర్శన. తమ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం గురించి నివ్వెరపోయే నిజాలను వెల్లడించింది స్విస్ బ్యాంక్. స్విస్ బ్యాంక్ అసోషియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ "యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విజ్టర్లాండ్" (యూబిఎస్)లో ఉన్న నల్లధన డిపాజిటర్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారన్న నిర్ఘాంతపోయే నిజాన్ని నిదానంగా ప్రకటించింది.భారతీయులు 65 వేల 223 వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. కమ్యూనిస్టు దేశాలైన రష్యా, చైనాలు కూడా ఈ జాబితాలో ముందున్నాయి. నల్లధన జాబితాలో రష్యా ద్వితీయ స్థానంలో ఉండగా.. చైనా ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. స్విస్ బ్యాంకులో దాగి ఉన్న నల్లధన వివరాలు రాబట్టేందుకు ఓవైపు ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బ్యాంకు ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం.గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపి నాయకుడు ఎల్‌కె అద్వానీ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు కూడా స్విస్ బ్యాంకులో దాచిన నల్లధన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా.. నల్లధనం గురించి ఖచ్చితమైన నగదు వివరాలను స్విస్ బ్యాంక్ అసోసియేషన్ వెల్లడించడం కూడా ఇదే తొలిసారి. ఈ నల్లధనాన్ని భారతదేశ అభివృద్ధిపై వెచ్చిస్తే మనం కూడా అగ్రదేశాల సరసన నిలుస్తామనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. భారతదేశంలో అవినీతికి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
ముంబయి: బాంద్రా అనంత్ కనేగర్ మార్గ్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి 10 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం వాటిల్లింది. 16 అగ్నిమాపక శకటాలు, 6 వాటర్ ట్యాంకర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
17, నవంబర్ 2010, బుధవారం
విశాఖలో చంద్రబాబు
విశాఖపట్నం : మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విశాఖకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పలుచోట్ల జరిగే సభల్లో బాబు ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిరోజున నగరంలో జిల్లా పార్టీ శ్రేణుల సమావేశంలో ప్రసంగించనున్నారు. జిల్లా శాఖలో నెలకొన్న విభేధాలను పరిష్కరించేందుకు బాబు దృష్టి పెట్టనున్నట్టు తెలియవచ్చింది.
నేడు కైశిక ద్వాదశి ఉత్సవం
తిరుమల: కార్తీకమాసం శుక్లద్వాదశి నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఉత్సవం గురువారం జరగనుంది. తెల్లవారు జామున శ్రీవారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తికి అభిషేక అర్చనలు, అలంకారాలు సమర్పించిన అనంతరం తిరువీధుల్లో వూరేగింపు జరుగుతుంది. సూర్యోదయం ప్రారంభంకాక ముందే ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయంలోకి ప్రవేశిస్తారు. కైశికద్వాదశికి మాత్రమే ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయం వెలుపలికి వూరేగింపుగా వస్తారు. ఉత్సవం నేపథ్యంలో స్వామి వారికి తిరుప్పావడ సేవను తితిదే రద్దు చేసింది.
"బక్రీద్" పండుగను ఎందుకు జరుపుకుంటారంటే..?
"ఈదుల్ జుహా" అనేది మనిషి యొక్క త్యాగ నిరతిని చాటిచెప్పే పండుగ. ఈ పండుగనే ’బక్రీద్’ అంటారు. బక్రీద్ అనే పేరు ఈ పండుగను ఎలా జరుపుకుంటారనేందుకు ఓ కథ ప్రచారంలో ఉంది. మహమ్మదీయుడు హజ్రత్ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లా కనిపించి "నీ కుమారుని నాకు బలి ఇవ్వమ"ని కోరుతాడునిద్ర నుంచి మేల్కొన్న ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌కు ఈ సంగతి తెలియజేయడంతో, దైవ భక్తుడైన ఇస్మాయిల్ తాను బలవడానికి సిద్ధమేనని చెబుతాడు. ఇక బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతని త్యాగనిరతికి సంతోషించి, ఆయన స్థానంలో ఒక గొర్రెను సృష్టించాడు. ఆనాడు ఇబ్రహీం దేవునికి గొర్రెను సమర్పించినందుకు గుర్తుగా ముస్లిం సోదరులు బక్రీద్ (బక్రా అనగా గొర్రె) పండుగను జరుపుకుంటున్నారుబక్రీద్ పండుగను పురస్కరించుకుని పండుగకు ముందురోజున మరణించిన వారి గోరీల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు. ఇలా ఉంచితే వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని విశ్వసిస్తారు. ఈ పండుగ సందర్భంగా ధనికులు పొట్టేలు మాంసాన్ని పేదలందరికీ ’కుర్బానీ’ అనే పేరుతో పంచటం ఆనవాయితీ.మరీ ధనవంతులు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు అతి పవిత్రమైన మక్కాను సందర్శిస్తారు. మరి ముస్లిం సోదరులందరికీ "ఈద్ ముబారక్" అంటూ మనమూ శుభాకాంక్షలు తెలియజేద్దామా..!.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)