న్యూఢిల్లీ: భారత్, ఫ్రాన్స్‌ల మధ్య భారీ అణుఒప్పందానికి ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఫ్రాన్స్ సహకారంతో భారత్‌లో రెండు అణుశక్తి కర్మాగారాలు నిర్మించేందుకు ఇరుదేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ నాలుగురోజుల భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో 1650 మెగావాట్ల రెండు అణు రియాక్టర్లు ఏర్పాటుచేస్తారు. 9.3 బిలియన్ల ఖర్చుతో వీటిని నిర్మిస్తారు. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీలు దీనిపై సంతకం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి