* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

2, డిసెంబర్ 2010, గురువారం

వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారు: అంబటి

కడప పార్లమెంటరీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్టు ఆ వర్గం అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో ఉన్న జగన్ నివాసం వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పార్టీ త్వరలోనే వస్తుందన్నారు. దీనిపై జగనే స్వయంగా ప్రకటన చేస్తారని చెప్పారు. అయితే, పార్టీ ఏర్పాటుకు రోజులు.. నెలలు పడుతుందా అనే విషయాన్ని తాను ఇపుడే చెప్పలేమన్నారు.వైఎస్ ఆశయ సాధనే లక్ష్యంగా జగన్ పార్టీ కృషి చేస్తోందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ పార్టీకి వైఎస్ అభిమానాలు, కాంగ్రెస్ వ్యతిరేకులు తమ మద్దతు తెలుపుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు.జగన్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలీయమైన పార్టీగా అవతరించబోతుందని అంబటి జోస్యం చెప్పారు. తమకు ప్రజలే మార్గ నిర్దేశకులన్నారు. అందువల్ల ప్రజల ఆశీస్సులు జగన్‌కు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇకపోతే.. మంత్రుల రాజీనామాలు, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం కూలిపోతుందా, ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే అంశాలతో తమకు సంబంధం లేని అంశమన్నారు. ఈ పరిణామాలతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. అదేసమయంలో వైఎస్ శ్రమతో ఏర్పాటైన ఈ కాంగ్రెస్ సర్కారును కూల్చే దుర్బిద్ది జగన్‌కు లేదన్నారు.ఇకపోతే పార్టీ ఏర్పాటు అంశంపై జగన్ తన అనుచరులు, జిల్లా స్థాయిలో ఉన్న నేతలు, అభిమానులతో చర్చలు జరుపుతున్నారన్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలో నెలకొన్న అంశాలపై కూలంకుషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వీటిపై చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి