అండర్ వేర్ వేసుకోకుండానే మిడ్డీతో ఓ ఫంక్షన్ కు హాజరై, కాలు మీద కాలు వేసుకు కూర్చుని, తాను లోపల ఫ్యాంటీ వేసుకోలేదనే విషయాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన యానాగుప్తా చిక్కుల్లో పడింది. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి తనను మీడియా ‘నో ప్యాంటీ గర్ల’ అని సంబోధిస్తుండడాన్ని తెగ ఆస్వాదిస్తున్న యానా గుప్తా ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. ‘ఈ ఫోటోల పుణ్యమా అని ఉచితంగా బోలెడంత ప్రచారం లభించింది కదా’ అని తెగ మురిసిపోతున్న యానాగుప్తాకు ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టు నుంచి నోటీసు అందుకోవాల్సి వచ్చింది.యానా గుప్తా చేసిన నిర్వాకం పై రిజ్వాన్ అహ్మద్ అనే స్వచ్చంద సేవకుడు నిప్పులు చెరుగుతున్నాడు. మొత్తం పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తే..యానాగుప్తా కావాలనే అలా చేసిందని అర్థమవుతోందని వాదిస్తున్నాడు. ఇందుకుగాను ఆమెపై క్రిమినల్ చర్య చేపట్టాల్సిందేనని పట్టుబడుతున్నాడు. లేకపోతే, యానా గుప్తా బాటలో మరికొందరు కూడా పయనించి, సభ్య సమాజం తలదించుకునేలా చేస్తారని రిజ్వన్ ఆరోపిస్తున్నాడు. మరి ఈ విషయాన్ని యానాగుప్తా ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. అయితే ఈ కోర్టు వివాదం వల్ల కూడా తనకు ఉచిత ప్రచారం లభిస్తోందని యానాగుప్తా సంతోపడే ప్రమాదం లేకపోలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి