న్యూఢిల్లీ: అసమాన హాస్యనటుడు, తన హావభావాలతో, అల్లరి చేష్టలతో నవ్వులు పూయించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన చార్లీచాప్లిన్ ఈ క్రిస్‌మస్‌కు భారత్‌లో డీవీడీ రూపంలో అలరించనున్నాడు. ఈ మహా హాస్యనటుడు నటించిన చిత్రాలు హై డెఫినేషన్(హెచ్ డీ) డీవీడీలుగా భారత్‌లో విడుదల కానున్నాయి. క్రిస్‌మస్ సందర్భంగా ఈగల్ హోం ఎంటర్‌టైన్‌మెంట్, ఎంకే2 గ్రూప్‌లు సంయుక్తంగా ఈ ఉన్నత నాణ్యత గల డీవిడలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. చార్లీ చాప్లిన్ నటించిన ।ద కిడ్*, ।మోడ్రన్ టైమ్స్*, ।ద సర్కస్* తదితర చిత్రాల కలేక్షన్ డీవీడిలు అభిమానుల ముందుకు రానున్నాయి. ఈ అద్భుతమైన ఆనందలహరిని వీక్షించే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ప్రేక్షకుల వంతని ఈ డివిడి రూపకర్తలు అంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి