"పిరానా" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన హాలీవుడ్ సంస్థ డైమెన్షన్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం టైటానిక్ -3 రిటర్న్స్. తెలుగులో ఈ చిత్రాన్ని ఆర్.ఎస్.మూవీస్ పతాకంపై సీహెచ్ శ్రీనివాసమూర్తి, కె.రామకృష్ణ అందిస్తున్నారు.ఎస్కే రఫీ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇటీవలే డీటిఎస్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తొలి కాపీతో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం గురించి నిర్మాతలు సిహెచ్ శ్రీనివాసమూర్తి, కె.రామకృష్ణ మాట్లాడుతూ... సముద్రంలో అదృశ్యమైన ఒక నౌక జాడ తెలుసుకునేందుకు ఓ సబ్‌మెరైన్‌లో హీరోహీరోయిన్లతో కూడిన 12మంది బృందం బయలుదేరుతుంది.ఈ అన్వేషణలో వారికి ఎదురైన సమస్యలను ఎదుర్కొని, ఆ షిప్‌ని ఎలా కనిపెట్టారనేది చిత్ర కథాంశం. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి