1, డిసెంబర్ 2010, బుధవారం
వచ్చింది రెడ్డి రాజ్యం
(విశాల విశాఖ ప్రత్యేక ప్రతినిది): రాష్ట్రంలో మళ్లీ రెడ్డి రాజ్యం మొదలయింది. పధ్నాలుగు నెలల ముందు వరకూ వైఎస్ రాజ శేఖరరెడ్డి! ఇప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి!! మరి బీసీల గతి? ఏముంది మళ్లీ అధోగతే!!! బీసీలు ఓట్లకే పనికివస్తారు తప్ప, పదవులకు పనికి రారని కాంగ్రెస్ నాయ కత్వం తన చర్యలతో మళ్లీ రుజువు చేసింది. జనాభా దామాషా ప్రకారం దక్కవలసిన పదవులన్నీ రివర్సయిన వైనం కిరణ్ కుమార్‌రెడ్డి సారథ్యంలోని సర్కారులో మరోసారి దర్శన మిచ్చింది. 52 శాతం ఉన్న బీసీలకు వచ్చిన పదవులు పదయితే, జనాభాలో కేవలం 4 శాతమే ఉన్న రెడ్లకు మాత్రం దక్కిన పద వులు పచ్చగా పధ్నాలుగు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి వర్గానికి రెడ్‌కార్పెట్ వేసి, బీసీలను వెనక్కితోసి ముందుకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధికి ఇదో నిలువెత్తు నిద ర్శనం. కాంగ్రెస్ పార్టీ మరోసారి రెడ్డి సామాజికవర్గానికేపట్టం కట్టి, బీసీలను అణచివే యాలని నిర్ణయిం చుకున్నట్లు బుధ వారం నాటి మంత్రివర్గం స్పష్టం చే సింది. గతంలో 34 మంది ఉన్న మంత్రిమండలిలో 12 మంది రెడ్లకు స్థానం కల్పించగా, ఈసారి 40మంది ఉన్న మంత్రి మండలిలో 14 మందికి స్థానం దక్కడం చూస్తే ఆ వర్గం హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవు తోంది.జానారెడ్డి అదేవిధంగా, గతంలో 11 మంది బీసీ లు న్నారు. కొండా సురేఖ రాజీనామా చేయగా ఆ సంఖ్య 10 మందికి పడింది. రెడ్ల మాదిరి గానే గతానికన్నా ఇప్పుడు బీసీల సంఖ్య పెంచే అవకాశం ఉన్నా ఆ పనిచేయలేదు. ఇప్పుడు 40 మంది మంత్రులున్నా అందులో బీసీల సంఖ్య పది మందే కావడం బట్టి, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో బీసీల అవసరం లేదని చె ప్పకనే చెప్పినట్టయింది. మంత్రివర్గంలో ఈసారి జనాభా దామాషా ప్రకారం ప దవులు ఇవ్వకపోతే ఆందోళన తప్పదని బీసీ సంఘాలు హెచ్చరించినప్పటికీ, కాంగ్రెస్ దానిని ఏ మాత్రం ఖాతరు చేసినట్లు కనిపించలేదు. చివరకు శాఖల కేటాయింపులో కూడా రెడ్లదే హవా. హోం, సమాచార, భారీ నీటిపారుదల, ఆ ర్థిక, పురపాలక, వ్యవసాయం, ఆరోగ్య, పంచాయతీరాజ్, న్యాయశాఖలు రెడ్డి వర్గానికే దక్కాయి. బీసీలకు ఎకై్సజ్, రెవిన్యూ, రవాణా, ఆర్ అండ్ బి శాఖలు మాత్రమే కీలకమైనవి దక్కాయి. రాయలసీమకు కీలక శాఖలు కేటాయించడం ద్వారా ముఖ్యమంత్రి తన ప్రాంతానికి న్యాయం చేశారు.సుదర్శ్ న్ రాజకీ యాల్లో ప్రభావితం చేసే పాత్ర పోషించే కమ్మ వర్గానికి దక్కింది ఒక్కటే. దీనిపై నా ఆ వ ర్గీయులు మండిపడుతున్నారు. తమను కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీగా చూ స్తోందని విరుచుకుపడుతున్నారు. తమ వర్గానికి ఎక్కువ శాఖలు ఇ వ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన డిమాండ్‌ను ఎవరూ పట్టిం చుకోలేదని స్పష్టమయింది. కాంగ్రెస్ వైఖరి చూస్తే కమ్మ సామాజిక వర్గం ఓట్లు తమకు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ తమ వర్గం టీడీపీ వైపు మొగ్గు పచూ పుతుందన్న ముందుచూపుతోనే తమను పక్కకు పెట్టారని మండిపడుతున్నారు. కాపులలో కూడా అసంతృప్తి రగులుతున్నది. కోస్తాలో కాపులు, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు, తెలంగాణలో మున్నూరు కాపులను కలి పితే మొత్తం కాపులకు 5 పదవులు దక్కినట్లయింది.సంఖ్యాపరంగా 5 పదవు లు దక్కినప్పటికీ, ఏ ఒక్కటీ కీలక శాఖ కాకపోవడం కాపుల్లో అసంతృప్తి రాజేసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి