"జల్" తుపాను తాకిడి గురయ్యే తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను ముప్పుపై ఆయన సమీక్ష నిర్వహించారు.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజలను సురక్షితంగా తరలించి, జల్ ముప్పు పొంచి ఉండటంతో అధికారులు నాలుగు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను వల్ల ఆదివారం ఉదయం నుంచి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడడం ప్రారంభమవుతాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.తుఫాను ముప్పు పొంచి ఉండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించి ఆ పాఠశాల భవనాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కలిగించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.ఆదివారం సాయంత్రం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుందని, రాత్రి వేళ అది తీరం దాటే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఆదివారం ఉదయం నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి