5, డిసెంబర్ 2010, ఆదివారం
పుత్తూరు వద్ద రోడ్డు ప్రమాదం
చిత్తూరు: పుత్తూరు మండలం వేపగుంట వద్ద సుమో.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఇదే మండలం వేణుగోపాలపురానికి చెందినవారు. తండ్రీ కొడుకులు మందడి(45), సోమయ్య(20), వీరికి తెలిసిన మరో వ్యక్తి మహేష్‌రెడ్డి ముగ్గురూ కలిసి ఒకే బైక్‌పై నగరి నుంచి పుత్తూరు వస్తున్నారు. తిరుపతి నుంచి చెన్నై వెళుతున్న సుమో వేపగుంట క్రాస్ రోడ్డు వద్ద ఈ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బైక్ మీద ఉన్న ముగ్గురూ అక్కడే మృతి చెందారు. మహేష్ రెడ్డికి ఇటీవలే వివాహం అయింది. సుమోలో వ్యక్తులు మద్యం తాగి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి