* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

3, డిసెంబర్ 2010, శుక్రవారం

10 నుంచి అసెంబ్లీ

 హైదరాబాద్‌ : రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఈనెల 10 నుంచి ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి సీనియర్‌ మంత్రులతో చర్చించారు. సమావేశాలు డిసెంబరు 10 నుంచి 16 వరకు వారం రోజుల పాటే జరిగే అవకాశాలున్నాయి. కచ్చితంగా ఎప్పటిదాకా నిర్వహించాలనే విషయాన్ని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నిర్ణయిస్తారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని సీఎం మంత్రులను కోరారు. ప్రతిపక్షం నుంచి ఎటువంటి విమర్శల దాడి వస్తుందో అంచనా వేసుకుని, దానికి తగ్గట్లుగా మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు తయారవ్వాలని సూచించారు. మంత్రులంతా సమష్టిగా పనిచేసి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వాణి వినిపించాలని కోరారు. ఏడాదిన్నరగా పెండిగులో ఉన్న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష కార్యవర్గం నియామకాన్ని పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఆయన శుక్రవారం సాయంత్రం న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డికి ఫోన్‌చేసి దీనిపై మాట్లాడారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగిన విషయాన్ని ఏరాసు వివరించారు. ఆ వివరాలతో తన వద్దకు వస్తే రెండు మూడురోజుల్లో నియామకం పూర్తిచేస్తామని సీఎం తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి