జిట్టా యువ తెలంగాణ పార్టీ రిజిష్టర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మరో ఆటంకం ఎదురయ్యేట్లే ఉంది. మరో తెలంగాణ పార్టీ ఎన్నికల కమిషన్ వద్ద నమోదైంది. తెలంగాణ పేరిట విడిగా ఉద్యమాన్ని నడిపిస్తున్న జిట్టా బాలకృష్ణా రెడ్డి యువ తెలంగాణ పేర ఓ పార్టీని ఎన్నికల కమీషన్ వద్ద నమోదు చేయించారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి నల్లగొండ జిల్లా భువనగిరికి చెందినవారు. మొదటి నుంచి ఆయన కెసిఆర్ వెంట ఉంటూ ఎన్నికల సమయంలో విభేదించి బయటకు వెళ్లిపోయారు.గత ఎన్నికల్లో జిట్టా బాలకృష్ణా రెడ్డి భువనగిరి శాసనసభా స్థానం నుంచి తెరాస టికెట్ ఆశించారు. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఆ సీటును ఉమా మాధవరెడ్డికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో జిట్టా బాలకృష్ణా రెడ్డికి పోటీ చేసే అవకాశం లభించలేదు. దీంతో కెసిఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెరాసకు దూరమయ్యారు. ఆ తర్వాత విడిగా తెలంగాణ యువజన సంస్థను నడుపుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ పేరునే ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి