హైదరాబాద్:నిరుద్యోగులకు శుభవార్త ఇది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగమేళాకు తెరలేచింది. సంస్థ లో ఖాళీగా ఉన్న శ్రామిక్స్, ట్రాఫిక్ సూపర్‌వైజర్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రామిక్స్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయనుండగా, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, మెకానికల్ సూపర్‌వైజర్ పోస్టులను ట్రైనీ పద్ధతిలో నియమించనుంది. శ్రామిక్స్ పోస్టులకు ఐటీఐ చదివినవారు అర్హులు. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుకు గ్రాడ్యుయేషన్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగినవారు అర్హులు. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి