1, నవంబర్ 2010, సోమవారం
20:10 రాజకీయాలు-సినిమాలు: చిరు
హైదరాబాద్: సినిమాల్లో తిరిగి నటించాలన్న అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరుతుందని మెగాస్టార్, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సూచనప్రాయంగా వెల్లడించారు. తన సినిమా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్నారు. 20 రోజులు రాజకీయాలు, 10 రోజులు సినిమాలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం బన్ని పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నందువల్లే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నానని, అయితే ఎట్టిపరిస్థితుల్లో రాజకీయాలను మాత్రం నిరక్ష్యం చేయనని స్పష్టం చేశారు. గత అక్టోబర్‌లో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల గురించి మాట్లాడుతూ కేంద్ర నుంచి తగిన నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి