విజయవాడ: భారమైన టోల్ పన్నును క్రమబద్ధీకరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందటూ ఎల్లుండి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా జరుపతలపెట్టిన లారీల సమ్మె తప్పదని ఏపీ లారీ యజమానుల సంఘం హెచ్చరించింది. టోల్ పన్నుపై గత ఏప్రిల్‌లో కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఈ నేపధ్యంలో తాము సమ్మెకు సిద్ధమయ్యామని నాయకులు విజయవాడలో తెలిపారు. టోల్ గేట్ల నిర్వహణపై 1997లో అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్రం ఉల్లంఘించిందని అన్నారు. కేంద్రంతో ఇవాళ జరిగే చర్చల్లో సానుకూల ఫలితాలు రాకుంటే సమ్మె తప్పదని నాయకులు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి