కావాలసిన పదార్ధాలు:
గుడ్లు: 4(ఉడికించినవి)
బంగాళాదుంపలు: 3(ఉడికించినవి)
గోధుమపిండి: 1cup
మైదా: 1cup
అరటి పళ్ళు: 2
ఉల్లిపాయలు: 2
క్యాప్సికమ్: 1
అల్లం: చిన్న పీస్
పచ్చిమిర్చి: 4
ఉప్పు: రుచికి సిరిపడా
కారం: 1 tbsp
కొత్తిమిర: 1/2 cup
నూనె: కావలసినంత
తయారు చేయు విధానాము:
1. గోధుమ పిండి, మైదాపిండి కాస్త వెచ్చటి నూనె, నీళ్లు వేసి చపాతీపిండిలా కలిపాలి. ఈ పిండి కలిపేటప్పుడే అరటిపళ్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి కలపాలి. పిండి పళ్లు బాగా కలిసేటట్టు కలిపి, తడి బట్టలో చుట్టి పెట్టాలి.
2. అల్లం, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొత్తిమీర, కారం, వేసి కచపచ దంచాలి.
3. క్యాప్సికమ్, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నూనెవేసి ఫ్రై చేసి దీనికి అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఉడికిన బంగాళాదుంపలు చిదిపి, ఉడికిన గుడ్ల ను చిన్న చిన్న ముక్కలుగా కోసి, కొద్దిగా ఉప్పు చేర్చి అన్నింటిని కలిపి మసాలా ముద్దలా తయారుచేయాలి.
4. మొదటే తయారు చేసి పెట్టుకొన్న గోధుమ, మైదా ముద్ద నుండి కొద్దిగా పిండి తీసుకొని ముద్దలా తయారు చేయాలి. ఉండను చిన్నగా వత్తి మధ్యలో ఆలు ఎగ్ మిశ్రమం వుంచాలి. నాలువైపులా అంచులు మూసి, మళ్లీ ఉండలా చేయాలి.
5. ఇప్పుడ ఈ ఉండను చపాతీలా చెత్తోనే వత్తుకోవాలి. స్టౌ పైన పాన్ పెట్టి నెయ్యి లేదా నూనె వేసి దోరగా వేయించాలి అంతే ఎగ్ పరోటా రెడీ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి