* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

31, డిసెంబర్ 2010, శుక్రవారం

ఎన్టీపీసీ కాలుష్యంపై ఆందోళన ఉద్ధృతం: పంచకర్ల

పెదగంట్యాడ(విశాల విశాఖ): ఎన్టీపీసీ సింహాద్రి విద్యుత్కేంద్రం యాష్‌పాండ్‌ ప్రభావంతో పరిసర గ్రామాల నివాసితులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాలుష్యం నివారణకు సంస్థ తగిన చర్యలు చేపట్టకపోతే జనవరి 22వ తేదీ నిరాహారదీక్షలు, ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం పెదగంట్యాడ మండలం పిట్టవానిపాలెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీపీసీ కాలుష్యంతో సతమతమవుతున్న పిట్టవానిపాలెం, దేవాడ, మరడదాసరిపేట గ్రామాలను తరలించాలని, భూములు కోల్పోయిన రైతులకు శాశ్వత, నిర్వహణపరమైన ఉద్యోగాలు కల్పించాలని కోరారు. యాష్‌పాండ్‌కు ఆనుకొని ఉన్న భూములకు ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలని, సర్వే నెంబర్‌ 491లో భూములకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. అనంతరం ఆయన యాష్‌పాండ్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గతంలో ఇక్కడ బూడిదనీటితో ముంపునకు పొలాలకు సంబంధించి ఆయా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆయన వెంట కాకి బాబు, పి.అప్పారావు, వుడా వెంకటరావు, వి.నారాయణరావు, డి.తాతారావు, వెంకన్న, సన్యాసినాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఒక్కో వార్డు అభివృద్ధికి రూ.1.5 కోట్లు

 మేయర్‌ జనార్దనరావు
విశాఖపట్నం(విశాల విశాఖ )  కొత్త ఏడాది ఒక్కో వార్డులో అభివృద్ధి పనుల కోసం రూ.1.50 కోట్లు చొప్పున కేటాయిస్తున్నట్లు మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్‌ పి.జనార్దనరావు తెలిపారు. శుక్రవారం ఉప మేయర్‌ కె.దొరబాబు, కమిషనర్‌ వీఎన్‌ విష్ణు, ఫ్లోరులీడర్‌ బెహరా భాస్కరరావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ప్రతి వార్డులో రూ.50 లక్షలతో పనులు చేపట్టామన్నారు. అధిక ప్రతిపాదనలు రావడంతో రానున్న సంవత్సరంలో కేటాయింపులు పెంచుతున్నామని చెప్పారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం అమల్లో ఉన్న 65 మిషన్‌ సిటీల్లో జీవీఎంసీ ఉత్తమ నగరం అవార్డుతోపాటు రూ.4.50 లక్షల ప్రోత్సాహకం అందుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద రూ.1,886 కోట్లతో చేపట్టిన 20 ప్రాజెక్టుల్లో ఇప్పటికే మూడు పూర్తి చేశామన్నారు. మెరుగైన మంచినీటి సరఫరా, బీఆర్‌టీఎస్‌ కారిడార్లు, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్మాణంలో ఉన్న 15,320 ఇళ్ల కోసం ఇప్పటికే 9,626 మంది లబ్దిదారులను ఎంపిక చేశామన్నారు. మురికివాడల్లో దశల వారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌, ఎర్రగెడ్డ కెనాల్‌ ఆధునికీకరణ స్ఫూర్తితో మిగిలిన చోట్ల గెడ్డల పనులు నిర్వహిస్తామన్నారు. రూ.20 కోట్ల సాధారణ నిధులతో రహదారులు, పాఠశాలలు, సామాజిక భవనాలు, సులభ్‌ కాంప్లెక్సుల నిర్మాణం చేపట్టామని వివరించారు. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) కింద 18,125 దరఖాస్తులు పరిష్కరించి రూ.83.46 కోట్ల ఆదాయాన్ని సేకరించామన్నారు.ఆస్తి పన్ను పెంపుతో జీవీఎంసీ ఆదాయం రూ.137.54 కోట్లకు పెరిగిందని మేయర్‌ వివరించారు. పెంచిన పన్నుపై ప్రజల నుంచి వచ్చిన 54 వేల పునః పరిశీలన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 13 వేలు పరిష్కారమైనట్లు తెలిపారు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.75 కోట్ల బ్యాంకు లింకేజీతో మహిళా సంఘాలకు రుణ సాయం అందించామన్నారు. సూక్ష్మ రుణ సంస్థల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రత్యేకంగా రూ.60 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించేందుకు జీవీఎంసీ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతి జోన్‌లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించామని వివరించారు. స్వీకారం, బాల్యం విద్యాశ్రీ పథకాలతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కమిషనర్‌ వీఎన్‌ విష్ణు మాట్లాడుతూ జీవీఎంసీ 2010లో అనేక విజయాలు సాధించిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2011లో విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఉప మేయర్‌ కె.దొరబాబు మాట్లాడుతూ కొత్త ఏడాదిలో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ ఫ్లోరు లీడర్‌ బెహరా భాస్కరరావు కూడా మాట్లాడారు.

30, డిసెంబర్ 2010, గురువారం

ఇక హక్కులకు దిక్కెవరు

పౌర హక్కుల ఉద్యమ నేత కెజి కన్నబిరాన్ కన్నుమూత
హైదరాబాద్: పౌర హక్కుల ఉద్యమ నేత, ప్రముఖ న్యాయవాది కెజి కన్నబిరాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. సికింద్రాబాదులోని మారేడుపల్లిలో గల ఆయన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1994లో ఆయన పియుసిఎల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దివంగత బాలగోపాల్ తో కలిసి ఆయన పౌర హక్కుల ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.ఆయన భార్య వసంతా కన్నబిరాన్, కూతురు కల్పనా కన్నబిరాన్ సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నారు. కన్నబిరాన్ నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఆయనకు నక్సలైట్ సానుభూతిపరుడిగా పేరుంది. నక్సలైట్లకు చెందిన పలు కేసులను ఆయన చేపట్టారు. అయితే, ఎటువైపు నుంచి తప్పు జరిగినా ఆయన నిర్భయంగా ప్రశ్నించారు. ఆయన మృతికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సంతాపం వ్యక్తం చేశారు.

గ్లామర్ లుక్ కోసం సర్జరీ చేయించుకున్న సమంత..!?

గ్లామర్‌ ఫీల్డులో తమ అందాల్నిమరింతగా ఆరబోయాలంటే హీరోయిన్లు తమ అందాన్ని కాస్త మెరుగులు దిద్దుకోవడం మామూలే. శ్రీదేవి నుంచి నేటి సమంత వరకు ముద్దుగుమ్మలు అదే బాటలో పయనిస్తున్నారు. "ఏమాయ చేసావె" చిత్రంలో కాస్త పర్వాలేదు అనిపించిన సమంత... ఇటీవలే చాలా ఫంక్షన్లలో హాజరైంది.సమంతను చూస్తుంటే.. బాగా ఒళ్లు తగ్గించి, సెక్సీగా కనిపిస్తోంది. పైగా మోకాలునుంచి కిందవరకు గల భాగాల్ని మెరుపులా క్రీమ్‌లు రాసుకుంటూ షైన్‌ అయ్యేట్లు చూసుకుంది. ఆమె కట్టు బొట్టు చాలా బాగుంది. ఇటీవలే గ్లామర్‌ రోల్‌ ప్లే చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన సమంత, ఎన్‌.టి.ఆర్‌. సరసన "బృందావనం"లో కాస్త అందాలను ఆరబోసింది.తాజాగా తన సన్నిహితులరాలి సూచన మేరకు సమంత అందాల్ని ఇనుమడింపే సర్జరీ చేయించుకుందని తెలిసింది. కుర్రకారును మరింతగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న ఈ చెన్నై భామ.. తన అందాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా పారితోషికం పెంచేయొచ్చునని తహతహలాడుతోంది.

ఆరుషి హత్యలపై విచారణ కొనసాగాలి గిరిజావ్యాస్‌

న్యూఢిల్లీ : ఆరుషి జంట హత్యల కేసులో తగిన ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నట్టు సీబీఐ ప్రకటించడం తగదని జాతీయ మహిళా సంఘం అధ్యక్షురాలు గిరిజావ్యాస్‌ అన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగాలని ఆమె కోరారు. మహిళలపై అకృత్యాలకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.

మే 8న ఎంసెట్‌

హైదరాబాద్‌ : మే 8న ఎంసెట్‌ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నతవిద్య, సాంకేతిక విద్య మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రకటించారు. ఎంసెట్‌ నిర్వహించిన 15 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఐసెట్‌ను మే 15న మే 20 న ఈసెట్‌ పరీక్ష, జూన్‌ 4న ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలిపారు. హైటెక్‌ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటుచేయనున్నట్టు రాజనర్సింహ వెల్లడించారు.

సీఎంతో గిరిజన శాఖ మంత్రి భేటీ

 హైదరాబాద్‌:ముఖ్యమంత్రికిరణ్‌కుమార్‌రెడ్డితో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు ఆయన క్యాంప్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. జనవరి 3నుంచి విశాఖ జిల్లాలో జగన్‌ ఓదార్పుయాత్ర ఉన్నందున ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ ఓదార్పుయాత్రలో పాల్గొనకుండా చూసే బాధ్యతను సీఎం మంత్రికి అప్పగించినట్లు సమాచారం.

తిరుపతి లాడ్జిలో కుటుంబసమేతంగా ఆత్మహత్య

తిరుపతి: తిరుపతిలోని ఓ లాడ్జిలో ఓ వ్యక్తి కుటుంబసమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీఆర్‌ మహల్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు పిల్లలతో దిగిన ఓ కుటుంబం తెల్లవారేసరికి ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మృతులను బంగారుపాళ్యం వాసులుగా గుర్తించారు.

విశాఖ నగరపాలక సమావేశంలో వేరుకుంపటి

విశాఖపట్నం(విశాల విశాఖ): విశాఖ నగరపాలక సమావేశంలో ఈరోజు కలకలం రేగింది. సమావేశానికి వచ్చిన కాంగ్రెస్‌ సభ్యుల్లో 7గురు వై.ఎస్‌.ఆర్‌ పేరుతో ఉన్న కండువాలు ధరించి సమావేశానికి రావటం ఆందరినీ ఆకర్షించింది. దానికితోడు వారంతా మిగిలిన కాంగ్రెస్‌ సభ్యులతో కాకుండా వేరుగా కూర్చోవటం కలకలం రేపింది. విశాఖ జిల్లాలో జనవరి 3న జగన్‌ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ సంఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

29, డిసెంబర్ 2010, బుధవారం

ఆ దర్శకుడు ఒక 'మృగం'

'మృగం' దర్శకుడు స్వామి తీసిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో 'నేటి చరిత్ర'గా డబ్బింగ్‌ చేశారు. ఈ చిత్రం ఈనెల 31న విడుదల కాబోతుంది. చెన్నైలో సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రం తెలుగులో ఇటీవలే కొంతమందికి చూపించారు. ఈ చిత్రంపై పలురకాలుగా తర్జనభర్జలు జరుగుతున్నాయి. సెక్స్‌ను విపరీతంగా చూపించేసి చివరికి అది తప్పు అని సందేశాన్నిస్తే చాలా...? అని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారుస్వామి గతంలో 'మృగం' తీశాడు. అందులో ఎద్దుల్ని పెంచే ఓ వ్యక్తి ఎద్దులాగా తన కంటికి నచ్చి ఆడదాన్ని లొంగదీసుకోవడం, కన్నతల్లి చెప్పినా వినిపించుకోకుండా ఆమెనుసైతం కొట్టడం జరుగుతుంది. చివరికి ఎయిడ్స్‌ వచ్చి చనిపోవడంతో కథ ముగుస్తుంది. ఇది అప్పట్లో మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.కానీ ప్రస్తుతం కథ మాత్రం పూర్తి విరుద్ధం. వావివరసలు మరచిన ఓ మామ తన కోడలిని లొంగదీసుకుని ఏవిధంగా ఎంజాయ్‌ చేశాడన్నదే 'నేటి చరిత్ర'. మిలట్రీ నుంచి ఊరికి వచ్చిన ఆ వ్యక్తి భార్య చనిపోతుంది. కొడుకు పంచన చేరతాడు. అప్పటికే కొడుక్కి పెండ్లి జరుగుతుంది. తన భార్యతో సరదాగా గడిపే అతను చదువు నిమిత్తం వేరే ఊరు వెళ్ళాల్సి వుంటుంది. కానీ, భార్యను తన తండ్రి దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కోడలిని లొంగదీసుకుంటాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక విషయం తెలిసిన కొడుకు తండ్రిని చంపేస్తాడు. ఆ తర్వాత భార్యనూ చంపేస్తాడు. ఇదీ కథ.శనివారం రాత్రి ప్రివ్యూచూసిన కొంతమంది సినీప్రముఖులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. మన సమాజంలో ఇటువంటి కాన్సెప్ట్‌తో చిత్రాలు రావడం.. చివర్లో ఏదో సందేశం ఉందనడం వంటివి యువతన పెడధోవన పట్టించే విధంగా ఉంటున్నాయని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.మరికొందరు... గతంలో శ్రీకాంత్‌ నటించిన 'ఆమె' చిత్రంలో కొడుకు చనిపోతే కోడలు గతి ఏమిటనే సందర్భంలోనే ఇ.వి.వి. సత్యనారాయణ అటువంటి సినిమా తీశాడు. కాకపోతే కొద్దిగా మన నేటివిటీని మార్చి తీశాడు. కాబట్టి అది హిట్‌ అయింది. 'నేటిచరిత్ర' అనేది పరభాషా నేటివిటీ అని దీన్ని ఎలా రీసీవ్‌ చేసుకుంటారనేది చూడాల్సిందేనని అంటున్నారు.అసలు ఈ చిత్రం మాతృక మలయాళం. ఆ చిత్రాన్ని తమిళంలో తీశారు. కాని తమిళంలో మహిళాసంఘాలు దర్శకుడు స్వామికి ఈ చిత్రం విడుదల తర్వాత దేహశుద్ధి చేసినట్లు చెబుతున్నారు. మరి సాంప్రదాయాలు, కట్టుబాట్లు బాగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నేటిచరిత్ర ఎటువంటి స్పందన చూపిస్తుందో
చూడాలి.

జనవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవచ్చు

కేసిఆర్ ఆశ
తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరిలో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కుప్పకూలిపోవచ్చని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2జీ స్పెక్ట్రమ్ ఉచ్చులో పూర్తిగా ఇరుక్కుపోయిందని, ఇటు సీమాంధ్రలో జగన్‌కు 70 మంది ఎమ్మేల్యేల మద్దతు ఉందని ఒకవేళ ఎన్నికలే జరిగితే కాంగ్రెస్‌కు ముందున్నది గడ్డుకాలమేనని ఆయన అన్నారు.మధ్యంతర ఎన్నికలు జరిగితే తెలంగాణలో టిఆర్ఎస్, సీమాంధ్రలో జగన్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రాష్ట్ర కమిటీ సభ్యులతో చంద్రశేఖర్‌రావు అన్నారు. అయితే జగన్‌తో కలిశామని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.తెలంగాణా అంశంపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో తమ కార్యకర్తలు సహనం కోల్పోయి రెచ్చిపోవద్దని, సంయమనంతోనే భవిష్యత్ కార్యక్రమాలను రూపొందిద్దామని
పిలుపునిచ్చారు. తెలంగాణా కోసం జేఏసితో కలిసి ఉద్యమిస్తామని, ఈ ఉద్యమాన్ని శాంతియుతంగానే ముందుకు తీసుకుపోతామని ఆయన చెప్పారు. ఉద్యమకారులను రెచ్చగొట్టద్దని ప్రధానిని కేసీఆర్ కోరారు.

నేను సమైక్యవాదిగానే ఉన్నాను

గుంటూరు, నరసరావుపేట: నేను సమైక్యవాదిగానే ఉన్నాను. ఆశావాదిగా అందరూ కలిసి ఉండేలా కమిటీ నివేదిక ఇస్తుందని భావిస్తున్నా. రెండ్రోజులాగితే మీరేచూస్తా'రుగా అంటూ శ్రీకృష్ణకమిటీ నివేదికపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో  ఆయన పరామర్శ యాత్ర నిర్వహించారు. రైతులను ఓదార్చారు. నరసరావుపేటలో మాట్లాడారు. ఆందోళనలలో పాల్గొన్న విద్యార్థులపై కేసులను ఎత్తి వేయటం అభినందనీయంగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి సహాయం తీసుకురావటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అన్నదాతల తరపున ఎవరు ఉద్యమాలు చేపట్టినా మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ దుస్థితి నుంచి రైతాంగం బయటపడాలంటే జాతీయ వ్యవసాయ విధానం అమల్లోకి తీసుకురావాలన్నారు.కౌలు రైతులను కాపాడేందుకు నిబంధనలను సడలించాలన్నారు.20 కుటుంబాలకు సాయం: పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి గుంటూరు జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర రెండోరోజు 20 కుటుంబాలకు రూ.25 వేల వంతున చెక్‌లను అందించారు. చదువుకుంటున్న పిల్లలుంటే ఉన్నత చదువులకు ఖర్చు భరిస్తామన్నారు.

"ఒత్తిడి".. వదిలించుకనేదెట్లా...?

మానవ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో తరచూ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతుంటాం. ఆర్థికం, సామాజికం, కుటుంబం, ఉద్యోగం, ప్రేమ ఇలాంటి పలు కారణాలు ఒత్తిడి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడిని నివారించుకునేందు రసాయన మందులపై ఆధారపడే కన్నా సహజసిద్ధంగా ఎలా నివారించుకోవచ్చో ఒకసారి చూద్దాం...!!సుధీర్ఘ శ్వాస - బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు 10 నిమిషాల పాటు సుధీర్ఘ శ్వాసను తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వ్యాయామాన్ని పాటిస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది.వ్యాయామం - వ్యాయామానికి మించిన ఔషధం మరొకటి లేదనే చెప్పాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చు. ఉదయాన్నే వాకింగ్ చేయడం, సైక్లింగ్, జిమ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తొలగిపోవడంతో పాటు, ఆరోగ్యం, చక్కని శరీరాకృతి లభిస్తాయి.ఆరోగ్యమైన తిండి - సరైన తిండి తీసుకోకపోవడం వల్ల ఒత్తిడి తలెత్తుతుంది. తాజా పండ్లు, పండ్ల రసాలు, సలాడ్‌లు వంటివి తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. అధిక ఫ్యాట్, అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.హాయిగా నిద్రపోండి - బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. కానీ సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అటు ఎక్కువగా.. ఇటు తక్కువగా కాకుండా.. రోజుకు ఎనిమిది గంటలపాటు నిద్రిస్తే ఒత్తిడి దూరమవుతుంది. వీలైనంత వరకూ పగటిపూట నిద్రకు దూరంగా ఉంటే మంచిది. ఎక్కువగా నిద్రపోవడం వల్ల శక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి నిద్ర విషయంలో సరైన మెలకువలు పాటిస్తే.. ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.కోరికలు - మీరు బాగా ఒత్తిడికి గురైనప్పుడు సినిమాకు వెళ్లడం, స్నేహితులను కలుసుకోవడం, మీకు ఇష్టమైన పుస్తకాలను చదుకోవడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం వంటివి చేయడం కూడా మంచి ఫలితాలనిస్తాయి.

జాతీయ వ్యవసాయ విధానం తీసుకురావాలి: చిరంజీవి

గుంటూరు: రైతుల కష్టాలపై జాతీయ వ్యవసాయ విధానం తీసుకురావాలని ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. రైతు పరామర్శ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఉండేందుకు వారికి కౌన్సెలింగ్‌ అవసరమని చెప్పారు. కౌలు రైతులకు ప్రస్తుతమున్న నిబంధనలు సడలించి ఉదారంగా ఆదుకోవాలని కోరారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశంపై ఆయన మాట్లాడుతూ... కేసుల ఎత్తివేత అభినందనీయమన్నారు. విద్యార్థులు కానివారి వివరాలు బహిరంగపర్చాలని చిరంజీవి డిమాండ్‌ చేశారు.

రూ.5 కోట్ల విలువైన గంజాయి మొక్కలు ధ్వంసం

మెదక్‌: జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌ మండలం పిప్రిలో ఎక్సైజ్‌ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ. 5కోట్ల విలువైన గంజాయి మొక్కలను అధికారులు ధ్వంసం చేశారు.

సరిహద్దులో పాక్‌ కాల్పులు

జమ్మూ: పాకిస్థాన్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. భారత సరిహద్దుల్లో మరోసారి కాల్పులకు పాల్పడింది. సాంబ జిల్లాలోని భారత సరిహద్దులోని ఓ ఔట్‌పోస్ట్‌పై పాక్‌ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. రాకెట్‌ ప్రొజెక్త్టెల్‌ గ్రెనేడ్స్‌తో పాక్‌ దళాలు భారత సరిహద్దులపై విరుచుకుపడ్డాయని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ జి. ఓబరాయ్‌ తెలిపారు. అప్రమత్తమైన భారత దళాలు ఎదురు కాల్పులు జరిపాయని చెప్పారు. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. భారత్‌ సరిహద్దు వెంబడి పాక్‌ కాల్పులకు పాల్పడడం ఈ నెలలోనే ఇది మూడోసారి.

భారతీయులే బెస్ట్...........తెలుసా............!

మన దేశంలో ప్రభుత్వం ప్రజల చేత బలవంతంగా మందు (ఆల్కహాల్) తాగిస్తున్నా.. మధ్యపాన సేవనంలో మాత్రం భారతీయులు చిట్ట చివరి స్థానంలోనే ఉన్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పీకల దాకా మందు కొట్టడంలో ఎవరు ఫస్ట్‌ అని అడిగితే బ్రిటిషర్లని, అదే ఎవరు లాస్టు అని అడిగితే భారతీయులని టక్కున చెప్పేస్తున్నారు విశ్లేషకులు.ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే బ్రిటిషర్లు తరచూ మద్యం సేవిస్తారని, భారతీయులు మాత్రం ఎప్పుడో ఒకసారి రుచి చూస్తారని ఆ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే.. 84 శాతం మంది బ్రిటిషర్లు మందు బాబులే. వీరిలో 41 శాతం మంది తరచూ మద్యం సేవిస్తారు. అదే భారత్‌లో అయితే కేవలం 27 శాతం మంది మాత్రమే మద్యపానం సేవిస్తారట.ప్రపంచ మద్యపాన ప్రియులలో బ్రిటిషర్లది సరాసరి 71 శాతం. బ్రిటన్‌లోని ప్రతి 10 మంది పౌరులలో ఒకరు ప్రతిరోజూ మద్యపానం చేస్తారు. ఫ్రాన్స్ మందు బాబులతో పోలిస్తే బ్రిటన్ మందు బాబుల సంఖ్య రెండు రెట్లు అధికం. ఇకపోతే ఆస్ట్రేలియాలో 27 శాతం మంది తరచూ మద్యం సేవిస్తారని ఆ సర్వేలో తేటతెల్లమైంది. అలాగే ధూమపానం విషయానికి వస్తే బ్రిటన్‌లో ప్రతి నలుగురిలో ఒకరు గుప్ప్.. గుప్ప్ అని దమ్ము కొట్టేస్తారట. ఈ వ్యసనాల వల్ల ఆయా దేశాలలో ఊబకాయ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని తేలింది.బ్రిటన్‌లో 33 శాతం మంది ఊబకాయులు ఉన్నట్లు ఆ సర్వే పేర్కొంది. స్థూలకాయ సమస్యలో బ్రిటన్ నాలుగోస్థానంలో ఉండగా.. అగ్రరాజ్యమైన అమెరికా 53 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. మెక్సికోలో 44 శాతం మంది ఊబకాయులతో ద్వితీయ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 34 శాతం మందితో తృతీయ స్థానంలో ఉంది.ఈ గణాంకాలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని బూపా హెల్త్‌ అండ్‌ వెల్‌బీయింగ్‌కు చెందిన డాక్టర్‌ అన్నాబెల్‌ బెంట్లీ అన్నారు. ఆరోగ్యకరమైన జీవణ ప్రమాణాల విషయంలో ఇతర దేశాలతో పోల్చి చూస్తే తాము చాలా వెనుకబడి ఉన్నామని ఆమె చెప్పారు. ఏదేమైనప్పటికీ మద్యపానం, ధూమపానాలు ఆరోగ్యానికి చాలా హానికరమైనవని, ఈ వ్యసనాల వల్ల మనుషులు శరీర పటుత్వాన్ని, రోగ నిరోధక శక్తిని కోల్పోయి అతి త్వరగా బలహీనపడి వివిధ అనోరోగ్యాల బారినపడుతారని ఆమె చెప్పారు.

28, డిసెంబర్ 2010, మంగళవారం

బాలలకు ఆరోగ్య రక్ష

విశాఖపట్నం(విశాల విశాఖ): ప్రాథమిక స్థాయిలో చదుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. 'జవహర్‌ బాల ఆరోగ్యరక్ష' పేరుతో రాజీవ్‌ విద్యామిషన్‌ ఆధ్వర్యంలో బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు అందజేసినట్లు రాజీవ్‌ విద్యామిషన్‌ ప్రాజెక్టు అధికారి సాయిబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 2.70 లక్షల కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. 1 నుంచి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులకు జవహార్‌ బాల ఆరోగ్యరక్ష పధకం వర్తిస్తుందని తెలిపారు. ఈ పథకంగా ద్వారా 12 సంవత్సరాల వయసులోపు ఉన్న విద్యార్థుల ఆరోగ్యం పరిరక్షించడానికి ప్రభుత్వమే బాధ్యతగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇందుకోసం వైద్య బృందాలను ఏర్పాటుచేశారు. ప్రతి నెల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు వైద్య బృందాలు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారు. దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైన వారికి మందులు అందజేస్తామని తెలిపారు. ప్రాథమిక ఆసుపత్రి స్థాయిలో వైద్యం చేయలేని వ్యాధులకు వేరే ఆసుపత్రులకు తరలిస్తారు. దీని ద్వారా ప్రతి నెలలో ఒక రోజు వైద్యపరీక్షలు నిర్వహించి ప్రాథమిక స్థాయిలో గుర్తించి నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

ఉప్పల్‌ మహంకాళీ ఆలయంలో చోరీ

హైదరాబాద్‌: ఉప్పల్‌లోని మహంకాళీ ఆలయంలో దుండగులు గత రాత్రి చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 తులాల ఆభరణాలు, హుండీని అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

సెన్సార్ బోర్డ్ కు డబ్బు ఎరగా చూపుతాం: మంచు విష్ణువర్థన్, లక్ష్మీ ప్రసన్న

మాటకు ముందు పళ్లు బయటపెట్టి నవ్వుతూ కనిపించే తెల్లపిల్ల తాప్సీ నటించిన ‘వస్తాడు నా రాజు’ చిత్రం సెన్సార్ వద్దకు వెళ్లింది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఓ పాటలో తాప్సీ తన నాభీకి అటు ఇటూ ఉన్న పొట్ట భాగాన్ని ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేసిందనీ, ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరారట.దాంతో వస్తాడు నా రాజు బాక్సులో నుంచి ఎప్పుడు బయటపడతాడో అని ఎదురూ చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదిలావుంటే అంతకుముందు లోగో విషయమై అభ్యంతరాల వల్ల లోగో ఆవిష్కరణ కొంత ఆలస్యమైంది. ఇప్పుడేమో తాప్సీ బొడ్డు రూపంలో చిత్రం విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులను అధిగమించి చిత్రం విడుదలకు సిద్ధం చేసేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నారు. మరో ప్రక్క మంచు విష్ణువర్థన్, లక్ష్మీ ప్రసన్న సెన్సార్ బోర్డు మెంబర్స్ ని కన్వీనియన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సెన్సార్ వారు డబ్బుకి లొంగితే మాత్రం ఆ ఎక్స్ పోజింగ్ షాట్స్ ని సినిమాలో వుంచటం ఖాయం.

27, డిసెంబర్ 2010, సోమవారం

30న ఆర్టీసీ కార్మికుల చలో నర్సీపట్నం

నర్సీపట్నం (విశాల విశాఖ): డిపో మేనేజర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈనెల 30న చలో నర్సీపట్నం కార్యక్రవుం చేపట్టనున్నట్టు నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో కార్యదర్శి జీఎస్ నారాయుణ చెప్పారు. స్థానిక డిపో గేటు ఎదుట సోవువారం కార్మికులు ఆందోళన కార్యక్రవుం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయుణ వూట్లాడుతూ డిపోలో నెలకొన్న సవుస్యలపై ఇప్పటికే కార్మికులు పలువూర్లు ఆందోళన చేసినా మేనేజరు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.దీనివల్ల కార్మికులు ఆభద్రతాభావానికి గురవుతున్నారన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రవుం చేపట్టేందుకు ఇప్పటికే విశాఖ డివిజన్ సర్వసభ్య సవూవేశంలో నిర్ణయుం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 30న జిల్లాలోని అన్ని డిపోల నుంచి కార్మికులు నర్సీపట్నం తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆయున పేర్కొన్నారు. ర్యాలీలో కార్మికులందరూ విధిగా పాల్గొని విజయువంతం చేయూలని కోరారు. ఈ కార్యక్రవుంలో యుూనియున్ ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, సంయుుక్త కార్యదర్శి బోళెం రవుణ పాల్గొన్నారు.

26, డిసెంబర్ 2010, ఆదివారం

ఉక్కు సీఎండీ పర్యటనల ఖర్చు రూ. కోటిన్నర

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.కె.బిష్ణోయ్ రెండు సంవత్సరాల 10 నెలల వ్యవధిలో చేసిన పర్యటనల కోసం స్టీల్‌ప్లాంట్ రూ.1,53,56,186లను వెచ్చించింది. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన కాం గ్రెస్ ఫర్ స్టీల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పట్టా రామఅప్పారావు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు సంబంధిత అధికారులు ఇచ్చిన సమాచారం వివరాలిలా ఉన్నాయి. 2007 మే 1 నుంచి 2010 మార్చి 31 వరకు సీఎండీ దేశ, విదేశాల ప్రయాణాల కోసం అవసరమైన విమాన టికెట్ల, హోటల్ ఖర్చులు, డీఏతో కలిపి ఈ మొత్తాన్ని వెచ్చించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ మొత్తంలో కే వలం ఢిల్లీలోని హోటళ్ల ఖర్చు రూ. 38,30,355లు కాగా, ఢిల్లీ టూరుకు సంబంధించి విమాన ఖర్చులు సుమారు రూ. 46 లక్షలు అయినట్టు అధికారుల సమాచారం. 201011 లెక్కలు ఆడిట్ కానందున ఏప్రిల్ నుంచి నేటి వరకు వివరాలు ఇవ్వలేకపోతున్నామని అధికారులు పేర్కొన్నారు.

'కూచిపూడి'కి గిన్నిస్‌ గౌరవం

హైదరాబాద్‌ : ఏకకాలంలో 2,800 మంది నర్తకీ నర్తకులతో సాగిన కూచిపూడి మహా బృందనాట్య ప్రదర్శన గిన్నిస్‌ పుటలకు ఎక్కడం భారత్‌కు గర్వకారణమని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ అన్నారు. ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం సాయంత్రం గురువులు, శిష్యులు, ప్రశిష్యులు కలిసి కనులపండువగా ప్రదర్శించిన మహా బృంద నాట్యానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇంతటి భారీ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తే అది ఆయన ఒక్కడికే కనిపించిందని.. అయితే.. కూచిపూడి కళాకారుల మహా ప్రదర్శన లోకమంతటికీ కనిపించిందని గవర్నర్‌ నరసింహన్‌ కొనియాడారు. కూచిపూడి, యోగా వంటివన్నీ మన ప్రాచీన సంపద అని, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదంతా ఆంధ్ర ప్రజల సౌభాగ్యమన్నారు. 600 ఏళ్ల నాటి ప్రాచీన నాట్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడానికి సిలికానాంధ్ర చేస్తున్న కృషి ప్రశంసనీయమని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మహా బృంద నాట్యం గిన్నిస్‌ పుటలకు ఎక్కడం ద్వారా ప్రపంచంలో రాష్ట్రానికి ఉన్నతమైన గౌరవం దక్కిందని.. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ అభినందనలను అందించారు. కూచిపూడి నాట్యానికి ప్రాణం పోసిన సిద్ధింద్రయోగికి నివాళిగా పద్మభూషణ్‌ వెంపటి చిన సత్యం హిందోళ రాగంలో రూపొందించిన 'థిల్లానా' నాట్యాన్ని ఏకకాలంలో 2,800 మంది కళాకారులు 10 నిమిషాలపాటు అభినయించారు. ఈ ప్రదర్శనను గిన్నిస్‌ సంస్థ ప్రపంచ రికార్డుగా గుర్తించింది. గిన్నిస్‌ ప్రతినిధి ఈ మేరకు ప్రదర్శన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రికి ధ్రువపత్రాన్ని అందజేశారు. రెండో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ భర్త దేవీసింగ్‌, గవర్నర్‌ సతీమణి విమలా నరసింహన్‌, ముఖ్యమంత్రి సతీమణి రాధికారెడ్డి, కేంద్రమంత్రి పురంధరేశ్వరి, మంత్రులు వట్టి, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, నాట్య కుటుంబాలు, కళాప్రియులు పాల్గొన్నారు.

భవానీ దీక్షా విరమణకు ఏర్పాట్లు పూర్తి

విజయవాడ( విశాల విశాఖ ప్రత్యేక ప్రతినిది): భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భవానీలు దుర్గమ్మ సన్నిధిలో దీక్ష విరమించనున్నారు. రేపు జరగబోయే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ ఈవో విజయకుమార్‌ తెలిపారు. ప్రసాదాల విషయంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి నాలుగేసి లడ్డూలు చొప్పున ఇస్తామన్నారు.

తెదేపా 'రైతుకోసం'

హైదరాబాద్‌: ఈ నెల 30న గుంటూరులో తెదేపా తలపెట్టిన బహిరంగ సభ పేరును 'రైతుకోసం'గా ఖరారు చేసినట్లు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు నాగం జనార్దనరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 31న తెలంగాణ ప్రాంత తెదేపా నేతల భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ఇస్తే సంతోషిస్తాంమని, లేకుంటే ఉద్యమిస్తామని చెప్పారు. తెలంగాణపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చేది... తెచ్చేది మీరే అయితే బలగాల మొహరింపులు ఎందుకని ప్రశ్నించారు.

అధినేతల బాటలోనే ద్వితీయ శ్రేణి నేతలు


పరవాడ(విశాల విశాఖ):  అధినేతల బాటలోనే ద్వితీయ శ్రేణి నేతలు కూడా ప్రస్తుతం పయనిస్తూ ఒకవైపు వై ఎస్.జగన్మోహన్‌రెడ్డి మరో వైపు జై కాంగ్రెస్ అంటూ జై కొడుతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు... ఎవరు జగన్ వెంట నడుస్తారన్న దానిపై ప్రజలు తెల్చుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి , మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ప్రస్తుతం జగన్ వెంటే నడుస్తున్న విషయం తెలిసిందే ! బాబ్జి మాజీమంత్రి కొణతాల రామకృష్ణకు ప్రధాన శిష్యుడు కావడం, కొణతాల వై ఎస్.జగన్మోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడు కావడం దీంతో వారి ఇరువురు జగన్ వెంటే ఉంటరన్నది జగమెరిగిన సత్యం. అయితే పెందుర్తి నియోజకవర్గంలో గల మెజార్టీ కాంగ్రెస్ నేతలు గండిబాబ్జి వెంటే ఉంటారు. దీంతో బాబ్జి నడిచిన బాటలోనే నేతలంతా ప్రయాణించాలని అనుకుంటున్నప్పటికి తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లడానికి మరికొందరికి మనసు ఒప్పలేదు. నేటి వరకు జగన్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న కొణతాల, గండిబాబ్జితో పాటు ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాఖలాలు లేవు. జగన్ ఓదార్పు యాత్రలో మాత్రం అందరూ పాల్గొంటామని చెబుతున్నారు. ఇదే బాటలో ద్వితీయ శ్రేణి నేతలు కూడా పయనించి పార్టీకి రాజీనామా చేయకుండా కొణతాల,బాబ్జి వెంట నడుస్తున్నారు. జగన్ కొత్తపార్టీ పెడితే ఆ పార్టీలోకి వెళ్లాలా..లేదా అన్న విషయాన్ని కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న క్యాడర్ అంతా బాబ్జి వెంట వెళితే మరో మూడునాలుగేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, ఆ అధికార ఫలాలను అందిపుచ్చుకోవాలని ద్వితీయ శ్రేణి నేతలలో గల కొంతమంది సీనియర్‌లు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం జైబాబ్జి..జై జగన్ అంటున్నా భవిష్యత్‌లో మాత్రం వారంతా కాంగ్రెస్ పార్టీలో ఉంటారన్న భావం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని గ్రామాల్లో గల వర్గాలు పట్టి పీడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. ఒక వర్గం జగన్ వెంట వెళితే మరో వర్గం కాంగ్రెస్‌లో ఉండి అధికారాన్ని చలాయించి వారి సత్తాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. జగన్ వెంట వెళ్లే వర్గం కాంగ్రెస్‌లో ఉండే వర్గంతో ఎలా పోటీ పడాలన్న దానిపై కూడా ఆలోచన చేస్తు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో బాబ్జిపై అభిమానం ఉన్నా ఆయన వెంట జగన్ పార్టీలోకి ఎంత మంది వెళతారన్న దానిపై ప్రజలు ఎదురు చూస్తున్నారు. జనవరిలో జరిగే ఓదార్పు యాత్రలో మాత్రం ప్రతీ ఒక్కరూ కూడా పాల్గొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

25, డిసెంబర్ 2010, శనివారం

అన్నీ 'వెరైటీ తారీఖుల 2011

2011 వస్తూనే మ్యాజిక్ ఫిగర్‌తో స్వాగతం పలుకుతోంది. ఏ యేడాది లేనన్నీ మ్యాజిక్ డేట్స్‌ కొత్త సంవత్సరంలో దాగున్నాయి. మరోవైపు ఇలా ఎక్కువ మ్యాజిక్ డేట్స్ ఉండటం..శుభమా..అరిష్టమా అంటూ చర్చలు మొదలయ్యాయి. కొన్ని జంటలైతే మ్యాజిక్‌ డేట్స్‌లో ఒక్కటవడానికి సిద్ధమవుతున్నాయి. మ్యాజిక్‌ డేట్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. యేడాదిలో ఏ రోజు మ్యాజిక్ డే వస్తే ఆరోజును తమ లైఫ్‌లో గుర్తిండి పోయే రోజుగా మార్చుకోవడానికి చాలా మంది తహతహలాడుతుంటారు.అయితే ప్రతీ యేడాది మ్యాజిక్ డేట్స్‌ ఒకటో రెండో ఉంటాయి. కానీ ఈ యేడాది మాత్రం మూడు మ్యాజిక్ డేస్ ఉన్నాయి. దీంతో చాలా మంది ఈ క్రేజీ డేట్స్‌లో వివాహాలు చేసుకోవడానికి రెఢీ అవుతున్నారు. 2011 కొత్త సంవత్సరం వెలకమ్‌ చెప్పడమే మ్యాజిక్‌ ఫిగర్‌తో చెబుతోంది. 1/1/2011. దీంతో చాలా మంది న్యూ ఇయర్ + మ్యాజిక్‌ డేట్‌ తమ లైఫ్‌లో గుర్తిండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ యేడాదిలో వచ్చే మరో మ్యాజిక్ ఫిగర్ 11/1/2011. సరిగ్గా పదిరోజుల తేడాతో మరో అరుదైన డేట్ రావడం సమ్‌థింగ్ స్పెషల్‌గా మారింది.ఈ సంవత్సరం వచ్చే మరో క్రేజీ డేట్‌ 11/11/2011 . దీనికైతే ప్రపంచవ్యాప్తంగా భలే డిమాండ్. ఈ యేడాది 1/10/2010 మ్యాజిక్‌ డేను చైనీయులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే రోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. చైనాలోనే కాదు...ప్రపంచ వ్యాప్తంగా ఈ తేదీ రోజూ చాలా జంటలు ఏకమయ్యాయి. పెళ్లిళ్లే కాదు చాలా ఫంక్షన్స్‌కు ఈ డేట్‌ మంచిరోజుగా మారింది. అయితే ఎప్పుడూ లేనంతగా ఈ యేడాది ఎక్కువ మ్యాజిక్ ఫిగర్స్ రావడం ఆనందంగా ఉన్నా...అయితే ఈ మ్యాజిక్ డేట్స్ అన్నీ శుభదినాలా..లేక అశుభ సూచికలా అనేది తేలాల్సి ఉంది.

వైయస్ జగన్ వెంట 70 మంది ఎమ్మెల్యేలు వస్తారు: గోనె ప్రకాశరావు

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మద్దతిచ్చే శాసనసభ్యుల సంఖ్య కొద్ది కాలంలోనే 60, 70 దాకా పెరుగుతుందని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశ రావు అన్నారు. లక్ష్యదీక్ష సందర్భంగా 25 మంది శాసనసభ్యులు మద్దతు తెలిపారని, ఆ సంఖ్య 60, 70కి పెరుగుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒత్తిడి చేసినా, అధికారంలో లేకున్నా వైయస్ జగన్ వెంట ఇప్పటికే అంత మంది శాసనసభ్యులు వచ్చారని, భవిష్యత్తులో మరింత మంది వస్తారని ఆయన అన్నారు.ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఆరు నెలలు కూడా అధికారంలో ఉండబోరని ఆయన జోస్యం చెప్పారు. రోశయ్య కన్నా, భవనం వెంకట్రామ్ కన్నా తక్కువ కాలం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ పై కొంత మంది అవకాలు చెవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు.

శబరిమలలో ఆంధ్ర భక్తునికి గాయాలు

చిత్తూరు: అయ్యప్ప దర్శనార్థం శబరిమల వెళ్ళిన ఆంధ్ర భక్తుడొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కిక్కిరిసిన భక్త సమూహంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకోవడం వల్ల ఆతను గాయపడినట్లు తెలుస్తున్నది. అలాగే మరో ముగ్గురు భక్తులు కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. కాగా, అయ్యప్ప దర్శనానికి రద్దీ ఎక్కువగా ఉంది. ఉదయం ఎనిమిది గంటల సమయానికి స్వామి వారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది.

98 పరుగులకే కుప్పకూలిన ఆసీస్

మెల్‌బోర్న్: ఇంగ్లాండ్ దెబ్బకు కంగారూలు కంగుతిన్నారు. తొలి ఇన్నింగ్స్‌లోనే చేతులెత్తేశారు. మెల్‌బోర్న్‌లో ఇవాళ ఉదయం ప్రారంభమైన యాషెస్ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 98 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్‌ను కట్టడి చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మన్స్‌లో వాట్సన్ 5, హ్యూగ్స్ 16, పాంటింగ్ 10, క్లార్క్ 20, హస్సీ 8, స్మిత్ 6, హడిన్ 5, జాన్సన్ 0, సిడిల్ 11, హిల్ఫెన్‌హాస్ 0 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ట్రెమ్లెట్, జేమ్స్ అండర్సన్ చెరో నాలుగు వికెట్లు తీసుకుని ఆసీస్‌ను అనూహ్యరీతిలో దెబ్బతీశారు.

ఆకట్టుకున్న 'లేపాక్షి' ప్రదర్శన

విశాఖపట్నం: సుమారు పది రాష్ట్రాలకు చెందిన వివిధ ఉత్పత్తులు ఒకే వేదికపై కొలువు తీరి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎంపోరియం ఆధ్వర్యంలో ఎంవీపీకాలనీ కొత్త రైతుబజారులో ఏర్పాటుచేసిన ప్రదర్శన శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ది హిందూ పత్రిక బ్యూరో చీఫ్‌ బి.ప్రభాకర శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొని దీనిని ప్రారంభించారు. ఇంటికి శోభనిచ్చే గృహాలంకరణ వస్తువులు, మహిళలు దుస్తులు, చిన్నారులు మెచ్చే బొమ్మలు.... ఇలా అన్నీ అందుబాటులో ఉంచారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, హైదరాబాద్‌ బంజారా చేతి ఎంబ్రాయిడరీ, కళంకారి, గుంటూరు మంగళగిరి ఫ్యాబ్రిక్‌, వెంకటగిరి చీరలు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షహాన్‌పూర్‌ వుడ్‌ కార్వింగ్స్‌, బెనారస్‌ చీరలు, కర్నాటక రోజ్‌ వుడ్‌ కార్వింగ్స్‌, అగర్‌బత్తీలు, మద్యప్రదేశ్‌ మహేశ్వరి చీరలు, బెల్‌మెటల్‌ ఉత్పత్తులు, పశ్చిమ బెంగాల్‌ చీరలు, నార సంచులు, తంజావూర్‌ పెయింటింగ్స్‌, రాజస్థాన్‌ జువెలరీ, హర్యానా బెడ్‌షీట్స్‌, గుజరాత్‌ దుస్తులు ఇలా అన్ని రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. జనవరి 2వ తేదీ వరకు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని లేపాక్షి సీనియర్‌ మేనేజర్‌ జగన్మోహనరావు తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి

వరంగల్‌: జిల్లాలోని మరిపెడ మండలం వీరారం గ్రామంలో ఈ ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఎంబీబీఎస్‌ చదువుతున్న తిలక్‌, బీటెక్‌ చదువుతున్న భరత్‌ క్రిస్మస్‌ సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చారు. తోటకు నీళ్లు పెట్టేందుకు ఈ ఉదయం పొలానికి వెళ్లారు. ఆ సమయంలో తిలక్‌ కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. అతడిని రక్షించేందుకు యత్నించిన భరత్‌ కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుదాఘాతంతో వీరిద్దరూ సమీపంలోని బావిలోకి పడిపోయారు.

పాక్‌లో ఆత్మాహుతిదాడి: 40 మంది మృతి

లాహోర్‌: పాకిస్థాన్‌లో జరిగిన ఓ ఆత్మాహుతిదాడిలో 40 మంది మృతి చెందగా 72 మందికి గాయాలయ్యాయి. బజౌర్‌ ప్రాంతంలోని ఖర్‌ పట్టణంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఇక్కడ ప్రపంచ ఆహారసంస్థ ఆహార పంపిణీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది దీంతో అక్కడ ఆహారాన్ని తీసుకునేందుకు 1000 మంది వరకు వచ్చారు. ఆ సమయంలో ఈ బాంబుదాడి జరిగింది. పాకిస్థాన్‌-ఆఫ్ఘన్‌ సరిహద్దుల్లో ఉన్న ఈ పట్టణంలో తరచు ఆల్‌ఖైదా దాడులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు.

24, డిసెంబర్ 2010, శుక్రవారం

జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా వసంతకుమార్

విశాఖపట్నం(విశాల విశాఖ): జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్ నియమితులయ్యారు. గతంలో ఇన్‌చార్జ్ మంత్రిగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరించేవారు. జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశాలకు ఇన్‌చార్జ్ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.ఈ ఏడాది జూలై మూడవ వారంలో జరిగిన డీఆర్సీ సమావేశం తరువాత నవంబర్ 27న సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే రోశయ్య స్థానంలో ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కొత్త మంత్రివర్గం ఏర్పడి, ఇన్‌చార్జీలు రద్దయ్యారు. శుక్రవారం ముఖ్యమంత్రి జిల్లాల వారీ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. డీఆర్‌సీ ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. గత సమావేశం జరిగి ఐదు నెలలు గడిచిపోయాయి. మంత్రి వట్టి బాధ్యతలు తీసుకొని జిల్లాకు వస్తే జనవరి మొదటి వారంలో డీఆర్‌సీ సమావేశం నిర్వహించే అవకాశముంది.:

చిరంజీవి దాసరి నారాయణరావుని కలిపిన నాటి మేటి ఆణిముత్యం...

గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా వుంటూ ఒకరికొకరు విమర్సలబాణీలు సంధించుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిని, దాసరి నారాయణరావుని ఓ పుస్తక ఆవిష్కరణ వేదిక కలిపింది. సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించిన నాటిమేటి సినీ ఆణిముత్యాలు పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో జరిగింది. దాసరి పుస్తకాన్ని ఆవిష్కరించి చిరంజీవికి అందజేసారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 'ఆర్టిస్ట్ ని అయ్యాక నా రెండో ఇంటర్వ్యూ పసుపులేటి రామారావు గారిదే. అప్పుడాయన విశాలాంధ్రలో వున్నారు. ఆ ఇంటర్వ్యూ నా కెరీర్ కు చాలా పుపయోగపడింది. దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి నిబద్దతతో వున్నారు రామారావు గారు. భావితరాలకు ఉపయోగపడేలా ఆయన ఈ పుస్తకం రాశారు. దీనికి బాగా ఖర్చు అయ్యే వుంటుంది. అందుకే ఉడతా భక్తిగా ఓ లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను' అన్నారు.దాసరి మాట్లాడుతూ 'జర్నలిజం అనేది ప్రమాదకరమైనది. అవాస్తవాలు రాసి మన మనసులను చంపుకోవాల్సి వస్తుంది. ఇతర భాషలలోని జర్నలిజంతో పోలిస్తే మన తెలుగు సినిమా జర్నలిజం నిజంగా ఉత్తమమైనది. సీనియర్ పాత్రికేయుడు మోహన్ కుమార్ పరిచయం చేసిన శిష్యుల్లో అగ్రగణ్యుడు పసుపులేటి రామారావు. ఏళ్ళు గడుస్తున్నా ఆయన వ్యక్తిత్వంలో మాత్రం మార్పులేదు. పుస్తకం అనేది మంచి ప్రయత్నం. సీనియర్ జర్నలిస్టులందరూ తమ అనుభవాలను క్రోడీకరించి, తప్పనిసరిగా ఇలాంటి పుస్తకాలను ప్రజల ముందుకుతేవాలి. అప్పుడే అందరికీ సినిమాలపై సరైన అవగాహన ఏర్పడుతుంది' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, ఏడిద నాగేశ్వర రావు, ముత్యాల సుబ్బయ్య, శివ కృష్ణ, ఎల్బీ శ్రీరామ్, ప్రభు, సురేష్ కొండేటి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పదేళ్ల తరువాత...... వణికిస్తున్న చలిపులి

తాండూరు(విశాల విశాఖ): పదేళ్ల తరువాత చలి విజృంభిస్తుంది.ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నడూ లేనివిధంగా 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది.గత వారం రోజుల నుండి మధ్యాహ్నం మూడు గంటలకే చలి ప్రారంభమై ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు.రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఉదయం 7 గంటల వరకు పొగమంచు వీడటం లేదు.చలి పెరగడంతో ఉదయం 10 గంటల వరకు ప్రజలు బయటకు రావడంలేదు.తిరిగి సాయంత్రం 5 గంటలకే ఇంటి ముఖం పడుతున్నారు.ప్రస్తుతం ఉన్న 8 డిగ్రీల ఉష్ణోగ్రత కనీసం పది సంవత్సరాల తరువాత వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రత 10 నుండి 11 వరకు నమోదు అయితేనే చలి విపరీతంగా ఉంటుంది.అలాంటిది ఒక్కసారిగా 8 డిగ్రీలకు పడిపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.ఇటీవల కురిసిన వర్షాలు,తుఫాను ప్రభావం వల్లనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.దీంతో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కంది పంటపెై ప్రభావం ఉంటుందని రెైతులు ఆందోళన చెందుతున్నారు.ప్రతి రోజు ఉదయం కురుస్తున్న పొగ మంచువల్ల కంది పూత రాలిపోవడంవల్ల కాయ ఏపుగా పెరగదని రెైతులు పేర్కొంటున్నారు.చలి ధాటికి సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు.ఉష్ణోగ్రతలు పెరిగితే కాని చలి తీవ్రత తగ్గదని అధికారులు పేర్కొంటున్నారు.

ఉక్కు ధరలకు రెక్కలు

విశాఖపట్నం(విశాల విశాఖ): నిర్మాణ రంగం ఊపందుకుంటుండడం, గిరాకీ పెరగడంతో ఉక్కు ధరలకూ రెక్కలు రానున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు అందుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటురంగ పరిశ్రమలు రెండూ ధరల పెంపు దిశగా సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం లిమిటెడ్‌ (ఆర్‌.ఐ.ఎన్‌.ఎల్‌.), సెయిల్‌, టాటా, జె.ఎస్‌.డబ్ల్యు, ఎస్సార్‌ వంటివన్నీ ఈ బాటనే పయనిస్తున్నాయి. ఒకపక్క ముడి సరకుల ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో ఇలా చేయడం అనివార్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉక్కు ధరలు పెరగవచ్చని సూచనలు వెలువడుతున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం డైరక్టర్‌ (కమర్షియల్‌) టి.కె.చాంద్‌ గురువారం స్పందిస్తూ ఇనుప ఖనిజం, కోకింగ్‌ కోల్‌ వంటి ముడిసరకుల ధర పెరగడంతో ఉక్కు ఉత్పత్తుల ధరను పెంచాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు. 'గత ఆర్థిక సంవత్సరంలో కోకింగ్‌ కోల్‌ సగటు ధర 129 డాలర్లు ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 215 డాలర్లకు పెరిగిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఎకాఎకి 245 డాలర్లకు చేరిపోయింది. పెన్సిల్‌ ఇన్‌గాట్‌ల ధరా కూడా 40-45 డాలర్ల వరకు పెరిగింది. ఇదంతా ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపే అంశాలేన'నని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి 10.8 శాతానికి, స్థూల జాతీయోత్పత్తి 8.75 శాతానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టులు, ఇంజనీరింగ్‌, తయారీ రంగాల్లో పురోగమనం వల్ల ఉక్కు ఉత్పత్తుల్లో, ప్రధానంగా పొడవైన ఉత్పత్తుల ధర పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

జగన్ నీతి, నిజాయితీలకు కట్టుబడాలి, భూమాపై చర్యలు!: పీఆర్పీ

విశాఖపట్నం: నిత్యం నీతి, నిజాయితీలు అంటూ వ్యాఖ్యానిస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వాటికి కట్టుబడి ఉండాలని ప్రజారాజ్యాం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇతర పార్టీలలో పదవులు అనుభవిస్తూ మరొకరికి మద్దతు ఇవ్వడం శోచనీయమని ఆయన అన్నారు.భూమా దంపతులు ప్రజారాజ్యం పార్టీలో పదవులు అనుభవిస్తూ జగన్ కు మద్దతు పలకడంపై ఆయన ధ్వజమెత్తారు. ఇక్కడ పదవులు అనుభవిస్తూ అక్కడ మద్దతా అని ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలను ఆహ్వానించేటప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పాల్సిన అవసరం జగన్ కు ఉందన్నారు. భూమా దంపతులపై పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు.

తాప్సీ నాభీని యూ ట్యూబ్‌లో చూడవచ్చు

మాటకు ముందు పళ్లు బయటపెట్టి నవ్వుతూ కనిపించే తెల్లపిల్ల తాప్సీ నటించిన "వస్తాడు నా రాజు" చిత్రం సెన్సార్ వద్దకు వెళ్లింది. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఓ పాటలో తాప్సీ తన నాభీకి అటు ఇటూ ఉన్న పొట్ట భాగాన్ని ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేసిందనీ, ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరారట.దీంతో "వస్తాడు నా రాజు" బాక్సులో నుంచి ఎప్పుడు బయటపడతాడో అని ఎదురూ చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదిలావుంటే అంతకుముందు లోగో విషయమై అభ్యంతరాల వల్ల లోగో ఆవిష్కరణ కొంత ఆలస్యమైంది. ఇప్పుడేమో తాప్సీ బొడ్డు రూపంలో చిత్రం విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులను అధిగమించి చిత్రం విడుదలకు సిద్ధం చేసేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నారు.ఇదిలావుంటే నాభీని ఓవర్ ఎక్స్‌పోజ్ చేస్తూ తాప్సీ నటించిన పాటను యూట్యూబ్‌లో పెట్టాలని యువహీరో మంచు విష్ణువర్థన్ ఆలోచన చేస్తున్నాడట. కనుక, సినిమాల్లో తాప్సీ సెక్సీ నాభీని చూడలేకపోయినా యూ ట్యూబ్‌లో చూడవచ్చన్నమాట.

తీపి గురుతులు ప్రేమలేఖలు..

ఈ ఆధునిక కాలంలో ఇపుడంతా ఇంటర్నెట్, సెల్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రేమను వ్యక్తీకరించాలన్నా... ప్రేమ భావనలు తెలుపాలన్నా.. ఇ మెయిల్ లేదా సెల్ సాధనంగా మారిపోయింది. నిజానికి హృదయంలో రేగే ప్రేమ భావనలను ఓ లేఖపై అద్ది ప్రియురాలు  ప్రియునికి అందజేస్తే ఆ అనుభూతి ఎన్నటికీ మరువలేనిదిగా మిగిలిపోతుందంటున్నారు ప్రేమ జీవులు.ఆనాటి కాలంలో ప్రేమలేఖలు గురించి ఎన్నో సినిమాలు, కథలు, నవలలు వచ్చాయి... కానీ నేటి కాలంలో అసలు ప్రేమలేఖలకే స్థానం లేకుండా పోయిందనే చెప్పవచ్చు. ప్రేమలేఖలా...? అవెలా ఉంటాయి..? ఎలా రాయాలి..? అని అడిగేవారూ ఎక్కువయ్యారు. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు....ప్రేమలేఖను రాయాలనుకున్నవారు ఇలా చేయాలి. మనసులో మీ ప్రేమమూర్తిని తలుచుకుంటూ కళ్లు మూసుకోండి. సుదీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ ప్రియురాలు ప్రియుడి రూపాన్ని మనసులో ఆవిష్కృతం చేసుకోండి. మీరు తొలిసారిగా మీ లవర్‌ను ఎక్కడ కలుసుకున్నారో మననం చేసుకోండి.ఆమె/అతని శరీర స్పర్శ రుచి చూసిన క్షణాలు, అది కలిగించిన హాయిని నెమరేసుకోండి. మీరు కలిసి తిరిగిన ప్రదేశాలు, సంతోషం కలిగించిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకోండి. వీటన్నిటిలో మీ లవర్‌తో అత్యంత ఆనందాన్ని కలిగించిన సంఘట ఏదో దానితో ప్రేమలేఖలోని తొలి వాక్యాన్ని ప్రారంభించండి.ఈ తొలివాక్యం... ఆమె/అతని హృదయ కవాటాలను తాకి మీదైన ప్రేమలోకంలో విహరించేటట్టు చేయాలి. మీతోటిదే లోకంగా మారిపోవాలి. ఆ ప్రేమలేఖ మీ ప్రేమబంధాన్ని మరింత దృఢం చేసేదిగా ఉండాలి. అన్నట్లు ప్రేమలేఖ రాసేటప్పుడు మీ ప్రియుడు లేదా ప్రేయసి ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని రాయడం మరిచిపోవద్దు.

22, డిసెంబర్ 2010, బుధవారం

ఆర్టీసీ బస్ ఢీకొని విద్యార్థిని మృతి

హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ విద్యార్థిని మృతి చెందింది. గురువారం ఉదయం ఖైరతాబాద్‌లో ఈ ప్రమాదం జరిగింది. కాగా మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

25న జీశాట్5పీ ఉపగ్రహ ప్రయోగం

చెన్నై: కమ్యూనికేషన్ల ఉపగ్రహం ।జీశాట్5పీ*ని డిసెంబర్ 25న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. నిజానికి సోమవారమే ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉంది. ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాల్సిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ఇంజన్‌లో లీకేజీ సంభవించడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. రాకెట్‌లోని క్రయోజనిక్ ఇంజన్‌కు రష్యాలో తయారైన వాల్వులు వాడారు. లీకేజీ సమస్యపై పరీక్షలు జరిపామని, ఇంజన్ వాల్వ్ బాగానే ఉందని ।ఇస్రో* డెరైక్టర్ సతీష్ చెప్పారు. 1999లో అంతరిక్షానికి పంపిన ।ఇన్‌శాట్2ఈ స్థానంలో ।జీశాట్5పీ*ని ప్రవేశపెట్టనున్నారు.

తెలుగురైతు నాయకుడు ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌: చంద్రబాబు దీక్షపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లిలో తెలుగు రైతు నేత వినాయకరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు సకాలంలో స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించారు.

21, డిసెంబర్ 2010, మంగళవారం

వైయస్ జగన్ దీక్షకు హాజరైన కాంగ్రెసు ఎంపి సబ్బం హరి

హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేపట్టిన లక్ష్యదీక్షకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి బుధవారం ఉదయం హాజరయ్యారు. రైతు సమస్యలపై విజయవాడలో జగన్ చేపట్టిన 48 గంటల దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్షకు వచ్చి వైయస్ జగన్ కు తాను సంఘీభావం ప్రకటించినట్లు సబ్బం హరి చెప్పారు. రాష్ట్ర సమస్యలపై ఎవరు పోరాటం చేసినా తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.తమకు ఎవరినీ బ్లాక్ మొయిల్ చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. రైతు సమస్యలపై ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఢిల్లీలో మంగళవారం కలిసిన పార్లమెంటు సభ్యుల్లో తాను కూడా ఉన్నానని, వినతిపత్ర రూపకల్పనలో తాను కూడా పాలు పంచుకున్నానని ఆయన చెప్పారు. తాను పని మీద విశాఖపట్నం వచ్చానని, ఈ సందర్బంగా తాను వైయస్ జగన్ దీక్షకు వచ్చి సంఘీభావం తెలిపానని ఆయన వివరించారు. వైయస్ జగన్ కు తొలి నుంచి సబ్బం హరి మద్దతు పలుకుతున్నారు. జనవరి 3వ తేదీ నుంచి విశాఖపట్నంలో చేపట్టే ఓదార్పు యాత్రకు కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు.

అటు ఇటు కాని హ్రుదయంతోటి

వై.ఎస్. జగన్మోహన రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీలో చేరే అంశంపై కాంగ్రెసు సికింద్రాబాద్ శానససభ్యురాలు జయసుధ దాటవేశారు. జగన్ పార్టీలో చేరేదా వద్దా అనేది పార్టీ పెట్టాక చూద్దామని జయసుధ అన్నారు. వై.ఎస్. జగన్ పార్టీలో చేరడంపై ఇంకా ఆలోచించలేదని జయసుధ తెలిపారు. రైతుల కోసం పోరాడుతున్న వై.ఎస్. జగన్మోహన రెడ్డికి మద్దతిచ్చేందుకే ఇక్కడు వచ్చానని ఆమె వెల్లడించారు.దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఇచ్చిన అవకాశంతోనే ఈ స్థాయికి ఎదిగానని, ఆయన తనయుడు జగన్ రైతులకోసం దీక్ష చేపట్టడంతో తన మద్దతు ప్రకటించానని లక్ష్యదీక్ష ప్రాంగణం నుంచి బయలుదేరిన అనంతరం మీడియాతో అన్నారు.అంతకుముందు వై.ఎస్. జగన్ దీక్షా వేదికపై మాట్లాడిన జయసుధ.. వైయస్ జగన్‌కు బాసటగా ఉండడానికే తాను దీక్ష ప్రాంగణానికి వచ్చినట్లు చెప్పారు. వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రజానాయకుడిగా సుధ అభివర్ణించారు. వై.ఎస్. జగన్ గుండెల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉందని, యువకులకు ఉండాల్సిందీ... ఈ లక్షణాలే అని జయసుధ అన్నారు.

బాబుకు సెలైన్‌ ఎక్కించేందుకునిమ్స్‌ వైద్యుల యత్నం

హైదరాబాద్‌: రైతు సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబుకు సెలైన్‌ ఎక్కిచేందుకు ఈ ఉదయం నిమ్స్‌ వైద్యులు యత్నించారు. అయితే ఇందుకు ససేమిరా నిరాకరించిన చంద్రబాబు వైద్యులను బయటకు పంపి గది తలుపులు వేసుకున్నారు. చంద్రబాబు దీక్ష ఆరోరోజుకు చేరుకోవడంతో ఆయన పూర్తిగా నీరసించిపోయారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు బలవంతంగా సెలైన్‌ ఎక్కించేందుకు యత్నించారు.

నర్సీపట్నం రామాలయంలో చోరీ

విశాఖ(విశాల విశాఖ) : విశాఖ జిల్లా నర్సీపట్నం వెలమవీధిలోని రామాలయంలో ఈ రోజు తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్వామివారి కిరీటంతో పాటు మూడు లక్షల విలువైన ఆభరణాలను దోచుకువెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెడ్డీస్‌ ల్యాబొరేటరీలో ఇద్దరు కార్మికుల మృతి

హైదరాబాద్‌: బొల్లారం పారిశ్రామికవాడలోని రెడ్డీస్‌ ల్యాబొరేటరీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గ్యాస్‌ లీక్‌ వల్ల కార్మికులు మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.

ఆరో రోజుకు చేరిన చంద్రబాబు దీక్ష

హైదరాబాద్‌: రైతు సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. ఆరో రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆయన బాగానీరసించిపోయారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా క్షీణిస్తోందని... ఇలాగే కొనసాగితే ఆయన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు. తక్షణం నరం ద్వారా సెలైన్‌, ద్రవాహారం ఎక్కించాలని, కనీసం ఏదైనా తాగడం చేయాలని వైద్యులు చంద్రబాబును బలవంతపెట్టారు. ఇందుకు చంద్రబాబు గట్టిగా నిరాకరించారు. మంగళవారం చంద్రబాబుతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో నేడు తెదేపా అన్ని జిల్లా కలెక్టరేట్ల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది.

ట్వంటీ, ట్వంటీ మ్యాచ్‌కు భారత జట్టు ప్రకటన

ముంబయి: దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సీరీస్‌, 20-20 మ్యాచ్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. ధోనీ, సెహ్వాగ్‌, గంభీర్‌, సచిన్‌, కోహ్లీ, రైనా, యువరాజ్‌, హర్భజన్‌, జహీర్‌, నెహ్రా, ప్రవీణ్‌, మునాఫ్‌, అశ్విన్‌, యూసుఫ్‌, శ్రీశాంత్‌, పీయేష్‌చావ్లాలకు జట్టులో చోటు లభించింది.

 

పత్తి కొనుగోళ్లకు కేంద్రం చర్యలు

ఢిల్లీ: నాణ్యత తక్కువ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని సీసీఐకి ఆదేశాలు ఇచ్చామని కేంద్ర జౌళి శాఖ మంత్రి దయానిధిమారన్‌ తెలిపారు. ఆయనతో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పత్తి రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దయానిధి మాట్లాడుతూ పత్తి, జనుము కొనుగోళ్ల విషయంలో అన్ని చర్యలకు ఉపక్రమించామని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు తొందరపడి తక్కువ ధరకు పత్తిని అమ్ముకోవద్దని సూచించారు. తగిన ధరతో జనుమును కూడా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. రేపట్నుంచే సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తుందని తెలిపారు.దుకు టీడీపీ ఎంపీలు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కారత్‌తో భేటీ అయ్యారు. రైతు సమస్యలపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపట్టే విషయంపై చర్చలు జరిపారు.

ప్రకాష్‌కారత్‌తో టీడీపీ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ: రైతులకోసం నిరాహారదీక్ష చేపట్టినటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషమించటంతో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు టీడీపీ ఎంపీలు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కారత్‌తో భేటీ అయ్యారు. రైతు సమస్యలపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపట్టే విషయంపై చర్చలు జరిపారు.

20, డిసెంబర్ 2010, సోమవారం

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ల మ్యారేజ్ డేట్ ఫిక్స్...

అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల నిశ్చితార్దం ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహం మార్చి ఆరున జరపటానికి పెద్దలు ఫిక్స్ చేసారని అల్లు అర్జున్ ని కలిసిన మీడియాకు చెప్పారు. అలాగే ఈ పంక్షన్ ఎరేంజ్ మెంట్స్ లో ఇరువైపుల కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారన్నారు. అలాగే పెళ్ళి సూటు కోసం డిల్లీనుంచి ప్రత్యేకంగా డిజైనర్ వస్తున్నారని అన్నారు. ఇక తనది ప్రేమ వివాహం అని మీడియాలో వచ్చిందని, అయితే అది నిజం కాదని, ఓ పార్టీలో తాము ఇద్దరం పరిచయం అయ్యామని, ఆ తర్వాత తమ అభిరుచులు కలవటంతో తమ కుటుంబ సభ్యులకు చెప్పటం వారు నిశ్చితార్దం ఏర్పాటు చేయటం జరిగిందని అని చెప్పుకొచ్చారు. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది.

రేపల్లె సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌కు తప్పిన ముప్పు

గుంటూరు: రేపల్లె - సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ రైలుకు పెను ముప్పు తప్పింది. జంపని - చినరావూరు మధ్య రైలు పట్టా విరగడం గమనించిన గ్యాంగ్‌మన్‌... ఎదురుగా రేపల్లె ప్యాసింజర్‌ రైలు రావడం గమనించి ముందుకు వెళ్లి రైలును ఆపివేశాడు. సుమారు 40 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. అనంతరం రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

టీనేజ్ అమ్మాయిల బ్రెస్ట్ సైజులు "బ్రా"ప్‌రే..!!

ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయిలు, 30 ఏళ్ల లోపు యువతుల ఎద ఆకృతులలో భారీగా తేడాలు వచ్చినట్లు బ్రా కంపెనీలు చెపుతున్నాయి. సహజంగా స్త్రీలు వాడే "బి" బ్రా సైజుకు బదులు ఇప్పుడు డిడి సైజులు ఎక్కువగా వాడుతున్నట్లు చెపుతున్నాయి. ఇది గత 20 ఏళ్ల కాలంలో చోటుచేసుకున్న పరిణామంగా వారు అభివర్ణిస్తున్నారు.దీనికి కారణాలేమిటో వారు చెప్పలేకపోయినా... ఆరోగ్య నిపుణులు మాత్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అసలు విషయాన్ని కనుగొన్నారు. పర్యావరణంలో వస్తున్న మార్పులు, ఆహారపుటలవాట్ల మూలంగా స్త్రీలలో హార్మోన్లకు సంబంధించి గణనీయమైన తేడాలు చోటుచేసుకున్నట్లు తమ పరిశోధనలో తేలిందంటున్నారు. ఫలితంగా వారు ధరిస్తున్న బ్రాలతో పాటు లింగరీ సైజుల్లో కూడా తేడాలు స్పష్టంగా బహిర్గతమవుతున్నట్లు వెల్లడించారు.బ్రాలను తయారు చేసే ఓ ప్రముఖ కంపెనీ మాట్లాడుతూ... టీనేజర్స్, స్లిమ్‌గా ఉన్న మహిళల్లో ఎద సైజులు అనతి కాలంలో భారీగా పెరిగి పోవడాన్ని తమ కంపెనీ బ్రాలు పట్టి చూపిస్తున్నాయంటోంది. తొలుత "బి" సైజు బ్రాలను వాడే యువతులు రెండు మూడు సంవత్సారాల కాలంలోనే ఏకంగా ఎఫ్ సైజు నుంచి జి సైజు కప్ లున్న బ్రాలను కొనుగోలు చేస్తున్నారని చెపుతోంది.బక్కపలచగా ఉన్న అమ్మాయిల్లో చాలామంది 10ఎఫ్ బ్రా సైజును వాడుతున్నారంటే వారి ఎద సంపద ఏమేరకు వృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చని సోదాహరణంగా వివరించింది. ఇదిలావుండగా చాలామంది టీనేజ్ ఆడపిల్లలు తమకు ఆకర్షణీయమైన ఎద సంపద లేకపోతే అల్లాడిపోయే మనస్తత్వం కలిగి ఉండటాన్ని తాము గమనించామని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎలాగైనా వక్ష సంపదను పెంచుకోవాలన్న ఏకైక ధ్యేయంతో పలు మార్గాలను అవలంభించడం కూడా ఇందుకు కారణమవుతోందంటున్నారు.ఇక లింగరీల విషయంలోనూ ఇదే వ్యవహారం జరుగుతోందంటున్నారు. ఇటీవల కాలంలో అమ్మాయిలు ముఖ్యంగా తమ ఎద సైజులతోపాటు పిరుదుల సైజులను పెంచుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారనీ, అందుకోసం ప్రత్యేకమైన వ్యాయామాలను సైతం ఆచరిస్తున్నారని వెల్లడించారు. దీంతో బ్రా, లింగరీ సైజుల్లో భారీ తేడాలు చోటుచేసుకుంటున్నాయని చెపుతున్నారు.అయితే పెరిగిపోతున్న వక్షోజ ఆకృతులకు ఆహారటపులవాట్లకు సంబంధమున్నదని అంటున్నారు. కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారాన్ని మితిమీరి తీసుకోవడం ఒక కారణమయితే, శరీరానికి పని చెప్పకుండా ఉండటం మరో కారణమంటున్నారు. వీటి ఫలితంగా టీనేజ్ వయసుకు చేరుకునే పిల్లల్లో వయసుకు మించిన శరీరపు సంపద వచ్చి చేరుతోందని అంటున్నారు. అందువల్లనే ఇటువంటి తారతమ్యాలు కనబడుతున్నాయంటున్నారు.కనుక పిల్లలకు మోతాదుకు మించిన కొవ్వు పదార్థాలను ఇవ్వకుండా ఉండటమే కాక మితిమీరిన ఫ్యాషన్ ప్రపంచపు పోకడలకు బానిసలవకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదని హెచ్చరిస్తున్నారు.

ముఖంపై ముడతలా..? అయితే మంచి నీళ్లు తాగండి..!

  సాధారణంగా యువతుల్లో ముఫ్పై ఏళ్లు దాటగానే.. ముఖంపై ముడతలు వచ్చేస్తుంటాయి. దీంతో వారు తెగ బాధ పడిపోతుంటారు. వీటి నుంచితప్పించుకునేందుకు రకరకాల క్రీములు రాయడం, బ్యూటీ పార్లర్‌కు వెళ్లి పర్సులు ఖాళీ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ.. బ్రిటీష్ వైద్యులు మాత్రం ఇలాంటివేవీ అవసరం లేకుండా మంచి నీటితో ముఖంపై ముడతలకు స్వస్తి చెప్పవచ్చని భరోసా ఇస్తున్నారు.రోజుకు కనీసం ఒకటిన్నర లీటర్ (8 గ్లాసుల) మంచినీటిని తాగితే ముఖంపై ముడతలు నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని అధికంగా సేవించడం వల్ల శరీరంలో మలినాలు బయటకు వెళ్లి చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందని వారి తాజా పరిశోధనలో వెల్లడైంది.ఈ పరిశోధనలో భాగంగా కొంత మంది స్త్రీలకు వారి ఆహారపు అలవాట్లు, దినచర్యలలో ఎలాంటి మార్పులు లేకుండా.. యధాతథంగా కొనసాగిస్తూనే రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని ఎనిమిది వారాల పాటు తీసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. వీరిలో కొందరు సాధారణ ట్యాప్ వాటర్ సేవించగా మరికొందరు బ్రిటన్‌లోని ఓ సరస్సులో దొరికే సహజసిద్ధమైన మినరల్ వాటర్‌ను సేవించారు.అనంతరం వీరి ఫోటోలను ఎనిమిది వారాలకు ముందు ఎనిమిది వారాలకు తర్వాత తీసి తేడా పోల్చి చూశారు. అశ్చర్యంగా ట్యాప్ వాటర్ సేవించిన వారి ముఖంపై 19 శాతం చర్మం ముడతలు తగ్గగా.. మినరల్ వాటర్ సేవించిన వారి ముఖంపై 24 శాతం మేర చర్మం ముడతలు తగ్గినట్లు వారు గుర్తించారు.

ఒకే ఒక్క పెగ్గు.. ప్లీజ్... అంటోన్న ఢిల్లీ మగువలు

దేశంలో నెంబర్‌వన్ స్థానంలో ఉన్న రాజధానిలో నివాసముంటున్న ఢిల్లీ యువతులు మద్యం సేవించడంలో దూసుకుపోతున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. వారాంతం వస్తే చాలు... మగువలు మత్తులో చిత్తైపోతున్నారు.కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ సంస్థ ఇటీవల నగరంలోని పబ్బుల్లో సర్వే చేపట్టింది. ఈ సర్వేను సుమారు వెయ్యిమందిపై సర్వే జరిపింది. ఈ సర్వేలో 34 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 40 శాతం ప్రతి వారం మద్యం సేవిస్తున్నారని తేలింది.ఇక 15 నుంచి 24 ఏళ్ల వయస్సు గలవారిలో 37 శాతం మహిళలు మద్యాన్ని తొలిసారి రుచి చూస్తున్నట్లు తేలింది. మొత్తమ్మీద వీరు వారానికి మద్యంకోసం వెయ్యి రూపాయల వరకూ ఖర్చు చేస్తారని ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది.

రూ.87 కోట్ల చేనేత రుణాల మాఫీ: మంత్రి శంకరరావు

హైదరాబాద్‌: చేనేత రుణ మాఫీకి బడ్జెట్‌లో కేటాయించిన 312 కోట్ల రూపాయలను దశలవారిగా వెచ్చిస్తామని చేనేత శాఖ మంత్రి శంకరరావు తెలిపారు. మొదటి దశలో 87 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామన్నారు. మరమగ్గాలకు విద్యుత్‌ సబ్సిడీ కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఎవరు నిరాహారదీక్షలు చేపట్టినా తప్పులేదన్నారు.

మరోసారి ప్లేటుపిరాయింపు జంట

చాలా గ్యాప్ తర్వాత మరోసారి జీవిత  రాజశేఖర్ కపుల్ మీడియా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో జనరంజక నాయకుడైన వైఎస్ జగన్‌ను బయటకు పంపి చిరంజీవి లాంటివారికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దగ్గరవుతుందో తమకు అర్థం కావడం లేదన్నారు. తమలాంటివారే కోట్లమంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్నారు. పనిలోపనిగా తెలంగాణా కోసం పోరాడుతున్న పార్టీలను సైతం తూర్పారబట్టారు. వారంతా పదవులకోసమే తెలంగాణా అంటున్నారు తప్పించి ప్రజల్లో రాష్ట్ర విభజన పట్ల ఆసక్తి లేదని అన్నారు. తమతో ఇదే విషయాన్ని చాలామంది ప్రజలు చెప్పారని వెల్లడించారు.అటు తర్వాత నటుడు రాజశేఖర్ అందుకుని.... జగన్‌ను నడిరోడ్డుపై నిలబెట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీ తానే రోడ్డుపై నిలుచుందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందనీ కనుక ఆ పార్టీకి తాము రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు.నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వైఎస్సార్ బతికున్నప్పుడు ఆయన వెంట ఉన్నామనీ, ఇపుడు ఆయన కుమారుడు జగన్ వెంట వెళ్లబోతున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను ఒక్క వైఎస్ జగన్ మాత్రమే నెరవేర్చగలరని అన్నారు.ఆద్యంతం ఎవరో తరుముకొస్తున్నట్లు మాట్లాడిన జీవిత- రాజశేఖర్ విలేకరులకు ప్రశ్నలు అడిగే ఛాన్సు ఇవ్వకుండా ప్యాకప్ చెప్పేశారు.

19, డిసెంబర్ 2010, ఆదివారం

పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రివర్యులు సుముఖత : మంత్రి నరసింహం

భారీ  వర్శాలు తుఫానుల వల్ల రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తద్వారా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి తోట నరసింహం పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో రైతాంగ సమస్యలపై చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి అన్ని విధాలా సానుకూలత వ్యక్తం చేశారని అన్నారు. ప్రభుత్వపరంగా రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున 58 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 10 శాతం వరకూ దెబ్బతిన్న ధాన్యానికి ఎటువంటి విలువ కట్టకుండా కనీస మద్దతు ధర వచ్చే విధంగా మిల్లర్లతో పాటు ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే జిల్లాకు రావలసిన ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మంత్రి తెలిపారు. అదే విధంగా దెబ్బతిన్న రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి పూర్తి సానుకూలత వ్యక్తం చేసినట్లు మంత్రి నరసింహం చెప్పారు.    
 

చంద్రబాబుకు అజిత్‌సింగ్‌, మందకృష్ణ పరామర్శ

హైదరాబాద్‌: నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబును రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధ్యక్షుడు అజిత్‌ సింగ్‌, మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శిచారు. రైతు సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబుకు అజిత్‌ సింగ్‌ తమ పూర్తి మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టును మందకృష్ణ మాదిగ ఖండించారు. చంద్రబాబుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.

ఆవాలతో మధుమేహానికి చెక్

విశాల  ఆరోగ్యం
మనుషుల్లో షుగర్ జబ్బుకు కారణం ఇన్సులిన్ వైఫల్యం. పాంక్రియాటిక్ గ్రంథిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ వైఫల్యంతో షుగర్ పెరిగి డయాబెటిస్ వస్తుంది.ఆ షుగర్ జబ్బు స్థాయిని బట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా శరీరానికి ఎక్కించాల్సి వస్తుంది. దీనికోసం మధుమేహ వ్యాధిగ్రస్తులు నానా తంటాలు పడుతుంటారు. ఇటువంటి వారికోసమే ప్రకృతి చికిత్సగా ఆవాలు ఉపకరిస్తాయి. ఆవాలు రుచిపరంగా చేదుగా ఉన్నప్పటికీ మేలు చేస్తాయి.కృత్రిమ ఇన్సులిన్‌ను ఎక్కించుకుని బాధ భరించేకన్నా ప్రకృతి సహజంగా లభించే అవాల నుండి లాభం పొందవచ్చు. ఈ ఆవాలును కొద్దిగా వేయించి, ఆ తర్వాత దానిని పొడి చేయాలి. ఈ పొడిని ప్రతిరోజూ మూడు పూటలా ఒక్కో స్పూన్ తీసుకుంటే రక్తంలో చక్కెరలను నియంత్రించడమేకాక, శరీరంలోకి ఎక్కించుకోవాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తుంది.

18, డిసెంబర్ 2010, శనివారం

ఇటాలియా ప్రధానమంత్రి క్రిస్మస్ బహుమతిగా ఎంపీలకు వజ్రపు ఉంగంరం

ఇటాలియా ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ తమ దేశ మహిళా ఎంపీలకు క్రిస్మస్ బహుమతిని అందజేయనున్నారు. ఆ దేశ పార్లమెంట్‌లో 24 మంది మహిళా ఎంపీలు ఉండగా, 13 మంది సెనెటర్లుతో కలిపి మొత్తం 37 మంది ఎంపీలు ఉన్నారు. వీరందరికీ ప్రధాని క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆమె 1,193 పౌండ్ల విలువ చేసే మొత్తం 37 రింగులను కొనుగోలు చేశారు.వార్షిక క్రిస్మస్ వేడుకల్లో భాగంగా 74 సంవత్సరాల సిల్వియో ప్రత్యేకంగా వీటిని తయారు చేయించినట్టు టెలీగ్రాఫ్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఉత్తర ఇటలీలోని అలెస్సాండ్రియా సమీపంలో ఉన్న వలెంజాలో ఉన్న ప్రముఖ జ్యువెలరీ సంస్థ రెకార్లో వీటిని తయారు చేసింది. మొత్తం 37 మంది మహిళా ఎంపీలకు మూడు రంగులతో కూడిన వజ్రపు ఉంగరాలను ఆమె బహుకరించనున్నారు.దీనిపై రెకార్లో సంస్థ ఛైర్మన్ కార్లో రే స్పందించేందుకు అందుబాటులో లేకపోయినప్పటికీ ఆ సంస్థ సిబ్బంది మాట్లాడుతూ... ఇటలీ ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ బహుమతులను ఎంపిక చేశారన్నారు. అయితే, దీనిపై మరింత ఎక్కువగా స్పందించేలేమని, ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా కొనుగోలు చేశారన్నారు.
.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృత్తి విద్యా కోర్సు చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. లారీ మోటర్‌ సైకిల్‌ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

17, డిసెంబర్ 2010, శుక్రవారం

ప్రారంభమైన రొట్టెల పండుగ

నెల్లూరు : భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ శుక్రవారం నెల్లూరులో ప్రారంభం అయ్యింది. ప్రతిఏటా నెల్లూరులోని బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ప్రారంభమైన ఈ రొట్టెల పండుగ నాలుగు రోజలు పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి మతాలకు అతీతంగా భక్తులు పోటెత్తారు. దర్గా ప్రాంగణం, స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. ముందు జాగ్రత్తగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.రొట్టెల పండుగకు వస్తున్న భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది 8 నుంచి 10 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుధ్యం లోపించకుండా ఎప్పటి కప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచేలా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రాజకీయ లబ్ధి కోసమే బాబు దీక్ష: చిరు

గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాజకీయ లబ్ధి కోసమే నిరాహార దీక్ష చేస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారే కానీ రైతుల కోసం కాదన్నారు. రైతులను, చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోకుంటే తాము కూడా పోరాటానికి సిద్ధపడాల్సి వస్తుందని చిరంజీవి హెచ్చరించారు. రైతులను ఆదుకోవటంలో సర్కార్ విఫలం అయ్యాందన్నారు.మన ఎంపీలు దద్దమ్మలని, వారి చేతగానితనం వల్లే రైతులకు న్యాయం జరగటం లేదని చిరంజీవి ఘాటుగా విమర్శించారు. పంజాబ్ ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ గోదాముల్లో ఎందుకు నిల్వ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. సీఎం తన ప్రకటనలో కౌలు రైతుల ప్రస్తావన తేకపోవటం బాధకరమన్నారు.మట్టి పిసికి అన్నం ముద్దను అందిస్తున్న రైతన్నను ఆదుకోవాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని చిరంజీవి కోరారు. అలాగే చేనేత కార్మికులు,పత్తి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తిని కొనుగోలు చేయాలన్నారు.

పెన్మత్స సాంబశివరాజు రాజీనామా?

విజయనగరం(విశాల విశాఖ): జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పెన్మత్స సాంబశివరాజు పార్టీకి రాజీనామా చేయనున్నారు. తన నిర్ణయాన్ని సాయంత్రం ప్రకటిస్తానని ఆయన చెప్పారు. రెండేళ్లుగా సాంబశివరాజు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సతివాడ నియోజకవర్గం నుంచి ఆయన 8సార్లు ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. సతివాడ నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గంగా మారిన అనంతరం గత ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. ఆయన కుమారుడికి ఇచ్చింది. దీనికి సాంబశివరావు నిరాకరించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

16, డిసెంబర్ 2010, గురువారం

"వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి

అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

నేటి నుంచి బాబు నిరాహారదీక్ష

హైదరాబాద్‌: రైతుల సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపడుతున్నారు. ఉదయం 8.30 గంటలకు అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి, తర్వాత ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి, ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శిస్తారు. అనంతరం ఆదర్శనగర్‌ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరాహారదీక్షకు కూర్చుంటారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం కంటితుడుపు చర్యగా ఉందని, అది కష్టాల్లో ఉన్న రైతునుఆదుకునేందుకు ఏమాత్రం సరిపోదంటూ చంద్రబాబు నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. పలువురు పార్టీ నేతలు ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష వద్దని వారించినా... చంద్రబాబు
రఘువీరాకు కళ్లు కనిపించవా?
తేమ, రంగుమారినధాన్యం గతంలో నాలుగుశాతం ఉన్నా కొనేవారమని, ఇప్పుడు దాన్ని ఎనిమిది శాతానికి పెంచామని సీఎం, రఘువీరారెడ్డిలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎర్రన్నాయుడన్నారు. తెదేపా అధికారంలో ఉండగా 24% తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుచేసేలా కేంద్రాన్ని ఒప్పించామని తాము చెప్పినప్పుడు.. బాబును సత్యహరిశ్చంద్రుడంటూ రఘువీరా ఎద్దేవా చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ కొనుగోలుకు సంబంధించి 2004 జనవరి 8న కేంద్రం నుంచి ఉత్తర్వులను రప్పించామని గుర్తుచేశారు. మెమోనెంబరు 3182/ సీఎస్‌.1(1)2003 మెమోతో ఆఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. వాటి ప్రతులను విలేకరులకు ఇచ్చారు. మంత్రి రఘువీరాకు కళ్లు కనిపించవా? కనీసం గతంలో ఏం జరిగిందో చూస్తే ఈ విషయాలు తెలిసేవి కదా అంటూ ధ్వజమెత్తారు.
దాడి వీరభద్రరావు మాట్లాడుతూ... రైతుల కన్నీళ్లు చూసి శిలలైనా కరుగుతాయని, కానీ కాంగ్రెస్‌ నేతల మనసులు మాత్రం కరగలేదని విమర్శించారు. ఎల్‌.రమణ మాట్లాడుతూ... తెలంగాణలో పోయిన పంటకు సన్న వరికి రూ.1800లు ఇచ్చారని, ఇప్పుడు రూ.వెయ్యి ఇస్తున్నారని, పత్తి గత పంటకు రూ.4000లు ఇస్తే, ఇప్పుడు రూ.3,500లే ఇస్తున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. తాను మడమ తిప్పని, మాట తప్పని మనిషినని రఘువీరారెడ్డి గొప్పలు చెప్పారని, మరి జగన్‌ను సీఎం చేయాలని 150 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించిన రఘువీరా ఇప్పుడు మాట, మడం రెండూ తిప్పలేదా? అని ప్రశ్నించారు. సత్యానికి హరిశ్చంద్రుడిలాగ, అసత్యానికి రఘువీరారెడ్డి ప్రతీక అని విమర్శించారు. శాసనసభాపక్ష సమావేశంలో... యనమల, నాగం జనార్దన్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రాథోడ్‌ రమేష్‌, సీఎం రమేష్‌, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, ఎల్‌.రమణ, వేణుగోపాచాలారి, పయ్యావుల కేశవ్‌, రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏటికొప్పాకలో క్రషింగ్ ప్రారంభం

ఎస్.రాయవరం(విశాల విశాఖ): మండలంలోని ఏటికొప్పాక సుగర్‌ఫ్యాక్టరీలో క్రషింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఉదయం 9.27 గంటలకు ఫ్యాక్టరీ ఎండీ పి.బాపునాయుడు కేన్ క్యారియర్‌లో చెరకు గడలను వేసి గానుగాట ప్రారంభించారు. అంతకు ముందు క్యారియర్ వద్ద పూజ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24వ తేదీ నుంచి రెగ్యులర్ క్రషింగ్ జరుగుతందన్నారు. ఈ ఏడాది 2.25 లక్షల టన్నుల చెరకు గానుగాడాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కర్మాగారం పరిధిలోని ఎనిమిది మండలాల్లోని పది వేల హెక్టార్లలో చెరకు సాగు చేపట్టారన్నారు.ఇందులో ఆరు వేల హెక్టార్లలో మొక్కతోటలు, నాలుగు వేల హెక్టార్ల కార్శితోటలు ఉన్నాయన్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా తోటల్లో నీరు నిల్వ ఉండడంతో క్రషింగ్ ఆలస్యంగా ప్రారంభించామన్నారు. టన్నుకు రూ.1800 చొప్పున చెల్లింపునకు నిర్ణయించామన్నారు. క్రషింగ్ అనంతరం పంచదార ధర పెరిగితే రైతులకు ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. భారీ వర్షాలకు ఫ్యాక్టరీ పరిధిలో 1500 ఎకరాల్లో చెరకుకు నష్టం వాటిల్లిందని, పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కార్యక్రమంలో కర్మాగార అధికారులు సీఈ ప్రసాద్, డి.సత్యనారాయణ, మాజీ డెరైక్టర్లు దేవిప్రసాద్, మళ్ల స్వామినాయుడు, కొండయ్య, కోటవురట్ల ఎస్‌బీహెచ్ బీఎం ప్రసాద్ పాల్గొన్నారు.క్యారియర్ అడుగున ఊటనీరు : ఫ్యాక్టరీ కేన్ క్యారియర్ అడుగుభాగాన చేరిన ఊటనీటితో కార్మికులు అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ క్రషింగ్ జరిగే సమయంలో కేన్ క్యారియర్ 24 గంటలూ రోలింగ్‌లో ఉంటుంది. అలాంటప్పుడు నీరు ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల కర్మాగారంలోని అన్ని యంత్రాలకు ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టారు. క్యారియర్‌కు గ్రీజు పెట్టేందుకు పది అడుగుల లోతున గొయ్యి తవ్వారు. అధిక వర్షాలు కారణంగా దాని నిండుగా ఊట నీరు చేరింది. దీనిని తొలగించేందుకు 15 రోజులుగా సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. మోటారుతో నీటిని బయటకు తోడుతున్నారు.

కొణతాల వెంటే అంతా

మునగపాక(విశాల విశాఖ): కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఓదార్పుయాత్ర విషయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆర్‌ఈసీఎస్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ అన్నారు. గురువారం రాత్రి స్థానిక కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ మునగపాక గ్రామాభివృద్ధికి కొణతాల రామకృష్ణ రూ. కోట్లు మంజూరుచేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి మరువరానిదన్నారు.ఆయన ఆశయ సాధనకు జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రకు జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మంచైనా, చెడైనా కొణతాల వెంటే ఉంటామంటూ మునగపాక కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సందర్భంగా తీర్మానించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు అనకాపల్లి సుబ్రహ్మణ్యం కల్యాణమండపంలో జరగనున్న సమీక్ష సమావేశానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జై జగన్....జై కొణతాల అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు మళ్ల సంజీవరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడారి గణపతి అచ్చెయ్యనాయుడు, ఎంపీటీసీ సభ్యులు సూరిశెట్టి సుధారాణి, ఆళ్ల పైడితల్లి, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మృత్యువుతో పోరాడే వారికి ప్రాణదానం చేసే "అమృతం"

 అమరత్వం పొందడం కోసం దేవతలు, గంధర్వులు "అమృతం" సేవించేవారని, ఈ అమృతాన్ని సొంతం చేసుకోవడం కోసం రాక్షసులు యుద్ధాలు చేసేవారని, మహర్షులు సైతం ఘోర తపస్సులు చేసే వాళ్లని పురణాల్లో చదువుకున్నాం..! అయితే అమృతం కేవలం దేవతలకేనా మానవులకు అవసరం లేదా అనుకున్నారో ఏమో గానీ.. బోస్టన్ శాస్త్రవేత్తలు "కృత్రిమ అమృతం" సృష్టించేశారు. దీన్ని మనుషుల శరీరంలోకి ఎక్కిస్తే యమలోక ద్వారాల వరకూ వెళ్లిన వాళ్లు కూడా తిరిగి భూలోకానికి వచ్చేస్తారట..!
అద్భుతాన్ని ఆవిష్కరించారు. బోస్టన్‌లోని మసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హసన్ ఆలం రసాయనాలతో కూడిన అతి శీతల ద్రవాన్ని తయారు చేశారు. ఊహించని ప్రమాదాలు సంభవించినపుడు తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్నవారి శరీలంలోకి ఈ శీతల ద్రవాన్ని పంపించడం ద్వారా వారి జీవన ప్రమాణాన్ని గణనీయంగా పెంచవచ్చని ఆయన తెలిపారుసాధారణ శరీర ఉష్ణోగ్రతల వద్ద ప్రమాదానికి గురైన వ్యక్తి శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి నాలుగు లేదా ఐదు నిమిషాల్లో మెదడు పనిచేయడం ఆగిపోతుంది. ఫలితంగా మరో పది, పదిహేను నిమిషాల్లో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అయితే అటువంటి వ్యక్తి శరీర నాడుల్లోకి రసాయనాలతో కూడిన "ప్లాస్మా ఎక్స్‌పాండర్స్" అనే అతిశీతల ద్రవాన్ని ఎక్కించడం ద్వారా జీవక్రియలు నెమ్మదించి, ఫలితంగా శరీరానికి ఆక్సిజన్ అవసరం తగ్గుతుందని అలం వివరించారు.ఇందువల్ల శరీర అవయవాలు నిరాఘాటంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయేలోపే శస్త్రచికిత్సను పూర్తిచేయవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని వరాహాల(పందులు)పై విజయవంతంగా పూర్తి చేశామనీ.. త్వరలోనే మనుషులపై కూడా నిర్వహిస్తామని అలం పేర్కొన్నారు. ఈ వైద్య విధానం ద్వారా మృత్యువుతో పోరాడుతున్న వారిలో దాదాపు 90శాతం మందిని ప్రాణదానం చెయ్యొచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఫ్రీజింగ్ ట్రీట్‌మెంట్ పద్ధతి:
ఈ పద్ధతిలో వేడి రక్తంలోకి చల్లగా ఉండే ఓ సెలైన్ లాంటి ద్రవాన్ని హృదయం చుట్టూ ఉండే రక్తనాళాల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్టోగ్రత ప్రతి నిమిషానికి రెండు డిగ్రీల చొప్పున తగ్గుతుంది. ఇలా తక్కువలో తక్కువ 50 డిగ్రీల ఫారన్‌హీట్ వరకూ శరీర ఉష్ణోగ్రత చేరుకుంటుంది. ఇది మెదడు స్పందనలు ఆగిపోకుండా చేయడమే కాకుండా.. హృదయ స్పందన సజావుగా సాగేలా చేయడం, శరీరంలోని అవయవాలను అదుపులో ఉంచడం చేస్తుంది."శరీర ఉష్ణోగ్రత, మెదడు ఉష్ణోగ్రతను 15 డిగ్రీల లేదా 10 డిగ్రీలకు తగ్గించగలిగితే.. కనీసం 60 నిమిషాల నుంచి 190 నిమిషాల వరకూ రక్షణ కల్పించవచ్చు" అని హసన్ అలం తెలిపారు. ఇప్పటికే ఈ తరహా ఫ్రీజింగ్ టెక్నిక్‌ను "ఏల్ న్యూ హెవెన్ హాస్పిటల్"లో హృద్రోగ సమస్యలతో బాధపడే వారికి కోల్డ్ ట్రీట్‌మెంట్ విధానాన్ని శస్త్రచికిత్సలలో ఉపయోగిస్తున్నారు. హసన్ ఆవిష్కరించిన ఈ అధ్భుత వైద్యవిధానం వైద్య చరిత్రలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన డా. కెవిన్ ఫాంగ్ అభిప్రాయపడ్డారు.

పెద్దలూ..........మీరూ చాక్లెట్లు తినండే....



 చిన్న పెద్ద అంటూ వయో బేధం లేకుండా అందరినీ నోరూరించేవి చాక్లెట్లు. అయితే చాక్లెట్లు ఎక్కువగా తినకూడదని, తింటే దంతాలు పాడవుతాయని చాలా మంది హెచ్చరిస్తుంటారు. ఇక నుంచి అలా అనే వాళ్లు మరొక్క సారి ఆలోచించుకోవాలేమో..!! ఎందుకంటే.. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.డార్క్ చాక్లెట్లు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిని గణనీయంగా తగ్గించవచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. బ్రిటన్‌లోని హల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు డార్క్ చాక్లెట్‌లపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించారు. దేహంలో ప్రమాదకర స్థాయికి పెరిగిన మధుమేహాన్ని తగ్గించటానికి డార్క్ చాక్లెట్లు చక్కటి ఔషధంలా ఉపయోగపడతాయని వారు తెలిపారు.చాక్లెట్లలో పాలీఫినోల్ అనే పదార్థం అధిక స్థాయిలో అది కోకావా సాలిడ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉండే మధుమేహ (డయాబెటిక్) వ్యాధిగ్రస్థులకు తరచూ గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. గత పరిశోధనలు కూడా కొలెస్ట్రాల్‌‌ గుండె సంబంధిత సమస్యను తగ్గిస్తుందని రుజువు చేశాయి.ఈ తాజా పరిశోధనలో కోకావా విత్తనాలలో ఉన్న రసాయనాలు కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా టైప్-2 మధుమేహం కలిగిన 12 మంది వాలంటీర్లకు 16 వారాల పాటూ పాలీఫినోల్స్ అధికంగా ఉన్న చాక్లెట్ బార్లను ఇచ్చి పరీక్షించారు. అనంతరం వారి కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించి చూడాగా.. అది గణనీయంగా తగ్గింది."దీని అర్థం హృదయ సమస్యను తగ్గిస్తుంది" అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ స్టీవ్ అట్కిన్ అన్నారు. అధిక కొకావా ఉండే చాక్లెట్లు టైప్-2 డయాబెటిక్ వారికి కావలసిన డైట్‌ను అందించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని ఆయన అన్నారు. అయితే బ్రిటన్‌లోని కొందరు మధుమేహ నిపుణులు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.ఈ చాక్లెట్లలో అధిక స్థాయిలో కొకావాతో పాటు అంతే అధిక స్థాయిలో ఫ్యాట్ (కొవ్వు), షుగర్ (పంచదార)లు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి మేలు కన్నా ఎక్కువ కీడునే కలిగిస్తాయనేది విమర్శకుల వాదన. బ్రిటన్‌లో దొరికే ప్రముఖ బ్రాండెడ్ చాక్లెట్‌ బార్‌లలో 200 కేలరీలు, 16 గ్రాముల వరకూ కొవ్వు ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీర మంతా కొవ్వు పేరుకుపోతుందని వారు వాదిస్తున్నారు.

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

 పెద్దపల్లి గ్రామంలో చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. విస్నూరు, దర్తపల్లి గ్రామాలకు చెందిన అన్నా చెల్లెళ్లు పెద్దపల్లి గ్రామానికి ఓ శుభకార్యానికి బుధవారం వచ్చారు. తమ వెంట పిల్లలు మమత(6), అజయ్‌(6)లను తీసుకు వచ్చారు. గురువారం ఎవరి పనుల్లో వారు ఉండగా ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చారు. వీరింటి పక్కనే ఓ చెరువు ఉంది. పిల్లలిద్దరూ ఆ చెరువు వద్దకు వెళ్లి అందులో మునిగి పోయారు. పిల్లల కోసం వెతుకుతుండగా మధ్యాహ్నం చెరువులో మృతదేహాలు కనిపించాయి.
 

6౦లో అడుగుపెట్టిన రోబో (రజినీకాంత్):

రోబో హీరో రజినీకాంత్ అరవై పదుల్లోకి అడుగుపెట్టారు. వయస్సు పెరిగినా వన్నె తరగని కథానాయకుడిగా రాణిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.అభిమానం పాళ్ళు కాస్త ఎక్కువైన తమిళ తంబీలు రజినీకాంత్ జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. అభిమాన సంఘాలతో పాటు ఎక్కడికక్కడ కేక్‌లు కట్ చేస్తూ రజనీ పుట్టిన రోజున కేక్‌లు కట్ చేస్తూ పండుగలా జరుపుకుంటున్నారు.తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రల నుంచి సూపర్‌స్టార్‌గా ప్రకాశిస్తున్న రజినీకాంత్ అభిమానులకు ఆరాధ్యదైవం. అంతేకాదు.. రజినీకాంత్ భారత్‌లో అత్యంత ఖరీదైన సినిమాల్లో హీరోగా నటించిన ఘనత సాధించాడు. అలాగే భారీ మొత్తంలో పారితోషికం తీసుకుని తన రికార్డులు తానే అధిగమించిన ఒకే ఒక్క హీరో రజనీకాంత్‌కు నేడు అరవయ్యవ జన్మదినం (డిసెంబర్ 12).ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో (18.08.1975లో విడుదలైన) తెరకెక్కిన ఆపూర్వ రాగంగళ్ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన రజినీకాంత్ 158 చిత్రాల్లో నటించారు. తాజాగా విడుదలైన రజినీకాంత్ 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. 60వ ఏట రోబోతో హిట్ కొట్టిన యాంత్రికుడికి మనం కూడా బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.. హ్యాపీ బర్త్ డే టు రజినీకాంత్....!

సినిమాల సందడి లేనట్లేనా...?

విడుదలకు దగ్గరయ్యే చిత్రాలకు పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుపుకోవచ్చని మంగళవారంనాడు ప్రొడ్యూసర్స్‌కు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలియజేసింది. కానీ, తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కానీ, సినిమా షూటింగ్‌లకు కానీ హాజరుకాబోమని ఏపీ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ స్పష్టం చేసింది. బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు కోటగిరి వెంకటేశ్వరరావు, కె. రాజేశ్వర్‌రెడ్డి ఇతర యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికులకు తమ విధానాలను వివరించారు. 10వ తేదీన ఫెడరేషన్‌ జనరల్‌ బాడీ నిర్ణయం ప్రకారం చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని తీర్మానం చేయడం జరిగింది. చర్చలకు పిలవాల్సిందిగా ఫిలిం ఛాంబర్‌ను రెండుసార్లు లెటర్లు పంపించాం. దానికి నేటివరకు ఏవిధమైన స్పందన రాలేదు.కానీ పోస్టుప్రొడక్షన్స్‌ వర్క్స్‌ చేసుకోవచ్చని ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఇచ్చిన వార్తకు మన సభ్యులెవరూ స్పందించవలసిన అవసరంలేదు. గత రెండేళ్ళుగా నిలిపి వేయబడిన వేతనాల అగ్రిమెంట్లు, 28.2.2010తో కాలపరిమితి ముగిసిన అగ్రిమెంట్లును బదులు నూతన అగ్రిమెంట్లు చేయగలమని ఛాంబర్‌ చెప్పిన తర్వాతే పోస్టుప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతాయని.. తెలియజేసింది.
 

కౌలు రైతులకు మార్చిలో గుర్తింపుకార్డులు: రఘువీరా

హైదరాబాద్‌: కౌలు రైతులకు సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వారికికూడా న్యాయం చేస్తామని రెవిన్యూ మంత్రి రఘువీరారెడ్డి సభాముఖంగా హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఈరోజు విపక్షాలన్నీ ఏకకంఠంతో కౌలు రైతుల విషయంపై ప్రశ్నించాయి. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ కౌలు రైతులకు మార్చి, ఏప్రిల్‌ నెలలో గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. ఉప్పుడు బియ్యం ఎగుమతికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.
 

15, డిసెంబర్ 2010, బుధవారం

చర్లపల్లి జైలులో సుమన్ నిరాహార దీక్ష: గద్దర్ సంఘీభావం

హైదరాబాద్: ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసే వరకు తాము ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి నాయకుడు సుమన్ అన్నాడు. ప్రభుత్వం విద్యార్థులపై కేసులు అక్రమంగా బనాయించిందన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు అన్నింటిని వెంటనే ఎత్తివేయాలన్నారు. ఓ వైపు కేసులు ఎత్తివేస్తామంటూనే ప్రభుత్వం మరోవైపు విద్యార్థులపై కేసులుకొనసాగిస్తుందన్నారు. ఒకే విద్యార్థిపై వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. సుమన్ తో పాటు మరో 8 మంది విద్యార్థులు చెర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే. వారిని నిన్న నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.కాగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ గురువారం చర్లపల్లి జైలులో విద్యార్థులను కలిశారు. వారికి తన సంఘీభావం తెలిపారు. విద్యార్థులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను సాయంత్రంలోగా విడుదల చేయాలన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆటో బోల్తా.. 16 మందికి గాయాలు

వరంగల్‌ : జిల్లాలోని పర్కాల మండలం కామరెడ్డిపల్లి గ్రామం వద్ద ట్రాలీఆటో బోల్తా పడిన ఘటనలో 16 మందికి గాయలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. క్షతగాత్రులను 108లో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు

జగన్‌ వైపు ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు చూపు

మేయర్‌ పీఠానికి బీటలు?
నగరంలో ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు జగన్‌ వైపుమొగ్గుచూపుతున్నారు. జగన్‌ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరడానికి పావులు కదుపుతున్నారు. అదేగానీ జరిగితే మేయర్‌ పీఠానికి బీటలు వారే పరిస్థితి రానుంది. ఇప్పటికే మేయర్‌కు మద్దతు ఇచ్చిన నలుగురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు జగన్‌ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకంపనలు మేయర్‌ పులుసు జనార్థనరావుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.మేయర్‌గా ఎన్నికైన ఆరునెలల నుంచే పులుసు జనార్థనరావుపై అధికారపక్ష సభ్యులే వ్యతిరేకించి పీఠం నుంచి దింపేందుకు గతంలో తీవ్ర ప్రయత్నాలు చేసిన సందర్భాలున్నాయి. ఉన్నతశ్రేణి నాయకుల జోక్యంతో వివాదాలు సద్దుమనగడం పరిపాటుగా వస్తున్న పరిణామం. పరోక్షంగా ఎన్నుకోబడిన మేయర్‌ను నాలుగేళ్ల వరకూ ఆయనపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు. మేయర్‌ తనంతట తాను స్వయంగా రాజీనామా చేస్తే తప్ప, కొత్తగా వేరొకరిని ఎంపిక చేయలేని పరిస్థితి. త్వరలో నాలుగేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి టిడిపి పావులు కదుపుతోంది.
కాగా, ప్రస్తుతం జగన్‌ పార్టీవైపు ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు మొగ్గు చూపుతున్నారు. గాజువాక ప్రాంతానికి చెందిన ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు తిప్పల నాగిరెడ్డి, చొప్పా నాగరాజు, ఇమిలి జ్వాలతోపాటు కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ ఉరుకూటి అప్పారావు జగన్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, జగన్‌తో కలిసి మంతనాలు కూడా సాగించినట్లు తెలిసింది. బుధవారం ఒకటో వార్డు కార్పొరేటర్‌ (ఇండిపెండెంట్‌ అభ్యర్థి) కొవగాపు సుశీల భర్త సుధాకర్‌, తోపాటు మరికొంతమంది ద్వితీయశ్రేణి నాయకత్వం జగన్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. జగన్‌ పర్యటనలోగా ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లతోపాటు మరికొంత మంది కాంగ్రెస్‌ కార్పొరేటర్లు జగన్‌కు మద్దతివ్వడంతోపాటు మేయర్‌కు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకొనేలా వ్యూహం కొనసాగుతోంది. డిప్యూటీ మేయర్‌ దొరబాబు ఇదే అదునుగా చేసుకొని మేయర్‌ పులుసు జనార్థనరావు అసంతృప్తివర్గాన్ని తనవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అసంతృప్తి జ్వాలలను సద్దుమనిగించేందుకు రెండురోజుల క్రితం మేయర్‌ ఏర్పాటు చేసిన అరకు టూర్‌ వర్కవుట్‌ కాలేదు. ఊహించిన స్థాయిలో సభ్యులు టూర్‌కు హాజరుకాలేదు.టిడిపికి 33 మంది కార్పొరేటర్లు ఉండగా, కాంగ్రెస్‌కు 27 మంది ఉన్నారు. 9 మంది ఇండిపెండెంట్లు, ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా ఉన్న మంత్రులు పురంధేశ్వరి, బాలరాజు, ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్‌, తైనాల విజయకుమార్‌, మళ్ల విజయప్రసాద్‌, ఎంపీ సబ్బంహరితో కలిసి కాంగ్రెస్‌ బలం 42కు చేరుకుంది. ఎక్స్‌ అఫిషియో సభ్యులు వెలగపూడి కలిపి టిడిపి బలం 37కు చేరుకుంది. ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు 9 మంది ఉపసంహరించుకొన్నట్లయితే కాంగ్రెస్‌ బలం 33కు పడిపోనుంది. మేయర్‌ పీఠాన్ని దక్కించుకొని నగరంలో ఓటింగ్‌కు పెంచుకోవడానికి టిడిపి ప్రయత్నిస్తోంది. ఇది ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే.

హైదరాబాద్‌ చేరుకున్న శ్రీకృష్ణ కమిటీ సభ్యులు

హైదరాబాద్‌ : శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ముంబయి నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి ఈ ఉదయం 10.55కు చేరుకున్నారు. అనంతరం నేరుగా లేక్‌వ్యూ అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు. కమిటీ సభ్యులు మధ్నాహ్నం 12 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. 12.30కు గవర్నర్‌, 2.15కు ముఖ్యమంత్రితో కమిటీ సమావేశం కానుంది. 3 గంటలకు పార్టీల నేతలు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు. సాయంత్రం 4.15కు కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీ చివరి అధికారిక పర్యటన ఇదే