* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

2, నవంబర్ 2010, మంగళవారం

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో జగన్-చిరులదే హవా!

రాష్ట్ర ముక్కలైతే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే అంశాలపై అప్పుడే బేరీజు వేయడం మొదలైంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ గడువు డిసెంబరు 31వ తేదీతో ముగియనుంది. ఈ గడువులోగా తమ నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని కమిటీ సభ్య కార్యదర్శి వీకె.దుగ్గల్ వెల్లడించారు.దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఆరంభమయ్యాయి. కొత్తగా హైదరాబాద్ రాష్ట్రం కోసం ఓ డిమాండ్ పుట్టుకొచ్చింది. అదేసమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌లో విలీనం కావడం తథ్యమని అంటున్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దీంతో తెలంగాణలో కేసీఆర్ రాజకీయ హీరో కానున్నారు.తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించని తెదేపా తెలంగాణలో పూర్తిగా తుడిచి పెట్టుకుని పోవడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ సైతం సీమాంధ్ర, హైదరాబాద్‌లలో బాగా దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెదేపా, వైఎస్, చిరంజీవిల భవితవ్యంపై రాజకీయ నిపుణులు పలు రకాల అంచనాలు వేస్తున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే ఎక్కువ లాభపడేవారి వైఎస్.జగన్ ముందు వరుసలో ఉంటారని వారు అంటున్నారు.ఇది జరగాలంటే ఆయన కాంగ్రెస్‌ ‌నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టాల్సి ఉంటుందని చెపుతున్నారు. దీంతో సీమాంధ్రలో జగన్ తిరుగులేని నేతగా ఆవిర్భవించడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌నే అట్టిపెట్టుకుని ఉంటే కాంగ్రెస్ లాభపడుతుంది. ఏదిఏమైనా జగన్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ప్రరాపా మాత్రమే ఇవ్వగలదన్నది వారి అంచనావిభజన అనివార్యమైతే సీమాంధ్రలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి విశేష ప్రజాదరణ లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. కోస్తాంధ్రలో కాపుల జనసంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో చిరంజీవికి కలిసొచ్చే అంశంగా వారు చెపుతున్నారు. ఏది ఏమైనా.. రాష్ట్ర విభజనపై కొన్ని రాజకీయ పార్టీలు, కొందరి నేతల భవిష్యత్ ఆధారపడివుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి