హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ చేపట్టిన యుద్ధభేరి కార్యక్రమం శనివారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తతల నడుమ లాఠీఛార్జికి దారితీసింది. ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్తానని ముఖ్యమంత్రి ప్రకటించే వరకూ కదిలేది లేదన్న మందకృష్ణ అర్ధరాత్రి ఒంటి గంట దాటాక వందలాది మంది కార్యకర్తలతో అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రెచ్చిపోయిన కార్యకర్తలు బారికేడ్లను ధ్వంసం చేశారు. అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. చేయి దాటుతోందని భావించిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. గుంపులను చెదరగొట్టే ప్రయత్నంలో దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. దీనికి నిరసనగా మంద కృష్ణ మాదిగ కొంతసేపు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి నినాదాలుచేశారు. ఆ తర్వాత మంద కృష్టను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి