* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

3, డిసెంబర్ 2010, శుక్రవారం

విజయమాల్యా యూబీ గ్రూపుతో ధోనీ రూ. 26 కోట్ల డీల్

  ప్రముఖ వ్యాపారవేత్త, శాసనసభ సభ్యుడు విజయమాల్యాకు చెందిన యునైటె బివెరేజెస్ (యూబీ) గ్రూపుతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ధోనీకు ఏడాదికి ఎనిమిది కోట్లకు పైచిలుకు చెల్లింపుతో మూడేళ్లపాటు ఈ ఒప్పందం కొనసాగనుంది.భారతదేశపు అతిపెద్ద స్పిరిట్ తయారీ సంస్థ అయిన యూబీ గ్రూపుతో ధోనీ రూ. 25.26 కోట్ల విలువు చేసే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈ ఒప్పందంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. "ఫిబ్రవరిలో క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి యూబీ ప్రయత్నిస్తున్నట్లు" వారిలో ఒకరు పేర్కొన్నారు.ఈ డీల్‌తో ప్రకటనలకు అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ సినీ నటులు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్‌ల సరసన ధోనీ నిలువనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అమీర్ ఎటిసలాట్ టెలికాం కంపెనీతో రూ. 30 కోట్ల విలువ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ధోనీ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక, ఇతర వివరాలు వెల్లడించడానికి మాత్రం కంపెనీ అధికారులు నిరాకరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి