* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

14, డిసెంబర్ 2010, మంగళవారం

గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

గుంటూరు(విశాల విశాఖ): విశాఖపట్నం నుంచి చెన్నై వెళుతున్న 16 చక్రాల పెద్ద గ్యాస్‌ ట్యాంకర్‌ మంగళగిరి జాతీయ రహదారిపై బోల్తా పడింది. ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతోంది. దీంతో రహదారిపై రాకపోకలు నిలిపివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఘటనా స్థలం చుట్టుపక్కల కాలనీలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మరో వాహనం తెప్పించి గ్యాస్‌ను అందులోకి నింపేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు.5వ నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న నేపధ్యంలో చాలా చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. ఇలాంటి చోట్ల మళ్లింపు దారులు ఏర్పాటు చేశారు. మంగళగిరి లక్ష్మినరసింహ కాలనీ వద్ద ఇటువంటి మళ్లింపు దారి ఉంది. ట్యాంకర్‌ పెద్దది కావడంతో ఇక్కడ మలుపు తిరుగుతున్న సమయంలో బోల్తా పడింది. గ్యాస్‌ లీక్‌ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, 108 వాహనాలను సిద్ధం చేశారు. దాదాపు 200 కుటుంబాలను ఖాళీ చేయించారు. సాంకేతిక సిబ్బందిని రప్పిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి