* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

11, నవంబర్ 2010, గురువారం

చంద్రబాబును చూస్తుంటే జాలేస్తోంది: కేసీఆర్ వ్యాఖ్యలు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును చూస్తుంటే తనకు జాలి వేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రథమ శత్రువు, ప్రథమ ముద్దాయి చంద్రబాబేనని కేసీఆర్ మరోమారు ధ్వజమెత్తారు. డిసెంబరు తొమ్మిదే తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు యూ టర్న్ తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్రం ఎపుడో ఏర్పాటై వుండేదన్నారు.రాష్ట్రంలో నెలకొన్న తాజ పరిస్థితులపై ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న తొలి వ్యక్తి చంద్రబాబేనన్నారు. అందువల్ల ఆయనకు కాంగ్రెస్‌పై విమర్శలు చేసే నైతికత అర్హత లేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు.తెలంగాణకు తెదేపా కట్టుబడి ఉంటే చంద్రబాబు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం పని అయిపోయిందన్నారు. తన పట్టును నిలుపుకునేందుకు బాబు వివిధ రకాలు కుస్తీ చేస్తున్నారన్నారు.జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే రాష్ట్రం ఏర్పాటు కాదన్నారు. నివేదికను పరిశీలించడానికి కేంద్రానికి కొంత సమయం కావాల్సి ఉంటుందన్నారు. అందువల్ల కేంద్రానికి జనవరి వరకు సమయం ఇస్తామన్నారు. ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని ఇవ్వకుంటే కాంగ్రెస్‌ను కూడా వదలిపెట్టబోమన్నారు.శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో మరో ప్రశ్నకు తావులేదన్నారు. అలాగే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్-తెరాసలు కలిసి పని చేసే అంశంపై ఇపుడే స్పందించలేమన్నారు. కానీ, తమ రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాల్సి ఉందన్నారు.ఎందుకంటే.. కాంగ్రెస్‌కు మా సహకారం, మాకు కాంగ్రెస్ సహకారం కావాల్సి ఉందన్నారు. అలాగే, రాష్ట్ర ఏర్పాటుకు నిర్ధిష్టమైన గడువులంటూ ఏమీ లేవన్నారు. డిసెంబరు తొమ్మిదో తేదీన చేసిన ప్రకటన మేరకు రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ మాత్రమే తెలంగాణ ఇవ్వగలదన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి