అదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న ప్రాణహిత పుష్కరాలు సోమవారం ఉదయం నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాణహిత పుష్కరాలను ఉదయం 9 గంటలకు కోతపల్లి మండలంలోని అర్చునగుట్ట వద్ద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.ప్రాణహిత నది జన్మస్థలమైన అదిలాబాద్ జిల్లాలో ఈ పుష్కరాలను గతంలో ఎన్నడు నిర్వహించలేదు. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడానికి సిద్ధమైంది. పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పనులు ఇంకాగ పూర్తిస్థాయి జరగలేదు.అయితే ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందన విమర్శలు వెల్లవెత్తున్నాయి. సోమవారం నుండి ప్రారంభం కానున్న ఈ పుష్కరాలకు ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయి పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ పుష్కరాలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి