* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

4, డిసెంబర్ 2010, శనివారం

రచనల దొంగతనం : "విన్‌ఫ్రే"పై 50 లక్షల కోట్ల దావా..!!

ఇతరుల రచనల్లోని భావాలను దొంగిలించి, అవి తనవిగా చెప్పుకున్న "టాక్ షో" మహారాణి "ఆప్రావిన్‌ఫ్రే"పై అమెరికాలో దావా ఒకటి దాఖలైంది. 1.2 ట్రిలియన్ డాలర్ల (దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు) మొత్తాన్ని విన్‌ఫ్రే తనకు చెల్లించి తీరాలని.. డామన్ లాయిడ్ గొఫె అనే న్యూయార్క్ రచయిత ఒకరు వాషింగ్టన్ కోర్టులో కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వస్తే... తాను రచించిన "ఎ టోమ్ ఆఫ్ పోయమ్స్" అనే గ్రంథం నుండి కొన్ని భావాలను దొంగిలించిన విన్‌ఫ్రే, ఆమె రాసిన "పీస్ ఆఫ్ మై సోల్" అనే రచనలో వాడుకున్నారని గొఫె ఆరోపించారు. ఈ విషయాన్ని విన్‌ఫ్రే గత సంవత్సరంలోనే అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.ఇదిలా ఉంటే... తన రచనల్లో భావాలను పొందుపరచిన విన్‌ఫ్రే పుస్తకాలు దాదాపు 65 కోట్లు అమ్ముడుబోయాయని, ఒక్కో పుస్తకం 20 డాలర్ల (వెయ్యి రూపాయలు) ఖరీదు చేసిందని గొఫె వివరించారు. కాబట్టి, ఆమె రచనల్లో తన భావాలు వాడుకున్నందుకుగానూ తనకు నష్టపరిహారంగా 1.2 ట్రిలియన్ డాలర్లను ఇచ్చితీరాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి